సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తూ, లక్ష్మీనారాయణ అందరికీ సుపరిచతమే. తరువాత ఆ పదవికి రాజీనామా చేసి, ప్రజా సమస్యల పై అధ్యయనం అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలు తిరిగి, సమస్యల పై అధ్యయనం చేసారు. కొన్ని రోజుల క్రితమే అన్ని జిల్లాలు తిరిగి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను రాజకీయ ఆరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తన ఆలోచనలకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ అయినా, వ్యక్తులైనా కలిసి వస్తే వారితో పనిచేయడానికి సిద్ధమన్నారు. అలాకాని పక్షంలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని తన అలోచనలను కార్యాచరణలో పెట్టడానికి కృషి చేస్తానన్నారు.

jd 23102018 2

అయితే ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను ఏ పార్టీలో చేరాలనే దాని పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని లక్ష్మీనారాయణ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీ స్థాపించాలా? లేక వేరే పార్టీలో చేరాలా? అనే విషయంపై ఆలోచిస్తున్నానని తెలిపారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందన్నారు. ఇప్పటికయితే తనను ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఆహ్వానించాయని లక్ష్మీనారాయణ తనకు వచ్చిన ఆఫర్లను వెల్లడించారు. ఆ ఆపర్ల పై తటస్థంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి తాను ఏపీకే పరిమితం అవుతానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నందున తగిన వ్యూహంతో ముందుకెళ్తానని చెప్పారు.

jd 23102018 3

అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే తన ఆలోచనా విధానమన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో ధనం, కులం కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. ఎన్నికలంటేనే ధన వ్యయంతో కూడుకున్న ఒక ప్రక్రియగా మారిందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తన ప్రచారం కోసం నిర్ధిష్టమైన మొత్తాన్ని వ్యయం చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతిస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మొత్తానికన్నా తక్కువ వ్యయం చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది తన వైఖరి అన్నారు. ఎన్నికల సందర్భంగా 50 శాతం మంది ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే మంచి పరిపాలకులను ఎంచుకోవచ్చని అది ప్రజా సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అమలు కావాలన్నది తన ఆలోచన అన్నారు.

గత కొంత కాలంగా రాఫెల్ స్కాం బయట పెట్టి, మోడీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి, దాని పై కనీసం మోడీ స్పందించే ధైర్యం కూడా చెయ్యకుండా చేసిన రాహుల్ గాంధీ, ఇప్పుడు మరో కుంభకోణంతో వచ్చారు. ఈ సారి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వంతు. మన ఏపి ప్రజలను ఉద్దేశిస్తూ, మీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి, రక్షణ బడ్జెట్ కావాలా అంటూ వెటకారం చేసిన ఈయన, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో ? ఈ స్కాంకు సంబంధించి, వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్‌ చోక్సీ నుంచి జైట్లీ కుమార్తె రూ.24 లక్షలు తీసుకుందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ విషయాన్ని బయటపెట్టేందుకు మీడియా భయపడుతోందన్నారు.

jaitley 23102018 2

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోమవారం జరిగిన రైతుల ర్యాలీలో రాహుల్‌ మాట్లాడుతూ.. న్యాయవాదులైన జైట్లీ కుమార్తె సోనాలీ జైట్లీ, అల్లుడు జయేశ్‌ బక్షి... ఛోక్సీ మోసపూరిత సంస్థ గీతాంజలి జెమ్స్‌ లిమిటెడ్‌ కోసం పని చేశారు. 2017 డిసెంబరులో ఆ సంస్థ వారికి రూ.24 లక్షలు చెల్లించింది. ఛోక్సీ ఫైల్‌ను జైట్లీ తొక్కిపెట్టడంతోనే అతను పారిపోయాడని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. రాయ్‌పూర్‌ సభలోనే కాకుండా రాహుల్‌ ట్విటర్‌లో కూడా జైట్లీపై ధ్వజమెత్తారు. ఛోక్సీ పేరోల్‌లో సోనాలీ ఉన్నారని, ఐసీఐసీఐ ఖాతా నంబరు 12170500316 నుంచి ఆమెకు డబ్బు అందిందని ఆరోపించారు.

jaitley 23102018 3

రాహుల్ మాట్లాడుతూ, ‘దేశం నుంచి రూ.35,000 కోట్ల నిధులతో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారులు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీల గురించి మీరు వినే ఉంటారు. చోక్సీ రూ.24 లక్షలను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కుమార్తె బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేశారు. కానీ ప్రముఖ మీడియా సంస్థలేవీ ఈ విషయాన్ని ప్రసారం చేయడం లేదు. నిజాన్ని బయటపెట్టాల్సిన మీడియా సంస్థలు బెదిరింపులకు, అణచివేతకు గురవుతున్నాయి’ అని తెలిపారు. రఫేల్‌ ఫైటర్‌ జెట్ల కాంట్రాక్టు నుంచి ప్రభుత్వ రంగ హాల్‌ సంస్థను తప్పించిన ప్రధాని మోదీ.. కనీసం కాగితపు విమానాన్ని తయారుచేసిన అనుభవం కూడా లేని రిలయన్స్‌ సంస్థకు కాంట్రాక్టును అప్పగించారని ఎద్దేవా చేశారు.

