‘నన్ను మానసికంగా దెబ్బతీయాలని.. తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామని కేంద్రం కుయుక్తులు పన్నుతోంది. నన్నేమైనా చేయాలని.. సాధించాలని మోదీ చూస్తున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. తనను భయపెట్టాలని చూస్తే గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గుంటూరులో బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనం శంకుస్థాపనకు వచ్చి.. ఉత్తరాంధ్రలో తితలీ తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించకుండా వెళ్లారని ఆక్షేపించారు. దేశంలో విపత్తులు సంభవిస్తే తక్షణమే స్పందించాల్సిన రాజ్‌నాథ్‌సింగ్‌ ఇలా చెయ్యవచ్చా అని అన్నారు.

cbn 18102018

శ్రీకాకుళంలోని టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో బుధవారం పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. ‘‘తిత్లీ తీరం దాటిన రోజే శ్రీకాకుళానికి వచ్చా. మధ్యలో ఒక్కరోజు విజయవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్లాల్సి వచ్చింది. మీకందరికీ సహాయ కార్యక్రమాలు అందిస్తున్నా. ఇక్కడ సహాయ చర్యలు ఆగిపోవాలని కేంద్రం కుట్ర పన్నుతోంది. అందుకే ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లు, సంస్థలపై దాడులు చేయిస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ సహా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించానని.. నాపై కక్ష సాధిస్తోంది. నలభైయ్యేళ్ల రాజకీయ జీవితం నాది. నాతో ఆషామాషీలా’ అంటూ చంద్రబాబు కేంద్రంపై ధ్వజమెత్తారు.

cbn 18102018

మనం కష్టపడి పని చేస్తుంటే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని, లేనిపోని విమర్శలు చేస్తున్నారని బాధగా ఉందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీకు ఇంత చేస్తుంటే పవన్‌ కల్యాణ్‌ నన్ను తిడతారు. ఎందుకు తిడతారో నాకే తెలియదు. తెలంగాణా సీఎం కేసీఆర్‌ నన్ను తిడతాడు. మోదీ చేతుల్లో ఉండి వారు మనతో ఆడుకుంటున్నారు. మీరందరూ ఉంటే కొండనైనా ఢీకొంటా.. రాజీపడను’ అన్నారు. ‘తితలీ తుఫాను పెనుప్రమాదం సృష్టిస్తుందని పసిగట్టిన వెంటనే సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించాను. ఐదు సార్లు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని నిర్దేశించాను. తర్వాత పలాస వచ్చి నాలుగు రోజులు మకాం వేసి బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చర్యలు ప్రారంభించాను. ఏ ఒక్క కుటుంబం ధైర్యం కోల్పోకుండా అండగా ఉండాలని 15 మంది మంత్రులను, 150 మంది డిప్యూటీ కలెక్టర్లను, ఐఏఎస్‌ అధికారులను జిల్లాకు రప్పించాను. 3 లక్షల ఎకరాల్లో కొబ్బరి, 1200 హెక్టార్లలో జీడిమామిడి, లక్ష ఎకరాల్లో వరి పంట నాశనమయ్యాయి. 36 వేల విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం మనకు అండగా ఉండాలి. కానీ అదే సమయంలో మన ఎంపీలపై, ఎమ్మెల్యేలపైనా ఐటీ దాడులు చేయించింది." అని అన్నారు.

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, ఆయ‌న మీడియా, సోష‌ల్ మీడియా సంస్థ‌లు చేస్తున్న దుష్ప్ర‌చారం పై శ్రీకాకుళం జిల్లావాసులు మండిప‌డుతున్నారు. బాధితుల ద‌గ్గ‌రకే నేరుగా ముఖ్య‌మంత్రి, మంత్రులు వ‌చ్చి..న‌ష్టం ప‌రిశీలించి..అన్నివిధాలు ఆదుకుంటుంటే..మీ రాజ‌కీయాలు ఏంటి జ‌గ‌న్? అని నిల‌దీస్తున్నారు. తిత్లీ తుఫాన్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి రాకుండా...ప్లానింగ్‌ ముద్దులు, ప్యాకేజీ నిమురుడుల‌తో ప‌ద‌వి కోసం పాదాల యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌..ప‌ట్ల శ్రీకాకుళం వాసుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌ని ..వైసీపీ స‌ల‌హాదారులు ఒక నివేదిక ఇచ్చార‌ట‌! అయితే త‌మ‌ప‌ట్ల ఉన్న వ్య‌తిరేక‌త‌ను ప్ర‌భుత్వం ప‌ట్ల తిప్పాలంటే ఏం చేయాలి? అనే దుర్మార్గపు ఆలోచ‌న‌లో భాగంగానే.. తుఫాన్ బాధితుల‌కు స‌హాయం పేరుతో చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ ప్ర‌చార‌యావ వ‌ల్లే స‌హాయ‌క‌చ‌ర్య‌లు సాగ‌డంలేద‌నే క‌థ‌నాలు వండి వారుస్తున్నారు. అయితే ఉద్దానంలో ప‌ర్య‌టించిన మంత్రి నారా లోకేష్‌, అక్క‌డ నేరుగా ఇంటింటికీ వెళ్లి మ‌రీ స‌మ‌స్య‌లు ప‌రిశీలించి...త‌క్ష‌ణ అవ‌స‌రాల‌ను గుర్తించి స‌హాయం అందించే ఏర్పాట్లు చేశారు.

