భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలను ఏకం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏన్‌డీఏలో చీలికపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మిగతా పార్టీల నేతలతో రానున్న రోజుల్లో చర్చలు జరుపనున్నట్లు సమాచారం. డిసెంబర్ 22 తరువాత బాబు తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తారని టీడీపీకి చెందిన ఒక ముఖ్యనేత తెలిపారు. చంద్రబాబు ఇప్పటికే రెండు దఫాలుగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై పర్యటనల్లో సుమారు 15 రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి బీజేపీకి వ్యతిరేకంగా వారి మద్దతు కూడగట్టగలిగారు. ఇవే గాక యూపీఏలో ఉన్న మరికొన్ని పార్టీలు సైతం తమ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

amit 15112018

వీటికితోడు ఎన్‌డీఏలోని పార్టీలను ఆ కూటమి నుంచి బయటకు తీసుకువచ్చి కొత్తగా ఏర్పడే కూటమిలో భాగస్వామ్యం చేసే విషయంపై చంద్రబాబు దృష్టి సారించనున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్‌డీఏలో ప్రస్తుతం 45 పార్టీలు భాగస్వామ్యులుగా ఉన్నాయి. వాటిలో 11 పార్టీలకు మాత్రమే లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఇప్పటికే ఇద్దరు నేతలు బాబుతో చర్చించారని, కొత్త కూటమిలో చేరడానికి తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలు మరిన్ని జిల్లాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 20న నెల్లూరు, 27న విజయనగరంలో సభలు నిర్వహించనున్నారు. అనంతపురంలో సైతం సభ నిర్వహించి ఆ తరువాత తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

amit 15112018

అమరావతిలో డిసెంబర్ 22న ధర్మ పోరాట దీక్ష చేపట్టి ఆ దీక్షకు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అదేరోజు కొత్త కూటమిలో భాగస్వాములు కావాలనుకుంటున్న పార్టీల నాయకులతో అమరావతిలోనే సమావేశం నిర్వహించి తదుపరి కార్యక్రమాన్ని రూపొందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత చంద్రబాబు తమిళనాడులో కొత్తగా రాజకీయ పార్టీలు ఏర్పాటుచేసిన సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌తో సైతం చర్చించనున్నట్లు సమాచారం. కాగా డిసెంబర్‌లో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే ఎన్డీయేలో చీలిక తథ్యమని బాబు గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం మరింత సులువవుతుందని ఆయన విశ్వాసంతో ఉన్నట్లు సమాచారం. మరో పక్క అధికారం అడ్డం పెట్టుకుని, ఆ పార్టీలని, కేసులతో బెదిరించే ప్రయత్నం ఇప్పటికే అమిత్ షా మొదలు పెట్టినట్టు తెలిసింది. చూద్దాం, చివరకు ఏమి జరుగుతుందో....

హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్లను అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేశాయని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ విమర్శించారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు జి ప్లస్-3 కేటగిరీలో రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. త్వరలోనే ప్రారంభంకానున్న ఈ ఇళ్లు దేశంలోనే మోడల్ ఇళ్లుగా మారతాయన్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మంగళవారం మంత్రి నారాయణ పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 82 ఎకరాల్లో నిర్మిస్తున్న 9500 గృహాలు, నరసాపురంలో ఇళ్ల నిర్మాణం కోసం సేకరించే స్థలాన్ని నారాయణ పరిశీలించారు.

housing 15112018 2

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని పలు ప్రారంభోత్సవల్లో ఆయన పాల్గొన్నారు. భీమవరంలోని ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ ఎంపీ తోట సీతారామలక్ష్మితో కలిసి విలేఖర్లతో మాట్లాడారు. వివిధ దేశాల్లో అత్యాధునికమైన టెక్నాలజీగా పేరొందిన షీర్‌వాల్ పరిజ్ఞానంతో రాష్ట్రంలోని పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు. మలేషియా, దక్షిణ కొరియా దేశాల నుంచి పరికరాలు రావాల్సివుందని, అవి వచ్చిన తర్వాత రోజుకు 50వేల ఇళ్లకు శ్లాబ్ పనులు జరుగుతాయన్నారు. ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా 35 వేల ఇళ్లకు శ్లాబ్ పనులు జరుగుతున్నాయన్నారు.

housing 15112018 3

వచ్చే ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఇళ్లను పూర్తిచేసి పేదలకు అందిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ.1000 కోట్లతో స్థలాలు కొనుగోలుచేసి ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఒక మినీ టౌన్ మాదిరిగా ఈ ఇళ్ల కాలనీలు ఉంటాయని, ఆసుపత్రి, పాఠశాలలు, షాపింగ్ కాంప్లెక్స్, పార్కు, కమ్యూనిటీ హాళ్లను ఈ కాలనీల్లో నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లల్లో రూ.45వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని మంత్రి ఆరోపించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కొటికలపూడి గోవిందరావు తదితరులు మంత్రి నారాయణ వెంట ఉన్నారు.

