నాలుగున్నరేళ్లుగా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంలో తొలిసారి సానుకూల కదలిక కనిపించింది. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఉంటుందని, దాని కోసం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా ముందడుగు వేసిందని భావిస్తున్నారు. మరో పక్క వైజాగ్ రైల్వే జోన్ పై కూడా త్వరలోనే ఎదో ఒక ప్రకటన వస్తుందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయకపోవడం వల్ల రాజకీయంగా వచ్చే ముప్పును గ్రహించినట్లు కనబడుతోంది. కొద్దినెలల క్రితం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రమేశ్‌ ఆమరణ దీక్ష చేపట్టడం, కొన్ని రోజుల కింద టీడీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ను కలసి వినతి పత్రం సమర్పించిన అనంతరం కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి.

modi 20102018 2

వారంలోగా సానుకూల ప్రకటన వెలువడుతుందని వారికి మంత్రి హామీ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో తన శాఖ అధికారులతో, మెకాన్‌ ప్రతినిధులతో సమీక్ష జరిపారు. స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుపై మెకాన్‌ ఇప్పటికే ముసాయిదా నివేదిక సమర్పించిన విషయం చర్చకు వచ్చింది. రాష్ట్రంలో ఎంత ఇనుప ఖనిజం లభ్యత ఉందో.. ఉక్కు ప్లాంటుకు అనువైన గ్రేడ్‌ ముడిఇనుము ఎంత లభిస్తుందో రాష్ట్రప్రభుత్వం సమాచారం ఇవ్వాల్సి ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నియమించిన టాస్క్‌ఫోర్స్‌ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తోందని చెప్పారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇతర సమాచారం కోసం వేచి ఉండకుండా.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి పేర్కొన్నారు.

modi 20102018 3

ఈ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అఽథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) సొంతంగా గానీ, ప్రైవేటు రంగంలో గానీ.. రెండింటి భాగస్వామ్యంతో గానీ స్థాపించడం సాధ్యమో కాదో త్వరితగతిన నివేదికను సమర్పించాలని మెకాన్‌ను ఆదేశించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపిస్తే.. రాయలసీమ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. మెకాన్‌ సంస్థ నిరంతం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ మైనింగ్‌ లీజులు, ఇనుప ఖనిజం లభ్యతపై త్వరగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. ఈ సాంకేతిక నివేదికను టాస్క్‌ఫోర్స్‌ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కేంద్రం స్పందించకుంటే.. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఏపీఎండీసీ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ దిశగా కార్యాచరణ మొదలుకావడంతో.. ఇంతకాలం మెకాన్‌ నివేదిక రాలేదంటూ దాటవేస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు కూడా రాష్ట్రప్రభుత్వం నుంచి సమాచారం రావడం లేదని బుకాయిస్తుండడం గమనార్హం.

గన్నవరం విమానాశ్రయం నుంచి మొదటి అంతర్జాతీయ సర్వీస్‌ ఈనెల 25న ప్రారంభం కానుంది. ఏళ్ల తరబడి ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న వారి కల నెరవేరబోతోంది. ఈనెల 25న తొలి సర్వీసు గాలిలోకి లేవబోతోంది. ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చిన.. కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. ఇక విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిచేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే. గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఈనెల 25న గురువారం తొలి విమానం బయలుదేరబోతోంది. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయం శనివారం నుంచి ఆరంభం కాబోతోంది. మరో ఆరు రోజులే సమయం ఉన్నందున.. నేడు ఇండిగో సంస్థ టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన చేయనుందని అధికారులు వెల్లడించారు.

indigo 20102018 2

విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఆరు నెలల్లోనే విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌తో పాటు అన్ని సౌకర్యాలూ సిద్ధమైపోయాయి. అప్పటినుంచి పలురకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన వ్యవహారం.. ఇన్నాళ్లకు పట్టాలెక్కింది. అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఇన్నాళ్లూ అడ్డంకిగా మారిన కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయ డైరెక్టర్‌ నుంచి ఇండిగో సంస్థకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ సమాచారం అందించారు. ఈనెల 25 నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ.. ఇండిగోకు తెలియజేశారు. దీంతో నేటి నుంచి టిక్కెట్ల విక్రయం ఆరంభం కాబోతోంది.

