విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన దాడికి సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు విపక్షనేత జగన్‌ నిరాకరించారు. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని తెలిపారు. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న విశాఖ నార్త్‌ ఏసీపీ బి.నాగేశ్వరరావు, సీఐ కె.లక్ష్మణమూర్తి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లో జగన్‌ చికిత్స పొందుతున్న సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. తాము వచ్చిన సమాచారాన్ని జగన్‌కు తెలియచేయాలని అక్కడున్న వైసీపీ నేతలను కోరారు. సుమారు గంట తర్వాత జగన్‌ నుంచి సిట్‌ అధికారులకు పిలుపు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... ఇద్దరు అధికారులు జగన్‌ వద్దకు వెళ్లి తమను పరిచయం చేసుకున్నారు. ఈ ఘటనపై వాంగ్మూలం ఇవ్వాలని కోరారు. అందుకు జగన్‌ నిరాకరించారు.‘

court 27102018 2

ఏపీ పోలీసులపై మాకు నమ్మకం లేదు. విచారణ బాధ్యతలను మరేదైనా రాష్ట్ర పోలీసులకు లేదా ఏదైనా దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించాలి’ అంటూ తన వైఖరిని స్పష్టం చేశారు. సంఘటన వివరాలు చెప్పాలంటూ 160 సీఆర్పీసీ కింద ఇచ్చిన నోటీసును స్వీకరించేందుకు కూడా నిరాకరించారు. ఇదే విషయాన్ని జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి నోటీసు ప్రతిపై రాసిచ్చారు. ‘‘ప్రచారం కోసం జగన్‌ అభిమానే దాడి చేసినట్లు స్వయంగా డీజీపీ, చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నోటీసును తీసుకోవడంలేదు. అలాగే... వారి నేతృత్వంలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న దర్యాప్తు తీరు తెన్నులపైనా మాకు నమ్మకం లేదు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చారు.

 

court 27102018 3

జగన్‌ తనపై జరిగిన దాడికి సంబంధించి రాష్ట్ర పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించినందున ఈ వ్యవహారంలో న్యాయపరంగా ఎలా నడుచుకోవాలన్న అంశంపై ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సు ముగిశాక కొందరు మంత్రులు, న్యాయనిపుణులతో చర్చించారు. జగన్‌ వాంగ్మూలం ఇవ్వకపోతే దర్యాప్తు చేయడం కష్టం కాబట్టి కోర్టులో 164 నిబంధన కింద పిటిషన్‌ వేయాలని నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వైకాపా నాయకులు చేసిన తప్పులు తిరిగివారికే తగులుతున్నాయని వ్యాఖ్యానించారు. జగన్‌పై దాడి జరిగిన వెంటనే డీజీపీ మీడియాతో మాట్లాడటాన్ని వైకాపా నాయకులు తప్పుపట్టడం చర్చకు వచ్చింది. డీజీపీ చేసిన దాంట్లో తప్పులేదని, మీడియా ప్రతినిధులు వివరాలు కోరడంతో అప్పటికి ఆయనకు తెలిసిన సమాచారం చెప్పారని సీఎం వ్యాఖ్యానించారు.

‘‘నేరాలు చేసే వ్యక్తులు రాజకీయ ముసుగులో ఉంటారు. ఇది చాలా ప్రమాదం. ఇలాంటి వారి విషయంలో కఠినంగా ఉండండి. విశాఖ సంఘటనను గమనించండి. పోలీసులు ఎవరికీ భయపడొద్దు. ఏ పార్టీ అయినా సరే.. అల్లర్లు సృష్టించాలని చూస్తే అణచివేయండి’’ అని సీఎం చంద్రబాబు పోలీసు అధికారులకు స్పష్టంచేశారు. ప్రస్తుత సమాజంలో రాజకీయమూ మారిందని, వచ్చే ఆర్నెల్లలో వీటి తీవ్రత పెరగవచ్చని అప్రమత్తం చేశారు. ‘హోదా’ విషయంలో కేంద్రంతో విభేదించగానే రాష్ట్రాన్ని, టీడీపీని లక్ష్యంగా చేసుకుని... ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకే కుట్ర రాజకీయాలు మొదలయ్యాయని తెలిపారు. విశాఖలో విపక్ష నేత జగన్‌పై దాడి సంగతిని ప్రస్తావించారు. ‘‘ప్రతిపక్ష నేతపై ప్రాణహానిలేని దాడులకు పాల్పడి, బయటి నుంచి మనుషులను రప్పించి, రాష్ట్రంలో అలజడులు సృష్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలని పథక రచన చేశారు."