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి... ముఖ్యంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి ఐటీ సోదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు... ఏపీలోని పలువురు టీడీపీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి... చంద్రబాబు, తెలుగుదేశం టార్గెట్ గా ఐటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏపిలో కాకుండా, తెలంగాణాలో చేసారు.

tdp 15112018 2

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌ గౌడ్‌కు చెందిన సంస్థలపై ఆదాయపన్ను శాఖ మరోసారి దృష్టి పెట్టింది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఉన్న ఆయన సంస్థల్లో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు తాజాగా హైదరాబాద్‌లో ఆయనకు చెందిన డ్యూక్స్‌ బిస్కెట్ల కంపెనీతో పాటు స్థిరాస్తి సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఉదయం నుంచి మొత్తం 20 బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయి. ఈ కంపెనీ ప్రమోటర్స్‌ ఎవరు, ఈ సంస్థలో మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరిగాయి, కంపెనీలోకి నిధులు ఎక్కడి నుంచి తెచ్చారు.. అన్న అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

tdp 15112018 3

దేవేందర్‌గౌడ్‌ కుమారుడు వీరేందర్‌గౌడ్‌ ఉప్పల్‌ నుంచి మహాకూటమి(తెదేపా) అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి నిన్ననే ఆయన నామినేషన్‌ వేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. కేంద్రాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలను ఐటీ దాడులతో వేధిస్తున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తరుచూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేవేందర్‌గౌడ్‌కు చెందిన సంస్థలపై ఐటీ సోదాలు జరగడంతో తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే తమపై ఎలాంటి దాడులు జరిగినా భయపడేది లేదని వీరేందర్‌గౌడ్‌ స్పష్టం చేశారు.

విజయవాడలో అంతర్జాతీయ బోట్ రేసింగ్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణానది పున్నమి ఘాట్‌లో ఈ నెల 16, 17, 18 తేదీల్లో అంతర్జాతీయ స్పీడ్ బోట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ రేసర్లు బోట్లతో సహా విజయవాడ చేరుకున్నారు. వాస్తవానికి ఇలాంటి బోట్‌రేస్‌లు ఇప్పటి వరకు లండన్, పోర్చుగల్, ఫ్రాన్స్, చైనా దేశాల్లోనే జరిగాయి. ఇక ఈ అంతర్జాతీయ బోట్ రేసింగ్‌లో 18 దేశాల నుంచి ఎఫ్1హెచ్2వోకు చెందిన 19 పవర్‌బోట్లు, ఎఫ్4కు చెందిన పది బోట్లు పాల్గొంటున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ, మాలక్ష్మీ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి బోటు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నది.

baotrace 15112018 2

ఈపోటీలు కృష్ణానదిలో రెండు కిలోమీటర్ల పరిధిలో జరుగనున్నాయి. 16వ తేదీ ఉదయం ట్రైల్స్ జరుగుతాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారు. 17, 18 తేదీల్లో కూడా ఈ పోటీలు కొనసాగుతాయి. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ బోట్ రేసింగ్‌లు పర్యాటకులను కనువిందు చేయనున్నాయి. 18 సాయంత్రం జరిగే ముగింపు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. ఈ పోటీల కోసం పున్నమిఘాట్ వద్ద భారీ స్థాయిలో షామియానాలు, కుర్చీలు సిద్ధం చేశారు. అలాగే దేశ విదేశీలను ఆకర్షించేలా బరంపార్క్, దుర్గాఫ్లైఓవర్ ప్రాంతంను అందంగా పూలమొక్కలు, రంగురంగుల విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు.

baotrace 15112018 3

ప్రధానంగా ఫ్లైఓవర్ దిగువ 800 మీటర్ల పొడవునా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల ఫౌంటెన్లు, పిల్లలు ఆడుకునేందుకు పార్క్, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. హెలికాఫ్టర్ ఆకారంలో జారుడుబల్ల, పలురకాల ఆట వస్తువులు, గ్రానైట్ బెంచీలు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాయి. ఇదిలా ఉండగా నగర ప్రజల సందర్శనార్ధం గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఈ పోటీల్లో పాల్గొనే స్పీడ్‌బోట్లను ప్రత్యేక వాహనాల్లో ఉంచి స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ప్రదర్శనగా తీసుకొచ్చారు. ఇది ఇలా ఉంటే, పోటీల ముగింపు సభలో గ్లోబల్ మ్యూజికల్ ఫెస్టివల్ జరగనుంది.

Advertisements

Latest Articles

Most Read