ఒక తప్పు చేసి, ఆ తప్పుని కరెక్ట్ అని చెప్పటానికి, తప్పు మీద తప్పు చేసి, ప్రతి తప్పుకి దొరికిపోతున్నారు జగన్ తప్పుడు బ్యాచ్. కోడి కత్తి డ్రామా అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ కోడి కత్తితో జగన్ ని గుచ్చినోడు వైసీపీ అని , వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ అన్న చెప్పాడు, వాళ్ళ ఊరు మొత్తం చెప్పింది, వాడికి ఫ్లెక్సీ డిజైన్ చేసినోడు చెప్పాడు, వాడే పది పేజీలు లెటర్ రాసి చెప్పాడు, రాష్ట్రం మొత్తం టీవీ లలో చూసింది. అయితే జగన్ తప్పుడు బ్యాచ్ మాత్రం, మార్ఫింగ్ల మీద మార్ఫింగ్లు చేస్తూ, కోడికత్తి దాడి నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిగా పేర్కొంటూ ఒక నకిలీ మెంబెర్ షిప్ కార్డ్ తయారు చేసారు.

morphing 28102018 2

ఈ నకిలీ కార్డు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయటమే కాకుండా, సాక్షాత్తు ఆ పార్టీ అధికారప్రతినిధి జోగి రమేష్ కూడా ఆ నకిలీ కార్డు ను చూపించి మాట్లాడటం జరిగింది. అయితే అబద్ధాలను మార్ఫింగ్ ద్వారా చూపించాలి అన్న తొందరలో వైసీపి జఫ్ఫా బ్యాచ్ చేసిన మార్ఫింగ్ కార్డ్ లో పెద్ద కామెడీ ఏమిటంటే వాళ్ళు కార్డ్ లో చూపించినట్లు " ముమ్మిడివరం మండలం " అమలాపురం నియోజకవర్గంలో లేదు.. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉంది.. కనీస అవగాహన లేకుండా కేవలం ఫోటోషాప్ మాత్రమే తెలిసిన బ్యాచ్ ను నమ్ముకుని ఇలా " వెర్రి పప్పలు " అయిపోయారు. అతి పెద్ద కామెడీ ఏమిటంటే ఆ ఫోటో షాప్ బ్యాచ్ ని నమ్మి, జోగి రమేష్ విపి అవ్వటం.

morphing 28102018 3

ఇదే విషయం లోకేష్ కూడా అన్ని ఆధారాలతో తన ట్విట్టర్ లో పోస్తే చేసారు. "వైకాపా ట్రేడ్ మార్క్ మార్ఫింగ్ ట్రిక్స్. దాడి చేసింది తన అభిమానే అని ఒప్పుకునే ధైర్యం లేని నాయకుడు జగన్ మోడీ రెడ్డి.తన అభిమానిని టిడిపి కార్యకర్తగా చిత్రిస్తూ చీప్ ఫోటో షాప్ జిమ్మికులు." "కనీస అవగాహన కూడా లేకుండా ముమ్మిడివరం మండలం అమలాపురం నియోజకవర్గం లోనిది అంటూ ఫేక్ మెంబెర్ షిప్ కార్డ్ తయారు చేసారు. ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి జగన్ మోడీ రెడ్డి తప్ప మరొకరు ఉండరు. "The party of fraudsters commits another fraud to cover up their fake assassination act. Shame on them. #Jagannatakam" అంటూ ట్వీట్ చేసారు.

నిన్నటి దాకా, తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకుని, కెసిఆర్, కేటీఆర్ ఎలా టార్గెట్ చేస్తున్నారో చూస్తున్నాం. ఇంకా మాట్లాడితే, ఉదయం కూడా, చంద్రబాబుని బూతులు తిట్టారు. అదంతా తెలంగాణాలోని వేరే జిల్లాల్లో. కాని, ఇప్పుడు కేటీఆర్ తెలంగాణాలోని మినీ ఆంధ్రా, కూకట్‌పల్లికి వచ్చి, అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిస్కట్ వేస్తున్నాడు. అక్కడకు వచ్చి, ఎక్కువగా చంద్రబాబుని సమర్ధిస్తూ, ఆయనను రాజకీయంగా ఎందుకు తిట్టాల్సి వచ్చిందో చెప్తున్నారు. ఆంధ్రా వారు అంటే చంద్రబాబు అన్నట్టు, కేటీఆర్ ఎంత సేపు చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ, కూకట్‌పల్లి ప్రజలను మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జగన్, పవన్ ప్రస్తావనే లేదు. వారి గురించి పెద్దగా పట్టించుకునే పని లేదని కేటీఆర్ అనుకున్నారో ఏమో..

