ఉన్నట్టు ఉండి ఉత్తర భారత బీజేపీ నేతలు, సడన్ గా నిన్న బెజవాడలో దిగారు. అగ్రిగోల్ద్ బాధితుల పై ప్రేమ వలకబోసారు. ముఖ్యంగా రాం మాధవ్, జీవీఎల్ వచ్చి హడావిడి చేసారు. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడే మీకు గుర్తొచ్చిందా అంటే సమాధానం లేదు. కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా ఉండగా జరిగిన స్కాం గురించి, ఆయనే నీతులు చెప్తున్నాడు. ఆర్ధిక నేరగాళ్ళు దేశం విడిచి పారిపోతుంటే, మోడీ చోద్యం చూస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ హయాంలో మోసాలు చేసిన అగ్రిగోల్ద్ మోసగాళ్ళు, ఢిల్లీలో దాక్కుంటే, వారిని అరెస్ట్ చేపించిన చరిత్ర చంద్రబాబుది. అంతే కాదు కోర్ట్ ద్వారా వేలం వేస్తుంటే, ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి అడ్డు పడుతున్నారు. వాళ్ళు బీజేపీ మనుషులు అని అందరికీ తెలిసిందే. మరి వాళ్ళను ఎందుకు ప్రశ్నించరు ?

bjp 23102018 2

ఇది సరే, మరి సహారా కుంబకోణం గురించి బీజేపీ ఎందుకు మాట్లాడడు ? బ్యాంకుల స్కాం గురించి ఎందుకు మాట్లాడదు ? ఇక్కడ చంద్రబాబు ఆగ్రిగోల్ద్ బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటే, వారికి 5 లక్షలు ఇచ్చారు. కోర్ట్ ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు, అగ్రిగోల్డ్‌ డిపాజిట్లు 2004 వరకు రూ.150కోట్లు ఉండగా 2014లో రూ.6,780 కోట్లకు చేరుకున్నాయి. ఇంత భారీగా డిపాజిట్లు సేకరించడంలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, సహకార శాఖ మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పాత్ర ఉందనే విషయం అందరికీ తెలుసు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌పై సీబీసీఐడీ విచారణ చేయించి తొమ్మిది నెలల్లోనే ఆయా సంస్థల ఆస్తులను అటాచ్‌ చేయించింది.

bjp 23102018 3

మరి బీజేపీ ఉన్నట్టు ఉండి ఎందుకు ఇంత హడావిడి చేసింది అంటే, నిన్న జరిగిన సిబిఐ హంగామా నుంచి దృష్తి మళ్లించేందుకే. సిబిఐ ద్వారా, తెలుగుదేశం పార్టీ పై పన్నిన భారీ కుట్ర బయట పడిన సంగతి తెలిసిందే. అందుకే ఆ విషయం పెద్దగా హైలైట్ అవ్వకుండా ప్రయత్నం చేసారు. మరో పక్క, మీడియా కూడా ఆగ్రిగోల్డ్ ఎపిసోడ్ కవర్ చేసారు కాని, సిబిఐ కుట్రలు పెద్దగా చూపించలేదు. అంటే, బీజేపీ వేసిన ప్లాన్ సక్సెస్ అయినట్టే. సియం రమేష్ ని ఇరికించటానికి సిబిఐ లో ఉన్నతాధికారి, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, దొంగ వాంగ్మూలం ఇప్పించి, రమేష్ పై నెట్టే ప్రయత్నం చేసారు. ఇది నిన్న బయట పడటంతో, ఆ ఉన్నతాధికారిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇంత కుట్ర పన్నిన బీజేపీ వేషాలు, ఇక్కడ చర్చకు రాకుండా, ఇంత ప్లాన్ చేసింది బీజేపీ.

చాకిరేవు సౌజన్యంతో... సరిగ్గా వుండాల్సిన చోటుకు, జగన్ పాదయాత్ర చేరింది. ఈ శుభ సమయంలో నాన్న వైఎస్సార్ & నాన్నగారి ఆత్మ కెవిపి కలిసి, ఇంటర్నేషనల్ డెకాయిటీ లతో కలిసి, మన ఆంధ్రా టైటానియంను, వారికి అమ్మేసిన విషయంలో, కీలక మలుపు చోటుచేసుకుంది. గబ.. గబా.. మన జాతీయ లేదా తెలుగు మీడియా ఛానళ్లు పెట్టి, ఇది సొల్లు వార్త అని, నన్ను తిట్టుకోకండి. వారిది ఉక్రెయిన్, అమెరికా, రష్యా స్థాయి డెకాయిటీ రేంజ్. మనం ఇప్పుడు, ఆ స్థాయి మీడియా, ఫాలో కావాలి. అంతరిక్ష వాహక లోహం ...అత్యంత ఖరీదైంది, దృఢమైనది, తేలికైనది, టైటానియం. చాలా చాలా డిమాండ్ వుంది. అరుదైనది అది. ప్రపంచంలో 30 శాతం, మన దేశంలోనే దొరుకుతుంది. అది కూడా ఉత్తరాంధ్రలో.. విశాఖ, విజయనగరం & శ్రీకాకుళం లో, ఎక్కువగా.

