ఆంధ్రప్రదేశ్‌ పై కేంద్ర వైఖరికి నిరసనగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పార్లమెంటు ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టాలని ఎంపీ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. పార్లమెంటు ముగిసే వరకు ఆయన దీక్ష కొనసాగనుంది. రామ్మోహన్ నాయుడు నిరసనకు మద్దతుగా టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంట్ లో మోడీని నిలదియ్యకుండా తెలుగుదేశం ఎంపీలను అన్ని విధాలుగా బెదిరించారు, మోడీ, షా.. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా, తెలుగుదేశం ఎంపీలు మాత్రం, వెనక్కు తగ్గలేదు. ఏపికి న్యాయం చెయ్యండంటూ పార్లమెంట్ లో టిడిపి ఎంపీల ఆందోళన కొనసాగిస్తున్నారు.

rammohan 18122018 2

మరో పక్క, ఏపీకి న్యాయం చేయాలంటూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న రీతిలో నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతీ రోజు పలు రకాల వేషధారణలతో పార్లమెంటుకు వస్తున్న ఎంపీ ఈరోజు జానపద కళాకారుడు వంగపండు వేషంలో నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్న మోదీ ఎన్నికలయ్యాక అన్నీ మరిచాడంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా రైల్వేజోన్ ఇతర హామీలను మరిచిన మోదీని ఓడించడానికి కదిలి రావాలంటూ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారంటూ జానపదాలు పాడుతూ శివప్రసాద్ నిరసనను తెలియజేశారు.

rammohan 18122018 3

‘ఏం పిల్లడో ఢిల్లీ వస్తవా.. ఏం అమ్మాయి ఢిల్లీ వస్తవా. ఢిల్లీలోనే మొండోడు(ప్రధాని మోదీ) ఉన్నడు. మొండోడిని కాదు.. నేను మొనగాడిని అంటడు. డ్రస్సులేమో తెగ జోరుగా ఏస్తడు. ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటడు. త్రీడీ ఎఫెక్టుతో ప్రధాని అయ్యుండు. ప్రజల గురించి అసలు ఆలోచించడు’ అంటూ ప్రధాని మోదీ పై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ తనదైన శైలి వేషాలతో నిరసన తెలియజేస్తే ఏపీ వాయిస్ వినిపిస్తున్నారు శివప్రసాద్. పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద తెదేపా లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం నేతృత్వంలో పార్టీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఎప్పుడూ ఆగ్రహంతో అది చేసారు, ఇది చేసారు అని వార్తల్లో ఉండే టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నిరసన తెలపటం ఏంటి అనుకుంటున్నారా ? ఈ ఘటన గుంటూరు జిల్లా, కాజా టోల్ ప్లాజా వద్ద జరిగింది. ఆయన ఫ్యామిలీతో సహా, కార్ లో తిరుపతి వెళ్లి, రిటర్న్ వస్తూ ఉండగా, కాజా టోల్ ప్లాజా వద్ద సిబ్బంది చింతమనేని కారును ఆపారు. ఏ టోల్ ప్లాజా వద్ద అయినా, కార్ ఆపగానే, ఎమ్మెల్యే అని చెప్పగానే కార్ కి దారి ఇస్తారు. ఎమ్మెల్యేలకు, టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉండటమే దానికి కారణం. అయితే, గుంటూరు జిల్లాలో అదీ రాజధానికి అత్యంత దగ్గరగా ఉండే కాజా టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం, ఎమ్మెల్యే చింతమనేని వాహనాన్ని కదలనివ్వలేదు.

chintamaneni 18122018 2

తాను ఎమ్మెల్యేను అని స్వయంగా చింతమనేని చెప్పినా అక్కడి సిబ్బంది వినిపించుకోలేదు. దీంతో చింతమనేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. తాను ఎమ్మెల్యేను అనీ, తనకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉందని గుర్తుచేశారు. అయితే సిబ్బంది మాత్రం డబ్బులు చెల్లించాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. మీరు ఎమ్మెల్యే అని నిరూపించుకోండి అంటూ మాట్లాడటంతో, చింతమనేని సహనం కోల్పోయారు. టోల్ ప్లాజా సిబ్బంది చర్యలకు నిరసనగా, తన కారును టోల్ గేట్ వద్ద వదిలేసి అటుగా వెళుతున్న బస్సు ఎక్కి, దెందులూరు ప్రయాణం అయ్యారు. ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని మంగళగిరి పోలీసులకు తెలియచేసారు. ఎమ్మెల్యే అని చెప్పినా, గన్ మెన్లు పక్కన ఉన్నా, తనను ఎమ్మెల్యే అని నిరూపించుకోండి అంటూ అక్కడ సిబ్బంది చెప్పటాన్ని, తప్పుబట్టారు.

