సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం వేకువజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు రక్తపోటు పడిపోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని సుప్రజ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి వాంతులు, ఛాతీ నొప్పితో మోత్కుపల్లి బాధపడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. మరోవైపు మోత్కుపల్లి బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా ఆలేరు నుంచి బరిలో ఉన్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన సుప్రజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భువనగిరి ఏరియా ఆసుపత్రికి సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో, కుటుంబీకులు సొంత వాహనంలోనే ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు.

telangana 07122018 2

మరో పక్క, తెలంగాణలో పోలింగ్ భారీగా నమోదు అవుతోంది. ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ప్రతీ గంట గంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. ఓటర్లు చురుగ్గా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 49 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇదే స్థాయిలో కొనసాగితే పోలింగ్ ముగిసే సమయానికి 80శాతానికి పైగా పోలింగ్ నమోదు అవుతుందని ఈసీ భావిస్తోంది. అటు పోలింగ్ కేంద్రా వద్ద కూడా క్యూలైన్లు చకచకగా కదులుతున్నాయి. ఓటువేసే ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో ఓటర్లు కూడా ఉత్సాహంగా ఉన్నారు.

telangana 07122018 3

ఇప్పటికే సినీ ప్రముఖులు చాలా మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, నితిన్, రాజమౌళి, కీరవాణి, విజయశాంతి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని అంతా పిలుపునిచ్చారు. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని ఈసీ చెబుతున్నా అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచే జనం క్యూ లైన్లలో నించున్నారు. అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. మహబూబాబాద్‌లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి.

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ వేళ.. తాండూరు కాంగ్రెస్‌ అభ్యర్ధి పైలెట్‌ రోహిత్‌ రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆయనపై తల్వార్లతో దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అయితే చుట్టు కాంపౌండ్‌ వాల్‌ ఉండటంతో తృటిలో తప్పించుకున్నట్లు సమాచారాం. దాదాపు వంద మంది ఆయనపైదాడికి రాగా.. అందులో పది మంది తల్వార్లతో చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నిమిషాల్లోనే పోలీసులు, కాంగ్రెస్‌ నేతలు అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. అయితే తనపై దాడి చేసింది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలేనంటున్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరారు.

trs 07122018 2

కాంగ్రెస్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమాచారం తెలిసి అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో ఆయనకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అమనగల్ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ వద్ద శుక్రవారం ఉదయం కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. కాగా... ఈ సమాచారం తెలిసి కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అక్కడకు చేరుకోగా ఆయనపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని అక్కడనుంచి పంపించివేశారు.

trs 07122018 3

టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఓటమి భయంతోనే ప్రజాకూటమి నేతలపై దాడులకు పాల్పడుతున్నారని టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. కూటమి నేతలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు ఈసీ చర్యలు తీసుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 1821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 2.81 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.90 లక్షల మంది భద్రతా బలగాలు పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. అధికార తెరాస, మహాకూటమి అధికారం కోసం తలపడుతున్నాయి. మరోవైపు భాజపా, బీఎల్‌ఎఫ్‌, ఎంఐఎం సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి.

ఓటు వెయ్యండి.. ఓటు హక్కు.. ఇలా అనేక ప్రకటనలు వారం నుంచి ఈసి చేసింది... ఈ ప్రయత్నం చాలా మంచిది... కాని, ఓటు వెయ్యటానికి వచ్చిన వారికి, ఓటు వేసే అవకాసం కూడా ఇవ్వలి కదా.. అసలకే హైదరాబాద్ లాంటి చోట, ఓటింగ్ కి రావటమే ఎక్కువ... అలాంటిది, వచ్చిన వాళ్లకి ఓటు వేసే అవకాసం లేకుండా, ఈవీఎంలు మొరాయించటం, లైటింగ్ లేకపోటం, ఇవన్నీ చూసి వెళ్ళిపోతున్నారు... హైదరాబాద్ తో పాటు, తెలంగాణాలోని చాలా చోట్ల పోలింగ్‌కు ఆటంకం ఏర్పడింది. ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ స్టార్ట్ అయింది, దీంతో అంత సేపు లైన్ లో నుంచేనే ఓర్పు లేక కొంత మంది వెళ్ళిపోయారు. కూకట్‌పల్లి,శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పల్లు జిల్లాల్లో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అంతరాయం కలిగింది.

telangana 07122018 2

పోలింగ్ కేంద్రాల వద్ద ఈసీ పలు నిషేదాజ్ఞాలు విధించింది. బూత్‌లోకి సెల్‌ ఫోన్స్‌కు అనుమతి నిరాకరించారు. అలాగే మద్య సేవించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం నిషేదించారు. కోడ్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. దీంతో కొంతమంది తమ మొబైల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించక పోవడంతో తిరిగి వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రాల బయట మొబైల్ ఫోన్లను దాచి పెట్టేందుకు సౌకర్యం లేకపోవడంతో పలువురు ఓటర్లు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించేది లేదని ఎన్నికల అధికారులు ముందుగా ప్రకటించినా, కనీసం పోలింగ్ కేంద్రాల ముందు ఫోన్ల డిపాజిట్ చేసి వెళ్లేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఇలా అనేక చిత్ర విచిత్రాల మధ్య ఓటింగ్ జరుగుతుంది.

telangana 07122018 3

మరొక గంటలో అన్నీ సెట్ అవుతాయని ఈసీ చెప్తుంది. అయినా, ఒకసారి వచ్చి వెళ్ళిపోయాన వాడు, మళ్ళీ రారు కదా. ఓర్పుగా లైన్ లో నుంచునే ఓపిక మన జనాలకి లేదయ్యె. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుండగా, 2.81 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.41 కోట్ల మంది పురుష ఓటర్లు, 1.40 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో 7.5 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓటు వేయనున్నారు. 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అందుకోసం ఈ స్థానాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది.

తెలంగాణలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఇవాళ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వేసే ప్రతి ఓటు ఎంతో మార్పు తీసుకొస్తుందని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం ట్వీట్‌ చేశారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. "ఓటు వేయడం దేశ పౌరులుగా మన బాధ్యత. ఎవరికి వేస్తున్నామనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి."

cbn tweet 07122018

తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుతున్నా అంటూ ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాని తెలిపారు. వారంతా ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ‘ఇవాళ ఎన్నికల రోజు. తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుతున్నా. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు.

cbn tweet 07122018

అటు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ తెలంగాణ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘అభివృద్ధి ఆధారిత ప్రభుత్వం కోసం తెలంగాణలోని సోదర, సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా యువ ఓటర్లు ఈ ప్రజాస్వామ్య పండగలో తప్పకుండా పాల్గొనాలి’ అని అమిత్‌షా ట్వీట్ చేశారు. మరో పక్క తెలంగాణాలో ఓటింగ్ కొనసాగుతుంది. తొలి రెండు గంటలు పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ ఇప్పుడు ఊపందుకుంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఈవో రజత్‌కుమార్ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 15శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.

Advertisements

Latest Articles

Most Read