జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టింది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకా? ప్రజలకు మంచి చేయడానికా? అని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో ఈ నెల 9న జరిగిన జనసేన ప్రజా పోరాట యాత్రలో అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి మొళ్ల రాజమనోహర్‌నానీ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదవశాత్తు మూత్రపిండం కోల్పోయాడు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని కారెం శివాజీ ఆదివారం ఉదయం పరామర్శించారు. ప్రమాద వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

dalit 22102018 2

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పోరాడుతున్న పవన్‌కు కిడ్నీ కోల్పోయిన ఎస్సీ విద్యార్థిని పరామర్శించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కేవలం రూ.50 వేలిచ్చి చేతులు దులుపుకున్న జనసేన నాయకుల దుర్మార్గాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో బస చేసిన పవన్‌కల్యాణ్‌కు విద్యార్థి పరిస్థితి గురించి చిత్రాలతోసహా కుటుంబ సభ్యులు వివరించినా కనీసం పరామర్శించడానికి రాలేదని విమర్శించారు. పవన్‌ వెంటనే రాజమనోహర్‌నానీని పరామర్శించి రూ.25లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

dalit 22102018 3

కవాతుకు వెళుతున్న జనసేన కార్యకర్తలు బైక్‌లపై వేగంగా వెళుతూ రాజ్‌మనోహర్‌ను ఢీ కొట్టి ఈడ్చుకుపోయారని.. బాధితుడు తల్లి దం డ్రులు రాజమహేంద్రవరంలో ఉన్న పవన్‌కల్యాణ్‌కు తమ కుమారుడి నిస్సహాయస్థితిని వివరించడానికి వెళ్లినా, పవన్‌కల్యాణ్‌ పట్టించుకోకపోవడం పట్ల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన పార్టీ కార్యకర్తల ఆగడాలకు ఎస్పీ విద్యార్థులను బలి తీసుకోవాలని చూస్తే ప్రతిఘటన ఉంటుందన్నారు. రాజమనోహర్‌ను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. యువకుడి పరిస్థితిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, బాధితులకు అండగా ఉంటామని ఆయన చెప్పారు.

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం పై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపిస్తూ కొత్త చర్చకు దారి తీసారు. తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్న వేళ, లక్ష్మీనారాయణ మాటలు ఆసక్తి రేపుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం, అమల్లోకి తెచ్చిన రైతుబంధు, రైతు బీమా, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరమైనవని లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయుల కాలంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అప్పట్లోనే గొలుసుకట్టు చెరువులను నిర్మించి పంటలకు సాగునీరందించేందుకు కృషి చేశారని తెలిపారు. అలాంటి చెరువులను అభివృద్ధి చేసి.. నీటి నిల్వలను పెంచేలా మిషన్‌ కాకతీయ పథకం చేపట్టడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు.

lakshminaryaan 22102018

వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వడం అభివృద్ధికి కీలకమని, సాగు రంగం అభ్యున్నతి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించనందువల్లే ఏడేళ్ల ముందుగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని తెలిపారు. తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారమంతా సత్యదూరమేననిని స్పష్టం చేశారు. అవసరమైన సమయంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు.

lakshminaryaan 22102018

అయితే ఒక పక్క మిషన్ కాకతీయ పథకం పై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే విమర్శలు వస్తుంటే, లక్ష్మీనారయణ అద్భుతం అనటం వెనుక, ఏదన్నా రాజకీయ కారణం ఉందా అనే చర్చ కూడా వస్తుంది. అయితే ఆయన ఆ ప్రయత్నాన్ని, ఆ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారని, పనులు జరుగుతున్న తీరు పై కాదని, లక్ష్మీనారయణ వర్గీయులు సమర్ధించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఒక పక్క తెలంగాణా సమాజంలో అధిక మంది, కేసీఆర్ చేస్తున్న పనుల పై విమర్శలు చేస్తుంటే, లక్ష్మీనారయణ వచ్చి, అద్భుతం అంటూ కితాబు ఇవ్వటం చూస్తుంటే, దీని వెనుక రాజకీయం కారణం లేకపోలేదనే మాటలు వినిపిస్తున్నాయి. లక్ష్మీనారయణ ఇటీవలే, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు తిరిగి, త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే.

