అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వ నగరాల జాబితాలో విజయవాడ చోట దక్కించుకొంది. లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ సంస్థ గురువారం ఈ రేటింగులను విడుదల చేసింది. రాష్ట్ర విభజనకు ముందు సంప్రదాయ వ్యాపార కూడలిగా ఉన్న విజయవాడ.. గత మూడేళ్లలోనే చాలా మారింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఇక... రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మించే ప్రయత్నాలూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2035 నాటికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే టాప్‌-10 ప్రపంచ నగరాల్లో విజయవాడకు చోటు దక్కడం విశేషం.

vij 15122018 2

విజయవాడ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. రహదారులు, భూగర్భ డ్రైనేజీ, పైవంతెనలు లాంటి మౌలిక వసతులు త్వరితగతిన సమకూరుస్తున్నారు. పరిశ్రమల రాక జోరందుకుంది. ప్రధానంగా ఐటీ, పరిశ్రమలు విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే వాణిజ్య కేంద్రంగా, విద్యా హబ్‌గా ఉంది. యువతకు ఉపాధిని కల్పించే పరిశ్రమలు సైతం తరలివస్తుండటంతో.. ఇక్కడే అవకాశాలను అందుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే రెండు దశాబ్దాల కాలంలో ఏటా 8.6 శాతం చొప్పున సగటు వార్షిక వృద్ధిని సాధించబోతోంది.

vij 15122018 3

విజయవాడ నగరం ప్రస్తుతం అత్యంత వేగవంతమైన పట్టణీకరణతో దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల జాబితాలోనూ మూడో స్థానంలో ఉన్నట్లు అమెరికాకు చెందిన డెమోగ్రాఫియా అంతర్జాతీయ సంస్థ రెండేళ్ల కిందట వెల్లడించింది. చదరపు కిలోమీటర్‌కు 31,200 మంది నగరంలో నివసిస్తున్నట్లు డెమోగ్రాఫియా ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగరం అత్యంత కీలకంగా మారిపోయింది. పాలనా కేంద్రంగా మారడంతో ఊహించని విధంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే 2019 నుంచి 2035 మధ్య నగరం ప్రగతి పథంలో సాగి.. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) గణనీయంగా పెరగబోతోంది. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ సంస్థ నివేదిక ప్రకారం.. 2018లో 5.6 శాతం ఉన్న జీడీపీ.. 2035 నాటికి 21.3 శాతానికి పెరగనుంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. గంటకు 13 కి.మీ వేగంతో ఇది తీరం దిశగా కదులుతోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా ఇది కదులుతోంది. మరికొన్ని గంటల్లో తుపానుగా, మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. 17వ తేదీన కాకినాడ-విశాఖ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ తుపానుకు ‘పెథాయ్‌’గా నామకరణం చేశారు. ఈ పేరును థాయ్‌లాండ్‌ ప్రతిపాదించింది.

cyclone 13122018 2

పెథాయ్‌ తుపాను నేపథ్యంలో వాతావరణశాఖ అధికారులు కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. 15న కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులో కొన్నిచోట్ల భారీ వర్షాలు, 16, 17న కోస్తాలోని పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అలాగే 17వ తేదీ కోస్తాతో పాటు ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. శనివారం నుంచే కోస్తా తీరంలో గాలుల తీవ్రత ఉంటుందని చెబుతున్నారు. 16వ తేదీ నుంచి గంటకి 80 కి.మీ నుంచి 110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

cyclone 13122018 3

‘పెథాయ్‌’ తుపాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యంత్రాంగం స‌ర్వస‌న్నద్ధంగా ఉందని అధికారులు ఆయనకు వివరించారు. జిల్లాల్లో తుపాను ముంద‌స్తు స‌న్నద్ధత‌ల‌పై సీఎం ఆర్టీజీఎస్ నుంచి వివ‌రాలు తెలుసుకున్నారు. ఎలాంటి ప‌రిస్థితి ఎదుర్కోవ‌డానికైనా సిద్ధంగా ఉండాల‌ని అధికారులను ఆదేశించారు. ప్రాణ‌న‌ష్టం లేకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అనిల్ చంద్రపునేఠా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి యంత్రాంగంతో నిత్యం ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

