తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గంటల వ్యవధి మాత్రమే ఉండటంతో తమ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్‌ వేగంగా పావులు కదుపుతోంది. కర్ణాటక తరహా వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికోసం కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి డీకే శివకుమార్‌ను ఆ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది. అత్యధిక స్థానాలు కలిగిన పెద్ద పార్టీగా భాజపా నిలిచింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ మాత్రం రాలేదు. జేడీఎస్‌, కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి.

dk shivakumar 11122018

అయితే గవర్నర్ మాత్రం‌ రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం భాజపా నేత యడ్యూరప్పను సీఎంగా నియమించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా కాంగ్రెస్‌ , జేడీఎస్‌ శాసనసభ్యులు భాజపా వైపునకు వెళ్లకుండా చేయడంలో డీకే శివకుమార్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో ఆయన పేరు కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టిలో పడింది. ట్రబుల్‌ షూటర్‌గా పేరు తెచ్చుకున్న డీకేను తెలంగాణలో రంగంలోకి దింపడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒక వేళ హంగ్‌ ఏర్పడితే డీకే ఎలాంటి వ్యూహం అనుసరించనున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల వెల్లడికి తక్కువ సమయమే మిగిలి ఉండటంతో రేపు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఏఐసీసీ పెద్దలు సైతం ఈ సాయంత్రానికే హైదరాబాద్‌ చేరుకోనున్నారు.

dk shivakumar 11122018

ఇప్పటికే తెరాసకు మజ్లిస్‌ పార్టీ మద్దతు ప్రకటించడం.. సీఎం కేసీఆర్‌తో ఎంఐఎం‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భేటీ కావడంతో కాంగ్రెస్‌ వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. ఏ పార్టీకీ మెజార్టీ దక్కకుండా హంగ్‌ ఏర్పడితే స్వతంత్ర అభ్యర్థుల సాయంతో గట్టెక్కాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులతో ఆ పార్టీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు తెరాసకు అనుకూలంగా ఉండగా.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మాత్రం బృందం చేసిన సర్వేలో ప్రజాకూటమికి విజయావకాశాలు ఉన్నట్లు తేలిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేపు వెల్లడయ్యే ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ‌

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరుగనుంది. రౌండ్ రౌండుకు ఫలితాలు మారుతూ రాజకీయ నాయకులకు ముచ్చమటలు పట్టించే ఫలితాలు రేపు ఆలస్యం కానున్నాయి. ఎన్నికల సంఘం విధించిన కొత్త నిబంధనలే దీనికి కారణమని తెలుస్తోంది. గతంలో ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ప్రతీ రౌండు ఫలితాలు వెంటనే బయటకు ప్రకటించేవాళ్లు. అయితే కొత్త రూల్ ప్రకారం ప్రతీ రౌండు ఫలితాన్ని స్టే‌ట్‌మెంట్ రూపంలో ముందు పోటీ చేసిన అభ్యర్థులకు ఇస్తారు. వారు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోతే దానిపై రిటర్నింగ్ అధికారి సంతకం చేసి మీడియాకు ఇస్తారు. అంతే కాకుండా ఆ రౌండ్ ఫలితాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.

count 10122018 2

ఇలా ప్రతీ రౌండు ఫలితం స్టేట్‌మెంట్ రూపంలో పెట్టిన తర్వాతే ఫలితం ప్రకటిస్తారు. దీంతో చివరి ఫలితం గతంలో కంటే రెండు గంటల ఆలస్యం అవ్వొచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. రేపు ఎన్నికల కౌంటింగ్ జరిగే 5 రాష్ట్రాల్లో, ఈ నిబంధన అమలు చేయనున్నారు. ఇక తెలంగాణలోని 119 నియోజకవర్గాల కౌంటింగ్ 31 జిల్లా కేంద్రాల్లో జరుగనుంది. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌, త్రివిధ దళాల్లో పనిచేసిన సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత అసలు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒక్కోలెక్కింపు కేంద్రంలో 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందికి ఇప్పటికే రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. సమాచార మార్పిడికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.

count 10122018 3

లెక్కింపు కేంద్రాలకు అనుబంధంగా మీడియా సెంటర్లను అందుబాటులోకి తెచ్చారు. కేవలం 161 పోలింగ్‌ కేంద్రాలు ఉన్న భద్రాచలం నియోజకవర్గంలో తొలి ఫలితం తేలనుంది. 12 రౌండ్లు పూర్తయ్యే సరికి విజేత ఎవరనేది తేలిపోనుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 580 పోలింగ్‌ కేంద్రాలు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం ఫలితం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అక్కడ 20కి పైగా రౌండ్ల తర్వాత తుది ఫలితం రానుంది. అంతేస్థాయిలో పెద్ద నియోజకవర్గాలైన మేడ్చల్‌, ఎల్బీనగర్‌, మల్కాజ్‌గిరి స్థానాలకు 20కి పైగా రౌండ్లు పట్టే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలూ తీసుకుంది.

