రాజకీయాల్లో కావల్సింది వయస్సు కాదని, పరిణితి అవసరమని, ఆ పరిణితి ముఖ్యమంత్రి చంద్రబాబులో పుష్కలంగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. శనివారం విజయవాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు వయస్సు పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 60ఏళ్లు దాటినవారు పాలించడానికి పనికిరారని పవన్ అనటం సరి కాదని, 65 ఏళ్ల వయస్సులోనే సీఎం చంద్రబాబు 2817కి.మీ. పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. శారీరకంగా, మానసికంగా చంద్రబాబు చాల ఫిట్గా ఉన్నారని పవన్ లాగా తీరుపతి కొండకి వెళ్లి 80 సార్లు కుదేలైన వ్యక్తి కాదని, చంద్రబాబు సత్తా ఏమిటో ప్రజలకు తెలుసన్నారు.

anuradha 25112018 3

రాజకీయాల్లో ప్రజా సమస్యలపై సకాలంలో స్పందించే గుణం ఉండాలని, ఆ గుణం, 40సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందని, కాబట్టే అభివృద్ధి చేయగలరేనే నమ్మకంతో ఓట్లేసి ఎన్నుకున్నారని తెలిపారు. చంద్రబాబు వయస్సు గురించి మాట్లాడే పవన్ 64ఏళ్ల కేసీఆర్, 68ఏళ్ల ప్రధాని మోడీ వయస్సును అడిగే దమ్ముందా అని ప్రశ్నించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 72ఏళ్లని, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 63ఏళ్లని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్! 72ఏళ్లని, రష్యా అధ్యక్షుడు పుతినకు 66ఏళ్లని పవ నీకు ఏం అనుభవం ఉందని ఇలా మాట్లాడుతున్నారో అర్దం కావటంలేదన్నారు. ప్రశ్నించడం కోసమే పుట్టానని చెప్పిన పవన్ నిత్యం సమీక్షలతో, పర్యటనలతో, టెలికాన్ఫరెన్స్లతో రోజుకి 18గంటలు పనిచేసే సీఎంని హేళనగా ప్రశ్నిస్తారా - మీరెంత, మీఅనుభమెంతా అంటూ నిలదీశారు.

anuradha 25112018 2

చాలా చోట్ల నిలబడతానన్న పవన్ శ్రీకాకుళం తిల్లీ తుపాన్ బాధితులకు కేంద్రం నుంచి రావాల్సిన పరిహారం గురించి, వెనుకబడిన జిల్లాలకు నిధిలిచ్చి వెనక్కి తీసుకున్న కేంద్రాన్ని, కాకినాడకు కేటాయించిన పెట్రో కాంప్లెక్స్, లోటు బడ్జెట్ గురించి ఎందు కు ప్రశ్నించరన్నారు. ప్రతిపక్షనేత జగన్ కోడి కత్తి డ్రామా ఆడతారని, పవన్ ఇసుక లారీల కథలు చెబుతారని, పవన్ బౌన్సర్లు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ మిడిల్ లైన్ దాటి వెళ్లి ఇసుక లారీని కొట్టిందని, ఆ ఘటన పై స్కార్పియో డ్రైవర్ తనదే తప్పని పరోక్షంగా అంగీకరించారని చెబుతూ దానికి సంబంధించిన వీడియోను మీడియాకు చూపెట్టారు. పవన్ చెన్నైలో మీడియా సమావేశం ఎందుకు పెట్టారో అర్ధంకావటంలేదని, దక్షిణాదిలో రాజధాని కోసం అన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తాయని, దీనికోసం పవన్ ప్రధాని మోడీకి వినతిపత్రం ఇవ్వలేదే అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విప్లవానికి పునాదులు వేసిన ఆర్టీజీఎస్‌ రియల్‌ టైమ్‌ గవ ర్నెన్స్‌ (ఆర్టీజీ) ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు వినూత్న ఆలోచనల నుండి పురుడుపోసుకున్న వ్యవస్థ. విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌ను శరవేగంగా అభివృ ద్ధిపథంవైపు పయనించేలా కంకణబద్ధుడైన సీఎం చంద్ర బాబుకు ఆర్టీజీఎస్‌ ఒక ఆయు ధంలా తయారయ్యింది. ఒక దార్శినికతతో, భవిష్యత్‌ తరా లకు సుపరిపాలన అందించా లన్న ముఖ్యమంత్రికి అత్యా ధునిక సాంకేతిక సహకారం ఎంతో అవసరమన్న ఉద్దేశంలో ఉండ గా శ్రీకారం చుట్టిందే ఆర్టీజీఎస్‌. 2017 నవంబరు 26న గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌ సేవలను ప్రారంభించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మరో అడుగు ముందుకు వేశారు.

