తిత్లీ తుపానుతో అతలాకుతలమయిన శ్రీకాకుళం జిల్లాకు ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల ఐకాస రూ.31 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అక్టోబర్‌ నెల వేతనం నుంచి ఈ సాయం అందజేస్తున్నట్లు ఐకాస ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదిక ఐకాస ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ముందుకురావడం ఎంతో స్ఫూర్తి దాయకమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆల్ఫ్రెడ్‌ ఉన్నారు.

ngos 20102018 2

తిత్లీ తుపానుతో అతలాకుతలమయిన ఉద్ధానం ప్రాంతంలోని బాధితుల సహాయార్థం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి శ్రీ విజయా ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ సొసైటీ విద్యార్థులు రూ. 3,31,116 సేకరించారు. విరాళానికి సంబంధించిన మొత్తాన్ని విద్యార్థులు మేఘన, ఉమ, మీనాక్షి, హేమంత్‌ శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. దాదాపు 2 వేల మంది కలిసి ఈ విరాళాలను సేకరించినట్లు విద్యార్థులు వివరించారు. తిత్లీ బాధితులను ఆదుకునేందుకు అమెరికాలోని ప్రవాసాంధ్రులు స్పందించి వారిని ఆదుకునేందుకు విరాళాలు సేకరించారు. వారికి అవసరమైన ఆహార పదార్థాలు, వస్తువుల్ని పంపిణీ చేశారు.

ngos 20102018 3

ఎన్‌ఆర్‌ఐ తెదేపా అమెరికా విభాగం ఆధ్వర్యంలో సుమారు రూ.50 లక్షల విరాళాలు సేకరించారు. దానిలో రూ.30 లక్షలతో రొట్టెలు, వాటర్‌ క్యాన్లు, దోమ తెరలు, బట్టలు, దుప్పట్లు, ఎల్‌ఈడీ ల్యాంప్‌లు వంటివి తుపాను బాధిత ప్రాంతాలకు పంపించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా స్థానిక ప్రతినిధులు ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌ పంపిణీ వ్యవహారాల్ని సమన్వయం చేస్తున్నారు. రూ.20 లక్షలతో పాఠశాల భవనం నిర్మిస్తామని ఎన్‌ఆర్‌ఐ తెదేపా ప్రతినిధి రామ్‌ చౌదరి తెలిపారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) పలాస, సోంపేట వంటి ప్రాంతాలకు 50 మందికి పైగా వాలంటీర్లను పంపించింది.

తిత్లీ తుపాను ధాటికి అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాను సామాన్య స్థితికి తీసుకొచ్చేందుకు యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. గురు, శుక్రవారాలు విజయదశమి పూజలు ఉన్నప్పటికీ యంత్రాంగం నిర్విరామంగా విధుల్లో పాల్గొన్నారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించేందుకు విద్యుత్తు శాఖ సిబ్బంది చేస్తున్న కృషికి స్థానికుల నుంచి మద్దతు లభిస్తోంది. ఎక్కడికక్కడ గ్రామాల్లో సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేస్తూ తమ వంతు సాయంగా నిలుస్తున్నారు. మా కోసం కుటుంబాలని వదిలేసి, పండగ రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నారని, మేము ఇలా కృతజ్ఞత తెలుపుకుంటున్నామని అన్నారు. పగలంతా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నా రాత్రిపూట ప్రధానంగా మండల కేంద్రాలకు సరఫరా అందిస్తున్నారు.

relief 20102018 2

గురు, శుక్రవారాల్లో జరిగిన పనితో 50 శాతం గ్రామాలకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించగలిగారు. మరోవైపు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పంటపొలాలను పరిశీలించి నష్టం అంచనా ప్రక్రియ చేపట్టారు. పంట పరిహారం ఈ నెల29 కల్లా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో తుది జాబితాలను సిద్ధం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. మరోవైపు గులాబీ కార్డుదారులకు, తెల్ల రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం అలాంటి వారికి రేషన్‌ సరకులు సరఫరా చేశారు. రేషన్‌ కార్డుదారులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

relief 20102018 3

తిత్లీ తుపానుకు 5 లక్షల కొబ్బరి చెట్లకు నష్టం జరిగినట్టు తెలుస్తోంది. యంత్రాంగం చేపట్టిన గణనలో కుప్పకూలిన కొబ్బరి చెట్ల సంఖ్య శుక్రవారం సాయంత్రానికి 4.5 లక్షలుగా ఉంది. మొత్తం గణన పూర్తయ్యే సరికి 5 లక్షలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. జీడితోటలు 15,500 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. మరో 3 వేల హెక్టార్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అరటి తోటలు 967 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. తోటలలో కూలిన చెట్లను తొలగించడానికి ఉపాధి హామీ పనులతో ముడిపెట్టారు. ఈ పథకం కింద చెట్లను తొలగించడానికి కొబ్బరి చెట్టుకు రూ.240 చొప్పున, జీడిమామిడి చెట్టుకు రూ.300 చొప్పున కూలి ధరలు నిర్ణయించారు. నష్టపరిహారాలలో తాటిచెట్లను కూడా చేర్చారు. తాటిచెట్టుకు రూ.800 పరిహారాన్ని ప్రకటించారు.వరకు విధుల్లో పాలుపంచుకుంటున్నామని ఒక తహసీల్దారుపై 10 మంది ఐఏఎస్‌లు, 10 మంది డిప్యూటీ కలెక్టర్ల సమీక్షలతో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని తహసీల్దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమృత్‌సర్‌ సమీపంలోని జోడా ఫాఠక్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద దసరాను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం 6.45 గంటలకు నిర్వహించిన రావణ దహనాన్ని చూసేందుకు వచ్చిన స్థానిక ప్రజలపైకి రైలు దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 61 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 72 మంది గాయపడ్డారు. రైలు పట్టాల పక్కనే ఉన్న ఒక మైదానంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని దాదాపు 300 మంది వీక్షిస్తున్నారు. రావణుడి బొమ్మను వెలిగించగానే.. బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఇదే సమయంలో కొందరు పట్టాలపైకి వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. రావణ దహనాన్ని తమ సెల్‌ఫోన్లతో చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో రెండు వేరువేరు ట్రాక్‌ల మీద రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి.