kvp 23102018 1

విజయమ్మను ఎంపీగా ఇక్కడ నిలబెట్టినా, ఏ2 విజయసాయిరెడ్డి అక్కడే తిరగాడుతున్నా, అదే కారణం. అమెరికాలో కొన్ని డొల్ల కంపెనీలు పెట్టి, వాటిద్వారా, పన్నులేని దేశాల ద్వారా, ముడుపులు తీసుకొని, ఉక్రెయిన్ డాన్ ఫిర్టాష్ కు దాసోహం చేశారని, అమెరికా ఎఫ్ బి ఐ దర్యాప్తు మొదలెట్టి, మన కెవిపి & వైఎస్ పేర్లు, చార్జ్ షీట్లో చేర్చింది. ఆ ఉక్రెయిన్ డాన్, ఆస్ట్రియాలో అరెస్ట్ అయ్యి, 4 ఏళ్ళు అయ్యింది. అమెరికా అప్పటి నుండి అడుగుతోంది, ఆ దేశాన్ని. ఎట్టకేలకు ఈ 24న, ఆ డాన్ ని, అమెరికాకు అప్పగిస్తారు. తరువాత మన కెవిపి గారికి, ఆహ్వానాలు పంపిస్తారు.

kvp 23102018 1

మేనేజ్ చెయ్యడానికి మోడీ గారి ఆఫీసులో, కాల్లు పట్టుకొన్నా పనికాదు. సచ్చే వరకు సాగతియ్యరు. చక చకా అయిపోతుంది. మన వైఎస్ గారి ప్రతిష్ట, అంతర్జాతీయ స్థాయిలో, గుర్తింపుకు నోచుకొంటుంది. మన వైకాపా అక్కడికి కూడా, వైఎస్ విగ్రహాలు ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆత్మ కెవిపి గారు, అమెరికా ప్రయాణం పెట్టుకొనే, మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తారు. ఆ డాన్ గారి అప్పగింతల వార్త వీడియో, క్రింద చూడండి. అందులో, మనదేశం పేరు కూడా, వినిపించేలా కృషిచేసిన పుణ్యాత్ములకు, వారికి దర్శకత్వం వహించిన, మన ఏ1 & ఏ2 ల రుణం, దేశం తీర్చుకొనే సమయం, ఆసన్నమయ్యింది. అంతర్జాతీయ ప్రత్యేక హోదా, ఆంధ్రాకు వచ్చేలా చేసిన, ఇంటర్నేషనల్ డెకాయిటీల పాలన రాజన్నరాజ్యం. ...

తెలంగాణా ఎన్నికల నోటిఫికేషన్ రాగానే, చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి తెలంగాణా తెలుగుదేశం నేతలతో సమావేశం అయ్యి ఒక విషయం చెప్పారు. ఇక్కడ విషయాల్లో మీరే నిర్ణయాలు తీసుకోండి, నేను పెద్దగా పట్టించుకోను, తెలంగాణా బాగు కోసం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, మీకు మద్దతు ఇస్తా అని చెప్పి వెళ్లారు. నిజానికి చంద్రబాబు ప్రచారానికి రాకపోతే, కేసీఆర్ ఎగితి గంతేయాలి. కాని, చంద్రబాబు ఏమి అనడులే, ఆయన స్వభావమే అంత అని అలుసుగా తీసుకుని, చంద్రబాబుని మళ్ళీ ఆంధ్రా ద్రోహిగా చూపించి, బూతు పురాణం మొదలు పెట్టాడు కేసీఆర్. చంద్రబాబుని ప్రతి మీటింగ్ లో టార్గెట్ చేస్తూ, తన పరిపాలన పై కాకుండా, కేవలం చంద్రబాబుని బూచిగా చూపి, ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ పసిగట్టిన చంద్రబాబు, ఇక ఏ మాత్రం ఉపేక్షించకూడదని డిసైడ్ అయ్యారు.

kcr 23102018 2

కేసిఆర్ కుయుక్తులు తిప్పి కొట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం, తానే స్వయంగా రంగంలోకి దిగనున్నారు. కేసిఆర్ చెప్తున్నా అబద్ధాలకు, బూతు పురాణాలకు సరైన సమాధానంగా, తెలంగాణా ప్రజల వద్దకే వచ్చి, వారికే చెప్పటానికి నిర్ణయం తీసుకున్నారు. నాలుగు నుంచి అయుదు పబ్లిక్ మీటింగ్ లలో పాల్గుని ప్రచారం చేస్తానని, తెలంగాణా టిడిపి నేతలకు చెప్పారు. కేసీఆర్‌ నన్ను దూషిస్తూ మాట్లాడేదాన్ని ప్రజలే హర్షించడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘‘గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్‌ అభివృద్ధికి నేనెంతో కష్టపడ్డాను. అనేక ఐటీ పరిశ్రమలు తేవడంతో సైబరాబాద్‌ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించి తొలుత ఇక్కడి నుంచి ఎమిరేట్స్‌కు తొలి విమానం నడిపేందుకు ఎంతో కష్టపడ్డాను. ప్రస్తుతం విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమానం నడిపేందుకు కష్టపడుతున్నాను"

