‘తిత్లీ’ తుఫాన్‌తో తల్లడిల్లిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఇంత కనికరం లేకుండా వ్యవహరిస్తున్న ప్రధానిని గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. తిత్లీ తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తిత్లీ నష్టంపై ప్రధానితో ఫోన్లో మాట్లాడానని, నష్టం వివరాలు తెలియజేస్తూ ఆదుకోవాలని రెండుసార్లు లేఖ రాశానని, కేంద్రం నుంచి మాత్రం స్పందన రాలేదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రం ఇంత ఆపదలో ఉంటే పెద్దన్నలా ఆదుకోవాల్సిన కేంద్రం బాధ్యత లేకుండా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్రం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, తిత్లీ బాధితులను పరామర్శించడానికి మాత్రం సమయం కేటాయించలేదన్నారు.

cbn 26102018 2

హుద్‌హుద్ సమయంలో విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రూ. వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి, తీరా రూ. 650 కోట్లు మాత్రమే ఇచ్చి సరిపెట్టారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. హుద్‌హుద్ సమయంలో తాను స్వయంగా ఇచ్చిన మాటను కూడా ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకోలేకపోయారని, ఈసారైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని కేంద్ర బృందం సభ్యులతో ముఖ్యమంత్రి అన్నారు. గురువారం తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, నష్ట ప్రభావాన్ని పరిశీలించామని కేంద్రం బృందం ముఖ్యమంత్రితో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తుఫాన్ రక్షణ, సహాయక చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని, తుఫాను అనంతరం ప్రజలు కష్టాలు పడకుండా, ఇంత వేగంగా కోలుకునేలా చేయడాన్ని ప్రశంసించారు. తుఫాను హెచ్చరికలు రావడంతోనే ప్రజలను అప్రమత్తం చేశామని, ప్రాణనష్టం భారీగా జరగకుండా టెలీ కాన్ఫరెన్సుల ద్వారా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని ముఖ్యమంత్రి వివరించారు.

cbn 26102018 3

కేంద్ర సాయం కోసం చూస్తూ కూర్చోలేదని, దసరా పండుగ కూడా జరుపుకోకుండా తామంతా కలిసి శ్రమించామని అన్నారు. తుఫాను కారణంగా లక్షలాది చెట్లు కూలిపోయాయని, వందల సంఖ్యలో మూగజీవాలు మరణించాయని, పెద్దసంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారి-విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. మొత్తం రూ. 3,673.10 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతమని, తలసరి ఆదాయంలోనూ అట్టడుగున ఉందని, కిడ్నీ వ్యాధి బాధితులు ఎక్కువని, దీనికి తోడు ‘తిత్లీ’ తుఫాన్ మరింత కోలుకోకుండా చేసిందన్నారు. తుఫాన్ అనంతరం సహాయక చర్యలు చేపట్టి 12 రోజుల్లోనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయగలిగామన్న ముఖ్యమంత్రి- గతంలో ఎన్నడూ లేనట్టుగా తుఫాను వచ్చిన 20 రోజుల్లోనే బాధితులకు పరిహారం అందించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించామనే సంతృప్తి తమకు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తున్నా కేంద్రం ‘తిత్లీ’ బాధితులను పూర్తిగా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. మానవతా దృక్పదంతో కేంద్రం తక్షణం స్పందించి సమయానికి సాయం అందించాలని కేంద్ర బృందం సభ్యులను ముఖ్యమంత్రి కోరారు.

ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన కోడి కత్తి గుచ్చుడు ఘటనపై విశాఖ సీపీ మహేష్‌చంద్ర లడ్డా పురోగతిని వివరించారు. ఈ కేసులో ఆయన కీలక ఆధారాలు వెల్లడించారు. జగన్‌ పై కోడి కత్తి గుచ్చుడు చేసిన నిందితుడని కోర్టులో ప్రవేశపట్టామని తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… నిందితుడు ఎయిర్ పోర్టులో ఇతర సామాగ్రితో కలిపి కత్తిని రెస్టారెంట్ కి తీసుకొచ్చాడని తెలిపారు. నిందితుడి వద్ద దొరికిన ఉత్తరంలో 9వ పేజీని ఆయన బాబాయి కూతురు జే.విజయలక్ష్మీ (16)తో ఇటీవల ఊరికి వెళ్లినప్పుడు రాయించాడని వివరించారు. మరో పేజీని రెస్టారేంట్ లో పనిచేసే తోటి ఉద్యోగి రేవతీపతి(19)తో రెండు రోజుల క్రితం రాయించాడని తెలిపారు.

