టీఆర్‌ఎస్ జీ హుజూర్ పార్టీ. దండం పెట్టడం తప్ప ఇందులో చర్చకు, ప్రశ్నకు తావులేదు. దీనిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని కూడా అనలేం.ప్రైవేట్ కంపెనీలోనైనా కొన్ని హక్కులు ఉంటాయి. కానీ, ఇది ఒక వ్యక్తి యజమానిగా ఉన్న కంపెనీ’అని ఇటీవల టీఆర్‌ఎస్‌కు రాజీనామా కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి తాను రాజీనామా చేయడానికిగల కారణాలను ఆదివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పని చేసిన టీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుతం దారి తప్పిందని, జై తెలంగాణ నినాదం పోయి ఇప్పుడు జై కేసీఆర్...జై కేటీఆర్‌గా మారిందంటూ నిప్పులు చెరిగారు. పార్టీలో ఉద్యమకారులు, కార్యకర్తలకు గుర్తింపులేదని, ఉన్నదల్లా పార్టీలో కొత్తగా చేరిన తెలంగాణ వ్యతిరేకులకేనని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం పాటు పడిన టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం ఎవరికి గౌరవం లేదని, అందరూ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉన్నవారేనన్నారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమేమి చేస్తామని హామీలను ఇచ్చిందో వాటిన్నింటినీ పక్కన పెట్టిందన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండలేక తనలాగా చాలా మంది బయట పడటానికి ఎదురు చూస్తున్నవారేనన్నారు. పార్టీ పార్లమెంటరీ నాయకులు జితేందర్‌రెడ్డి, కేశవరావు కూడా ఎప్పుడో అప్పుడు బయటికి వచ్చేవారేన్నారు. ఎంపీలలో చివరికి మిగిలేది ఆ ఇద్దరు (కవిత, వినోద్‌కుమార్) కావచ్చని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు అందులో ఏముందో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు తెలిసేది కాదని, పోలీసుల బదిలీల గురించి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికి పేపర్లో చేశాకే తెలిసేదన్నారు. తమ శాఖల్లో ఏమి జరుగుతుందో సంబంధిత మంత్రులకు పేపర్లో చూశాకే తెలిసేదన్నారు. కేసీఆర్ పాలనను అందరు నిజాం నవాబుతో పోలుస్తారని, తన దృష్టిలో అది కూడా తప్పేనన్నారు. నిజాం హయాంలో కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆ అంశాన్ని మంత్రులతో చర్చించే ప్రజాస్వామ్యం ఉండేదని విశే్వశ్వర్‌రెడ్డి గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలకు ఒకప్పుడు ఢిల్లీలో ఎంతో గౌరవం ఉండేదని, ప్రస్తుతం తమను లైట్‌గా తీసుకుంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని తమను పార్లమెంట్‌లో ఆందోళన చేయమని పార్టీ ఆదేశిస్తే చేశామన్నారు. అయితే సంబంధిత మంత్రి తమను పిలిచి దీని గురించి మీ సీఎం మమ్మల్ని కోరనప్పుడు ఎలా ఇస్తామని అడిగితే తమ పరువు పోయిందన్నారు.

అలాగే త్రిబుల్ తలాక్ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్నప్పుడు చర్చలో పాల్గొనకుండా చల్లగా జారుకోండని తమకు పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. మద్దతు అయినా ఇవ్వాలి లేకపోతే వ్యతిరేకించడమైనా చేయాలి, అలా కాకుండా చల్లగా జారుకోవడం ఏమిటో తెలియక నవ్వుల పాలయ్యామన్నారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మరుసటి రోజు సభకు వెళ్లాలో లేదో అర్దరాత్రి ఫోన్లు వచ్చేవన్నారు. వాళ్లు వెళ్లమంటే వెళ్లడం, లేదంటే మానుకోవడమే తమ పని అన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తాండూరుకు వెళ్లనిచ్చేవాళ్లు కాదన్నారు. అనేక సార్లు మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి మీరు అటు వైపు వెళ్లవద్దని చెప్పేవాళ్లన్నారు. సొంత నియోజకవర్గంలో కూడా పర్యటించలేని అవమాన పరిస్థితిని ఎదుర్కొన్నాని చెప్పారు. చివరకు తాను సభకు ఎలాంటి డ్రైస్ వేసుకొని వెళ్లాలో కూడా పార్టీ వాళ్లు చెప్పేవాళ్లంటే ఇక ఇంతకంటే ఏమి చెబుతానని విశే్వశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కారణం ఏమిటో పార్టీలో ఎవరికి తెలియదన్నారు. ఈ విషయాన్ని తమ పార్లమెంటరీ నాయకుడు జితేందర్‌రెడ్డికైనా తెలుసేమోనని అడిగితే, పేపర్లు చూడవా? అని ఎదురు ప్రశ్నించారని, కేశవరావు కూడా అదే చెప్పారన్నారు. ప్రధాని మోదీతో ఏదో ఒప్పందం కుదుర్చుకొనే శాసనసభను రద్దు చేశారని విశే్వశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఒకవైపు మైనార్టీలను నమ్మిస్తూ, మరోవైపు బీజేపీతో ఒప్పందం చేసుకోవడం వారిని మోసం చేయడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని, డబుల్ బెడ్‌రూమ్‌లు నిర్మించి ఇస్తామని, సాగునీటిని అందిస్తామని ఎనె్నన్నో హామీలు ఇచ్చి ఏదీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. చివరకు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని మైనార్టీలకు కూడా మోసం చేయడాన్ని వాళ్లు అర్థం చేసుకోవాలన్నారు. బస్సులో జేబు కొట్టిన వాడే దయదలిచి టికెట్ కొనిచ్చినట్టు ఒక్కో వ్యక్తి తలపై 61 వేల అప్పుబారం మోపి, పెన్షన్లు, షాదీ ముబారక్‌లు ఇస్తున్నారని విశే్వశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

