మొదటి మూడేళ్ళు ఒక వెలుగు వెలిగిన బీజేపీకి, సంవత్సర కారణంగా అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అమిత్ షా, మోడీలకు ఎదురు లేకుండా పోయింది అనుకున్న టైంలో అటు రాజకీయంగా, ఇటు ప్రజల్లోనూ డౌన్ ఫాల్ మొదలైంది. రోజు రోజుకీ దిగాజారిపోతున్న బీజేపీ, దీనికి కారణాలు వెతకటం ప్రారంభించింది. ఈ కారణాలు ప్రజల వైపు నుంచి ఆలోచించకుండా, జాతకం, వాస్తు వైపు నుంచి అలోచించి, సమస్య ఎందుకు వచ్చిందో కనుక్కుంది. ఇంతకీ సమస్య ఏంటో తెలిస్తే, మీరు అవాక్కవుతారు. కారణం ఏంటి అంటే, కొత్త బీజేపీ ఆఫీస్ వాస్తుగా బీజేపీ పెద్దలు తేల్చారు.

bjp 21102018 2

దేశ రాజధాని ఢిల్లీ.. దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ మార్గ్‌-6.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం.. అధునాతన హంగులు, సకల సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మేళవించిన ఐదు అంతస్తుల విలాసవంతమైన భవనం.. ఏడాదిన్నరలోనే నిర్మాణం పూర్తిచేసి సాక్షాత్తూ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రారంభించారు. కానీ అది బీజేపీకి అస్సలు అచ్చిరాలేదని పార్టీ నేతలు బాధపడుతున్నారు. ఆ భవనంలోకి మారాక.. యూపీలోని గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌, కైరానా లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం మూటకట్టుకుంది. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేక చతికిలబడింది.

bjp 21102018 3

నమ్మకమైన మిత్రపక్షం టీడీపీని కోల్పోయింది. జమ్మూకశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవలసి వచ్చింది.. మిత్రపక్షం శివసేన తెగదెంపులకు సిద్ధమైంది.. కొత్త కార్యాలయంలో అడుగుపెట్టాకే ఈ ఎదురుదెబ్బలన్నీ తగిలాయని పేరుచెప్పడానికి ఇష్టపడని ముగ్గురు బీజేపీ సీనియర్‌ నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ‘వార్‌రూం’ను కొత్త కార్యాలయంలో ఏర్పాటు చేయొద్దని పార్టీ నాయకత్వంపై ఒత్తిడి వస్తోంది. అగ్రనాయకత్వం కూడా ఇదే అభిప్రాయం ఉండడంతో మళ్లీ అశోకా రోడ్‌-11లోని పాత కార్యాలయానికి మకాం మార్చాలని భావిస్తోంది. 2014లో మోదీ సారథ్యంలో బీజేపీ బరిలోకి దిగినప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు చెందిన లోధీ ఎస్టేట్‌ బంగళాను వార్‌రూంగా ఉపయోగించారు. ఇది బీజేపీకి బాగా కలసివచ్చి.. సొంతగానే మెజారిటీ సాధించింది.

తిత్లీ తుపాను బాధితులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనలను సైతం సడలించి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఈ నెల 25లోగా నష్టం అంచనాలు పూర్తయిన వెంటనే పరిహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. పరిహారానికి సంబంధించి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపాల్సిందిగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలెక్టర్లు, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తుపాను సందర్భంగా మృతిచెందినవారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. నిర్వాసితులు పునరావాస శిబిరాల నుంచి ఇళ్లకు చేరుకున్న వెంటనే కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున, అరకిలో చక్కెర పంపిణీ చేస్తారు.

current 20102018 2

కాగా మత్స్యకారులు, వంశధార వరద బాధితులకు కుటుంబానికి 50కిలోల బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పింక్ రంగు కార్డు దారులతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ రేషన్ పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ పంటల్లో వరి పంట నష్టానికి సంబంధించి హెక్టార్‌కు రూ. 20వేలు చెల్లించనున్నారు. మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల నష్టానికి ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనలు వర్తిస్తాయి. ఉద్యానవన పంటల్లో అరటి, జీడి, మామిడి పంటలకు హెక్టార్‌కు రూ.30వేలు, కొబ్బరిచెట్టు పూర్తిస్థాయిలో నష్టపోతే చెట్టుకు రూ.15వందలు చెల్లిస్తారు. మామిడి, జీడి, అరటి పంటలు వేసుకునేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద పొలాల్లో పడిపోయిన చెట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఉచిత ప్రాతిపదికన తొలగిస్తారు. అలాగే తోటల్లో తిరిగి చెట్లను నాటేందుకు మూడేళ్ల కాలపరిమితితో సన్న, చిన్నకారు రైతులకు రూ.40వేలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది.