ladha 26102018 2

రేవతిపతిది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోలి గ్రామమని తెలిపారు. అతడు 10వ తరగతి చదివి అటెండర్ గా రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు. రెండు రోజుల క్రితమే అతడితోనే జిరాక్స్ తెప్పించాడన్నారు. నాలుగు నెలలుగానే పని… నిందితుడి వద్ద ఉన్న కత్తిని అప్పుడప్పుడు రెస్టారెంట్ లో పండ్లు కోయడానికి ఉపయోగించేవాడని తెలిపారు. నిందితుడి వద్ద మరో చిన్న కత్తి కూడా దొరికిందని వివరించారు. రెస్టారెంట్ యాజమాని హర్షవర్ధన్ స్టేట్ మెంట్ తీసుకున్నామని, నిందితుడు శ్రీనివాసరావును రిమాండ్ కి పంపించనున్నట్లు తెలిపారు.

ladha 26102018 3

దాడికి వాడిన కత్తి కోడిపందేలుకు వాడిందని, ఆ కత్తి పొడవు 8సెం.మీలు ఉండగా.. ఆ కత్తిలో వాడిగా ఉన్న భాగం మూడు సెం.మీలేనని వివరించారు. నిందితుడి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామని, శ్రీనివాస్‌ ఏడాది కాలంలో తొమ్మిది సెల్‌ఫోన్లు మార్చి వాటిలో ఒకే సిమ్‌ను వాడాడని, అలా ఎందుకు చేశాడనేది విచారిస్తున్నట్టు సీపీ వెల్లడించారు. నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామంలోనూ విచారణ జరుపుతున్నామని, స్వగ్రామంలో నిందితుడు శ్రీనివాసరావుపై ఓ గొడవ కేసు ఉన్నట్టు తేలిందని, ఘటనపై విచారణ కొనసాగుతోందని లడ్డా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం వేడెక్కింది.. ప్రశాంతంగా సాగిపోతున్న రాష్ట్రంలో, ఒకదాని తరువాత మరొక సంఘటనలు చేస్తూ, లేని పోని ఉద్రిక్తతలు రేపుతున్నారు. మొన్నటిదాకా ఐటి దాడులతో హంగామా చేసి, నిన్న జగన్ పై కోడి కత్తితో గుచ్చి, అదేదో పెద్ద పోటు పొడిచినట్టు హంగామా చేస్తున్నారు. ఈ పరిస్థుతుల్లో, గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. ఏపి పై రిపోర్ట్ ఇవ్వటానికి ప్రధాని మోడీ దగరకు వెళ్లారు. ఆయనతో ఉదయం భేటీ అయ్యారు. తెలంగాణాలో ఎన్నికలు, ఏపిలో జరుగుతున్న హంగామా పై, ఆయన నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జగన్ పై కోడి కత్తితో గుచ్చి దాడి చెయ్యటం, తరువాత జరిగిన పరిణామాలు, ప్రజలు ఏమనుకుంటున్నారు లాంటి, చంద్రబాబు ఎలా రియాక్ట్ అయ్యారు లాంటి విషయాలు చెప్పినట్టు తెలుస్తుంది.