dgp 27102018 2

"శాంతి భద్రతల సమస్య లేవనెత్తి ప్రజలు ఐదేళ్లకు ఎన్నుకున్న టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి రాష్ట్రపతి పాలన పేరుతో గవర్నర్‌ను రంగంలోకి దించాలనేది ప్లాన్‌. ఆలోచించి చూడగా విషయం మొత్తం అర్థమైంది. ఈ విషయాన్ని దేశం మొత్తం చాటి చెబుతాను’’ అని చంద్రబాబు ప్రకటించారు. జగన్‌పై దాడి జరిగిన తర్వాత నాలుగు గంటల పాటు పోలీసులు సరిగా వ్యవహరించలేదు. సంఘటన 12.40 గంటలకు జరిగితే డీజీపీ వెంటనే మీడియాతో మాట్లాడారు. మీరందరూ ఎందుకు స్పందించలేదు. నాతో పాటు ఐటీ మంత్రి (లోకేశ్‌) ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పంపుతుంటే మీరెందుకు మాట్లాడలేదు? రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పింటే నాతోపాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ దోషులుగా నిలబడాల్సి వచ్చేది. దాడి విషయం తెలియగానే కలెక్టర్ల సదస్సు నుంచి వచ్చేసి పోలీసులకు గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో డీజీపీ ఠాకూర్‌ గట్టి చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా వారి పథకాలు ఫలించలేదు. అందువల్లే నన్ను, డీజీపీని ఏ1, ఏ2గా చేర్చి కేసులు పెట్టాలంటున్నారు.

dgp 27102018 3

రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ఇష్టంలేక ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. హిందువులను టీడీపీకి దూరం చేసే కుట్రలో భాగంగా రమణ దీక్షితులును అడ్డు పెట్టుకుని తిరుమల వివాదం తీసుకొచ్చారు. పింక్‌ డైమండ్‌ అన్నారు. సుబ్రమణ్యస్వామి ద్వారా కేసులేయిస్తారు. ఏంటని అడిగితే అమిత్‌ షా చెప్పారని పిటిషనర్‌ బదులిస్తారు. భవిష్యత్తులో చర్చిలపైనా దాడులు జరగొచ్చు. విభజిత రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తుంటే దుష్టశక్తులు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశాను. కానీ... ఇప్పుడు పడుతోన్న కష్టాలను జీవితంలో ఎన్నడూ చూడలేదు. కేంద్ర ప్రభుత్వంతోపాటు పొరుగు రాష్ట్ర ప్రభుత్వం, స్వరాష్ట్రంలో విపక్షాలు మూకుమ్మడిగా కుట్రలు పన్నుతున్నాయి.

రేపటి చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా హీట్ పెంచుతుంది. తెలుగు మీడియానే కాక, జాతీయ మీడియా కూడా చంద్రబాబు పర్యటన పై ఆసక్తి చూపిస్తుంది. ప్రతిపక్ష నేత జగన్‌ పై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తి గుచ్చుడు దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటికే చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కెసిఆర్, దగ్గర నుంచి బీజేపీ, పవన్, గవర్నర్ దాడి చేస్తున్నాయి. దీంతో పూర్తి క్లారిటీ వచ్చిన చంద్రబాబు, ఇక ఉపేక్షించేది లేదని, నేరుగా రంగంలోకి దిగుతున్నారు. కేంద్రం పై డైరెక్ట్ అటాక్ కి రంగం సిద్ధం చేసారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. ‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు... రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ’.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

tdp mps 26102018 2

శనివారం ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనమై వెళ్తున్నారు. మరోవైపు శనివారం ఉదయం 10 గంటల కల్లా టీడీపీ ఎంపీలంతా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముందుగా ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఐటీ దాడులు, జగన్‌పై దాడి ఘటన, కేంద్రం సహాయ నిరాకరణపై టీడీపీ ఎంపీలతో చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడనున్నారు. జాతీయ మీడియాతో జరిగే సమావేశంలో చంద్రబాబు.. గవర్నర్ వ్యవస్థపై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

