కేసీఆర్, ఏపి రాజకీయాల్లో వేలు పెడతా, కాలు పెడతా అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈయన రాజకీయాల్లో వేలు పెట్టటం ఏమో కాని, రాష్ట్ర అభివృద్ధిలో మాత్రం, వేలు, కాలు పెడుతున్నాడు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ, ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బ తీసి, మోడీకి మేలు చేకూర్చే పనిలో ఉన్నారు కేసీఆర్. దేశ వ్యాప్త టూర్ పేరుతో, దేశాన్ని ఉద్దరించేది నేనే అంటూ బయలుదేరారు. నిన్న ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ని కలిసారు. అయితే సమావేశం అనంతరం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల గురించి ఏమి మాట్లాడాదలుచుకోలేదని, పోలవరం విషయం పై కేసీఆర్ తో చర్చించాను అంటూ ఏకంగా విలేకర్ల ముందే చెప్పారు. అంటే కేసిఆర్ అక్కడకు వెళ్ళింది ఫ్రంట్ గురించి కాదు, ఏపి జీవనాడి పోలవరం పై దెబ్బ కొట్టటానికి.
ఇప్పటికే ఒరిస్సా, తెలంగాణా, పోలవరం పై అనేక సార్లు కోర్ట్ కి వెళ్ళాయి. ఇప్పటికీ కేంద్రానికి, కోర్ట్ లకి, ప్రాజెక్ట్ ఆపమంటూ లేఖలు రాస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఇద్దరూ కలిసి పోలవరం పై పడనున్నారు. ఎగువ రాష్ట్రమైన తెలంగాణా నుంచి వచ్చే నీళ్ళు మనం వాడుకున్తున్నాం, సముద్రం లోకి వెళ్ళకుండా ఆపుకుని, వాడుకుంటున్నాం. పై నుంచి వచ్చే నీళ్ళు ఆపుకోలేని కేసీఆర్, ఎగువ రాష్ట్రం అన్న సంగతి మర్చిపోయి, ఏపి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఒరిస్సా అభ్యంతరం తెలిపింది అంటే, ఏమన్నా అర్ధముంది. ఎందుకంటే, అక్కడ ముంపు ప్రదేశం ఎక్కువ. అలాంటిది కేసిఆర్ వేలు పెడతా అంటూ చేస్తున్న పని ఇది.
మరి కేసీఆర్ తెలంగాణాలో గెలిస్తే, సంబరాలు చేసుకున్న జగన్, పవన్, ఇప్పుడు కేసిఆర్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ పై ఏమి మాట్లాడతారు ? ఏపి ప్రజలను ఛీ కొట్టి, కుక్కలు, రాక్షులు అని, చివరకు మనం తినేది పెంట అని సంభోదించినా, కేసీఆర్ అంటే ఎలాంటి ప్రేమ కార్చారో, ఇప్పుడు పోలవరం ఆపే ప్రయత్నం చేస్తున్న, అదే వైఖరితో ఉంటారా ? ఏపి నాశనం అవుతుంటే, చంద్రబాబుకి ఇబ్బంది కాబట్టి, సంతోష పడతారా ? మీకు, రాష్ట్రం మీద ప్రేమ కంటే, చంద్రబాబు మీద కోపం ఎక్కువ, అందుకే చంద్రబాబు ఏపిని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్నా, ఏపిని అన్ని విధాలుగా చిన్న చూపు చూస్తున్న కేసీఆర్ అంటే, ప్రేమ కారిపోతుంది. కేవలం చంద్రబాబు మీద కోపంతో, ఏపి ప్రజల ఆత్మగౌరవాన్ని, హక్కులని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టకండి.