chintamaneni 18122018 3

కావాలని ఇలా చేసారా, రెచ్చగొట్టి ఏదైనా ఇష్యూ చెయ్యటానికి, ఇలా చేసారా అనే అనుమానం వ్యక్తం చేసారు. నిత్యం ఆ రూట్ లో ఏంటో మంది ఎమ్మల్యేలు వస్తారని, సిబ్బందికి ఎవరు ఏంటో తెలియదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా, టోల్ ప్లాజా సిబ్బంది పై తన సహజమైన దూకుడు ప్రదర్శించకుండా, హుందాగా నిరసన తెలపటం మంచి పరిణామం. అయితే ఇంకా ఎమ్మెల్యే చింతమనేని కారు టోల్ ప్లాజా వద్దే ఉంది. ఇలనాటి సంఘటనలు తాను పట్టించుకోను అని, కాని అక్కడ వాళ్ళ వాలకం చూస్తుంటే, తనను కావాలని, అక్కడ సిబ్బంది అవమానించారని, జరిగిన అవమానానికి బాధ్యలు అయిన వారి మీద, ఏ చర్యలు తీసుకున్నారో చెప్తేనే, అక్కడ నుంచి వాహనం తీసుకువెళ్తానని, చింతమనేని పోలీసులకి చెప్పారు.

నవ్యాంధ్రలో మెల్లమెల్లగా ఐటీ రంగం జోరందుకుంటోంది. ఐటీ కంపెనీలతో పాటు... వాటిని పెట్టాలనుకునేవారికి పెట్టుబడులు సమకూర్చే సంస్థలు, వాటిలో పనిచేయాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చే ఏజెన్సీలు... ఇలా అన్నింటితో కూడిన సమగ్రమైన ‘ఐటీ వాతావరణం’ వస్తోంది. అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో ఐటీ సంస్థల సందడి మరింత పెరగనుంది. ఈ క్రమంలో, అమరావతిలో మరో ఆరు ఐటీ స్టార్టప్ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ(ఎపీఎన్‌ఆర్‌టీ) ఆధ్వర్యంలో ఐదు సంస్థలను అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రుల సహకారంతో, ఆంధ్రప్రదేశ్‌ ఎలక్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏజెన్సీ (ఏపీఈఐటీఏ) ఆధ్వర్యంలో మరో సంస్థను అందుబాటులోకి తెస్తున్నారు.

itcompanies 17122018 2

ఈ నెల 19న ఐటీ మంత్రి నారా లోకేశ్‌ వీటిని ప్రారంభించనున్నారు. వీటిలో నాలుగు సంస్థలను విజయవాడలో, మరో రెండింటిని మంగళగిరిలోని ఎన్‌ఆర్టీ టెక్‌ పార్క్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థలు మొత్తం 530 ఉద్యోగాలు కల్పించనుండగా ప్రారంభం నాటికి 150 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. కంపెనీల వివరాలు.... జీటీ కనెక్ట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, 100 ఉద్యోగాలు; పరికారమ్ ఇటీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, 100 ఉద్యోగాలు; టెక్ స్పేస్, 100 ఉద్యోగాలు; ట్రెండ్ సాఫ్ట్ టెక్నాలజీస్, 100 ఉద్యోగాలు; డయాగ్నో, స్మార్ట్ సోలుషన్స్, 30 ఉద్యోగాలు; ఏపి ఆన్లైన్ , 100 ఉద్యోగాలు... మొత్తం 530 ఉద్యోగాలు...