గత వారం రోజులుగా అమరావతిలో జరిగిన, బోస్ రేసింగ్, ఎయిర్ షో కార్యక్రమాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి పెంచామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మనం చేస్తున్న పనులతో పంచవ్యాప్తంగా అందరి దృష్టి అమరావతిపైనే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే టాప్-5 సుందరమైన నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని సీఎం పునరుద్ఘాటించారు. అమరావతిలో ఈ రోజు ‘నీరు-ప్రగతి’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా తుళ్లూరు వద్ద గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ద్వారా మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే గోదావరి-కృష్ణా నదులను తమ ప్రభుత్వం అనుసంధానం చేసిందని గుర్తుచేశారు.

cbn 26112018

పంచ నదుల మహా సంగమమే లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతపురంలో సూక్ష్మ సేద్యం ద్వారా అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. మైక్రో ఇరిగేషన్‌తో ఉత్పాదకత 29% పెరిగిందని సీఎం పేర్కొన్నారు. ప్రపంచం వినూత్న ఆవిష్కరణల వైపు చూస్తోందన్నారు. బయో మెట్రిక్ ద్వారా పారదర్శకంగా పథకాల అమలు చేయాలని అధికారులకు సూచించారు. బోట్ రేసింగ్, ఎయిర్ షోతో అమరావతి ఖ్యాతి పెంచామన్నారు. అంతర్జాతీయంగా అందరి దృష్టి అమరావతిపైనే ఉందని పేర్కొన్నారు. ఈనెల చివరలో, డిసెంబర్ మొదట్లో వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు.

cbn 26112018

రబీలో సీమ జిల్లాలు, ప్రకాశంలో పంటల విస్తీర్ణం పెరిగిందని, నాణ్యమైన పైర్లు, ఆరోగ్య జీవనానికి ఏపీ చిరునామా కావాలని తెలిపారు. కత్తెర తెగులు సోకకుండా జొన్న, మొక్కజొన్నను కాపాడాలన్నారు. ఎప్పటికప్పుడు రైతులను చైతన్యపరచాలని సీఎం ఆదేశించారు. గోకులం, మినీ గోకులాలను సద్వినియోగం చేసుకోవాలని, పశు గణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందున్నామని, టెక్నాలజీలో ఏపీనే ముందుందని చెప్పారు. ఈజ్ ఆఫ్ లివింగ్ లో కూడా తామే ముందుండాలని ఆకాంక్షించారు. నరేగాలో గత ఏడాది లక్ష్యం పూర్తిచేశామని, రూ.10వేల కోట్ల నరేగా లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. ఆదరణ-2 పనిముట్లు వెంటనే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

 

ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడే బీజేపీ పార్టీకి, అయోధ్య గుర్తుకు వస్తుంది, మోడీని చంపే కుట్ర అనే వార్తలు వస్తాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నెహ్రు మాత్రమే ఈ దేశానికి అన్యాయం చేసారు అనే మాటలు వస్తాయి. ప్రతి ఎన్నికల ప్రచారంలో ఇవే డైలాగులు. ప్రధాని మోడీ కూడా అంతే. ఈ ఆరోపణల వరకు అయితే, ఎవరికీ ఇబ్బంది ఉండదు. ప్రదాని అయినా, సియం అయినా, ఎన్నికల ప్రచారంలో, రాజకీయ విమర్శలు చెయ్యటం, చాలా సహజం. ఇక్కడ వరకు ఎవరినీ తప్పుబట్టటానికి లేదు. కాని ప్రధాని హోదాలో ఉంటూ, తమ అసమర్ధత కనపడకుండా చెయ్యటానికి, ఏకంగా సుప్రీం కోర్ట్ మీదే విమర్శలు చెయ్యటం, ఎప్పుడైనా చూసామా ? అన్ని వ్యవస్థలు సర్వ నాశనం చేసిన మోడీ గారు, తన చేతాకని తనాన్ని, సుప్రీం కోర్ట్ మీదకు నెట్టేసి, ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

