తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఈ రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం తరువాత, ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫానుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. నిన్న రాత్రే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో ముందస్తు చర్యలపై చర్చించామన్నారు. అధికారులందర్నీ అప్రమత్తం చేశారని.. అన్ని చోట్లా హైఅలర్ట్ ప్రకటించని గవర్నర్ చెప్పుకొచ్చారు. తుపాను ఏర్పాట్లు చంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారన్నారు. మరో పక్క పెథాయ్ గడగడలాడిస్తోంది. సుడులు తిరుగుతూ గంటకు 28 కిమీ వేగంతో తీరంవైపు దూసుకొస్తోంది. శ్రీహ‌రికోట‌కు తూర్పున 280 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న తుఫాను,
17వ తేదీ సాయంత్రానికి కాకినాడ నుంచి తుని మ‌ధ్య తీరం దాటే అవ‌కాశాలు ఉన్నాయి.

narasimhan 16122018

గత యాభైఏళ్లలో డిసెంబర్ నెలలో కోనసీమను తుఫాన్ ప్రభావం లేదు. అంతకుముందు కోనసీమను అతలాకుతలం చేసిన తుఫాన్ దృష్ట్యా కాకినాడ వద్ద తీరం దాటితే పెను ప్రమాదం అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీరందాటే సమయంలో పెనుగాలులు, 20 సెమీకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సముద్రం అలలు ఆరేడు మీటర్ల ఎత్తున ఎగసిపడనున్నాయంటున్నారు. విశాఖ, ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.

narasimhan 16122018

తీరం వెంబడి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తుఫాన్‌ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమైనారు. ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. సహాయ చర్యల కోసం అధికారులు ఫోన్ నెంబర్లను ప్రకటించారు. ఫోన్ నెంబర్లు: మచిలీపట్నం- 08672 252486, గుడివాడ- 08674 243697, ,నూజివీడు- 08656 232717, విజయవాడ- 0866 2574454, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో తుఫాన్‌ సహాయ కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌- 1800 425 3077, అమలాపురం ఆర్డీవో కార్యాలయం 08856 233208, కాకినాడ ఆర్డీవో ఆఫీసు- 08842 368100 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

పెథాయ్ తుపానుకు విద్యుత్ వ్యవస్థ దెబ్బతినకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్‌లు, కూలిపోయిన విద్యుత్ స్తంభాల స్థానే కొత్తవి సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈనెల 17న తుపాను తీరం దాటే సమయం వరకు సరఫరా, పంపిణీలో ఎలాంటి నష్టాలు జరగకుండా చూడాలన్నారు. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆయా విద్యుత్ రంగ సంస్థల అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లైన్ల మరమ్మతులు ఎప్పటికప్పుడు నిర్వహించేందుకు తగినంతసిబ్బందిని తుపాను ప్రభావిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

current 16122018

బ్రేక్ డౌన్‌లు, లైన్ నష్టాలు స్తంభాలు కూలిపోయే సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు ఎప్పటికప్పుడు అవసరమైన యంత్రసామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రధానంగా గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదమున్నందున విద్యుత్ లైన్ల పై చెట్లు విరిగిపడి ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించి సరఫరాను సత్వరమే పునరుద్ధరించాలని ఆదేశించారు. ప్రతి మండలానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, విజిలెన్స్, మానిటరింగ్ సెల్ విభాగంతో పాటు సిబ్బందిని తగినంత తుపాను ప్రభావిత జిల్లాలకు తక్షణమే పంపించాలని ఆదేశించారు.

current 16122018

ఇఇలు, డిఇలు, ఎఇలు సబ్‌స్టేషన్‌లు, 33, 11 కెవి లైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. హుదూద్, తిత్లీ తుఫాన్‌ల సందర్భంగా విద్యుత్ శాఖ అందించిన సేవల స్ఫూర్తితో తిరిగి పెథాయి తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు. సుమారు 50 నుంచి 70 వేల వరకు స్తంభాలను సిద్ధంచేయాలన్నారు. ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరా పునరుద్దరణ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించవద్దని కోరారు. అవసరమైన మేరకు జనరేటర్లను సమకూర్చుకుని మరమ్మతులు పూర్తిచేయాలన్నారు. తుఫాన్ సమయాల్లో ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా కాకుండా జాగ్రత్తలు వహించాలని, కర్నూలు, కడప, అనంపూర్ జిల్లాల నుంచి అవసరమైన సిబ్బంది తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఎస్‌పిడిసిఎల్, ఇపిడిసిఎల్ సిఎండిలు ఎంఎం నాయక్, హెచ్‌వై దొర స్పందిస్తూ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, సబ్‌స్టేషన్‌లు దెబ్బతింటే అందుకు తగ్గ సామగ్రి, ఉద్యోగులు, కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోంది. ఆ హామీల అమలు స్థితిగతులపై అధ్యయనం చేస్తున్న హోం శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి అవసరమైన సమాచారం ఇవ్వకుండా కేంద్ర అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీ ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమై ఆంధ్రకు ఇచ్చిన హామీల అమలుపై సమీక్షించింది. సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అధికారులు వేర్వేరుగా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలు ఎక్కడి వరకు వచ్చిందని సమావేశాల్లో చిదంబరం ప్రశ్నించగా.. అధికారులు సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయారు.