indigo 20102018 3

సాధారణంగా.. కనీసం 40 రోజుల ముందు టిక్కెట్ల విక్రయం ఆరంభించాల్సి ఉంటుంది. 180 సీట్ల ఇండిగో బోయింగ్‌ గన్నవరం నుంచి సింగపూర్‌కు ఈనెల 25న బయలుదేరి వెళ్లనుంది. టిక్కెట్ల విక్రయం ఆరంభమవ్వగానే.. 25వేల మందికి సంక్షిప్త సందేశాల రూపంలో సమాచారం వెళ్లిపోయే వ్యవస్థ ఇండిగోకు ఉంది. అందుకే టిక్కెట్ల విక్రయం పెద్ద సమస్య కాదని ఇండిగో, విమానాశ్రయం, ఏపీఏడీసీ అధికారులు భావిస్తున్నారు. హాట్‌కేకుల్లా టిక్కెట్లు అమ్ముడైపోనున్నాయన్నారు. వారంలో గురు, మంగళవారాల్లో తొలుత నడపనున్నారు. ఈనెల 25 గురువారం అయ్యింది. మంగళవారం 30న వస్తోంది. ఈలోగా రెండో సర్వీసుకు టిక్కెట్ల విక్రయానికి సమయం ఉంటుంది.

ఆరు రోజుల తరువాత శ్రీకాకుళం వచ్చి, ఇంకా ఎందుకు కరెంటు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకోండి. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ చెప్పిన విషయాలు ఒకసారి చూడండి. మీరు చంద్రబాబు కష్టానికి ఎలాగూ గౌరవం ఇవ్వరు, కనీసం అధికారులు, సిబ్బంది చెప్తున్న మాటలన్నా విని, వారు పడుతున్న కష్టాన్ని అభినందించండి. నగరంలోని ట్రాన్స్ కో పర్యవేక్షక ఇంజినీర్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అజయ్ జైన్ మాట్లాడారు. తిత్లీ తుపాను సందర్భంగా దాదాపు 170 కిలోమీటర్లు వేగంతో సుమారు అయిదు నుంచి ఆరు గంటల పాటు గాలులు వీచాయన్నారు. ఈ గాలులకు సబ్‌స్టేషన్లు మినహా విద్యుత్తు వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని తెలిపారు.

current 20102018 2

జిల్లాలో 33,300 స్తంభాలు కూలిపోయాయని.. వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, సొంపేట, పలాస, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, పోలాకి, నరసన్నపేట, హిరమండలం, భామిని, కొత్తూరు మండలాల్లో విద్యుత్తు వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఏడు ట్రాన్స్‌కో హైటెన్షన్‌ విద్యుత్తు టవర్లు దెబ్బతిన్నాయని, ఇవి పంట పొలాల్లో నడుంలోతు నీటిలో ఉండటం వల్ల పునరుద్ధరణ చాలా కష్టమయిందని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి అవసరమైన విద్యుత్తు స్తంభాలను పెద్దఎత్తున తెప్పిస్తున్నామని, విద్యుత్తు లైన్‌ వేయడం పునరుద్ధరణ అనిపించుకోదని.. ఏకంగా పునర్నిర్మాణంగానే భావించాలని వెల్లడించారు. గోతులు తీయడానికి 20 డ్రిల్లింగ్‌ యంత్రాలు, 250 క్రేన్లు వచ్చాయని వివరించారు. జిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న 7500 మంది సిబ్బందికి అదనంగా మరో 2400 మంది సిబ్బంది వస్తున్నారని ఆయన వెల్లడించారు.