ktr 28102018 2

కూకట్‌పల్లి నిజాంపేట్ రోడ్డులోని రాఘవరెడ్డి గార్డెన్‌లో ‘మన హైదరాబాద్.. మనందరి హైదరాబాద్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్.. కేసీఆర్ మాట్లాడిన మాటలు.. ఇక్కడి సెటిలర్లను ఉద్దేశించినవి కావని, టీడీపీ, చంద్రబాబును ఉద్ధేశించి మాట్లాడరని వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో విమర్శలు సహజం అని పేర్కొన్నారు. చంద్రబాబును విమర్శించడానికి కొన్ని కారణాలు ఉన్నాయనే విషయం వాస్తవమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలని చంద్రబాబు లేఖలు రాశారని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలోనే, వివిధ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుంటారని అన్నారు. వాస్తవానికి చంద్రబాబును కూడా తప్పు పట్టేలేమని... ఏపీ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాల్సిన బాధ్యత ఆయనపై ఉందని కేటీఆర్ తెలిపారు.

ktr 28102018 3

ఎగువన ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టులు కడితే, ఏపీకి నీరు రాదనే ఆందోళనతో ఆయన లేఖలు రాసి ఉండవచ్చని చెప్పారు. నందమూరి హరికృష్ణ దురదృష్టవశాత్తు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ నేతలు మానవీయ కోణంలో ఎలా స్పందించారో అందరికీ తెలుసని చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారని, అక్కడ నుంచి భౌతికకాయం హైదరాబాదుకు వచ్చేంత వరకు భౌతికకాయం పక్కనే ఉన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తాను కూడా ఆయన నివాసానికి వెళ్లి కుటుంబసభ్యలను ఓదార్చామని తెలిపారు. ఇక్కుడుండే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు తాను ఒకటే మాట ఇస్తున్నానని, మీలో ఒక వ్యక్తిగా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని కేటీఆర్ తెలిపారు. మీ మనసులో ఉన్న అనుమానాలన్నింటినీ పక్కన పెట్టాలని విన్నవిస్తున్నానని అన్నారు. ఓట్ల కోసం తప్పుడు మాటలు చెప్పే వ్యక్తిని తాను కాదని చెప్పారు. మొత్తానికి సీమంధ్ర ఓటర్ల కోసం, కూకట్‌పల్లిలో ఇలా ఫీట్లు చేస్తున్నాడు కేటీఆర్.

‘జగన్‌ను చంపాలనే ఆలోచన నాకు లేదు. ఆయన్ని గాయపరిస్తే ప్రజల నుంచి సానుభూతి వస్తుంది. పార్టీకి లాభం జరుగుతుందని భావించే దాడి చేశా’ అని నిందితుడు శ్రీనివాసరావు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ‘నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. వాటిని జగన్‌తో పంచుకొనే అవకాశం లభించలేదు. ఇప్పుడీ ఘటన ద్వారా నేను రాసిన లేఖతో వైసీపీ అధినేతకు అన్నీ అర్థమవుతాయి. నేను అనుకున్నది నెరవేరినట్లే’ అని కూడా చెప్పినట్లు సమాచారం. కాగా, జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడిపందేల కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావులో ఏ కోశానా భయం, ఆందోళన కనిపించడం లేదని అతడ్ని గురు, శుక్రవారాల్లో విచారించిన పోలీసులు అంటున్నారు.

jagan 28102018 2ఎన్నిసార్లు ప్రశ్నించినా.. ‘నా వెనుక ఎవరూ లేరు. ఎవరూ ప్రేరేపించలేదు. బుద్ధిపూర్వకంగానే దాడి చేశా’ అని అతను వెల్లడించినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అంత కరుడుగట్టిన వ్యక్తిత్వం శ్రీనివాస్ కు ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీస్‌ కస్టడీ కోరుతూ శనివారం కోర్టులో పిటిషన్‌ వేశారు. నిందితుడు శ్రీనివాసరావును విచారించేందుకు కోర్టు 6 రోజులు అనుమతి ఇచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలోని ఆయన కుటుంబసభ్యులను మరోసారి విచారించారు.