itcompanies 17122018 3

కృష్ణా, గుంటూరుల్లో ఇప్పటికే ఐటీ కంపెనీలు గత ఏడాది కాలంలో 35 వరకూ ప్రారంభమయ్యాయి. వీటిలో 2300కు పైగా కొలువులు స్థానిక యువతకు లభించాయి. మరో ఆరు నెలల్లో గన్నవరంలోని ఐటీ పార్కులో రెండో టవర్‌ నిర్మాణం పూర్తి చేయనున్నారు. దీనిలో మరో 25 కంపెనీల వరకూ రానున్నాయి. ప్రస్తుతం ఉన్న మేధాటవర్స్‌లో 12 కంపెనీలు ఉండగా.. మరికొన్ని కంపెనీలకు త్వరలో స్థలం కేటాయించనున్నారు. గుంటూరు పరిధిలోని మంగళగిరిలోనూ ప్రస్తుతం ఓ ఐటీ టవర్‌ ఏర్పాటు చేశారు. దీనిలో 50వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులోనికి వచ్చింది. మూడు అంతస్థుల్లో పైకేర్‌ సంస్థ కార్యాలయం ఏర్పాటు చేసింది. మరో అంతస్తులో ఇతర కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఈ ఐటీ టవర్‌లో మొత్తం 400మంది వరకూ ఉద్యోగులు ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడే మరికొన్ని కూడా ఏర్పాటు కానున్నాయి.. మంగళగిరి పరిధిలోనూ మరో 30 ఐటీ కంపెనీల వరకూ ఏర్పాటు చేసేందుకు ఏపీఎన్‌ఆర్‌టీ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే మంగళగిరిలో హెల్త్‌క్లస్టర్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. మెడికల్‌ కోడింగ్‌, బిల్లింగ్‌, బీమా కంపెనీల ప్రొసీజర్స్‌ వంటి కంపెనీలు దీనిలో రానున్నాయి. గన్నవరం ఐటీపార్క్‌లో మేధాటవర్స్‌కు వెనుకవైపు రెండో ఐటీ టవర్‌ నిర్మాణం ప్రారంభమైంది.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, పనుల్లో నాణ్యత లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఈ ఏడాది ఆగస్టు 11న పోలవరం ప్రాజెక్టు క్షేత్రంలోనే సమీక్ష నిర్వహించిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా పోలవరం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదంటూ తమ పార్టీ నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన థర్డ్‌ పార్టీ(కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ )తో చేయిస్తున్నామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) గడ్కరీ దృష్టికి తీసుకొచ్చింది. పీపీపీకి వాప్కోస్‌ అందిస్తోన్న నెలవారీ నివేదికలు బయటకు వచ్చాయి.

polavaram 17122018

జూన్‌ నుంచి ఆగస్టు దాకా మూడు నెలలపాటు వాప్కోస్‌ ఇచ్చిన నివేదికల్లో పోలవరం పనుల్లో నాణ్యత కొరవడినట్లు ఎక్కడా అభిప్రాయపడలేదు. పైగా పనులన్నీ ఉత్తమ నాణ్యతా ప్రమాణాల(ఎక్స్‌లెంట్‌)తో జరుగుతున్నాయని వాప్కోస్‌ కితాబిచ్చింది. జూన్‌ నెల నాణ్యతా పరీక్షల నివేదిక... 1276 కాంక్రీట్‌ క్యూబుల నాణ్యతను పరిశీలించాం... ఎం15ఏ40 పరిశీలనలో నాణ్యతా ప్రమాణాలు ‘ఎక్స్‌లెంట్‌’ గా ఉన్నాయి. మరో 624 కాంక్రీట్‌ క్యూబుల నాణ్యతనూ పరిశీలించాం... ఎం20ఏ40 నాణ్యత ‘ఎక్స్‌లెంట్‌’గా ఉంది. కాంక్రీట్‌ గ్రేట్‌ ఎం25ఏ20కు సంబంధించి 843 సెట్స్‌ పరిశీలించాం.. నాణ్యత ‘ఎక్స్‌లెంట్‌’గా ఉంది అని వాప్కోస్‌ పేర్కొంది. జూన్‌ నెలంతా నిర్వహించిన క్వాలిటీ టెస్టుల ఫలితాలను వాప్కోస్‌ ‘ఎక్స్‌లెంట్‌’ అంటూ కితాబిచ్చింది.

polavaram 17122018

జూలై నాణ్యతా పరీక్షల నివేదిక.. స్పిల్‌వే కాంక్రీట్‌ బ్లాక్‌లను ఈ నెలలో వాప్కోస్‌ పరీక్షించింది. ఎం15ఏ40 పరీక్షల కింద 792 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం20ఏ40 పరీక్షల కింద మరో 290 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం25ఏ20 పరీక్షల కింద 502 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం30ఏ40 పరీక్షల కింద 48 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం50ఏ20 పరీక్షల కింద 10 బ్లాకులను పరీక్షించి... ‘ఎక్స్‌లెంట్‌’ అని పేర్కొంది.. ఆగస్టు నాణ్యతా పరీక్షల నివేదిక... ఎం15ఏ40 పరీక్షల కింద స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌కు చెందిన 460 కాంక్రీట్‌ బ్లాకులను వాప్కోస్‌ పరీక్షించి.. కాంక్రీట్‌ ‘ఎక్స్‌లెంట్‌’గా ఉందని కితాబిచ్చింది. అలాగే ఎం20ఏ40 పరీక్షల కింద స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌కు చెందిన 441 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం25ఏ20 పరీక్షల కింద స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌కు చెందిన 883 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం30ఏ40 పరీక్షల కింద స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌కు చెందిన 73 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం50ఏ20 పరీక్షల కింద స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌కు చెందిన 17 కాంక్రీట్‌ బ్లాకులను వాప్కోస్‌ పరీక్షించి... కాంక్రీట్‌ ‘వెరీగుడ్‌’ అని కితాబిచ్చింది.

Advertisements

Latest Articles

Most Read