aphelp 16122018 2

ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలతో కూడిన నివేదికను పలు శాఖలకు పంపిన కమిటీ.. లిఖితపూర్వకంగా జవాబులివ్వాలని ఆదేశించింది. కానీ కొన్ని శాఖలే సమాధానాలు ఇచ్చాయి. దాంతో కమిటీ సమావేశమవుతున్నా ఆంధ్ర అంశాలు కాకుండా ఇతర అంశాలపై చర్చ జరుగుతోంది. కాగా.. గత సమావేశాల్లో ఆంధ్రకు ఏ ప్రాతిపదికన నిధులు ఇస్తున్నారని అధికారులను కమిటీ అడుగగా.. 2015లో ఆంధ్ర అభివృద్ధిపై నీతి ఆయోగ్‌ రూపొందించిన నివేదిక ఆధారంగా నిధులు ఇస్తున్నామని వారు బదులిచ్చారు. కానీ ఆ నివేదికను బహిర్గతం చేయలేదు. దాంతో ఆ నివేదికను తమకివ్వాలని కేంద్ర హోం, ఆర్థిక శాఖల అధికారులను కమిటీ చైర్మన్‌, సభ్యులు అడిగినట్లు సమాచారం.

aphelp 16122018 3

ఇప్పటివరకు ఆ నివేదికను కమిటీకి అందించకపోగా.. ‘ఆ నివేదిక మా వద్ద లేదు. మీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటే కాస్త పంపిస్తారా’ అని కమిటీలో సభ్యుడిగా ఉన్న మన రాష్ట్ర ఎంపీకి అధికారులు ఫోన్‌ చేసి అడిగినట్లు తెలిసింది. ‘మా వద్ద లేదనే కదా.. మిమ్మల్ని నివేదిక అడిగింది. అయినా మీ వద్ద నీతి ఆయోగ్‌ నివేదిక లేకపోతే ఏ ప్రాతిపదికన నిధులు ఇస్తున్నారు? ఆ నివేదిక ప్రకారమే నిధులు ఇస్తున్నామని కమిటీకి ఎలా చెప్పారు’ అని ఆ ఎంపీ ఘాటుగా నిలదీసినట్లు సమాచారం. బడ్జెట్‌ సమావేశాల వరకూ సమాచారమివ్వకుండా సాగదీస్తే.. ఆ తర్వాత కొద్దిరోజుల్లో ప్రస్తుత లోక్‌సభ గడువు ముగుస్తుందని, ఇక ఈ అంశం తెరమరుగవుతుందన్నది ప్రభుత్వ కుయుక్తిగా చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటుకు వారం రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే నోటిఫికేషన్‌ ముసాయిదాకు మార్పులు చేసిన కేంద్ర న్యాయశాఖ తుది ప్రకటన సిద్ధచేసినట్లు సమాచారం. త్వరలో ఈ ప్రకటన ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు. ఏపీలో హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారు, తదితర వివరాలు నోటిఫికేషనో ఉంటాయి. ప్రకటన జారీ తర్వాత మూడు మాసాల్లోపు ఏపీ హైకోర్టు తరలింపు ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు వద్ద నిర్మిస్తున్న ఏపీ హైకోర్టు భవనాన్ని ఈనెల 15 నాటికి పూర్తి చేస్తామని సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డిసెంబర్‌ చివరకు భవనం పూర్తి కానున్నట్లు సమాచారం.

highcourt 16122018 2

నేలపాడులో నిర్మిస్తున్న హైకోర్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. డిసెంబర్‌ 15 నాటికి భవనం పూర్తవుతుందని చెప్పిన ప్రభు త్వం, ఇప్పుడు డిసెంబర్‌ 31 నాటికి భవనం సిద్ధమ వుతుందని చెబుతోంది. ‘నోటిఫికేషన్‌ వెలువడటం అన్నదే ముఖ్యం. కేంద్రం నిర్ణయించిన విధంగా ఈ వారంలో నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. ఇదే సమయంలో హైకోర్టు తరలింపునకు 90 రోజుల గడువు ఎలానూ ఉంది. కాబట్టి ఈ వారం రోజుల్లోపు నోటిఫికేషన్‌ వచ్చినా, రాబోయే 3 నెల ల్లోపు ఎప్పుడైనా అమరావతికి హైకోర్టును తరలించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆలోచన తోనే ఉంది’’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

highcourt 16122018 3

మరో పక్క, రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు భవన నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రీకాస్ట్ టెక్నాలజీతో శరవేగంగా నిర్మిస్తున్నామన్నారు. ఈ నెల 31 నాటికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు, రైతులకు ఇచ్చిన ప్లాట్లలో రోడ్ల నిర్మాణ పనులు 1600 కిలోమీటర్ల మేర పూర్తి అయ్యాయన్నారు. మార్చి నాటికి మిగిలిన రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాజధాని నిర్మాణ పనులను చూసి మాట్లాడాలని విపక్షాలకు సూచించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు.

Advertisements

Latest Articles

Most Read