రాజధాని ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా నిర్మితమవుతున్న సెక్రటేరియట్‌ - హెచ్‌వోడీ టవర్లకు ఫౌండేషన్‌ ప్రక్రియకు ఏపీ సీఆర్డీయే సిద్ధమవుతోంది. దేశంలోనే ఇంతకు ముందెక్కడా కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 5 టవర్ల (ఒక్కొక్కటి 40 అంతస్థులతో 4టవర్లు, 50 అంతస్థులతో 1)కూ కలిపి 12 వేల క్యూబిక్‌ మీటర్ల మేర ఒకే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ను వేయాలని నిర్ణయించిన ఏపీసీఆర్డీయే అమరావతికి మరో విశిష్ఠతను జోడించనుంది. వేలాది కార్మికులు, నిపుణులతోపాటు భారీ ఎత్తున నిర్మాణ సామగ్రి, యంత్రాలు, సునిశిత ప్రణాళిక, అద్భుత సమన్వయం అవసరమయ్యే ఇంతటి ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ దేశంలో ఇదే ప్రథమని చెబుతున్నారు! 3 రోజులు రేయింబవళ్లు నిర్విరామంగా శ్రమిస్తే గానీ పూర్తవని ఈ బృహత్తర ప్రక్రియను త్వరలోనే చేపట్టాలని సీఆర్డీయే భావిస్తోంది. ఇందుకోసం పలు శాఖలు, సంస్థలు, నిష్ణాతులను సమన్వయపరచుకోవడంలో నిమగ్నమైంది.

amaravati 09122018 2

అన్నీ వేలాది టన్నుల్లోనే.. సచివాలయం 5 టవర్లకు కలిపి సుమారు 13 అడుగుల లోతున వేసే 12 వేల క్యూ.మీ. అత్యంత భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు అదే స్థాయిలో నిర్మాణ సామగ్రి అవసరం. దీనికోసం సుమారు 1300 టన్నుల స్టీల్‌, 3,000 టన్నుల సిమెంట్‌, 12,000 టన్నుల కంకర, 8,000 టన్నుల ఇసుక, 3,000 టన్నుల ఫ్లైయా్‌షతోపాటు 12 లక్షల లీటర్ల కృష్ణానదీ జలాలు కావాల్సి ఉంటుందని అంచనా వేశారు. వీటన్నింటినీ కలిపి కాంక్రీట్‌ మిక్సర్‌ తయారు చేసేందుకు 35 టన్నుల సామర్ధ్యం కలిగిన హెడ్‌ మిక్సర్లను వినియోగించాలి.

 

amaravati 09122018 3

సామగ్రి తరలింపునకు భారీ ప్రణాళికలు.. భారీగా అవసరమయ్యే నిర్మాణ సామగ్రిని సచివాలయం నిర్మాణ ప్రాంతంలో ఉంచడం సాధ్యం కాదు కాబట్టి అవి లభ్యమయ్యే చోటు నుంచి వాటిని ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేసే రోజుల్లో నేరుగా చేర్చనున్నారు. వచ్చే వారం ఈ ప్రక్రియ ఓ కొలిక్కి రానుందని సమాచారం. అది పూర్తయిన వెంటనే బహుశా ఈ నెల 10- 16 తేదీల మధ్య ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేయవచ్చునని తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పనులు ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి సారించింది. ఇంతటి అత్యంత భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేయబోతున్న సీఆర్డీయే.. కాంక్రీట్‌ టెక్నాలజీలో ప్రపంచంలోనే సుప్రసిద్ధ సంస్థలు, వ్యక్తుల మార్గదర్శకత్వంలో ఎప్పటికప్పుడు పలు పరీక్షలు చేయిస్తూ, వాటి ఫలితాల ఆధారంగా కార్యాచరణను రూపొందించుకుంటోంది.

తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) మళ్లీ దాడులు మొదలుపెట్టింది. టీడీపీ నేతలు లక్ష్యంగా ఇవి జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం నేతలు, సానుభూతి పరుల పై ఐటి దాడులు చేసి, ఏమి దొరక్క, మీడియాకు తప్పుడు లీక్ లు ఇచ్చి, హంగామా చేసారు. అయితే, ఈసారి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన కార్యాలయాల్లో సోదాలు చేశారు. పోలింగ్‌కు ముందు బీద మస్తానరావు, ఎంపీలు సీఎం రమేశ్‌, సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ ముగిసిన తర్వాత మరోసారి ఐటీ గురి పెడుతుందని పార్టీ నేతలు ముందుగానే ఊహించారు. శుక్రవారం సాయంత్రం నుంచే ఈ అంశంపై ప్రచారం జరగ్గా శనివారం అదే జరిగింది.

it 09122018 2

టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబానికి చెందిన పలు సంస్థల కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. చెన్నైలోని టి.నగర్‌ బజుల్లా రోడ్డులో ఉన్న బాలాజీ గ్రూప్‌ ఆఫీసు, పూందమల్లిలో ఉన్న ఎండ్రికా ఎంటర్‌ప్రైజెస్‌ డిస్టిలరీస్‌ ఫ్యాక్టరీ, మాగుంట కుటుంబానికి చెందిన సన్నిహితుల కార్యాలయాలు.. ఇలా పదిచోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. డిస్టిలరీ ఫ్యాక్టరీలో లెక్కల్లో చూపని నగదు భారీగా పట్టుబడినట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే ఎప్పటిలాగే, ఐటీ అధికారులు దీనిని ధృవీకరించలేదు. కేవలం బురద చల్లారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రమే పక్కా ప్రణాళిక ప్రకారం రంగంలోకి దిగిన ఐటీ అధికారులు శనివారం కూడా సోదాలు కొనసాగించారు.

it 09122018  3

ఆదివారం కూడా సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై టీనగర్‌లోని బాలాజీ సంస్థల ప్రధాన కార్యాలయంలోను, పూందమల్లిలోని ఆ సంస్థతో పాటు, మరో కంపెనీలోను తనిఖీలు చేశారు. టీడీపీలో ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు, వారి వ్యాపారాలపై ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని పార్టీ నేతలు ముందు నుంచీ ఆరోపిస్తున్నారు. ఈ దిశగానే సోదాలు జరుగుతుండటం ఈ అనుమానాలు మరింత బలపరుస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఎన్నికల సందర్భంగా కొంత విరామం ఇచ్చి మళ్లీ మొదలుపెట్టినట్లు భావిస్తున్నారు. ఇవి మరికొంత కాలం కొనసాగుతాయని సమాచారం. దీనికోసమే పలు ఐటీ బృందాలు రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలోనే మకాం వేసి, తమకు అందిన ఆదేశాల మేరకు దాడులు చేస్తారని అంటున్నారు.

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నడూ లేని విధంగా ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా తెలంగాణలో పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అలాగే భారీ పోలింగ్ కూడా నమోదైంది. మరో పక్క ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల అయ్యాయి. లగడపాటి తెలంగాణలో ప్రస్తుత ప్రజల నాడి ప్రకారం ప్రజాకూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయని ప్రకటించారు. జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ మొత్తం టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా సర్వే ఫలితాలను విడుదల చేశాయి. అయితే నార్త్ టీవీ చానల్స్, తెలుగు రాష్ట్రాల పై ప్రసారం చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ సక్సెస్ కాలేదు. వారి అంచనా ఎప్పుడు తప్పుతూనే ఉంది. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల ప్రజా నాడి పట్టటంలో, ఈ నార్త్ టీవీ చానల్స్ ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి.

rajdeep 08122018 1

అయితే తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై ఇండియా టుడే తన సర్వేలో తెరాస పార్టీకి భారీ ఆధిక్యం ఇచ్చింది. ఇండియా టుడే ప్రకారం.. టీఆర్‌ఎస్‌: 79-91, ప్రజాకూటమి: 21-33, ఎంఐఎం: 4-7, బీజేపీ: 1-3 గెలుచుకోనున్నాయి. టీర్ఎస్ మరోసారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకోబోతోందంటూ ఇండియా టుడే సర్వే చూసిన పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతూ ఉండగా, తెరాస పార్టీకి అసలు 91 సీట్లు ఎలా వస్తాయని అంచనా వేసారో అర్ధం కాక రాజకీయ విశ్లేషకులు అవాక్కయ్యారు. అయితే, ఇండియా టుడే కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది.

