ఒక పక్క దేశంలో ప్రతి వ్యవస్థను నాశనం చేస్తున్నారు మోడీ-షా... వారికి వ్యతిరేకంగా దేశంలో అన్ని శక్తులను ఏకం చెయ్యాల్సిన కాంగ్రెస్ పార్టీ, ఆ విషయంలో ఫెయిల్ అవ్వటంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యారు. చివరికి బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో కలిసారు. డెమోక్రాటిక్ కంపల్షన్ తో, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మొరోసారి మోడీ/షా గద్దెనెక్కకుండా, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరో పక్క మోడీ/షా, మన రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం తెలిసిందే. నమ్మించి ఎలా మోసం చేసారో, ఈ నాలుగేళ్లలో చూసాం. ఈ తరుణంలో రెండో సారి గెలిచి, మంచి ఊపు మీద ఉన్న కేసీఆర్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొత్త రాగం అందుకున్నారు.

kcr 22122018 2

ఇప్పటికే చంద్రబాబు వెంట 22 పార్టీలను చీల్చే ప్రయత్నం మొదలు పెట్టారు. ఒక పక్క మోడీ ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తుంటే, కేసీఆర్ మాత్రం, మోడీకి అన్ని విధాలుగా సహకరం అందిస్తున్నారు. మోడీ కూడా, కేసీఆర్ కు ఎన్నికల్లో ఎలాంటి సహకారం అందించారో, మొన్న జరిగిన ఎన్నికల్లో చూసాం. ఈ తరుణంలో మోడీకి సహకరం అందించటానికి కేసీఆర్ ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో, చంద్రబాబు వెంట ఉన్న వారిని చీల్చి, మోడీకి సహకారం అందించే పని మొదలు పెట్టారు. దేశ వ్యాప్త పర్యటన పేరుతో, రేపటి నుంచి కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ తరుణంలో, తాను బలంగా ఉన్నాను, నా వెంట మరిన్ని పార్టీలు ఉన్నాయని చెప్పుకోవటానికి కొత్త ఎత్తుగడ వేసారు. ఎలాగూ ఏపి రాజకీయాల్లో వేలు పెడతా అని చెప్పారు కాబట్టి, ఇక్కడ నుంచే ఆ ప్రయత్నం మొదలు పెట్టారు.

kcr 22122018 3

తాను చెప్తున్న ఫెడరల్ ఫ్రంట్ మొదటిగా జాయిన్ అవుతున్న పార్టీలు, జగన్ పార్టీ వైసీపీ, పవన్ పార్టీ జనసేన, అలాగే ఏంఐఎం పార్టీ, ఇవి మూడు తన ఫెడరల్ ఫ్రంట్ లో చేరబోతున్నాయని, చంద్రబాబు ఉంటున్న తెలుగు రాష్ట్రాల్లోనే, చంద్రబాబుకి సహకారం లేదని, వీరు నా వెంట ఉన్నారనే, ప్రచారం కేసీఆర్ మొదలు పెట్టారు. దీనికి తగ్గట్టుగానే, జనవరి 9న పాదయాత్ర అవ్వగానే జగన్, అలాగే విదేశీ పర్యటన ముగించుకుని పవన్, ఇద్దరూ కేసీఆర్ ని కలిసి, ఫెడరల్ ఫ్రంట్ లో చేరనున్నట్టు ప్రకటన చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాగూ ఇదంతా బీజేపీ స్కెచ్ కాబట్టి, జగన్, పవన్ లకు కూడా, అమిత్ షా, మోడీ నుంచి ఇబ్బంది ఉండదు. అయితే, ఇద్దరుముగ్గురితో కలిసి ధర్డ్ ఫ్రంట్ విఫల ప్రయోగమే అని, ఇది బిజెపికి మేలు చేసే ప్రయత్నమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మోడీ గారి న్యూఇయర్ గిఫ్ట్, ఈ సారి మోత మొగనుంది. ప్రతి ఇంట్లో వాడే కేబుల్ టీవీ చార్జీలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్‌ బిల్లు నెలకు రూ.200 లోపు ఉంది. నగర ప్రాంతాల్లోనైతే రూ.250 వరకు పడుతోంది. కేబుల్‌ కనెక్షన్‌ ద్వారా సుమారు 300 నుంచి 350 వరకు చానెళ్లు ప్రసారం అవుతున్నాయి. వీటిలో 70 నుంచి 80 వరకు పే ఛానెళ్లు ఉన్నాయి. వార్తలు, వినోదాలు, ఆటలు అందించే చానెళ్లు హిందీ, తమిళ, మలయాళ చానెళ్లు 150 వరకు ప్రసారాలు జరుగుతున్నాయి. తాజాగా ట్రాయ్‌ నిర్ణరుంచిన ప్రకారం తొలి 100 ఎయిర్‌ ఫ్రీ చానె ళ్లకు రూ.130 తోడు జీఎస్టీ కలిపి చెల్లించాలి. వినియోగదారులు ఫ్రీచానె ళ్లు కాకుండా జెమిని, ఈ టీవీ, మాటీవీ, ఈటీవీ, స్పోర్ట్‌ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెళ్లు ఎంపిక చేసుకుంటే వాటికి అదనంగా చార్జీలు చెల్లించాలని కొత్త నిబంధనలు విడుదలయ్యాయి. వినియోగదారుడు కోరుకున్న చానెళ్లు, ప్యాకేజీల వారీగా ప్రసారాలు అందుతాయి.