rtgc 25112018 2

రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్టీజీఎస్‌) ద్వారా భూగర్భ జల మట్టాల మొదలుకొని వాతావరణంలోని మార్పులను సైతం ఇట్టే పసిగట్టే ఆధునిక సాంకేతిక విధానంతో ప్రజలను విపత్తుల నుండి కాపాడేందుకు ఎంతగానో దోహదపడుతోంది. ఇటీవల ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన ‘తిత్లి’ తుఫాను విపత్తును ఎదుర్కొనడంలో పూర్తి విజయాన్ని సాధించడానిఇక ఆర్టీజీఎస్‌ ఎంతగానో దోహదపడింది. దేశంలోనే మొట్టమెదటి ‘రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌’ ఆర్టీజీఎస్‌ కేంద్రం ఎపీలో సేవలను ప్రారంభించింది. దాదాపుగా 62 అడుగుల పొడవైన వీడియో వాల్‌ ఆర్టీజీఎస్‌ ప్రత్యేకత. ఆసియాలోనే అతి పొడవైన వీడియో వాల్‌ ఇదే. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ లో సాంకేతిక వినియోగం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. దీంతో రూ.1600 కోట్ల ప్రభు త్వం ఆదా చేయగలిగింది. ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలలో పూర్తిస్థాయిలో అక్రమా లను అడ్డుకట్ట వేస్తూ.. సమర్థవంతంగా అమలు చేయడానికి దోహదపడింది.

rtgc 25112018 3

ఇప్పటి వరకూ అందిన ఫిర్యాదులు 1,69,76,311, దీనిలో వ్యక్తిగత ఫిర్యాదులు 1,36,74,648, సామా జిక (కమ్యూనిటీ) ఫిర్యా దులు : 33,01,663, ఇప్ప టి వరకూ పరిష్కరించినవి 73,17,238, పరిశీలన పూర్త య్యి, మంజూరు కానివి : 72,34, 605, ఇంకా పరిశీలించాల్సిన ఫిర్యా దులు : 5,48,552, తిరస్కరించిన ఫిర్యాదులు : 18,75,908. ఆర్టీజీఎస్‌ మొత్తం 27 ప్రభుత్వశాఖలు అమలు చేస్తున్న 156 పథకాలపై నిత్యం పర్యవేక్షణ చేస్తూ, వాటి అమలు తీరుపై నిత్యం ప్రజాభిప్రాయాన్ని సేకరించడం లో సిబ్బంది నిమగ్నమై ఉంటారు. ఆర్టీజీఎస్‌ కేంద్రం ఇప్పటి వరకూ 62.27 లక్షల కాల్స్‌ చేసింది. పరిష్కారవేదికకు అందిన ఫిర్యాదులు మొత్తం : 6,040, విచారణను పూర్తి చేసిన ఫిర్యాదుల సంఖ్య : 2,065, ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నవి : 3,975.

రాష్ట్ర సాగునీటి చరిత్రలో నవ శకానికి ప్రభుత్వం నాంది పలుకుతోంది. పట్టిసీమ ద్వారా గోదావరి- కృష్ణా అనుసంధానంతో పవిత్ర సంగమంతో రికార్డు సృష్టించిన నేపథ్యంలో మరో అడుగు ముందుకేసి గోదావరి- పెన్నా అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. నదుల అనుసంధానంతోనే కర వు నిర్మూలన సాధ్యమని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రైతాంగానికి సాగునీరందించేందుకు గోదావరి- పెన్నా అనుసంధానం కీలకం కానుంది. తొలిదశలో సాగర్ ఆయకట్టుకు సాగు నీరందించే ఈ పథకం పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 26వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం ఐదు దశల్లో గోదావరి- పెన్నా అనుసంధానం పనులు చేపడతారు. తొలిదశ లో పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి నుంచి ప్రస్తుతం ఉన్న పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణానదికి మళ్లించిన నీటిని గుంటూరు జిల్లా హరిశ్చంద్రాపురం గ్రామం వద్ద అంటే నాగార్జునసాగర్ కుడికాలువ 80వ కిలోమీటర్ వద్ద ఎత్తిపోతల ఏర్పాటు కానుంది.