current 20102018 3

పడవలు కోల్పోయిన మత్స్యకారులకు లక్ష చొప్పున, మెకనైజ్డ్ బోట్లకు రూ 6లక్షలు, వలకు రూ 10వేలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యకారులకు 50 శాతం సబ్సిడీతో పడవలకు పరిహారం చెల్లిస్తారు. ధ్వంసమైన రొయ్యల చెరువులకు హెక్టార్‌కు రూ.30వేలు పరిహారం అందిస్తారు. తుపానులో మృతిచెందిన ఎడ్లకు రూ.30వేల చొప్పున, మేకలకు రూ.3వేలు, పశువుల పాకకు రూ.10వేలు, నూతన నిర్మాణాలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్, గోకులం పథకం కింద రెండు పశువులకు రూ లక్ష, నాలుగింటికి లక్షన్నర, ఆరింటికి లక్షా 80వేలు మంజూరు చేస్తారు. పౌల్ట్రీ సెక్టార్‌లో పూర్తిస్థాయిలో దెబ్బతిన్న కోళ్లఫారాలకు రూ.10వేలు, ఫారం కోళ్లకు రూ.150, బ్రాయిలర్ కోళ్లు మృతిచెందితే రూ.75 చొప్పున పరిహారం ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.10వేల పరిహారంతో పాటు ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద రూ.2.5 లక్షలతో ఇళ్లను నిర్మిస్తారు. షాపులు కోల్పోయిన చిరువ్యాపారులకు రూ.10వేల చొప్పున మంజూరు చేస్తారు. ఇదిలా ఉండగా తుపానుకు దెబ్బతిన్న పరిశ్రమలు, రైస్‌మిల్లులకు సంబంధించి నష్టపరిహారం మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మన రాష్ట్రంలో విశాఖ నగరానికి హూద్ హూద్ తుఫాను వచ్చి విధ్వంసం చేస్తే, ప్రధాని మోడీ వచ్చి, తక్షణ సాయం కింద వెయ్య కోట్లు ప్రకటించారు. తక్షణ సాయమే ఇంత ఇచ్చారంటే, ఇక పూర్తి స్థాయి సాయం, దీనికి పది రెట్లు ఉంటుందని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే, ఇస్తానన్న వెయ్య కోట్లు కూడా ఇవ్వకుండా, 600 కోట్లు ఇచ్చి పండగ చేసుకోమన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం తుఫానుకైతే పైసా కూడా ఇవ్వకుండా, కనీసం ఒక సానుభూతి ప్రకటన కూడా చెయ్యలేదు. మన బాదలు ఇలా ఉంటే, ఇటీవల వరదలు వచ్చి నాసనమైన కేరళ రాష్ట్రం కూడా, మోడీ మాయ మాటలకు ఇబ్బంది పడుతుంది. స్వయంగా ఆ రాష్ట్ర సియం, మోడీ పై విమర్శలు గుప్పించారు. చేస్తానన్న సాయం చెయ్యకుండా, వేరే వాళ్ళు చెయ్యనివ్వకుండా, మోడీ అడ్డుపడుతున్నారని విమర్శలు గుప్పించారు.

kerala 20102018 2

తమ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. తమ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆ రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టేందుకు ప్రవాస భారతీయుల నుంచి విరాళాలు సేకరించే నిమిత్తం ఆ రాష్ట్ర మంత్రులు 17 దేశాల్లో పర్యటించాలని నిర్ణయించుకోగా వారి పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. అంతకు ముందు యూఏఈ అందిస్తామన్న సాయాన్ని కూడా వద్దని చెప్పింది. ఈ విషయాలను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రస్తావిస్తూ మోదీని పినరయి విజయన్‌ విమర్శించారు.