గత ఎనిమిది నెలల నుంచి, ఢిల్లీ స్థాయిలో, చంద్రబాబు పై బీజేపీ పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. దీనికి ఆపరేషన్ గరుడ అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఏపికి రావలసిన విభజన హామీల పై, గట్టిగా పోరాడుతున్నందుకు, చంద్రబాబు పై బీజేపీ నేతలు కక్ష కట్టారు. ఇక్కడ జగన్, పవన్ తో గేమ్ ఆడిస్తూ, కులాల కుంపట్లు రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క, సిబిఐ, ఈడీ, ఐటి దాడులతో భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇవన్నీ రూల్స్ ప్రకారం చేస్తే పరవాలేదు కాని, కుట్రతో చేస్తున్నారు. ఏ ఆధారం దొరక్కపోవటంతో, దొంగ వాంగ్మూలం సృష్టించి, తెలుగుదేశం పార్టీని ఇరికించే, అతి భారీ కుట్ర బయట పడింది. మోడీ-షా, వ్యవస్తలని ఎలా నాశనం చేసారో చెప్పే సంఘటన ఇది. వీళ్ళ పాచిక పారి ఉంటే, ఈ పాటికి తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు, దేశ ప్రజల ముందు దోషిగా నిలబడేవారు.

target cm 23102018 2

అదృష్టవసాత్టు, వాళ్ళలో వాళ్ళో కొట్టుకుని, సిబిఐ వాళ్ళే, ఈ కుట్ర బయట పెట్టారు. ఒకవేళ ఈ కుట్ర బయటకు రాకుండా ఉన్నట్టు అయితే, బీజేపీ ఆపరేషన్ గరుడ సూపర్ హిట్ అయ్యేది. చంద్రబాబుని, జగన్ ని ఒకే గాటిన కట్టాలి అనే వారి ప్లాన్ సక్సెస్ అయ్యేది. పవన్ కళ్యాణ్ రెచ్చిపోయే వాడు. ఆంధ్ర రాష్ట్రం బీజేపీ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయేది. తమిళనాడు లాగా, మన రాష్ట్రాన్ని నాశనం చేసే వారు. ఇంత కుట్ర పన్నిన బీజేపీ నాయకుల గుట్టు, సిబిఐ గొడవల ద్వారా బయట పడింది. అసలు జరిగిన విషయం ఇది... కేంద్రంపై యుద్ధానికి దిగిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ను ఇరికించేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా మధ్య మొదలైన కుమ్ములాటల్లో ఈ సంగతి బయటపడింది. అలోక్‌ వర్మకు ‘ముడుపుల మకిలి’ పట్టించి... సీఎం రమేశ్‌ ద్వారానే ఈ లావాదేవీలు జరిగాయనేందుకు తగిన ‘ఆధారాలు’ సృష్టించినట్లు వెల్లడైంది. ఇప్పుడు ఈ కేసులో సీబీఐ తన సొంత డీఎస్పీని అరెస్టు చేయడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

target cm 23102018 3

వేల కోట్లను మనీలాండరింగ్‌ చేసే మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీ కేసు నుంచి బయట పడేందుకు ఏపీకి చెందిన సానా సతీశ్‌ బాబు ఏకంగా సీబీఐ డైరెక్టర్‌కే ముడుపులు చెల్లించారన్నట్లుగా రాకేశ్‌ అస్థానా బృందం ఆధారాలు సృష్టించింది. ‘‘నా కేసు గురించి ఈ ఏడాది జూన్‌లో నా పాత మిత్రుడు సీఎం రమేశ్‌తో చర్చించాను. దీనిపై సీబీఐ డైరెక్టర్‌తో మాట్లాడతానని ఆయన భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ సీఎం రమేశ్‌ను కలిసినప్పుడు... సీబీఐ డైరెక్టర్‌ను స్వయంగా కలిశానని చెప్పారు. ఇక సీబీఐ నన్ను పిలవబోదని కూడా తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే జూన్‌ నుంచి ఇప్పటిదాకా నాకు సీబీఐ నుంచి సమన్లు రాలేదు. దీంతో నాపై కేసు క్లోజ్‌ అయినట్లుగా భావించాను’’ అని సానా సతీశ్‌ గతనెల 26న వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలిపింది. సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్‌ ఈ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దీనిని ‘అస్త్రం’గా వాడుకుని... అటు సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను, ఇటు సీఎం రమేశ్‌ను అడ్డంగా ఇరికించడమే అస్థానా బృందం అసలు ఉద్దేశం కావొచ్చు! ఈ విషయంలో తన పేరును లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో అలోక్‌ వర్మ అప్రమత్తమై రంగంలోకి దిగారు. వాంగ్మూలం ఇచ్చినట్లు చెబుతున్న గతనెల 26న సానా సతీశ్‌బాబు ఢిల్లీలోనే లేరని నిర్ధారించారు. ఆయన సంతకాన్ని డీఎస్పీ దేవేంద్ర కుమార్‌ స్వయంగా ఫోర్జరీ చేసినట్లు తేలింది. అస్థానా ప్రోద్బలంతోనే ఇదంతా జరిగినట్లు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. ఇక... అసలు సానా సతీశ్‌ను ఇప్పటిదాకా కలవనే లేదని సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు. ఇదంతా చూస్తుంటే ఢిల్లీ స్థాయిలో ఏపీపై కుట్రలకు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని అర్థమవుతోంది. మన అదృష్టం బాగుండి, ఇది బయట పడింది కాని, లేకపోతే జరిగే పరిణామాలు ఊహించుకుంటేనే భయం వేస్తుంది.