lagadapati 26102018 2

నిన్న చంద్రబాబు గవర్నర్ పై మొదటిసారిగా బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై కూడా, గవర్నర్, మోడీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. నిన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీకి ఫోన్ చేయడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నేరుగా డీజీపీకి ఎలా ఫోన్ చేస్తారని ప్రశ్నించారు. ఏమైనా వివరాలు కావాల్సి ఉంటే నేరుగా తనకు చేయాలి, కానీ డీజీపీకి ఎలా చేస్తారని చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలిసారి తాను గవర్నర్‌పై స్పందిస్తున్నానని చెప్పారు. అసలు గవర్నర్‌ పాత్ర ఏమిటి? పరుధులు ఏంటి ? ఏమి చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పాలనలో వేలుపెట్టే అధికారం గవర్నర్‌కు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో గవర్నర్‌ వ్యవస్థపైనే పోరాడామని గుర్తు చేశారు. ఎవరి తరపున ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసని, ఢిల్లీ స్క్రిప్టు ఇక్కడ అమలు చేయాలనుకుంటే కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

lagadapati 26102018 3

ఇదిలా ఉంటే.. గవర్నర్‌తో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోందోనన్న అంశంపై ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. అసలు లగడపాటి రాజగోపాల్ ఎందుకు భేటీ అయ్యారో అని అందరూ చర్చించుకుంటున్నారు. తెలంగాణా ఎన్నికల విషయంలో లగడపాటి సర్వే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఆవ విషయం పై, గవర్నర్ పిలిపించారా అనే చర్చ జరుగుతుంది. లగడపాటి, చంద్రబాబుకి సన్నిహితంగా ఉంటున్నారు. ఒకవేళ అలా ఉండద్దు అనే సంకేతాలు ఇవ్వటానికి, గవర్నర్ పిలిపించారా అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి, గంట గంటకు ట్విస్ట్ లు తిరుగుతూ, ఏపి రాజకీయం హాట్ హాట్ గా మారిపోతుంది. చివరకు ప్రజలు, ఎలాంటి క్లైమాక్స్ రాస్తారో చూడాలి. ఇక్కడ ఎన్ని పాత్రలు ఉన్నా, క్లైమాక్స్ మాత్రం, ప్రజలే డిసైడ్ చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఢిల్లీ చేస్తున్న కుట్రల్ని, ఢిల్లీలోనే తేల్చుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన రేపు అందుబాటులో ఉన్న జాతీయ నేతలను ఆయన కలవనున్నట్టు సమాచారం. గవర్నర్ నరసింహన్ తీరును నిరసిస్తూ జాతీయ స్థాయిలో చంద్రబాబు గళమెత్తనున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి, ఆపరేషన్‌ గరుడ తదితర అంశాలను సీఎం దేశ ప్రజల ముందు ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపడం, తిత్లీ తుఫానుపై స్పందించకపోవడం, విభజన చట్టం పెండింగ్ అంశాలపై దిల్లీ వేదిక నుంచి ఆయన కేంద్రాన్ని నిలదీయనున్నారు.

cbn delhi 26102018 2

మరోవైపు, గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలే టార్గెట్‌గా ఐటీ దాడులు, మరోవైపు జగన్‌పై దాడి ఘటనను గురించి చంద్రబాబు జాతీయ నేతలకు వివరించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటన పై ఆసక్తి నెలకొంది. ఏదేమైనా ఏపీలో రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రోజు కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ, ఢిల్లీ పై ధ్వజమెత్తారు. నేరాలు చేసే వ్యక్తులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రమాదమని చంద్రబాబునాయుడు అన్నారు.

cbn delhi 26102018 3

ఏదైనా నేరాలు జరిగినప్పుడు పోలీసులు ధైర్యంగా వ్యవహరించాలని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన తిత్లీ తుపానుపై స్పందించని కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత లాంటి వారు జగన్‌పై చిన్న దాడి జరిగిన వెంటనే స్పందించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. గవర్నర్‌ వ్యవహార శైలి కూడా సరిగా లేదని.. జగన్‌పై దాడి విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నేరుగా డీజీపీనే నివేదిక అడగడం ఏంటని ప్రశ్నించారు. గవర్నర్‌ నేరుగా అధికారులనే సంప్రదిస్తే ఇక తామెందుకుని అన్నారు. ప్రత్యేక హోదా గురించి అడిగితే ఇన్ని దాడులు చేస్తారా? అంటూ కేంద్రాన్ని నిలదీశారు. ఐటీ దాడులతో వ్యాపారులు బెంబేలెత్తుతున్నారని.. అభివృద్ధిని అడ్డుకునే పనులు సమాజానికి మంచివి కావన్నారు.

Advertisements

Latest Articles

Most Read