ఒక పక్క తెలంగాణాలో తెరాస పార్టీ ఆధిక్యంలో దూసుకువెళ్తుంటే, మరో పక్క మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి అంచున ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో దూసుకెళుతోంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీ ముందంజలో ఉంది. మిజోరం, తెలంగాణలో ఆ పార్టీ వెనుకంజలో ఉంది. మధ్యప్రదేశ్‌(230)లో 114 స్థానాల్లో కాంగ్రెస్‌, 101 స్థానాల్లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌(199)లో 102 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండగా.. భాజపా 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఛత్తీస్‌గఢ్(90)‌లో 58 స్థానాల్లో కాంగ్రెస్‌, 23 స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉన్నాయి.

modi 11122018

ఇక తెలంగాణ(119) లో ఆ పార్టీ వెనుకంజలో ఉంది. తెరాస 91 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఆ పార్టీ 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మిజోరం(40)లోనూ కాంగ్రెస్‌ పార్టీ వెనుకంజలో ఉంది. ఇక్కడ ఎంఎన్‌ఎఫ్‌ 25 స్థానాల్లో ఆధిక్యం ఉండగా కాంగ్రెస్‌ 8 స్థానల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ 82, ప్రజాకూటమి 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సహా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రజాకూటమి అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ తదితరులు తెరాస అభ్యర్థులపై వెనుకంజలో కొనసాగుతున్నారు. కూకట్‌పల్లిలో తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసినిపై తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆధిక్యంలో ఉన్నారు.

count 10122018 2

నాగార్జునసాగర్‌లో జానారెడ్డిపై నోముల నర్సింహయ్య, కొడంగల్‌లో రేవంత్‌పై పట్నం నరేందర్‌ రెడ్డి, అందోల్‌లో దామోదర రాజనర్సింహపై చంటి క్రాంతికిరణ్‌, మధిరలో భట్టి విక్రమార్కపై లింగాల కమల్‌రాజ్‌ ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడయింది. చంద్రాయణ్ గుట్ట మాజీ ఎమ్మెల్యే, ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) శాసనపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఘనవిజయం సాధించారు. మరోవైపు పాతబస్తీలోని 5 నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. అక్బరుద్దీన్ మెజారిటీకి సంబంధించిన తెలియాల్సి ఉంది. కాగా, గోషా మహల్, యాకుత్ పురాలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు.

తెలంగాణాలో ప్రజా కూటమి నేతలు, రాజ్‌భవన్‌లో గవర్నర్ ని కలిసిన సందర్భంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. తెలంగాణా టీడీపీ సీనియర్ నేత పై గవర్నర్ నరసింహన్ సెటైర్ వేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. ఇటు కాంగ్రెస్‌ కూడా 80 స్థానాల్లో కూటమి నేతలు విజయం సాధిస్తామని చెబుతున్నారు. ఎవరికి వారు ధీమాగా ఉన్నా.. వీరిని హంగ్ భయం వెంటాడుతోంది. అందువల్ల ఇరు పార్టీల నేతలు ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులతో బేరసారాలు సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కూటమి నేతలు మరో ముందగుడు వేశారు. మహాకూటమి విజయం తథ్యమని భావించిన నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. సోమవారం గవర్నర్‌తో భేటీ అయ్యారు.

governer 11122018

ఈ సమావేశంలో గవర్నర్, కూటమి నేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అదేంటంటే... మొదట ప్రజాకూటమి ఏర్పాటు, ఎజెండా తీర్మానాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గవర్నర్‌కు వివరించారు. ప్రభుత్వ ఏర్పాటు ఇతర అంశాలు మాట్లాడుతున్నప్పుడు టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి గవర్నర్ ముందు కూర్చొని మాట్లాడడాన్ని గవర్నర్ ప్రశ్నించారు. ‘‘అదేంటి ఎప్పుడూ నిలబడి మాట్లాడుతావ్ కదా... ఈ రోజు కూర్చొని మాట్లాడుతున్నారు’’ అని గవర్నర్ సెటైర్ వేశారని వినికిడి. దీంతో ఆయన వెంటనే లేచి నిలబడ్డారు. రావుల నిల్చోగానే గవర్నర్ వెంటనే కల్పించుకున్నారు. ‘‘సరదాగా అన్నాను.. కూర్చోండి’’ అని చెప్పారు. పర్వాలేదు నిల్చొనే మాట్లాడతా అని రావుల సమాధానం ఇచ్చినట్లు రాజ్‌భవన్ వర్గాల సమాచారం.