cabel 22122018 2

ప్రస్తుతం కేబుల్‌ ద్వారా అందుతున్న చానెళ్లన్నీ ఈనెల 29తో ప్రసారాలు ముగుస్తాయి. 30వ తేదీ నుంచి ప్రస్తుతం అందుతున్న చానెళ్లు అన్నీ చూడాలంటే సుమారు రూ. 600 నుంచి రూ.800 వరకు చెల్లించాల్సి ఉంటుందని ట్రాయ్‌ నిర్ణయించిన ధరలు చెప్తున్నాయి. తెలుగు చానెళ్లు మాత్రమే కావాలనుకుంటే రూ.500 వరకు చెల్లించాలి. దీనికి తోడు ఇంగ్లీష్‌, స్పోర్ట్స్‌లాంటి చానెళ్లు కావాలంటే అదనంగా రుసుం చెల్లించాలి. ప్రస్తుతం వినియోగదారులు నెల మొత్తం టీవీ చూసిన తరువాత నెలాఖర్లో బిల్లు చెల్లించే వారు. ప్రస్తుత టారిఫ్‌ ప్రకారం ముందే డబ్బులు చె ల్లించి రీచార్జి చేయించుకోవాలి. ఈనెల 29వ తేదీ నుంచి వినియోగదారులు తమకు కావాల్సిన ప్యాకేజీలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

cabel 22122018 3

ఇప్పటివరకు నెల మొత్తం టీవీ ప్రసారాలు వీక్షించి నెలాఖరుకు బిల్లు చెల్లించేవారు. అదికూడా రోజుల తరబడి తిప్పించుకుని మరీ వినియోగదారులు బిల్లులు చెల్లిస్తున్నారని, ప్రస్తుతం వస్తున్న టారిఫ్‌ ప్రకారం తాము కేబుల్‌ టీవీలను నడిపించే పరిస్థితులు లేవని కేబుల్‌ టీవీ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న రూ. 200 బిల్లు చెల్లించడానికి గాను అనేక ఇబ్బందులు పడుతున్నారని, వసూలు చేసుకోవడానికి తాము సైతం ఇబ్బందులు పడుతున్నామని, అలాంటిది ఏకంగా నాలుగైదు రెట్లు బిల్లులను పెంచితే చెల్లించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేబుల్‌ ప్రసారాలు అందించలేమని ఆవేదన చెందుతున్నారు. పే చానెళ్లను రెగ్యులర్‌ చేయాలని, సుప్రీం ఆదేశాల నేపధ్యంలో ఇదే అదునుగా ఇష్టారీతిన ధరలను పెంచుతున్నారని ఆపరేటర్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం విధిస్తున్న టారిఫ్‌ వల్ల కేవలం కేబుల్‌ ఆపరేటర్లు మాత్రమే గాకుండా డీటీహెచ్‌లు సైతం ఇదే పరిస్థితి ఎదుర్కోనున్నారని అంటున్నారు.

సందర్భం దొరికితే, ఏపిలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి, ఏపికి మేము లక్షల లక్షల కోట్లు ఇస్తుంటే, చంద్రబాబు తినేస్తున్నాడు అంటూ, ఆరోపణలు చేసే రాష్ట్ర బీజేపీ నేతలకు, నిన్న విడుదల అయిన, నీతి ఆయోగ్‌ రిపోర్ట్ చూసి, వాళ్ళ నోట్లో పచ్చి వెలక్కాయి పడినంత పని అయ్యింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రగతిని ప్రతిబింబించే స్థిర అభివృద్ధి లక్ష్యాల(సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌) ఆధార నివేదిక-2018ని నీతి ఆయోగ్‌ శుక్రవారం విడుదల చేసింది. 2030 నాటికి సాధించాలనుకున్న స్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశంలోని రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇది సూచిస్తోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలుశాఖ, గ్లోబల్‌ గ్రీన్‌ గ్రోత్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఐక్యరాజ్యసమితి భారతీయ విభాగాలు కలిసి రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. దేశంలో ఈ స్థిర అభివృద్ధి లక్ష్యాల అమలు పర్యవేక్షణ బాధ్యతలను నీతి ఆయోగ్‌ నిర్వర్తిస్తోంది.