tdp mps 26102018 3

గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వం పాలనలో వేలు పెడుతున్నారంటూ చంద్రబాబు నిన్ననే మండిపడ్డారు. గవర్నర్.. ఏపీ డీజీపీకి ఫోన్ చేసి జగన్‌పై జరిగిన దాడిపై నివేదిక అడిగిన నేపథ్యంలో చంద్రబాబు కన్నెర్ర జేశారు. మరో పక్క రాష్ట్రంలో, మోడీ - షా లు ఆడుతున్న వికృత క్రీడని కూడా దేశం ముందు ఉంచనున్నారు. ఇప్పటికే ఏపికి జరిగిన నష్టాన్ని, దేశం ముందు ఉంచటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అవిశ్వాస తీర్మానం పెట్టటం, జాతీయ స్థాయి నాయకులని కలవటం, ఢిల్లీలో ప్రెస్ మీట్ లు పెట్టి, మోడీ-షాలని ఏకి పారేసి, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశానికి చెప్పారు. ఇప్పుడు దీని తరువత రాష్ట్రాన్ని ఎలా ఇబ్బంది పెడుతుంది, ఐటి దాడులతో భయబ్రాంతులకి గురి చెయ్యటం, అనేక రకాల కుట్రలు చెయ్యటం, గవర్నర్ ని ఇందులో వాడటం, జగన్, పవన్ పాత్రలు, ఇవన్నీ చెప్పి, మరోసారి కేంద్రం పై దాడి చెయ్యనున్నారు.

‘కుట్రలు మొత్తం అర్థమయ్యాయి. దీనిని దేశమంతా చాటిచెబుతా’ అని ప్రకటించిన చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా వెంటనే అక్కడికి చేరుకోవాలని ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జాతీయ దిన పత్రికలు, చానళ్లతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని లక్ష్యంగా ఎంచుకొని పదేపదే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని... ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా భయపెట్టడం లక్ష్యంగా ఇది జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాతీయ స్ధాయిలో ఎత్తిచూపి మోదీ ప్రభుత్వాన్ని నిలదీయడమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రధాన అజెండాగా తెలుస్తోంది. అన్నిటికంటే, గవర్నర్ టార్గెట్ కా చంద్రబాబు వేగంగా పావులు కదుపుతున్నారు.

governer 27102018 2

జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగినట్లు చెబుతున్న దాడిలో ఘటనలో గవర్నర్ నరసింహన్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. ఏపీ ప్రభుత్వ పెద్దలు గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. సీఎం చంద్రబాబు నేరుగా గవర్నర్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అసలు గవర్నర్ల వ్యవస్థపై చర్చ జరుగాలంటున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి నరసింహన్ ఢిల్లీ స్థాయిలో కుట్ర చేస్తున్నారనేది టీడీపీ నేతలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. జగన్‌పై దాడి జరిగిందనే ప్రచారం ఊపందుకోకముందే గవర్నర్ ఏపీ డీజీపీకి ఫోన్ చేశారు. ఎయిర్‌పోర్టులో ఏం జరిగిందో.. సీఐఎఫ్ పోలీసుల నుంచి విశాఖ పోలీసులు సమాచారం తీసుకుంటుండగానే గవర్నర్ డీజీపీకి ఫోన్ చేశారు. సీరియస్‌గా రిపోర్ట్ అడిగారు. అసలు ఆ ఘటన జరిగింది.. ఎయిర్‌పోర్టు కేంద్ర పరిధిలో ఉంటుంది. ఆ విషయం గవర్నర్‌కు తెలియంది కాదు.

governer 271020183

అదికాక ఏ అధికారంతో డీజీపీకి ఆయన ఫోన్ చేశారనేది టీడీపీ వర్గాల్లో వస్తున్న ప్రధానమైన విమర్శ. తెలంగాణలో ఎన్నో ఘోర ప్రమాదాలు, ఒక్క బస్సు ప్రమాదంలో 60 మంది మరణించిన.. ఆయన ఏ అధికారికి ఎందుకు ఫోన్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థ పేపర్ పవర్‌కు మాత్రమే పరిమితం. ఆయన రాజ్‌భవన్‌కు తప్ప మరో దానికి అధికారి కాదు. కనీసం ఒక బంట్రోతును కూడా బదిలీ చేసే అధికారం లేదు. కనీసం ఏ ప్రభుత్వ ఉద్యోగిని కూడా నేరుగా ఫోన్ చేసి ఆదేశించే అధికారం లేదు. అలా ఆదేశిస్తే ఆయన తన అధికార పరిధిని దాటి ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లఘించినట్లేనని టీడీపీ వాదన. ఇప్పుడు గవర్నర్ కచ్చితంగా అదే చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించి సమాచారమో మరేదో కావాలంటే నేరుగా సీఎంతో మాట్లాడాలి. కాని ఇక్కడ గవర్నర్ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read