rajdeep 08122018 1

రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేస్తూ, తెలంగాణాలో మళ్ళీ తెరాస వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నా, చాలా టైట్ ఎలక్షన్ జరిగింది, ఫలితాలు పోటా పోటీగా వస్తాయని ట్వీట్ చేసారు. "The exit poll result which if true will confirm the rise of a regional satrap: my own view, it's going to be a tighter race". మరో పక్క, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే విషయం చెప్పారు. ఇండియా టుడే కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్, ఈ సర్వేలను నమ్మవద్దు, చాలా పోటా పోటీగా ఎన్నిక జరుగింది అంటూ, స్వయంగా తనకు చెప్పారన్నారు. ఆ ఛానల్ సర్వేలో టీఆర్ఎస్‌కు 79 - 91 సీట్లు వస్తాయని తేలిందిన.. అయితే వాటిని రాజ్‌దీప్ ఖండించారన్నారు. ఉదయం 9 గంటలకు తనకు ఫోన్ చేసిన రాజ్‌దీప్.. ఎగ్జిట్ పోల్ చూసి కంగారుపడొద్దన్నారని ఉత్తమ్ తెలిపారు. ఆ ఫలితాలతో ఏకీభవించడం లేదని రాజ్‌దీప్ తనతో చెప్పారన్నారు. పోటీ హోరాహోరీగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు.

ఎంతో శ్రావ్యంగా పాటలు పాడుతూ యూట్యూబ్‌లో లక్షాలాది శ్రోతలను అలరిస్తున్న పసల బేబిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. అలవోకగా పాటలు పాడుతూ యూట్యూబ్‌లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పసల బేబిని సీఎం చంద్రబాబు అభినందించారు. బేబినీ ఎంపీ మురళీమోహన్, మహిళా చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి చంద్రబాబుకు పరిచయం చేశారు. సినీ పాటలతో లక్షలాది మంది అభిమానులను సోషల్ మీడియా ద్వారా మెప్పించడం గొప్ప విషయమని ప్రశంసించారు. అంతేకాదు బేబిని సీఎం సన్మానించారు. ఈ సందర్భంగా బేబి పాడిన పాటకు చంద్రబాబు ఫిదా అయ్యారు.

baby 08122018 1

చంద్రబాబును కలిసిన అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ బేబిగారు అద్భుతమైన పాటలు పాడుతున్నారు. ‘‘ఆమె చదువుకోలేదు. సంగీత జ్ఞానం అంతకన్నా లేదు. బేబి మట్టిలో మాణిక్యం. వ్యవసాయ కూలిగా పనిచేస్తూ.. పనులు చేసేటప్పుడు పాటలు నేర్చుకుంది. ఆమె పాడిన పాటలను ఎవరికి వాళ్లే అద్భుతమని కొనియాడారు. బేబి పాటలను ఎవరో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఆమె ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్, కోటి, కీరవాణిలు ఆమెతో పాటలు పాడిస్తామని అంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా బేబిని ఇంటికి పిలిచి సత్కారం చేసి కొంత పారితోషకం కూడా ఇచ్చారు. చంద్రబాబు కూడా ఆమెను ఆశ్వీర్వదించారు. బేబిని వెలుగులోకి తేవాలని సీఎం చెప్పారు’’ అని మురళీమోహన్ తెలిపారు.

baby 08122018 1

కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో గ్రామీణ గాయని బేబి పాడిన పాటలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. పొలం పనులు చేసేటప్పడు ఆమె పాడిన పాటలు ఇప్పుడు సంచలనం అవుతున్నారు. టాలీవుడ్ అంతా ఆమె చుట్టూ తిరుగుతోంది. ఆమె పాడిన పాటలకు ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి, కోటి, ఏఆర్ రెహ్మాన్, కోటి, కీరవాణి, మురళీమోహన్‌‌లు ఆమె పాటలను ఆస్వాదించిన వారిలో ఉన్నారు. ప్రభుదేవా, నగ్మా నటించిన ప్రేమికుడు సినిమాలోని ‘ఓ చెలియా నా ప్రియసఖియా’ అంటూ ఆమె పాడిన పాటకు లక్షలాది లైక్‌లు, వేల షేర్, కామెంట్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పాటలతో లక్షలాది మంది అభిమానులను బేబి సొంతం చేసుకుంది. బేబి స్వస్తలం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని వడిశలేరు.

 

 

Advertisements

Latest Articles

Most Read