బీజేపీని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఓ ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌డీ తివారీ చనిపోయిన సంగతి తెలిసిందే. ఈయన మన ఏపి గవర్నర్ గా కూడా పని చేసారు. అయితే ఆయన అంత్యక్రియల సమయంలో తన మంత్రివర్గ సహచరులతో కలిసి యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నవ్వులు చిందించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. యోగి చర్య పై విపక్షాలు ఒంటికాలిపై లేస్తున్నాయి. శనివారం రాత్రి ఎన్డీ తివారీ మృతదేహాన్ని లక్నో తీసుకువెళ్లారు. అక్కడ్నించి యూపీ అసెంబ్లీ వద్ద ప్రజా సందర్శనార్థం ఉంచారు.

up 22102018 2

దీంతో సీనియర్ నేతలంతా తివారీకి నివాళులర్పించారు. యోగి ఆదిత్యనాథ్ సైతం తన మంత్రులతో కలిసి వచ్చారు. మొదటి వరుసలో యోగి, బీహార్ గవర్నర్ లాల్జీ టాండన్‌లు కూర్చోగా, యూపీ మంత్రులు మెహసిన్ రజా, అశుతోష్ టాండన్‌లు వారి వెనుక కూర్చున్నారు. ఎన్డీ తివారీ భౌతికకాయానికి సమీపంలోనే వారు కూర్చున్నారు. ఆదిత్యనాథ్ వెనక్కి తిరిగి టాండన్, రజాలతో మాట్లాడుతుండటం, వారంతా కలిసి ఒక్కసారిగా నవ్వుకోవడం కెమెరాలో చిక్కింది. దీంతో విపక్షాలు ఒక్కసారిగా యోగి ఆదిత్యనాథ్‌పై మండిపడ్డాయి. సీఎంగా, గవర్నర్‌గా కీలక పదవులు చేపట్టిన రాజకీయ కురువృద్ధుడు చనిపోతే అతని మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని 'జోక్స్' కట్ చేస్తారా? అని కాంగ్రెస్ ప్రతినిధి జిషాన్ హైదర్ మండిపడ్డారు.

up 22102018 3

'ఇలాంటి సందర్భాలను బీజేపీ కేవలం ఫోటోలు దిగే సందర్భంగానే చూస్తుంది. అది...అటల్ బిహారీ వాజ్‌పేయి కావచ్చు... తివారీ అయినా కావచ్చు. వాళ్ల పార్ధివదేహాన్ని పక్కనే ఉంచుకుని నవ్వుకుంటున్నారంటే వారెంత నిర్దయులో అర్ధం చేసుకోవచ్చు' అని ఆయన మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ సైతం యోగిని తప్పుపట్టింది. భారతీయ జనతా పార్టీ నిజ స్వరూపం ఇదేనని, మృతదేహాన్ని పక్కన పెట్టుకుని నవ్వులు రువ్వడమంటే మానవత్వాన్ని మంటకలపడమేనని ఆపార్టీ ప్రతినిధి అనురాఘ్ భదౌరియా అన్నారు. 'అలాంటి వ్యక్తులకు చావు, పుట్టుకల విలువ తెలియదు. వారికిది కేవలం రాజకీయ అంశమే' అని యోగి, ఆయన మంత్రివర్గ సహచరులను ఆయన తప్పుపట్టారు.