kcr 23102018 3

ఇప్పుడు తెలంగాణలో తెదేపా ఉండొద్దు అన్నట్లుగా తెరాస పనిచేస్తోంది. తెదేపాకు వ్యతిరేకంగా తెరాస చేపడుతున్న చర్యలు, మాట్లాడుతున్న మాటలపై ప్రజలు ఆలోచిస్తున్నారు. కేంద్రంలో భాజపా పూర్తిగా విఫలమైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో మాట్లాడి దానికి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నాలకు తెలంగాణలో ఇప్పుడు ఏర్పాటు చేసిన మహాకూటమి నాంది. ఇలాగే లోక్‌సభ ఎన్నికల్లోనూ కలసికట్టుగా భాజపాపై పోరాడాలని యోచిస్తున్నాం. తెరాస ఓటమే లక్ష్యంగా తెదేపా శ్రేణులన్నీ పని చేయాలి. తెలంగాణలో ప్రచారానికి నేను సైతం వస్తాను’’ అని వాఖ్యానించారు. మొత్తానికి సైలెంట్ గా అమరావతి, పోలవరం అంటూ తన పని తాను చేసుకుపోతున్న చంద్రబాబుని కెలికి మరీ, కేసీఆర్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు కేసీఆర్ బూతులని, చంద్రబాబు వివరణని చూసి, తెలంగాణా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు.

చరిత్రలోనే తొలిసారిగా సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థాన కేసులో సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్‌ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. సతీష్‌బాబు సానా తన వాంగ్మూలంలో చెప్పినట్లుగా దేవేందర్‌కుమార్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని సీబీఐ పేర్కొంది. సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్ తప్పుడు స్టేట్‌మెంట్‌ను సృష్టించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పేరును సతీష్ సానా చెప్పకపోయినా డీఎస్పీ దేవేందర్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేశారని సీబీఐ గుర్తించింది. సతీష్ సానా ఢిల్లీలో ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని తేల్చారు. సీబీఐ ఆఫీసులో తొలిసారి సోదాలు నిర్వహించిన అధికారులు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. అరెస్ట్‌ చేసిన దేవేంద్ర కుమార్‌ దగ్గర ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దేవేంద్రకుమార్‌ అరెస్టుతో సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థాన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

modi 23102018

దీంతో సీబీఐలో లంచాల బాగోతం ప్రభుత్వాన్ని ఒక్క కుదుపు కుదిపింది. ప్రధాని మోదీ మెడకు చుట్టుకొని ఆయనను, బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థలో కీలక నేతలు పరస్పరం ఆరోపణలతో కీచులాడుకొని కేసులు పెట్టుకోవడంతో ప్రభుత్వ ప్రతిష్ట బజారున పడుతోందని గ్రహించిన మోదీ వెంటనే రంగంలోకి దిగారు. సోమవారం నాడు ఇద్దరు డైరెక్టర్లు- అలోక్‌ వర్మ, రాకేశ్‌ అస్థానాలను పిలిపించి మాట్లాడారు. ఈ వ్యవహారంలో గూఢచారి సంస్థ రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) ఉన్నతాధికారికి కూడా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో రా అధిపతి అనిల్‌ దస్మానాతోనూ ప్రధాని సోమవారం విడిగా మాట్లాడారు. అస్థానాను సస్పెండ్‌ చేయాల్సిందిగా అలోక్‌వర్మ వారం రోజుల కిందటే ప్రభుత్వానికి సిఫారసు పంపారు. అంటే అస్థానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన రోజే- అక్టోబరు 15నే ఈ సిఫారసుతో కూడిన నోట్‌ను పీఎంవోకు పంపారు. అయితే పీఎంఓ నుంచి దీనికి వెంటనే క్లియరెన్స్‌ రాలేదని తెలుస్తోంది.

modi 23102018

అస్థానాపై తదుపరి చర్యలకు ప్రధాని మోదీ విముఖంగా ఉన్నట్లు, దానికి అనుమతి నిరాకరించినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ మోదీ- అలోక్‌ వర్మ ఆరోపణలను కూడా పరిశీలించడానికి టైం తీసుకున్నట్లు పీఎంఓ వర్గాలు తెలిపాయి. అస్థానాను అదే పదవిలో కొనసాగనిస్తే రాజకీయంగా అది గుదిబండగా మారే ప్రమాదముందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. సస్పెండైనా చేయాలి, లేదా బదిలీ వేటైనా వేయాలి.. అన్నది పార్టీ ఆలోచనగా ఉన్నట్లు చెబతున్నారు. గుజరాత్‌ కేడర్‌ అధికారి అయిన రాకేశ్‌ అస్థానాను మోదీ ఏరికోరి సీబీఐకి తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు లంచాల బాగోతంలో ఇరుక్కోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

 

Advertisements

Latest Articles

Most Read