పోలవరం ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో ఉండగా, అది అందుకున్న నవయుగ కంపెనీ, తరువాత పనులు ఎలా పరుగులు పెట్టించిందో అందరికీ తెలుసు. పోలవరం పనుల్లోనే కాదు, మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉండగా కూడా, నవయుగ ముందుకొచ్చింది. శ్రీకాకుళంలో వచ్చిన, తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు నవయుగ కంపెనీ ఛైర్మన్‌ కె.విశ్వేశ్వరరావు రూ.కోటి విరాళాన్ని అందించారు. పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు సోమవారం పోలవరం వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విరాళానికి సంబంధించిన చెక్కును ఆయన అందజేశారు. తీవ్ర తుఫాను వల్ల అల్లాడిన శ్రీకాకుళం ప్రజలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు, తమ వంతుగా ఈ సహాయం చేస్తున్నట్టు చెప్పారు.

navayuga 23102018 2

మరో పక్క, ప్రాజెక్టును సోమవారం 28వసారి ఆయన సందర్శించారు. మధ్యాహ్నం రెండింటికి హెలికాప్టర్‌లో ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన హిల్‌వ్యూ కొండపై నుంచి పనులను పరిశీలించారు. అనంతరం స్పిల్‌వేలో 26వ బ్లాకు పనులను చూశారు. ఆ తరువాత త్వరలో ప్రారంభించబోయే ఎగువ కాపర్‌డ్యాం ప్రాంతం వద్దకు వెళ్లారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. పోలవరం నిర్మాణాన్ని సవాలుగా తీసుకున్నామని, ఏదిఏమైనా వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలనేదే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఏడు నెలలే కీలకమని.. ఎగువ, దిగువ కాపర్‌డ్యామ్‌లు పూర్తి చేస్తే ప్రాజెక్టునుంచి నీళ్లివ్వగలమని తెలిపారు.

navayuga 23102018 3

‘డిసెంబరులో గేట్ల పనులను ప్రారంభిస్తాం. మే 15, 20 తేదీలనాటికి పూర్తి చేస్తాం. స్పిల్‌ఛానల్‌, స్పిల్‌వే పూర్తి చేసి కుడి, ఎడమకాల్వలకు నీళ్లందిస్తాం. ఇది పూర్తి చేయగలిగితే అటు విశాఖ, ఇటు కృష్ణా జిల్లాలు సస్యశ్యామలం కావడంతోపాటు అన్ని జిల్లాలకు లాభం చేకూరుతుంది. వంశధార నుంచి పెన్నా వరకు అన్ని నదులనూ అనుసంధానించి నీరు ఎక్కువ, తక్కువలను సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది’ అని సీఎం వివరించారు. ‘ఇప్పటివరకు ప్రాజెక్టుకు రూ.15,013 కోట్లు ఖర్చయ్యింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.9,877 కోట్లు వెచ్చించగా, కేంద్రం నుంచి రూ.6,720 కోట్లు వచ్చాయి. ఇంకా రూ.3150 కోట్లు రావాల్సి ఉంది. వైకుంఠపురం వద్ద పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీకి శ్రీకారం చుట్టాం. మొదటిదశలో నాగార్జునసాగర్‌ కుడి ప్రధానకాల్వకు నీరిస్తాం. రెండో దశలో సోమశిలకు, మూడో దశలో బొల్లపల్లికి నీరిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 61 ప్రాజెక్టులు నిర్మిస్తుండగా 18 ఇప్పటికే పూర్తి చేశాం. మరో ఏడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 20 వివిధ దశల్లో ఉన్నాయి. 16 టెండర్ల దశలో ఉన్నాయి. వీటిని వేగవంతం చేస్తాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read