niti 22122018

ఈ కార్యక్రమంలో 0-49 నడుమ మార్కులు సాధించిన రాష్ట్రాలను ఆకాంక్షిత రాష్ట్రాలుగా, 50-64 మధ్య మార్కులు పొందిన వాటిని ప్రతిభావంత రాష్ట్రాలుగా, 65-99 మార్కులు సాధించిన వాటిని పురోగాములు(ఫ్రంట్‌రన్నర్‌)గా, 100 మార్కులు చేరుకున్న వాటిని లక్ష్యసాధకులుగా పేర్కొన్నారు. ఇందులో మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ 64, తెలంగాణ 61 మార్కులతో ప్రతిభావంత రాష్ట్రాల జాబితాలో నిలిచాయి. హిమాచల్‌, కేరళ, తమిళనాడు, చండీగఢ్‌, పుదుచ్చేరిలు పురోగాములుగా సత్తాచాటుకున్నాయి. ఏపీలో మొత్తం 8 లక్ష్యాల్లో పురోగామిగా, రెండు లక్ష్యాల్లో పర్‌ఫార్మర్‌గా, మూడు విభాగాల్లో వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో నిలిచింది. అభివృద్ధిని, లక్ష్యాలను పర్యవేక్షించడానికి ఆంధ్ర ప్రదేశ్‌ చేసిన ప్రయత్నాలను నీతీ ఆయోగ్‌ ప్రసంశించింది.

niti 22122018

రియల్‌ టైమ్‌ అవుట్‌కమ్‌ బేస్డ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను(ఆర్టీజీ) రాష్ట్రం అమలు చేస్తున్నదని తన నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది. ‘‘సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌- విజన్‌ 2029’’ పేరిట లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. పనిచేస్తున్న తీరు బాగుందని కొనియాడింది. సామర్థ్య పెంపు వనరులను సమకూర్చుకొన్న తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా ఉన్నదని పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమం.. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు దోహదకారిగా ఉన్నదని నీతీ ఆయోగ్‌ అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అధికారులు అన్ని గ్రామాలకు వెళ్లి, ప్రభుత్వ లక్ష్యాలపై ప్రజలతో 30 నిమిషాలు చర్చిస్తున్నారని వెల్లడించింది. 2017 నవంబరులో రాష్ట్ర శాసన సభలో కూడా దీనిపై చర్చించారని కూడా వివరించింది. లక్ష్యాల సాధనకు అవసరమైన సామర్థ్యాల పెంపునకు ఇప్పటికే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు చర్యలు చేపట్టాయని తెలిపింది.

సీఎం కేసీఆర్ రిటర్న్ గిప్ట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. శ్రీకాకుళంలో ధర్మపోరాట సభలో మాట్లాడుతూ సభికులను గిఫ్టుపై ప్రశ్నించారు. కేసీఆర్‌ బర్త్‌డే పార్టీ గిఫ్ట్‌ తీసుకోవాలా.. వద్దా తమ్ముళ్లూ అని ప్రశ్నించారు. ఎవరిని బెదిరిస్తున్నారని అడుగుతున్నానన్నారు. మీరంతా అండగా ఉంటే కొండనైనా ఢీకొంటానని స్పష్టం చేశారు. అధికారం తనకు ముఖ్యం కాదని, ఆత్మగౌరవమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. కష్టపడతా.. సంపద సృష్టిస్తా, అవమానాన్ని సహించనని చంద్రబాబు హెచ్చరించారు. అధికారం ముఖ్యం కాదు… ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అన్ని రాజకీయ పార్టీలను కలిశానన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ తో పోరాడాం.. ఇప్పుడు దేశం కోసం కలిసి పనిచేస్తున్నామన్నారు. బుంధేల్ ఖండ్ ప్యాకేజీ ఇస్తామని.. ఇవ్వలేదన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకున్నారన్నారు. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ కోసం మన ఎంపీలు పోరాడుతూనే ఉన్నారన్నారు.

srikakulam 22122018 2

విద్వేషాలకు టీడీపీ దూరంగా ఉంటుందని, ఆయన రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీని స్థాపించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఈవీఎంలలో వీవీ ప్యాట్ లు సరిగా పనిచేయట్లేదని, పేపర్ బ్యాలెటే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటును ప్రోగ్రాం తయారు చేసే వ్యక్తికి అప్పజెప్పడం సరికాదన్నారు. అభివృద్ది చెందిన దేశాల్లో ఎక్కడా యంత్రాలపై ఆధారపడలేదన్నారు. కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకరించట్లేదన్నారు. ప్రైవేటు వ్యక్తులతో పెట్రో కెమికల్ కారిడార్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఫోన్టు, కంప్యూటర్లలో సమాచారం తీసుకునేలా చట్టం తెచ్చారన్నారు.

srikakulam 22122018 3

కేంద్రంపై తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేదని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి న్యాయం చేసేందుకే ఎన్డీయే నుంచి బయటికొచ్చామని, టీడీపీ ఎంపీలు చెప్పగానే రాజీనామాలు చేశారని చంద్రబాబు తెలిపారు. న్యాయం చేయమని అడిగితే దాడులు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఎంపీలు నోరు ఎత్తితే ఐటీ దాడులు చేయిస్తున్నారని, 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చారు.. మనకెందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేయడం నా జీవితాశయమన్నారు. 63శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని, రాష్ట్రానికి పోలవరం జీవనాడి. వంశధార, నాగావళి పూర్తి కావాలి” అని చంద్రబాబు ఆకాంక్షించారు. ధర్మవీరులకు జన్మనిచ్చిన వీరభూమి శ్రీకాకుళం అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిపోసిన నేల శ్రీకాకుళం అన్నారు.

Advertisements

Latest Articles

Most Read