modi 26112018 2

ఈ ఏడాది మొదట్లో అయోధ్య కేసుల విచారణ చేపట్టాలని ప్రయత్నించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులను అభిశంసన పేరుతో కాంగ్రెస్‌ బెదిరించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఎవరి పేర్లూ ప్రస్తావించని మోదీ.... న్యాయవాదులు కూడా అయిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులు 2019 లోక్‌సభ ఎన్నికలయ్యే వరకు అయోధ్య కేసుల విచారణ ఆలస్యమయ్యేలా సర్వోన్నత న్యాయస్థానం జడ్జిలను భయపెట్టారని విమర్శలు చేసారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం వీహెచ్‌పీ భారీస్థాయిలో ధర్మ సభ నిర్వహించిన రోజే మోదీ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. రాజస్థాన్‌లోని అల్వర్‌లో, మధ్యప్రదేశ్‌లోని విదిశలో ఆదివారం నిర్వహించిన సభల్లో ఆయన కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. న్యాయ వ్యవస్థలో ఆ పార్టీ భయ వాతావరణాన్ని సృష్టించిందన్నారు.

modi 26112018 3

ఈ ఏడాది ఏప్రిల్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏడు ప్రతిపక్ష పార్టీలు అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై అభిశంసన నోటీసు ఇవ్వడం, దాన్ని రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరించడం తెలిసిందే. ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థలపై కాంగ్రెస్ కు నమ్మకం లేదని మోదీ విమర్శించారు. ‘‘ఓ సుప్రీం కోర్టు జడ్జి వాళ్ల (కాంగ్రెస్‌) రాజకీయ ఉద్దేశాలకు అనుగుణంగా కేసుల విచారణ టైమ్‌ టేబుల్‌ రూపొందించకపోయినా, అయోధ్య వంటి సున్నితమైన కేసులో అందరి వాదనలు విని న్యాయం చేయాలనుకున్నా అప్పుడు రాజ్యసభ సభ్యులు కూడా అయిన ఆ పార్టీ న్యాయవాదులు అభిశంసన పేరుతో జడ్జిలను భయపెట్టే ఆట మొదలుపెడతారు’’ అని మోదీ చెప్పారు. అయితే, మోడీ ఇలా దిగజారి ఏకంగా సుప్రీం కోర్ట్, కాంగ్రెస్ చెప్పినట్టు నడుస్తుంది అనే సంకేతాలు ప్రజలకు ఇచ్చారు. ఇది ఎంత వరకు సమంజసం ? తమ చేతకాని తనాన్ని, ఇలా కోర్ట్ ల పై నెట్టేసి, ఒక ప్రధాని ఆరోపణలు చెయ్యటం, బహుసా ఎప్పుడూ లేదేమో..

మొబైల్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేయడం ద్వారా అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ అంబులెన్సుల సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా 108 పేరుతో యాప్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించనుంది. రాష్ట్రంలో ప్రతి 60వేల మందికి ఒక అంబులెన్స్ ఉండాలన్న లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ పరంగా సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ పరిధిలో 108, తదితర అంబులెన్సుల సేవలు ఉన్నప్పటికీ అవి ప్రజావసరాలకు చాలటం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీసుల తరహాలో ప్రైవేట్ అంబులెన్సులను డిజిటల్ పూలింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఓలా తరహాలో ఒక యాప్‌ను అభివృద్ధి చేయనుంది.

108 26112018 2

అంబులెన్సుగా సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్నవారి వివరాలు, వాహనం వివరాలు ఈ యాప్‌లో నమోదు చేస్తారు. అంబులెన్సుగా సేవలందించే వాహనాలు 5 సంవత్సరాల కంటే ముందు కొన్నవి అయి ఉండకూడదు. ఆసక్తి వ్యక్తీకరించిన వారి వివరాలు, వాహనం వివరాలు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తారు. ప్రైవేట్ అంబులెన్సుల్లో కనీసంగా ఆక్సిజన్, డ్రైవర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ తప్పనిసరిగా ఉండాలి. ఇందుకు కిలోమీటరుకు 25 రూపాయల చొప్పున చెల్లిస్తారు. వాహనాన్ని జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు. అంబులెన్సుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌కు, 108 కాల్‌సెంటర్‌కు ప్రైవేట్ అంబులెన్సుల వివరాలను అనుసంధానిస్తారు.

108 26112018 3

ఎవరైనా ఈ అంబులెన్సుల సేవలను వినియోగించుకోవాలంటే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. జీపీఎస్, తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, వాహనం తిరిగిన దూరాన్ని లెక్కించి వాహన యజమానులకు ప్రభుత్వం రుసుము చెల్లిస్తుంది. నెలకు ఒకసారి నేషనల్ హెల్త్ మిషన్ నిధుల ద్వారా చెల్లిస్తారు. యాప్ లేదా కాల్ సెంటర్ ద్వారా అంబులెన్సు సేవల అభ్యర్థన లేని సమయంలో ఆ వాహనాలు వేరే పనులు చేసుకునే వీలు కల్పించారు. ఈ విధానం వల్ల చాలావరకూ రాష్ట్రంలో అంబులెన్సు సేవల కొరత తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read