కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుడి భుజం కేవీపీ రామచంద్రరావుకు గతంలో అత్యంత సన్నిహితంగా ఉన్నవారితోపాటు టీఆర్‌ఎస్‌ ప్రేరణతో కాంగ్రె్‌సలో చేరారని అనుమానిస్తున్నవారిని, ఎన్నికలకు ముందే సీఎం పదవిపై దృష్టిసారించిన వారిని జాబితాలో లేకుండా ఏఐసీసీ జాగ్రత్తలు తీసుకుంటోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మిత్రపక్షాల బూచిని చూపించి పొన్నాల లక్ష్మయ్య, మొదలైన వారిని పక్కన పెట్టేందుకు ఇదే కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

kcr 16112018 2

మరికొంత మందిని పై నుంచి ఊడిపడ్డారనే పేరుతో పక్కన పెట్టారని, వారిలో కోరుట్ల సీటును ఆశిస్తున్న నరసింగరావు ఉన్నారని తెలుస్తోంది. బీసీ నాయకుడు కొమిరెడ్డి రాములుకు రాకుండా ఆయన్ని రంగంలోకి దించారని ప్రచారం జరిగింది. కాగా అనుమానం ఉన్నవారిని మొదటి జాబితాలో ప్రకటించకుండా ఆపి, రెండో జాబితాలో క్లియర్‌ చేసేందుకు కూడా ఇదే కారణమని తెలుస్తోంది. సికింద్రాబాద్‌ సీటును ఆశిస్తున్న బండ కార్తికరెడ్డి, రాజేంద్రనగర్‌ సీటును ఆశిస్తున్న సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి తదితరుల పేర్లు కూడా వైఎస్‌ వర్గానికి గతంలో సన్నిహితులనే పేరుతోనే పక్కన పెట్టినట్లు సమాచారం. సీఎల్పీ నేత కావడం వల్ల జానారెడ్డికి సీటు ఇవ్వక తప్పలేదని అంటున్నారు.

kcr 16112018 3

అయితే, మరో పక్క, కేసీఆర్, జగన్, కేవీపీ సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. కేవీపీ కోవర్ట్ లు ద్వారా, మహా కూటమిని దెబ్బ కొట్టానికి కేసీఆర్ ప్లాన్ చేసినట్టు రాహుల్ గాంధీకి స్పష్టమైన సమాచారం ఉండటంతో, కేవీపీ వర్గం అనుకున్న వారందరినీ పక్కన పెట్టేసారు. ఈ విధంగా, కేసీఆర్, జగన్, కేవీపీ కుట్రకు ఫుల్ స్టాప్ పెట్టేసారు. కేవీపీ మహా కూటమిలో కాంగ్రెస్ రాకుండా చెయ్యని ప్రయత్నం లేదు. తద్వారా కీసీఆర్ కు సహాయం చెయ్యాలని కేవీపీ ప్రయత్నం చేసారు. అయితే అవేమీ కుదరలేదు, కాంగ్రెస్ మహా కూటమిలో చేరిపోయింది. ఇప్పుడు కేవీపీ మనషుల్లో ఒక్కరికి కూడా టికెట్ రాకుండా చేసారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. ప్రస్తుతం సిబిఐలో నెలకొన్న వివాదాలు, మోడీ-షా కనుసన్నల్లో సీబీఐ నడుస్తూ ఉండటంతో, చాలా మంది ఈ నిర్ణయాన్ని సమర్ధించారు. పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మద్దతు ప్రకటించారు. అయితే, ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తప్పుబట్టారు.

jd 16112018 2

సీబీఐలో పని చేసిన ఆయన, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. చట్టం ప్రకారం సీబీఐకి ఇచ్చిన అనుమతిని రద్దు చేసే అధికారం, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. అయితే ఎందుకు రద్దు చేశారో సరైన కారణం చెప్పాలి అని చెప్పారు. ఇప్పుడు సిబిఐ పై ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే అని, అయితే ఒక సంస్థ పై ఆరోపణలు వస్తే, ఆ సంస్థనే దర్యాప్తు చేయవద్దనడం సరికాదని అన్నారు హితవుపలికారు. సీబీఐ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, దీనిపై అవసరమైతే రాజకీయ పోరాటం చేసుకోవాలని కోరారు.