 

governer 11122018

ఇదిలావుంటే కర్నాటక ప్రభుత్వ ఏర్పాటులో జరిగిన రాజకీయ పరిణామాలను గవర్నర్ ముందు సుప్రీంకోర్టు న్యాయవాది జంధ్యాల ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కర్ణాటక సంగతి ఏంటని న్యాయవాది, ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడితే పోలింగ్‌కు ముందే పొత్తు కుదుర్చుకున్న ప్రజాకూటమికి ఎక్కువ సీట్లు వచ్చినట్లయితే వారినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితాలకు అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతున్నది. అదే జరిగితే గవర్నర్ ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ అంశంపై గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకున్న కూటమికే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

భారత సమకాలీన రాజకీయ చరిత్రలో వినూత్న ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోని 22 రాజకీయ పక్షాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. భిన్న సిద్ధాంతాలను పక్కనపెట్టి.. ఏకస్వరం వినిపించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ చేతులు కలిపాయి. కదం కదం కలిపి ఆందోళన పథంలో సాగాలనే నిర్ణయానికి వచ్చాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న వ్యవస్థల విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉమ్మడి పోరాటం చేయాలని 22 పార్టీల విపక్ష కూటమి నిర్ణయించింది. గత నాలుగున్నరేళ్లుగా సాగుతున్న ఎన్డీయే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వ్యవస్థల దుర్వినియోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా విస్తృత ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టి 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించాలని సంకల్పించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమన్వయంతో సోమవారం సాయంత్రం 3.30కు ఇక్కడి పార్లమెంటు అనుబంధ భవనంలో యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షాల తొలి భేటీకి అనూహ్య మద్దతు లభించింది. తొలుత ఇందులో 11 పార్టీలు భాగస్వాములవుతాయని భావించినా సోమవారానికి ఆ సంఖ్య 22కి చేరింది.

front 11122018

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇండియా పరిరక్షణ లక్ష్యంగా జరిగిన బీజేపీయేతర సమావేశం చారిత్రాత్మకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న వారంతా ఈ సమావేశానికి హాజరయ్యారని ఆయన తెలిపారు. బీజేపీ కూటమిని ఓడించేందుకు తామంతా ఒక వేదికపైకి వచ్చాం.. తమది దేశ ప్రజల వాణి అని చంద్రబాబు తెలిపారు. సీబీఐ, రిజర్వు బ్యాంకుపై ప్రభుత్వం దాడి చేస్తోంది.. ఈడీ తదితర సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రత్యర్థులపై ప్రయోగిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే ఆర్‌బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకోసం ఆర్థిక వ్యవస్థ, ఆర్‌బీఐ తదితర సంస్థలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. ఉర్జిత్ పటేల్ రాజీనామా దేశానికి మంచిది కాదు.. రేపు ఏం జరుగబోతోందని అని చంద్రబాబు ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది.. రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అభద్రతాభావంతో ఉన్నారని అన్నారు. దేశాన్ని, రాజ్యాంగ సంస్థలను రక్షించుకునేందుకు కలిసికట్టుగా పని చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించామని చంద్రబాబు ప్రకటించారు. బీజేపీని ఓడించేందుకు ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావలసిన సమయం ఆసన్నమైందని పిలుపిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించవలసిందే.. లేకపోతే దేశానికి తీరని నష్టం వాటిల్లుతుందని చంద్రబాబు అన్నారు. పార్లమెంటు లోపల, వెలుపల ఏంచేయాలనే దానిపై వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నామని అన్నారు.

front 11122018

మొత్తం 22 పార్టీల నాయకులు హాజరైన ఈ సమావేశానికి దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి హజరుకాలేదు. వారు లేని లోటు ఈ సమావేశంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, సీనియర్ నాయకులు అహమద్ పటేల్, ఆంటోని, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఆశోక్ గెహ్లోత్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ప్రఫుల్ల పటేల్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీడీపీ తరపున చంద్రబాబు నాయుడు, జేడీ(ఎస్) అధినాయకుడు దేవెగౌడ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా, ఎల్‌జేడీ నేత శరద్ యాదవ్, ఆర్జేడీ నుండి తేజస్వి యాదవ్, డీఎంకే తరపున స్టాలిన్, కనిమోజి, బాలు, హేమంత్ సోరెన్ (జేఎంఎం), అజిత్‌సింగ్ (ఆర్‌ఎల్‌డీ), డి.రాజా (సీపీఐ), జోస్‌కెమణి (కేసీఎం), జితెన్‌రాం మంజి (హెచ్‌ఏఎం), బాబులాల్ మరాండి (జేవీఎం), కునహలికుట్టి (ఐయూఎంఎల్), బద్రుద్దీన్ అజ్మల్ (ఏఐయూడీఎఫ్), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ), కేజీ కెన్యా (ఎర్‌పీఎఫ్), ప్రేమచంద్రన్ (ఆర్‌ఎస్‌పీ) సమావేశానికి హాజరయ్యారు.

Advertisements

Latest Articles

Most Read