వైసీపీ టార్గెట్‌గా మరోసారి ట్వీట్ బాంబ్ పేల్చారు ఏపీ మంత్రి నారా లోకేష్. వైసీపీ-బీజేపీపై మధ్య రహస్య బంధం ఉందని.. సాక్ష్యం కూడా ఉందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. లోకేష్ తన ట్వీట్‌లో ‘నిజమే.. రహస్య మిత్రుల బంధం బయటపడింది.. ప్రజలకు కూడా తెలిసిపోయింది. #BharatiyaJaganSamithiParty (భారతీయజగన్‌సమితిపార్టీ) అభివృద్ధికి ఎలా అడ్డుపడుతుందో’అంటూ సెటైర్ పేల్చారు. "Yeah, right! The ‘secret allies’ are spilling the beans over the ‘secret alliance’ which is ‘not a secret’ anymore! Good that people now know how #BharatiyaJaganSamithiParty are major obstacles for development."

lokesh 14112018 1

తెలుగురాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభ జన బిల్లు జగన్ వల్లే నిలిచిపోయిందని, జగన్ కోరిక మీదటే మోదీ ఈ బిల్లు రాకుండా చూశారని, దానికి ప్రత్యక్షసాక్షిని తానేనని వైసీపీకి మిత్రపక్షమైన టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ప్రముఖ టీవీ ఛానల్ ద్వారా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో విభేదాల కారణంగానే జగన్ అభిప్రాయానికి మోదీ పెద్దపీట వేశారని ఎంపీ వినోద్ చెప్పారు. కాపు, బోయల రిజర్వే షన్ల అంశం కేంద్రం పరిధిలో ఉంది. కేంద్ర పరిధిలో ఉన్న ఈ అంశాలు పూర్తి రిజర్వేషన్లు అమలైతే వైసీపీ కనుమరుగవుతుందన్న కార ణంతో అమలుకాకుండా చేయాలని మోదీ, జగన్ కు సహకరించారనేది అక్కడ చెప్పిన విషయం.

lokesh 14112018 3

మరో పక్క దుబాయ్ లో ఎన్నారై టీడీపీ సమావేశంలో లోకేష్ ప్రసంగించారు. తెలంగాణ ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో ఆ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. విభజన సమయంలో తెలంగాణకు కూడా అనేక హామీలు ఇచ్చారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, అయినా కేంద్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట కూడా అనడం లేదని విమర్శించారు. తెలుగువారంతా కలసికట్టుగా అభివృద్ధి చెందాలనేదే టీడీపీ ఆశయమని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే... దేశం బలంగా ఉంటుందని చెప్పారు.

మోదీ సర్కారు ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటోందన్నది విపక్షాల ఆరోపణ! ఈ జాబితాలో రాజ్యాంగ సంస్థ ‘కాగ్‌’ను కూడా చేర్చారా? ఇది... 60 మంది మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర సర్వీసుల మాజీ అధికారులు చేసిన అభియోగం! దేశాన్ని కుదిపేవేస్తున్న నోట్లరద్దు, రాఫెల్‌ వ్యవహారాలపై మౌనం ఎందుకు వహిస్తున్నారని 60 మంది మాజీ ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు కంప్ట్రోలర్‌ అడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను నిలదీశారు. దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించాల్సిన కాగ్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాలపై ఆడిట్‌ నివేదికలను తయారు చేయడంలో జాప్యం చేస్తుందని విమర్శించారు.

caag 14112018 2

ఈ చర్య వెనుక బిజెపి రాజకీయ ప్రయోజనా లున్నాయని, ఎన్నికల ఏడాది కావడంతో వాస్తవాలు బయటకు వస్తే ఆ పార్టీకి నష్టం జరగుతుందనే జాప్యం చేస్తున్నారని వీరు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పలు ప్రశ్నలను లేవనెత్తుతూ వారు కాగ్‌కు ఒక లేఖ రాశారు. అదే లేఖను రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌కూ పంపుతున్నట్లు తెలిపారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో పంజాబ్‌ మాజీ డిజిపి జులియో రబిరో, అరుణారారు, పుణే మాజీ పోలీస్‌ కమిషనర్‌ మీరన్‌ బుర్వాన్‌కర్‌, ప్రసారభారతి మాజీ సిఇఓ జవహర్‌ సర్కార్‌, ఇటలీలో భారత్‌ మాజీ రాయబారి కెపి ఫాబియన్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వ, అఖిల భారత సర్వీసులకు చెందిన పలువురు అధికారులు సంతకాలు చేశారు.

caag 14112018 3

‘‘సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీయే ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా కాగ్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. అత్యంత కీలకమైన నోట్ల రద్దు, రాఫెల్‌పై నివేదికలు ఇవ్వకుండా ఉద్దేశపూర్వక జాప్యం చేస్తోంది’’ అని వీరు ఆరోపించారు. వెంటనే ఈ రెండు అంశాలపై కాగ్‌ నివేదిక సమర్పించాలని... దీనిని శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుంచాలని డిమాండ్‌ చేశారు. ‘‘నోట్ల రద్దు ప్రభావం, బ్యాంకులు ఇచ్చిన సమాచారం, కొత్త నోట్ల ముద్రణకు పెట్టిన ఖర్చు, సంచిత నిధికి ఆర్బీఐ ఇచ్చిన డివిడెండ్‌... ఈ మొత్తంపై సమగ్ర పరిశీలనాత్మక నివేదిక సమర్పిస్తామని కాగ్‌ శశికాంత్‌ శర్మ 20 నెలల కిందట ప్రకటించారు. కానీ... ఇప్పటిదాకా ఆ నివేదిక ఊసే లేదు. రాఫెల్‌పైనా ఈ ఏడాది సెప్టెంబరులోనే కాగ్‌ నివేదిక ఇస్తుందని వార్తలు వచ్చాయి. దానిపైనా ఇప్పటికీ స్పష్టత లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీయేను ఇబ్బంది పెట్టకూడదనే నోట్ల రద్దు, రాఫెల్‌పై కాగ్‌ మౌనం పాటిస్తోందనే అభిప్రాయం బలపడుతోంది’’ అని మాజీ అధికారులు తెలిపారు.

