గాలి జనార్ధనరెడ్డి... జగన్ మోహన్ రెడ్డికి దేవుడు ఇచ్చిన అన్నయ్య... ఇద్దరూ కలిసి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేసి కొల్లగొట్టారో అందరికీ తెలిసిందే... ఇద్దరూ జైలు జీవితం అనుభవించి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నారు... అయితే జగన్ మాత్రం ప్రతి రొజూ బయటే తిరుగుతున్నా, గాలి జనార్ధన్ రెడ్డి మాత్రం, 4 ఏళ్ళ నుంచి ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చింది లేదు... సంవత్సరం క్రితం, కేంద్రం నుంచి వచ్చిన అభయంతో 4 ఏళ్ళ తరువాత మీడియా ముందుకు వచ్చారు.. అదీ తన మూడవ ప్రత్యర్ధి అయిన ABN రాధాక్రిష్ణ దగ్గరకు వచ్చారు... ఇలా ఉంటూ ఉండగానే, కర్ణాటక ఎన్నికలు రావటం, తాను అక్రమంగా సంపాదించిన సొమ్ము, బీజేపీ తరుపున నుంచున్న వారి కోసం ఖర్చు పెట్టటం జరిగిపోయాయి.

gaali 07112018 2

నిన్నటికి నిన్న కూడా, గాలి జనార్ధన్ రెడ్డి సామ్రాజ్యం అయిన, బళ్ళారిలో, ఘోర ఓటమి చవి చూసాడు. తన సామ్రాజ్యం అనుకున్న చోటే, గాలిని ప్రజలు ఘోరంగా ఓడించారు. అయితే ఇది జరిగిన 24 గంటలు గడవక ముందే, ఇప్పుడు గాలి గురించి నేషనల్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్ గుప్పు మంటుంది. ఆ కధనం ప్రకారం, గాలి జనార్ధనరెడ్డి పరారీలో ఉన్నాడు. గాలి జనార్ధనరెడ్డిని పట్టుకోడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అంబిడెంట్ అనే కంపెనీని ఈడీ నుంచి కాపాడటానికి, ఆ కంపెనీతో డీల్ కుదుర్చుకున్న గాలి. ఈడీ అధికారికి కోటి లంచం ఇచ్చిన గాలి.

gaali 07112018 3

అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారం కడ్డీలు అందుకున్న గాలి. బళ్ళారిలో ఈ నిధులు, బంగారం. బద్దలైన గాలి పాపాలు. గాలి కోసం గాలిస్తున్న సీసీబీ పోలీసులు. గాలితో పాటు మరో ముగ్గురుని కూడా పట్టుకోవటానికి గాలిస్తున్న పోలీసులు. గాలి జనార్ధన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజకీయ నాయకుడుతో దగ్గరి సంబంధాలు ఉండటంతో, ఆ యువ నేత ఎస్టేట్, ప్యాలెస్ లో కూడా, పోలీసులు గాలించే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి, పాపాలు చేసిన వాడు, ఎప్పటికైనా ఇలా దొంగ లాగా తిరాగాల్సిందే. ప్రస్తుతం, కండీషనల్ బెయిల్ పై తిరిగిన వారే పరిస్థితి కూడా తొందరలోనే ఇలా ఉంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు https://www.facebook.com/news9live/videos/335594130583944/

చంద్రబాబు మరోసారి బీజేపీ పై విరుచుకుపడ్డారు. రాజకీయ పార్టీలలో బీజేపీ చిచ్చు పెడుతోందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నేతల కుటుంబాల్లో కూడా చిచ్చు రగిలిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల చర్చ మొదలైంది. చంద్రబాబు తొందరిపడి ఏది మాట్లాడరు. అలాంటిది ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడారు ? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు ? చంద్రబాబు సొంత కుటుంబంలో చిచ్చు పెట్టటానికి బీజేపీ ఏమన్నా ప్రయత్నం చేసిందా అనే చర్చ మొదలైంది. చంద్రబాబు మాట్లాడుతూ, కేసుల పేరుతో భయపెడుతున్నారని, డబ్బులతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న అరాచకాల వల్లే ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు.

ccbn 06112018 2

p style="text-align: justify;">వినాశకాలే విపరీత బుద్ధిలా బీజేపీ పోకడలు ఉన్నాయని విమర్శించారు. మంగళవారం టీడీపీ సమన్వయం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాలపై పార్టీ నేతలు దిశానిర్దేశం చేశారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి శరాఘాతం అని, ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం చంద్రబాబు పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతిన్నదని, బీజేపీకి చెందిన ఒక అభ్యర్థి పోటీ చేయకుండా తప్పుకుంటే.. పోటీ చేసిన అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారని అన్నారు. నరేంద్ర మోదీ పాలనపై ఉన్న వ్యతిరేకతకు ఈ ఫలితాలే సాక్ష్యం అని పేర్కొన్నారు.