ధనిక రాష్ట్రాలకు మించి అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, ప్రజలు అప్రమత్తత పాటిస్తూ ప్రభుత్వానికి అండగా ఉండకపోతే మళ్లీ అరాచక శక్తులు విజృంభించి చీకటి రోజులు తెస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధిని కొందరు అదే పనిగా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ‘‘ప్రత్యేక హోదా మన హక్కు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఆ హోదా ఇవ్వాలన్న కేసీఆర్‌, ఇప్పుడు మోదీ చేతిలో కీలుబొమ్మగా మారి అడ్డుపడుతున్నారు. అలాంటి వ్యక్తిని జగన్‌, పవన్‌లు ఆకాశానికెత్తేస్తున్నారు. వారి ఉద్దేశాల్ని ప్రజలే గ్రహించాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ పరిధిలో రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమకు ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం ఉండవల్లి నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా శంకుస్థాపన చేశారు.

ap 15122018 2

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో మాట్లాడారు. ‘‘ఒక పరిశ్రమ రావాలంటే ఎంతో శ్రమపడాలి. చెడగొట్టడం చాలా సులభం. కొంతమంది అభివృద్ధి నిరోధకులు పరిశ్రమలు రాకుండా, అభివృద్ధి జరగకుండా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వారిపట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యుడు జనార్దన్‌రెడ్డి సిమెంటు పరిశ్రమ వల్ల భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరారని, ప్రక్రియ కొలిక్కి వచ్చేదాకా పట్టుబట్టి సాధించారని, మిగతా వారూ అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

ap 15122018 3

రాష్ట్రానికి రూ.15,73,172 కోట్ల పెట్టుబడుల్ని తెచ్చే 2,632 పరిశ్రమల్ని ఈ నాలుగున్నరేళ్లలో ఆకర్షించామని, తద్వారా 33,03,671 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘వీటిలో రూ.6,30,457 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటుచేస్తున్న 1,695 పరిశ్రమలు ఉత్పత్తి నుంచి అనుమతుల వరకు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో 795 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి. మరో 299 యూనిట్లు భూకేటాయింపు, 638 పరిశ్రమలు డీపీఆర్‌ దశల్లో ఉన్నాయి. ప్రారంభించిన పరిశ్రమల్లో రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రానికి ఏం ఒరిగిందని మాట్లాడే విపక్షానికి ఇదే సమాధానం’’ అని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మేనల్లుడు కనుమూరి ఉదయ్‌కుమార్‌(43) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాదులో వ్యాపారం చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్న ఆయనకు గురువారం రాత్రి ఛాతీలో నొప్పిరావడంలో అక్కడి కేర్‌ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండో చెల్లెలు కనుమూరి హైమావతి కుమారుడు ఉదయ్‌కుమార్‌. మేనల్లుడు గుండెపోటుతో మృతిచెందారన్న సమాచారం తెలియగానే ముఖ్యమంత్రి తమ కుటుంబసభ్యులతో అమరావతి నుంచి హైదరాబాదుకు చేరుకున్నారు. మృతుడు ఉదయ్‌కుమార్‌కు భార్య సింధూరి, కుమార్తె వన్షిక ఉన్నారు.

uday 15122018 2

సాయంత్రం 5.15 గంటల సమయంలో హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పార్థివదేహాన్ని 6.15 గంటలకు కందువారిపల్లిలోని స్వగృహానికి తీసుకువచ్చారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన బంధువులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ రోజు, ఉదయ్ కుమార్ అంత్యక్రియలు చిత్తూరు జిల్లా కందులవారిపల్లెలో అశ్రునయనాల మధ్య జరిగాయి. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న సీఎం.. కందులవారిపల్లె చేరుకొని ఉదయ్ కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తన చెల్లెలు హైమావతిని పరామర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం ఉదయ్ కుమార్ అంతిమయాత్ర ప్రారంభమైంది. అశ్రునయనాలతో కందులవారిపల్లెలో అంతిమయాత్ర సాగింది.

uday 15122018 3

మంత్రి నారా లోకేష్, సినీహీరో నారా రోహిత్ పాడె మోసి ఉదయ్ కుమార్‌కు తుది వీడ్కోలు పలికారు. వారితో పాటుగా సీఎం చంద్రబాబు అంతిమయాత్రలో పాల్గొన్నారు. దహన క్రియలు పూర్తయిన తర్వాత ఉదయ్ కుమార్ నివాసానికి చేరుకున్న సీఎం తన చెల్లెలు హైమావతిని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం నారావారిపల్లెలో తన నివాసానికి చేరుకున్న సీఎం కాసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని రాజధానికి పయనమయ్యారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరితో పాటు లోకేష్, బ్రాహ్మణి, సినీ హీరో నారా రోహిత్, మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు, చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు ఉదయ్ కుమార్ అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు.

Advertisements

Latest Articles

Most Read