punjab 20102018 2

కంగారుపడ్డ జనానికి తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది. బాణసంచా తాలూకూ మోత, పొగ, రావణుడి బొమ్మ దహనం వల్ల వెలువడ్డ వెలుగులతో జనానికి దృశ్యగోచరత సరిగా లేదు. రైలు మోత వినిపించలేదు. ఈ అయోమయంలో.. జలంధర్‌ నుంచి అమృత్‌సర్‌ వైపు వేగంగా దూసుకెళుతున్న రైలు కిందపడి నలిగిపోయారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు అమృత్‌సర్‌ సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ రాజేశ్‌ శర్మ చెప్పారు. కళ్ల ముందే బంధువులు, స్నేహితులు దుర్మరణం పాలవ్వడాన్ని చూసిన జనం గుండెలు అవిసేలా రోదించారు. తమవారి జాడ కోసం మరికొందరు అన్వేషణలో పడ్డారు. తెగిపడ్డ అవయవాలతో ఆ ప్రాంతం మొత్తం భయానకంగా ఉంది.

punjab 20102018 3

మృతుల్లో అనేక మంది చిన్నారులూ ఉన్నారు. కొన్ని మృతదేహాలను గుర్తించలేకపోయారు. ఈ దృశ్యాలు.. వీక్షకుల గుండెలను పిండేశాయి. మృతదేహాలను తొలగిచేందుకు అక్కడికి వచ్చిన అధికారులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. శవాలను తొలగించడానికి తొలుత అంగీకరించలేదు. దీంతో ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా మృతదేహాలు ఘటనా స్థలిలో పడి ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి డీజీపీ నేతృత్వంలో అదనపు బలగాలు అక్కడికి తరలివచ్చాయి. రావణ దహనకాండ వేడుకకు, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సిద్ధూ భార్య, స్థానిక ఎమ్మెల్యే నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాదం తర్వాత స్థానికులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

‘మీ టూ’.. ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న పెద్ద ఉద్యమం. ఆడవాళ్ళ పై జరుగుతున్న లైంగిక దాడులకు, ఎంతటి వారైనా వారికి తగిన శిక్ష పడేలా, ఆడవాళ్ళు దైర్యంగా ముందుకు వస్తున్నారు. ఈ ఉద్యమ ధాటికి, సాక్షాత్తు కేంద్ర మంత్రే రాజీనామా చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ఇదే స్పూర్తి తీసుకుని, కేంద్రం పై పోరాటం చేయ్యమంతున్నారు. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై ‘మీ టూ’లా ఉద్యమించి కేంద్రాన్ని దారికి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుజాతికి పిలుపునిచ్చారు. తిత్లీ బాధితులను ఆదుకోవాలని, రాష్ట్రానికి న్యాయం జరగాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ‘మీ టూ’ మాదిరిగా తెలుగు జాతి ఉద్యమిస్తుందన్నారు.

cbn meetoo 20102108 3

న్యాయం చేసే వరకు ఉద్యమాన్ని వదిలిపెట్టబోమని అంతా కంకణబద్ధులు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీ మైదానంలో గురువారం దుర్గా పూజ చేసిన చంద్రబాబు తన ఈ సంకల్పాన్ని వివరించారు. అలాగే తిత్లీలో బాధితులకు పరిహారాన్ని అందించడంలో ఎక్కడా పైసా అవినీతికి తావివ్వబోనని ఆయన స్పష్టం చేశారు. నష్టాల అంచనాలో ఎక్కడా దళారులకు చోటు ఉండదన్నారు. నష్టాల అంచనాలో గాని, పరిహారాన్ని అందించడంలో గాని ఎవరైనా రాజకీయాలు చేస్తే సహించనన్నారు. నష్టపోయిన వారికి రాజకీయాలకు అతీతంగా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

cbn meetoo 20102108 2

తుపాను తీరం దాటడంపై సరైన అంచనాకొచ్చాం కాబట్టే ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించుకోలిగాం. ఈ జిల్లాలో 9 మంది.. విజయనగరంలో ఇద్దరు చనిపోయారు. 15 మంది మంత్రులు జిల్లాలోనే ఉన్నారు. 25 మంది ఐఏఎస్‌ అధికారులు, 90 మంది డిప్యూటీ( కలెక్టర్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవలు అందించడంలో నిమగ్నమయ్యారు. వారిని అభినందిస్తున్నా. విజయదశమి చాలా ముఖ్యమైన పండగ. అయినా ఎవరం దసరాకు వెళ్లలేదు. ఇక్కడే పలాసలో దసరా చేసుకుంటున్నామంటే అది మీపై ఈ ప్రభుత్వానికి ఉన్న అంకితభావానికి తార్కాణం. నష్టపోయిన ప్రాంతాలకు పూర్వ వైభవం తెస్తా. ఆదుకునేందుకు దాతలు, సేవా సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, దేశవిదేశాల్లో ఉన్నవారు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read