12 ఓట్లుతో గెలిచిన ఎమ్మల్యే... ఎవరైనా ప్రజలకి మంచి చేసి, వచ్చే ఎలక్షన్స్ లో ఇలా 12 ఓట్లుతో కాకుండా, 12 వేల ఓట్లతో గెలివాలి అనుకుంటారు... కాని ఈయన ప్రజలను గాలికి వదిలేసి, వాళ్ళ పార్టీ అధినేత సేవలు తరిస్తూ ఉంటాడు... ఏ లిటిగేషన్ దొరుకుతుందా, ఎవరి మీద కేసు వేద్దామా అని చూస్తూ ఉంటాడు... చివరకి ఏ కేసు నిలబడు అనుకోండి అది వేరే విషయం... కాని, ఈ లోపు కేసు వేసి, సాక్షి టీవీలో హడావిడి చేస్తూ ఉంటారు... కేసు కొట్టేసిన రోజు మాత్రం, అసలు సాక్షిలో వార్తే ఉండదు... అమరావతి పై కేసులు, సధావర్తి భూములు, ఫైబర్ గ్రిడ్ పై కేసు, ఇలా ఒకటి రెండు కాదు, పదుల సంఖ్యలో కేసులు వెయ్యటం, మొట్టికాయలు తినటం, ఈయనకు బాగా అలవాటు. మంచి పని కోసం అయితే ఎవరికీ ఇబ్బంది ఉండదు, కాని ప్రతిది రాజకీయ ఉద్దేశంతో వేస్తే ఇలాగే ఉంటుంది.

alla 22102018

ఏపీలో సాధికార మిత్రల నియామకంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యే వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. సుప్రీం తీర్పుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఈ అంశంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేశారు. పంజాయితీ రాజ్ చట్టాలను ఉల్లంగిస్తూ సాధికారమిత్రలను నియమించారని విమర్శించారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు గ్రామ పంచాయితీ అధికారులున్నాయన్నారు. టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టేందుకే సాధికార మిత్రలను నియమించారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అయితే ఇంతకు ముందు హైకోర్ట్ లో ఇదే కేసు పై, కోర్ట్ ఘాటుగా వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో కాని, పంచాయతీ రాజ్ చట్టంలో కాని, ఇలాంటి పనులు పంచాయతీ సిబ్బంది మాత్రమే చెయ్యాలని ఎక్కడా లేదని కోర్ట్ చెప్పింది. మంచి పని చేసే ఎవరైనా, ఈ పనులు చెయ్యవచ్చు అని చెప్పింది. చట్టంలో లేని దాని గురించి, మేము ఏమి చెయ్యలేము అంటూ, పిటీషన్ కొట్టేసింది. దీంతో ఆళ్ళ సుప్రీంకు వెళ్లారు, అయితే అక్కడ కూడా కోర్ట్ షాక్ ఇచ్చింది.

alla 22102018

నిజానికి, ‘సాధికారమిత్ర’ అనే వ్యవస్థ, గ్రామాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయం సంపాదించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు స్వయం సహాయక సంఘాలను ఎన్నుకుంది. ఇందుకు ప్రత్యేకంగా ‘సాధికార మిత్ర’ వ్యవస్థను రూపొందించింది. స్వయం సహాయక సంఘాలలో సభ్యత్వంతో సంబంధంలేకుండా ప్రతి 35 కుటుంబాలు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, దానికి ఓ ‘సాధికార మిత్ర’ను నియమిస్తారు. వారు ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తారు. సేవే లక్ష్యంగా ముందుకు వచ్చేవారికి ‘సాధికారమిత్ర’లుగా అవకాశం కల్పిస్తారు. ఆ 35 కుటుంబాల బాధ్యత, ఆ ‘సాధికారమిత్ర’కు ఉంటుంది. అన్ని ప్రభుత్వ పధకాలు వారికి అందేలా, వీరు దగ్గర ఉండి పని చేస్తారు. అలాంటి ‘సాధికారమిత్ర’లని కూడా రద్దు చెయ్యమని, మన జగన్ పార్టీ అడుగుతుందంటే, వీరికి ప్రజల సమస్యల పై ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుంది.

Advertisements

Latest Articles

Most Read