jagan 28102018 3శ్రీనివాసరావు ఇంట్లో లభించిన మూడు బ్యాంకు ఖాతా పుస్తకాలలోని లావాదేవీలపై ఆరా తీశారు. ఆ ఖాతాలకు పెద్దమొత్తంలో నగదు జమ అయినట్టు సిట్‌ అధికారులకు సమాచారం అందింది. అయితే, శనివారం బ్యాంకులకు సెలవు కావడంతో.. ఆ ఖాతాలను పరిశీలించే పనిని సోమవారానికి వాయిదా వేసుకొన్నారు. ఇప్పటికే అతని కుటుంబసభ్యులు, బంధువులతో సిట్ అధికారులు మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం వారితో మరొకసారి మాట్లాడనున్నారు. లేక రాసిన రేవతి పతి, మరో యువతితోపాటు తాజాగా ఇంకో యువతిని కూడా సిట్ పోలీసులు విచారించారు. వారిచ్చిన సమాచారాన్ని కూడా శ్రీనివాసరావు చెప్పే వివరాలతో పోల్చనున్నారు. గత ఏడాది కాలంలో శ్రీనివాసరావు 9 ఫోన్లు ఎందుకు మార్చాడు? వాటిని కొనడానికి అవసరమైన నగదు ఎలా వచ్చింది? అతని ఆర్థిక వనరులు ఏంటి? అతనికి ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి? నగదు పరిస్థితి, ఇతర లావాదేవీలు ఏంటి? ఈ అంశాలపై సిట్ పోలీసులు శ్రీనివాసరావును ప్రశ్నించనున్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల జ్వరం రాజకీయపార్టీలను అతలాకుతలం చేస్తోంది... ఇప్పటికే అసెంబ్లీని రద్దు చెయ్యటం, ఎన్నికల తేదీలు ప్రకటించటం, ఐటి రైడ్లు, ప్రచార హడావిడి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే తెలంగాణా నాయకులకు, ముఖ్యంగా తెరాస నాయకులకు మాత్రం, ఎప్పుడూ ఆంధ్రా మీదే టార్గెట్. చంద్రబాబుని టార్గెట్ చెయ్యాలి, జగన్ ను లేపాలి అనే ధ్యాస మీదే ఆగిపోతున్నారు. కెసిఆర్, కేటీఆర్ రోజు ఎలా తిడుతున్నారో చూస్తున్నాం. ఇప్పుడు, వీరికి తోడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తయారయ్యాడు. అప్పట్లో కెసిఆర్ చెప్పిన జోస్యం లాగా, ఇప్పుడు కూడా ఆంధ్రాలో నెక్స్ట్ సియం ఎవరనేది చెప్పిస్తున్నారు. ఆంధ్రలో రాబోవు ఎన్నికల్లో జగన్‌ అధికారంలోకి రావటం, చంద్రబాబు ఓడిపోవటం తధ్యమని, జోష్యం చెప్పారు.

nayani 2810208 2

జగన్ కూడా ప్రతి సందర్భంలో, కేసీఆర్ కు సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణలో మళ్లీ టిఆర్‌ఎస్‌ కనుక గెలిస్తే, రాబోయే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కెసిఆర్‌ కీలకమైన పాత్ర పోషిస్తారని, ఆ పార్టీకి చెందిన నాయకులు, వైకాపాకు చెందిన నాయకులు చెబుతున్నారు. డిసెంబర్‌ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మళ్లీ కొలువు తీరితే కెసిఆర్‌ ఆంధ్రా పై దృష్టిసారిస్తారని, ఆంధ్రాలో ఆయన ప్రచారం చేసినా చేయవచ్చునని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే జగన్‌ నయమని ఆయన చెప్పబోతున్నారని కెసిఆర్‌ కనుక మళ్లీ తెలంగాణలో గెలిస్తే, ఇక్కడ చంద్రబాబుకు ఇక్కట్లు తప్పవని, టిఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

nayani 2810208 3

ముందస్తు ఎన్నికల్లో కెసిఆర్‌ కనుక ఘనవిజయం సాధిస్తే, ఆ ప్రభావం ఆంధ్రా రాజకీయాల పై ఖచ్చితంగా ఉంటుందని వారు చెబుతున్నారు. బిజెపితో అంటకాగుతున్న కెసిఆర్‌ తమకు కామన్‌ శత్రువు అయిన చంద్రబాబును ఓడించడానికి, ఆంధ్రాలో పర్యటిస్తారని, అదే సమయంలో జగన్‌ కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరతారని ప్రచారం జరుగుతోంది. అందుకే జగన్ కూడా రంగంలోకి దిగారు. అవసరం అయిన చోట ఫైనాన్సు చెయ్యటానికి కూడా సిద్ధమయ్యారు. మిషన్ భాగీరధ కాంట్రాక్టు తీసుకున్న తన నాయకులని, కెసిఆర్ కు తగు సహాయం చెయ్యమని ఆదేశించారు. ఈ బాధ్యత అంతా విజయసాయి రెడ్డికి అప్పగించినట్టు తెలుస్తుంది. కెసిఆర్ గెలుపు కోసం, తన సామాజిక వర్గ పెద్దలని సపోర్ట్ చెయ్యమని అడుగుతున్నారు. అయితే ఇప్పటికే రెడ్లు అందరూ , కెసిఆర్ కి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. జగన్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read