current 20102018 3

చివరి ఇంటికి విద్యుత్తు సరఫరా జరిగేంతవరకు మొత్తం పది వేల మంది సిబ్బంది జిల్లాలోనే ఉంటారని వెల్లడించారు. దసరా పండుగకు జిల్లాలో పనిచేస్తున్న అన్ని స్థాయిల విద్యుత్తు శాఖ అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఎవరూ తమ ఇళ్లకు వెళ్లలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. దసరా రోజు ఉదయం నాటికి అన్ని మండల కేంద్రాలకు, మెళియాపుట్టికి మాత్రం శుక్రవారం పునరుద్ధరించామని తెలిపారు. పలాస వద్ద గల పవర్‌గ్రిడ్‌ దెబ్బతినడంతో రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు సైతం విద్యుత్తు సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు. గురువారం నాటికి ఆయా పనులు పూర్తిచేయగలిగామన్నారు. రానున్న రోజుల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గుండ్రంగా ఉండే స్పన్‌ స్తంభాలను వేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ స్తంభాలు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకోగలవని వివరించారు. కోస్తా తీరంలోని తొమ్మిది జిల్లాల్లోనూ రానున్న ఆరునెలల్లో ఈ పనులు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని చెప్పారు.

పర్యటక రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో నవంబరు 23, 24, 25 తేదీల్లో విజయవాడలోని కృష్ణా నదీ తీరం పున్నమి ఘాట్‌లో విమాన విన్యాసాలు (ఎయిర్‌ షో) నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. శుక్రవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10.15 - 10.45 గంటల మధ్య, సాయంత్రం 4.15 - 4.45 గంటల మధ్య విన్యాసాలు ఉంటాయన్నారు. నవంబరు 16 నుంచి 18 వరకూ నిర్వహించే బోటు రేసింగ్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. 400 మంది బోటు రేసింగ్‌ రైడర్లు పాల్గొంటారని వివరించారు.

boating 20102018 2

ఎఫ్‌1 హెచ్‌2వో పవర్‌ బోట్‌ రేసింగ్‌ నిర్వహణ ద్వారా ప్రపంచ దృష్టిని అమరావతి వైపు ఆకర్షింపచేయాలని సీఎం చంద్రబాబునాయడు భావిస్తున్నారని పర్యాటక శాఖ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఎఫ్‌1హెచ్‌2వో నిర్వహణకు ప్రతి శాఖ నుంచి తాము సహకారం ఆశిస్తున్నామని మీనా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రకాశం బ్యారేజీ వేదికగా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రీడాపోటీలను నిర్వ హిసు ్తన్నామని, అమరావతిలో జరిగే పోటీల్లో 10 బృందాలకు ఒక్కో జట్టు నుంచి 50 మంది సభ్యులు చొప్పున 500 మంది జల క్రీడాకారులు వస్తున్నారని వివరించారు. ఎక్కువమంది పోటీలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించినట్లు వివరించారు. వీఐపీ, వీవీఐపీ, జట్టు సభ్యులు, జట్టుతో వచ్చిన వారు, మీడి యాకు ప్రత్యేక గ్యాలరీలు నిర్మించాల్సి ఉందన్నారు.

boating 20102018 3

సాంస్కృతిక కార్యక్రమాలు, జలవ నరులు, పర్యాటక ప్రాధాన్యంపై మూడు రోజులపాటు కార్యగోష్టి నిర్వహిస్తున్నామని, శిల్పారామం నేతృత్వంలో క్రాప్ట్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహి స్తామని చెప్పారు. పోటీలు జరిగే విధా నం, రేస్‌ ట్రాక్‌కు సంబంధించిన అంశాలను శుక్లా వివరించారు. నగర సుందీకరణ అంశాన్ని తన బాధ్యతగా తీసు కుంటానని మున్సిపల్‌ కమిషనర్‌ నివాస్‌ తెలపగా, జిల్లా యం త్రాంగం అంతటినీ అందు బాటులో ఉంచుతామని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. నవంబరు 16 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న బోట్‌ రేసింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై 30 శాఖల అధికారులతో సమీక్షించారు. సమయం తక్కువగా ఉండటం వల్ల ప్రతి ఒక్క రోజూ విలువైనదేనని, పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై నిశిత పర్యవేక్షణ జరపనున్నామని మీనా తెలిపారు. రేసింగ్‌లో ప్రమాదం జరిగితే క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుపత్రికి తరలించడంపై ప్రత్యేకంగా సమావేశంలో చర్చ జరిగింది.

Advertisements

Latest Articles

Most Read