jd 16112018 3

‘‘ప్రతిపక్ష నేత జగన్‌ పై దాడి కేసులో కోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు జరుగుతుంది. సెక్షన్‌6లో ఉన్న నిబంధనలు కోర్టు ఉత్తర్వులకు వర్తించవు. కర్ణాటక మైనింగ్‌ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇలాంటి ఉత్తర్వులే ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం సాధారణ అనుమతిని రద్దు చేసింది. మళ్లీ తిరిగి అనుమతి ఇచ్చింది’’ అని లక్ష్మీనారాయణ చెప్పారు. రాష్ట్రానికి సీబీఐకి ఇచ్చిన అనుమతిని రద్దు చేసే అధికారం రాష్ట్రానికి ఉందని చెప్తూనే, ఆ నిర్ణయం మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కట్టడి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వేరే రాష్ట్రాల మద్దతు కూడా లభిస్తుంది. సిబిఐ వ్యవస్థ నాశనం చేసి, నిర్వీర్యం చేసి, తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న మోడీ-షాలకు చంద్రబాబు బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ కూడా అనుసరించబోతున్నారు. ఆమె తన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీబీఐని బీజేపీ నియంత్రిస్తోందని ఆరోపించారు.

cbi 16112018 3

అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. సీబీఐ, ఆర్బీఐలను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకుంటోందన్నారు. సీబీఐ చట్టాన్ని పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. రాష్ట్రాల పరిథిలోని అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్ల దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే పశ్చిమ బెంగాల్ కూడా సీబీఐకి ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

cbi 16112018 2

చంద్రబాబు చాలా మంచి పని చేసారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ తన అధికారాలను, అధికార పరిథిని వినియోగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సాధారణ సమ్మతిని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయడానికి సీబీఐకి అధికారం ఉండదు. తాజాగా మమత బెనర్జీ కూడా చంద్రబాబు బాటలోనే సీబీఐని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని రాష్ట్రాలు ఇలా చేసే అవకాసం ఉందని తెలుస్తుంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌, జనసేన అధినేత పవన్‌ క ల్యాణ్‌ బీజేపీ పక్షమో.. కాంగ్రెస్‌ పక్షమో తేల్చిచెప్పాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పాటుచేసిన ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ విగ్రహాల ఆవిష్కరణకు ఆయన వచ్చారు. తొలుత ఇక్కడి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లివచ్చిన కిరణ్‌.. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర నాయకులతో కలసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌ వరకూ ర్యాలీగా తరలివచ్చారు. అనంతపురం-తాడిపత్రి రహదార్ల కూడలిలో ఏర్పాటుచేసిన ఇందిర, రాజీవ్‌ విగ్రహాలను లాంఛనంగా ఆవిష్కరించారు.

kiran 16112018

అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. దేశ రాజకీయాలు రెండు పక్షాలుగా చీలాయని, రాష్ట్రంలోని వైసీపీ, జనసేన తాము ఎటువైపు ఉంటారో వెల్లడించాలన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన చివరి రోజుల్లో ఓ సభలో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన చిరకాల స్వప్నంగా పేర్కొన్నారని.. తండ్రి మాటను నిలపాలనుకుంటే జగన్‌ ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోవాల్సిన ఘడియలు ఆసన్నమయ్యాయని తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన సర్దార్‌ పటేల్‌ను ఆసరాగా చేసుకుని పరపతి పెంచుకోవడానికి బీజేపీ పాకులాడుతోందని కిరణ్‌ ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ కంటే ఎక్కువకాలం జైలుకు వెళ్లిన నెహ్రూ ఈ దేశానికి ప్రధాని కావడం సమంజసమని పటేల్‌ స్వయంగా చెప్పారన్నారు.

kiran 16112018

ఎన్డీఏ పాలనలో దేశం అస్థిరత ఎదుర్కొంటోందని.. దేశాన్ని కుల, మతాలకు అతీతంగా సమానంగా చూడగలిగింది ఒక్క కాంగ్రెసేనని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అమ్మ ఒడిలాంటిదని అభివర్ణించారు. హోదా ఆంధ్రుల హక్కని నినదించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రె్‌సను ఆదరించాలని పిలుపిచ్చారు. తాము అధికారంలోకి వస్తే గుత్తి కోటను పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మెయ్యప్పన్‌, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, సీనియర్‌ నేతలు తులసిరెడ్డి, శైలజానాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read