ప్రాధమిక వైద్యం, కుటుంబ సంక్షేమం, ఏపీ వైద్యవిధాన పరిషత్, ఆయుష్, మందుల నియంత్రణ, గిరిజన సంక్షేమం, సాధికారిత శాఖల మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ బుధవారం ఉదయం సచివాలయంలోని 2వ బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు. 15 గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాట్లు మంజూరు చేస్తూ, గిరిజన ప్రాంతాల్లో రూ.213 కోట్ల వ్యయంతో 48 రోడ్లు నిర్మించాలని రోడ్లు భవనాల శాఖకు పంపే ప్రతిపాదనలపై తొలి సంతకాలు చేశారు. తల్లి పరమేశ్వరి, సోదరుడు సందీప్, ఆయా శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

kidari 14112018 2

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి కల్నల్ వి.రాములు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ అరుణ కుమారి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఏపీవివిపీ ప్రత్యేక అధికారి శ్రీదేవి తదితరులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి శ్రావణ్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఇంతటి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

kidari 14112018 3

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, సంక్షేమ పథకాలు చేస్తానన్నారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమపథకాలు అందేందుకు కృషి చేస్తానని చెప్పారు. మంత్రి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పలువురు ప్రముఖులు పాల్గొని శ్రమణ్ ను అభినందించారు. శ్రావణ్‌కుమార్‌ వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూలో ఇంజినీరింగ్‌ చదివారు. సివిల్‌ సర్వీసెస్‌కి ఎంపికవడం ఆయన లక్ష్యం. దాన్ని సాధించేందుకు దిల్లీలో ఉంటూ సివిల్స్‌ పరీక్షలకు శిక్షణ పొందుతున్నారు. తండ్రి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో... ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు రాజకీయాల్లోకి వస్తున్నారు. శ్రావణ్‌ 1990 జూన్‌ 14న జన్మించారు. ఎనిమిదో తరగతి వరకు పెదబయలులోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో చదువుకున్నారు. విశాఖలో ఇంటర్మీడియెట్‌ చదివారు.

ఒడిశా ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్‌ పట్నాయక్‌ గమ్యం ఎటువైపు ! భాజపాయేతర పార్టీలన్నిటినీ ఒకే తాటిపైకి తెచ్చి 2019 ఎన్నికలను ఎదుర్కోవాలన్న ధ్యేయంతో ఆంధ్రప్రదేశ్‌ సీఎం, టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు. ఈ నెల 22న దిల్లీలో మహాకూటమి నేతలంతా ఒకేచోట సమావేశమయ్యేలా ఆయన ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకు ఆయన ఆయా పార్టీల అగ్రనేతలతో ఈ విషయమై మాట్లాడారు. మంగళవారం ఆయన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడి హస్తినలో ఏర్పాటయ్యే సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించారు. వీరిద్దరూ మంచిమిత్రులు.

cbn 14112018 2

ఈ కార్యక్రమంలో నవీన్‌ పాల్గొంటారా లేదా ! అన్నది అస్పష్టం. భాజపా, కాంగ్రెస్‌లకు తాము సమానదూరంలో ఉంటానని, భవిష్యత్తులో ఇదే పంథా కొనసాగిస్తానని, అదే బిజద లక్ష్యమని ఆయన పునరుద్ఘాటిస్తూ వచ్చారు. జీఎస్‌టీ, నోట్ల రద్దు తదితర నిర్ణయాలు, కీలక బిల్లులు భాజపా పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయాల్లో నవీన్‌ మద్దతుగా నిలిచారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏ పక్షాన ఉన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని కేంద్ర రాజకీయాల పట్ల ఆసక్తి లేదని పలుసార్లు పేర్కొన్న నవీన్‌ చంద్రబాబు అభ్యర్థన మన్నిస్తారా? అన్నదిప్పుడు చర్చనీయంగా ఉంది.

cbn 14112018 3

దీనిపై సీనియర్‌ మంత్రి, బిజద ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ పాత్ర్‌ మంగళవారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు, నవీన్‌ ఏం మాట్లాడుకున్నారన్నది తమకు తెలియదని చెప్పారు. కాంగ్రెస్‌, భాజపాలకు సమానదూరమన్నది తమ పార్టీ విధానమని, 22న ముఖ్యమంత్రి దిల్లీ వెళతారా ! అన్నదానిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ అగ్రనేత శ్రీకాంత్‌ జెనా మాట్లాడుతూ నవీన్‌ అంతర్యం ఎవరికీ బోధపడదని, ఆయన పక్కా అవకాశవాది అని అభివర్ణించారు. స్వీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసే ఆయనకు భాజపాతో లోపాయికారీ సంబంధాలున్నాయని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read