గవర్నర్‌ నరసింహన్‌తో ప్రజాకూటమి నేతలు భేటీ అయ్యారు. ప్రజాకూటమిని ఒక పార్టీగా గుర్తించాలంటూ గవర్నర్‌ను కలిసి కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐలు కలసి పోటీ చేసినందున ఈ కూటమిని అంతా ఒకటిగానే గుర్తించాలని విన్నవించనున్నాయి. ఈ భేటీలో కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి‌, షబ్బీర్అలీ‌, భట్టి విక్రమార్క, మధుయాష్కి, అజారుద్దీన్‌, టీడీపీ నుంచి ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరామ్‌, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలను ఒక పార్టీగా పరిగణించాలని గవర్నర్‌ను నేతలు కోరారు. కూటమికి అత్యధిక స్థానాలు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తమకే ఇవ్వాలని నేతలు కోరారు.

amitshah 10122018

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీరాని పరిస్థితి ఏర్పడితే పోలింగ్‌కు ముందే పొత్తు కుదుర్చుకున్న ప్రజాకూటమికి ఎక్కువ సీట్లు వచ్చినట్లయితే వారినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితాలకు అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతున్నది. అదే జరిగితే గవర్నర్ ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ అంశంపై గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకున్న కూటమికే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫలితాల అనంతరం రాజ్యాంగబద్ధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాకూటమి ముఖ్య నేతలుగవర్నర్‌ నరసింహన్‌ను కలసి వినతిపత్రం అందచేసారు. ఫలితాల తరవాత తెరాసకు మద్దతిస్తామని భాజపా ప్రకటించడం పై చర్చిస్తూ ముందుముందు తలెత్తబోయే ఇలాంటి పరిణామాల గురించి గవర్నర్‌కు ముందే వివరించారు.

amitshah 10122018

ఫలితాల తరవాత ప్రత్యర్థులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే అవకాశాల పై ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. రేవంత్‌రెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి అరెస్టు చేయడం, పోలింగ్‌ రోజున వంశీచంద్‌రెడ్డిపై భౌతిక దాడి చేయడం, వేలాదిమంది ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా జాబితాల నుంచి తొలగించడం వంటి అంశాలన్నింటిపైనా గవర్నర్‌కు వివరించారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించారు. అమిత్ షా, మోడీ కలిసి వివధ రాష్ట్రాల్లో చేస్తున్న పనులు చూసి, ప్రజా కూటమి నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. గోవా, జమ్మూ, నాగాలాండ్, కర్ణాటక రాష్ట్రాల్లో గవర్నర్ లను అడ్డు పెట్టుకుని, అమిత్ షా చేసిన అరాచకం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తరువాత, మన గవర్నర్ గారు ఏమి చేస్తారో చూడాలి.

ఒక పక్క ప్రధాని మోడీ, అమిత్ షా కలిసి, దేశంలో వ్యవస్థలు అన్నీ నాశనం చేస్తున్నారని, అందుకే అందరినీ ఒక తాటి పైకి తెస్తూ చంద్రబాబు ఢిల్లీలో దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో మీటింగ్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో రాజీనామ చేస్తున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. భారతదేశ రిజర్వు బ్యాంకులో వివిధ పదవుల్లో సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు చెప్తున్నారు.

modi 012122018 1

2016 నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉర్జిత్‌ హయాంలోనే 2016 నవంబర్‌ 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నోట్ల నద్దుపై ఉర్జిత్‌ పటేల్‌ అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ (జేపీసీ) ఎదుట హాజరై పలుమార్లు వివరణ కూడా ఇచ్చుకున్న విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా ఆర్బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న సైలెంట్‌వార్‌ కారణంగానే గత నెల 19న రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశం తర్వాత ఆయన రాజీనామా చేస్తారంటూ వార్తలు వెల్లువెత్తాయి. అయితే, కేంద్రం ఉర్జిత్‌, బోర్డులో డైరెక్టర్లతో చర్చలు జరిపిన తర్వాత ఆయన తన ఆలోచనను విరమించుకున్నారని అప్పట్లో ఆర్బీఐ వర్గాలు, కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ రోజు అకస్మాత్తుగా ఆయన తన రాజీనామా లేఖను కేంద్రానికి పంపడంతో పాటు వ్యక్తిగత కారణాల రీత్యా వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు.

modi 012122018 1

ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర విషయాల్లో ప్రభుత్వ సూచనలకు రిజర్వ్ బ్యాంక్ ససేమీరా అంటుండటంతో.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఉర్జిత్ పటేల్‌కు ప్రభుత్వం లేఖలు పంపింది. ప్రజా ప్రయోజనం కోసం, నిర్దిష్ట సమస్యల విషయంలో రిజర్వ్ బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతూ ఆర్బీఐ గవర్నర్‌కు సూచనలు చేసే అధికారం కేంద్రానికి ఉందని సెక్షన్ 7 స్పష్టం చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకూ సెక్షన్ 7ను కేంద్రం వాడలేదు. 2008 సంక్షోభం సమయంలోనూ, 1991లో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా కేంద్రం ఇలా చేయలేదు. అసాధారణ రీతిలో కేంద్రం సెక్షన్‌ 7ను ఉపయోగించడంతో.. ప్రభుత్వ ఉద్దేశాలు, ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు రాజీనామా చేస్తారని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. రిజర్వుబ్యాంకును ఈ ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వకుండా, తన అవసరాలను, విధానాలను దాని మీద రుద్దుతూ పీకనులుముతున్నదని బ్యాంకు ఉద్యోగుల సంఘం విరాళ్‌ ఆచార్య విరుచుకుపడ్డారు. రిజర్వుబ్యాంకు బోర్డులో పరివార్‌ మనిషి గురుమూర్తిని పార్ట్‌టైమ్‌ డైరక్టర్‌గా నియమించడంతో నిప్పురాజుకుంది. మోదీ మనిషిగా గురుమూర్తి అతిజోక్యం బ్యాంకులో అందరినీ బాధిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా రెండోసారి గవర్నర్‌ గిరీ వెలగబెట్టకూడదని ఉర్జీత్‌ సైతం అనుకుంటున్నట్టు చెబుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read