ఈ మహాయజ్ఞంలో భాగంగా తొలిదశ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ అంచనా విలువ రూ. 83, 976 కోట్లు. తొలిదశ పనులు పూర్తయి తే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 16 నియోజకవర్గాల్లో 79 మం డలాల పరిధిలోని 9లక్షల 61వేల ఎకరాలకు సాగునీరు అందటంతో పాటు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. తద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీటి కొరత శాశ్వతంగా తీరనుంది. గుం టూరు జిల్లాలో గుంటూరు, ప్రత్తిపాడు, తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, వినుకొండ, చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల, ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, కొండేపి, ఒంగో లు, దర్శి, సంతనూతలపాడు, పర్చూరు, అద్దంకి నియోజకవర్గా ల్లో రైతాంగానికి తొలిదశ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందుతుంది. పోలవరం కుడి ప్రధాన కాలువలోకి పట్టిసీమ నుంచి 8500 క్యూసెక్కులు, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 6870 క్యూసెక్కులు కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి మళ్లించిన నీటిలో కృష్ణాడెల్టా వినియోగానికి 7వేల క్యూసెక్కులు, మిగిలిన 7వేల క్యూసెక్కులు గుంటూరు జిల్లా హరిశ్చంద్రాపురం నుంచి 5 అంచెలుగా నకరికల్లు గ్రామం వద్ద నాగార్జునసాగర్ జవహర్ కాల్వలో కలుపుతారు. ఈ ఐదు అంచెల్లో 10.25 కిలోమీటర్ల దూరం ఎత్తిపోతల పథకం పైపుల ద్వారా, 56.35 కిలోమీటర్లు గ్రావిటీ కాల్వ ద్వారా 73 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ జవహర్ కాల్వలోకి పంపుతారు.

తొలి ఎత్తిపోతల ద్వారా కృష్ణానది నుంచి ఒక కిలోమీటరు లీడింగ్ చానల్ తర్వాత ఒకటో కిలోమీటరు వద్ద హరిశ్చంద్రాపురం గ్రామ శివారులో 17 నుంచి 24 మీటర్ల వరకు 7వేల క్యూసెక్కుల నీటిని 1.1 కిలోమీటరు వద్ద గ్రావిటీ కెనాల్‌లో వదులుతారు. అక్కడి నుండి 11.5 కిలోమీటర్ల వరకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలిస్తారు. రెండవ ఎత్తిపోతల పథకం ద్వారా 11.5 కిలోమీటర్ల వద్ద లింగాపురం గ్రామ శివారులో లెవల్ 22.55 నుంచి 42 లెవల్ వరకు 7వేల క్యూసెక్కుల నీటిని 13.55 కిలోమీటర్ల వద్ద గ్రావిటీ కెనాల్‌లో వదులుతారు. ఇక మూడవ ఎత్తిపోతల ద్వారా 35.25 కిలోమీటర్ల వద్ద ఉయ్యందన- తాళ్లూరు గ్రామ శివారులో లెవల్ 37.64 మీటర్ల నుంచి 65 మీటర్ల వరకు 7వేల క్యూసెక్కుల నీటిని 37.75 కిలోమీటర్ల వద్ద గ్రావిటీ కెనాల్‌లో కలుపుతారు. నాలుగో ఎత్తిపోతల పథకం ద్వారా 47.25 కిలోమీటర్ల వద్ద గంగిరెడ్డిపాలెం (రాజుపాలెం) దగ్గర లెవల్ 62.53 మీటర్ల నుంచి 107.30 మీటర్ల వర కు 7వేల క్యూసెక్కుల నీటిని 51.75 కిలోమీటర్ల వద్ద గ్రావిటీ కా లువతో కలుపుతారు. ఐదో ఎత్తిపోతలలో 65.44 కిలోమీటర్ల వ ద్ద నకరికల్లు గ్రామ పరిధిలో లెవల్ 103.93 మీటర్ల నుంచి 140 మీటర్ల వరకు 7వేల క్యూసెక్కులు నాగార్జున సాగర్ జవహర్ కా లువ 80వ కి.మీ వద్ద కలపటం ద్వారా తొలిదశ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఈ తొలిదశ పథకానికి భూ సేకరణతో కలిపి రూ. 6020.15 కోట్ల వ్యయం అవుతుంది. దీంతో పాటు సాగర్ కుడికాల్వ కింద ఉన్న శివారు ప్రాంతాలకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. సాగునీటితో పాటు మంచినీటిని పుష్కలంగా అందించే వీలు కలుగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ వినియోగదారులకు ఇది తీపికబురే. విద్యుత్‌ చార్జీలు పెంచకుండా వచ్చే ఏడాది కూడా ప్రస్తుత విద్యుత్‌ చార్జీల టారిఫ్‌నే ప్రభుత్వం యథాతథంగా కొనసాగించనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏవిధమైన విద్యుత్‌ చార్జీల పెంపుదల లేకుండా ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రూపొందించాయి. 2019-20కిగాను రాష్ట్రంలో వినియోగదారులకు నాణ్య మైన, నమ్మకమైన విద్యుత్‌ పంపిణీకోసం రూ.38,204 కోట్లు అవసరం అని పేర్కొంటూ రూపొందించిన నివేదికను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలికి అందచేశాయి. శనివారం సింగరేణి భవన్‌లోని ఏపీ ఈఆర్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఈపీడీసిీఎల్‌ సీఎండి హెచ్‌వై దొర, సీజీఎం ప్రసాద్‌ , ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీజీఎం బి.లలిత తదితరులు 2019-20 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్‌)ను ఏపీ ఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ జి.భవానీప్రసాద్‌కు సమర్పించారు.