ccbn 06112018 3

ప్రజలకు బీజేపీ ఎంత దూరం అయ్యిందో ఈ ఎన్నికలే స్పష్టమైన సంకేతం ఇస్తున్నాయని అన్నారు. గెలుపొందిన అభ్యర్థులకు లక్షల్లో మెజారిటీలు రావడం అంటే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు, ఈ ఉప ఎన్నికలకు ఎంతో మార్పు ఉందన్నారు. రాజకీయం రోజు రోజుకూ మారిపోతోందని, అహంభావంతో ఉంటే ప్రజలే కళ్లు తెరిపిస్తారని మరోసారి రుజువైందన్నారు. అహంభావం, అతి విశ్వాసం పతనానికి దారితీస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ, ఇన్ కంట్యాక్స్, ఆర్బీఐ, గవర్నర్ వంటి అన్ని సంస్థలను నాశనం చేశారు, ఢిల్లీని భ్రష్టుపట్టించారని చంద్రబాబు అన్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ధర్మపోరాట దీక్ష ముగింపు సభ చేస్తున్నామని, ఈ సభకు జాతీయ నేతలను ఆహ్వానించడానికి ప్రయత్నిస్తున్నా అని సీఎం చంద్రబాబు అన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి, తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేశారు. కర్ణాటక ఉప ఎన్నిక ఫలితాల్లో కూటమి, అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం పై ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ నెల 9న బెంగళూరులో కర్ణాటక, ఏపి సీఎంల భేటి జరుగనుంది. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామితో ముఖ్యమంత్రి భేటి కానున్నారు. జాతీయ స్థాయిలో భాజాపా యేతర రాజకీయ పార్టీలన్నింటినీ ఏక తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు జాతీయ స్థాయి నాయకులతో మంతనాలు చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ ప్రధాని దేవెగౌడతోనూ చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు.

cbn photo 06112018 2

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై ఆయనను అభినందించారు. రోజు రోజుకీ దేశంలో భాజాపా ప్రతిష్ఠ దిగజారిపోతోందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో ఇటీవల మూడు లోక్‌సభ స్థానాలు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో భాజపాకు గట్టి షాక్‌ తగిలింది. ఈ ఫలితాల్లో నాలుగు స్థానాలను కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమి గెలుచుకోగా.. శివమొగ్గ లోక్‌సభ స్థానంలో మాత్రమే భాజపా గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కుమారస్వామికి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. కాగా, ఈ నెల 9న బెంగళూరులో కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు భేటీ కానున్నట్టు సమాచారం. మాజీ ప్రధాని దేవెగౌడతో కూడా చంద్రబాబు సమావేశమవుతారని తెలుస్తోంది.

cbn photo 06112018 3

కర్ణాటక ఉప ఎన్నికల్లో భాజపా ఘోర పరాభవం చవిచూసింది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే భాజపా విజయం సాధించింది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి జయకేతనం ఎగురవేసింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించి.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది.

అప్పుడెప్పుడో మనోడు బాగా ఎమోషన్ లో ఉన్న టైంలో, నాకు తెలంగాణా అంటే ప్రాణం, నా గుండెకాయి, నేను తెలంగాణా నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పారు పవన్. తరువాత, అనంతపురం వెళ్లారు, గాల్లో పిడిగుద్దులు గుద్ది, నేను అనంతపురం నుంచి పోటీ చేస్తున్నా అన్నారు. తరువాత అరకులో రెండు రోజులు ఫోటో షూట్ చేసి, నేను పాడేరు నుంచి పోటీ చేస్తున్నా అన్నారు. తీరా చూస్తే అది ఎస్సి రిజర్వడ్ సీట్. అది అయిపోయిన తరువాత అనకాపల్లి వచ్చి, జుట్టు పైకి ఎగరేసి, నేను అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నా అని సెలవిచ్చారు.. మొన్న తిరుపతి అన్నారు. ఇప్పుడు పిఠాపురం వంతు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను చాలా మంది పిఠాపురం నుంచి పోటీచేయాలని అడుగుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు సెలవిచ్చారు.

pk 06112018 3

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. శ్రీపాద వల్లభుడంటే తనకెంతో ఇష్టం, ప్రేమ, గౌరవమని.. ఆయన ఆశీస్సులు ఉంటే పిఠాపురం నుంచే పోటీచేస్తానేమో అని వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి పోటీచేయాలని భగవంతుడి ఆజ్ఞే అయితే అప్పుడు చూద్దామన్నారు. పవన్ ప్రకటనతో, జనసైనికులు నాగినీ డాన్స్ వేస్తున్నారు. పిఠాపురం అయితే పవన్ సామాజిక వర్గం అధికంగా ఉంటుందని, పవన్ గెలుపు చాలా సునాయాసం అవుతుందని అంటున్నారు. ఇంతకు ముందు తెలంగాణా, అనంతపురం, పాడేరు, అనకాపాల్లి, తిరుపతి అయితే చాలా కష్టం అని ఆలోచిస్తున్నామని, పిఠాపురం అయితే కుమ్మేస్తాం అని అంటున్నారు.

pk 06112018 2

పవన్ మాట్లాడుతూ "జనసైనికులు చాలా జాగ్రత్తగా ఉండండి, దాడులు జరిగే అవకాశం ఉంది, సంయమనం పాటించండి, అవసరమైన రోజు నేనే చెప్తాను ఆరోజు సైలెన్సర్ పీకుతారో ఏం పీకుతారో మీ ఇష్టం. నేను ఎంతో సంయమనం పాటిస్తాను, శాంతంగా ఉంటాను, తప్పుడు మాటలు మాట్లాడను. ఎవడు ఎవరితో రంకు చేసినా జనసేన దే బాధ్యత అంటే ఎలా, మీరు నేను సమస్యలపై మాట్లాడుతుంటే దాన్ని పక్కదారి పట్టించటానికి ఏదొకటి చేస్తే ఎలా. నాకు ఆడపడుచుల మీద అపారమైన అభిమానం ఉంది. నేను వచ్చింది మీ భవిష్యత్తు కోసం, మీ జీవితాల కోసం, మీ ఆనందం కోసం, మీకు నాకు మధ్య రెండు గుండెలు మాత్రమే దూరం' అని ఈ రోజు స్క్రిప్ట్ అంతా పవన్ చదివేశారు.

Advertisements

Latest Articles

Most Read