విజయవాడ సీఆర్డీఏ కార్యాలయాన్ని ఉత్తరాఖండ్ ఆధికారుల బృందం మంగళవారం సందర్శించింది. సీఆర్డీఏ స్పెషల్ కమిషనర్ వి.రామమనోహరరావు, అదనపు కమిషనర్ సగిలి షణ్మోహన్‌తో వారు సమావేశమయ్యారు. అమరావతి రాజధాని ప్రణాళిక, ఆర్థిక వనరుల ప్రణాళిక, భూ సమీకరణ పథకం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ సమీకరణ పథకం కింద అమరావతి నగరానికి భూముల సేకరణలో అనుసరించిన విధానాలను సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాఖండ్‌లో వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా అమరావతిలో అమలుచేసిన వినూత్న అంశాల అధ్యయనానికి వచ్చినట్టు వారు తెలియజేశారు.
బృందంలో ముస్సోరి డెహ్రాడూన్ డెవల్‌పమెంట్ ఆథారిటీ వైస్ చైర్మన్ ఆశిష్ శ్రీవాత్సవ, మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్ జోగ్డాండే, డిస్ర్టిక్ మేజిస్ర్టేట్ మురుగేశన్ పలువురు డెహ్రడూన్ అధికారులు పాల్గొన్నారు. మరో పక్క,
సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌తో యూఎస్ కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ డెలిగేట్ల బృందం మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని విశేషాలను కమిషనర్ వారికి వివరించారు. అమరావతిలో అవకాశాలను తెలియజేశారు. బ్లూగ్రీన్ సీటి అమరావతి హ్యాపీసిటీగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఎల్వీఎస్ తదితర అంశాలను వారికి తెలియజేశారు. ప్రజారాజధాని డిజైనింగ్ గురించి బృందం తెలుసుకుంది. భారత-కాలిఫోర్నియా మధ్య సాంకేతిక సహకారం అంశంపై చర్చించేందుకు వారు విచ్చేసినట్టు కమిషనర్ తెలిపారు. అమరావతి ప్రణాళిక, వాటర్ మేనేజ్మేంట్, ఎనర్జీ ఎఫీషియన్సీ విధానం గురించి వారికి వివరించినట్టు పేర్కొన్నారు. బృందంలో ఆష్కాల్రా, సెస్లియా అగ్వయిర్ కర్రి, ఎలాయిస్ గొమెజ్ రేయిస్, రిచర్డ్ బ్లూమ్, మార్క్ స్టోన్, షారోన్ క్విర్క్ సిల్వా ఉన్నారు. సమావేశంలో సీఆర్డీఏ ఎకనమిక్ డెవలప్మెంట్ విభాగం డైరెక్టర్ వై.నాగిరెడ్డి, అడ్వయిజర్ ఆర్.రామకృష్ణారావు, ఇన్ఫ్రాచీఫ్ గణే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.