current 25112018 2

వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా విద్యుత్‌ చార్జీల టారిఫ్‌ను ఇప్పుడున్నట్టుగానే యథాతథంగా కొనసాగించనున్నట్టు ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నాయి. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాలో సగటున 7.8శాతం వృద్ధి ఉన్నప్పటికీ ఆదాయంలో మాత్రం సగటు యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.1.49గా ఉండటంతో రాష్ట్రంలో 1.64కోట్ల మంది విద్యుత్‌ వినియోగదారులు లాభపడనున్నట్టు ఏఆర్‌ఆర్‌ నివేదిక ద్వారా వివరించారు. ఇందులో ఎల్టి డొమెస్టిక్‌ కింద 1.31కోట్ల మంది వినియోగదారులు లబ్ది పొందుతారని , అదే విధంగా 17లక్షల వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులు కూడా లబ్ది పొందుతారని పేర్కొన్నారు. అంతే కాకుండా వచ్చే ఏడాది రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి లక్ష విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు.

current 25112018 3

కమర్షియల్‌ కేటగిరిలో 12.1లక్షమంది వినియోగదారులు లబ్ది పొందుతారని వెల్లడించారు.కాటేజెస్‌ ఇండస్ట్రీస్‌ పరిధిలోని దోబీఘాట్స్‌కు ఉచిత విద్యుత్‌ సరఫరాను కొనసాగించనున్నట్టు తెలిపారు.రాష్ట్రంలోని నాలుగువేల మంది ఉద్యాన నర్సరీ పెంపకందారులకు కూడా ఉచితంగానే విద్యుత్‌ సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. విద్యత్‌ వాహనాలకు చార్జింగ్‌ కోసం ఈవీపాలసీ ప్రోత్సాహం కింద టారీఫ్‌లో యూనిట్‌ విద్యుత్‌ను రూ.6.95నుంచి రూ.5.95కు తగ్గించి యూనిట్‌కు రూపాయి సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించనున్నట్టు నివేదికలో పొందు పరిచి ఈ మేరకు డిస్కమ్‌ అధికారులు ఏపీ ఈఆర్సీసి ఛైర్మన్‌ జస్టిస్‌ భవానీ ప్రసాద్‌కు ఏఆర్‌ఆర్‌ నివేదికను సమర్పించారు.

Advertisements

Latest Articles

Most Read