kerala 20102018 3

‘నేను మోదీని కలిసిన సమయంలో.. మా రాష్ట్ర మంత్రులు విదేశాలకు వెళ్లడానికి ఆయన అంగీకరించారు. కానీ, చివరి నిమిషంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అందుకు అనుమతిని నిరాకరించింది. అన్ని విషయాల్లోనూ సాయం చేస్తామని మోదీ మాట ఇచ్చినప్పటికీ మా మంత్రులు విదేశాలకు వెళ్లడానికి ఎందుకు అనుమతి ఇవ్వట్లేరో నాకు అర్థం కావట్లేదు. మాకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోవట్లేదు. యూఏఈతో పాటు చాలా దేశాలు పెద్ద ఎత్తున సాయం చేస్తామని ముందుకు వచ్చాయి. కానీ, వారి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము విఫలం కావాలని అనుకోవట్లేదు. మేము మా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సి ఉంది. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. మళయాలీ ప్రజలే మా బలం. వారిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కేరళను బాగు చేసుకోవడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలోని భుజ్‌లో భారీ‌ భూకంపం వచ్చిందని, దీంతో ఆయన విదేశాలకు వెళ్లి గుజరాత్‌ కమ్యూనిటీ సాయాన్ని కోరారని, ఇప్పుడు తాము అదే పని చేయాలనుకుంటే కేరళపై వివక్ష చూపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధిలో దూసుకుపోతోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ‘మిషన్‌ అంత్యోదయ’ ద్వారా దేశవ్యాప్తంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పౌరసేవలకు సంబంధించి నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసిం ది. సర్వేలో ఏపీలోని 118గ్రామాలు మొదటి 10ర్యాంకుల్లో ఉండటం విశేషం. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి, సాగునీటి వనరులు, ఆరోగ్యం, పౌష్టికాహారం, మహిళా సాధికారత తదితరాలను పరిగణనలోకి తీసుకుని సుమారు 1.6లక్షల పంచాయతీలను ఎంపిక చేసి విశ్లేషణాత్మకంగా సర్వే నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ఒకే ర్యాంక్‌ 2అంతకుమించి గ్రామ పంచాయతీలకు లభించింది. మొదటి 10 ర్యాంకు ల్లో దేశవ్యాప్తంగా 210 గ్రామాలు స్థానం పొందగా, వాటిలో ఏపీకి చెందిన గ్రామాలే 118ఉన్నాయి.

apfirst 21102018 2

ఇవన్నీ అంత్యోదయ పథకం అమలవుతున్న గ్రామాలు. 2017 అక్టోబరులో 50వేల గ్రామ పంచాయతీల్లో ప్రాథమిక సర్వేచేపట్టారు. అదే క్రమంలో ఈ ఏడాది నవంబరులోగా 2.5లక్షల గ్రామాల్లో ఈ కసరత్తు పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధిశాఖ సంకల్పించింది. ఏపీలోని పలు గ్రామాలు బహుముఖాభివృద్ధిలో ఉన్నాయని సర్వే ద్వారా స్పష్టమవుతోంది. సీఎం చంద్రబాబు ప్రత్యేక పర్యవేక్షణతో గ్రామాలు మౌలికంగా అభివృద్ధి సాధిస్తున్నాయనడానికి ఇదే తార్కాణం. పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అందుతున్న మౌలిక సౌకర్యాలు వంటి అంశాలపై కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ విశ్లేషణాత్మక సర్వే కొనసాగిస్తోంది.

apfirst 21102018 3

కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రజలకు అందుతున్న వౌలిక సదుపాయాలు తదితర అంశాలపై విశే్లషణాత్మక సర్వే కొనసాగిస్తోంది. మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా దేశవ్యాప్తంగా 58శాతం గ్రామాలు ఉన్నట్లు గుర్తించింది. 21 శాతం గ్రామాలు సామాజిక వ్యర్థ నిర్వహణ పద్దతులను కచ్చితంగా అమలు చేస్తున్నాయని, 75 శాతం మంది గృహ వినియోగదారులు ఎల్పీజీ, బయోగ్యాస్ వంటి కాలుష్యరహిత ఇంధన వనరులను వినియోగిస్తున్నారని సర్వే వివరించింది. రాష్ట్రంలో 92 మార్కులతో చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీరామాపురం గ్రామ పంచాయతీ మొదటి పది స్థానాలు సాధించిన 97 గ్రామాల్లో రెండో స్థానం దక్కించుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన పది గ్రామాలు, విశాఖపట్నం జిల్లాకు చెందిన మరో పది గ్రామాలు మొదటి పది ర్యాంక్‌లలో ప్రత్యేకతను చాటుకున్నాయి.

Advertisements

Latest Articles

Most Read