రాత్రి 2 గంట‌ల వ‌ర‌కూ మేలుకుని ఉండి స‌మీక్ష‌లు చేస్తూ...ఉద‌యం 6 గంట‌ల‌కే తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల క‌ష్టాలు, అవ‌స‌రాలు తెలుసుకుంటూ చొర‌వ‌గా ప‌రిష్క‌రిస్తున్న మంత్రి నారా లోకేష్‌కి ప్ర‌జ‌ల్లో ఆద‌రణ బాగా పెరిగింద‌నే నివేదిక కూడా వైసీపీ స‌ల‌హాదారులు జ‌గ‌న్‌కు పంపార‌ట‌. ఇది త‌ట్టుకోలేని జ‌గ‌న్‌...ఐటీ మంత్రి నారా లోకేష్‌ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఎందుకు ప‌ర్య‌టిస్తున్నారంటూ ఓ ప‌నికిమాలిన క‌థ‌నాన్ని స‌ర్కులేట్ చేయించారు. అక్ర‌మాస్తుల వార‌సుడు, ల‌క్ష కోట్ల అక్ర‌మార్కుడు అయిన జ‌గ‌న్ స్థాపించిన‌ పార్టీకి, ఆ పార్టీకి అనుబంధంగా ప‌నిచేస్తున్న పెయిడ్ జ‌ర్న‌లిస్టుల‌కు నారా లోకేష్ ఐటీతోపాటు గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్ శాఖ‌లు వంటి కీల‌క శాఖ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నార‌ని తెలియ‌క‌పోవ‌డం విచార‌క‌రం. మ‌రోవైపు తుఫాన్ భ‌యంతో పాద‌యాత్ర‌కు సెల‌వు పెట్టి త‌న అక్ర‌మాల‌కు సాక్షి అయిన లోట‌స్‌పాండ్‌కు పారిపోయి...టికెట్ల అమ్మ‌కాల ప‌ని చూసుకున్న జ‌గ‌న్‌...తుఫాన్ బాదిత ప్రాంతాల‌లో ఇంటింటికి తిరుగుతూ స‌మ‌స్య‌లు ప‌రిష్కరిస్తున్న మంత్రి నారా లోకేష్‌పై అవాస్త‌వ ఆరోప‌ణ‌లు, కుట్ర‌పూరిత క‌థ‌నాల‌తో బ‌ద్నాం చేయాల‌ని చూడ‌టం హాస్యాస్ప‌దం అని.. స్థానికులు అంటున్నారు. తిత్లీ విధ్వంసం త‌రువాత ప‌ల్లెల‌కు నేరుగా వెళ్లి తాగునీరు, ఆహారం అందేలా చూడ‌టం..పారిశుధ్యం మెరుగుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌గా చ‌ర్య‌లు తీసుకున్న‌ది...ఐటీ శాఖ చూస్తున్న పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రే అని తెలియ‌క‌పోవ‌డం ఇంకా విచిత్రం.

మ‌రోవైపు తుఫాన్ బాధితులు సీఎంని, మంత్రుల‌ని నిల‌దీస్తున్నార‌ని రాశారు. ఇది క‌రెక్టే! క‌ష్టంలో ఉన్న బాదితులు స‌హాయం కావాల‌ని అడుగుతారు..వారు అడుగుతార‌ని, వారికేం కావాలో అదే చేద్దామ‌ని సీఎం, మంత్రులు తుఫాన్ బాధితుల వ‌ద్ద‌కే నేరుగా వెళుతున్నారు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్న ఏ ప్ర‌భుత్వాధినేత అయినా..ఇలాగే చేస్తారు. అదే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న మంత్రులూ చేశారు. శుక్ర‌వారం వ‌స్తే కోర్టుకి, తుఫాన్ వ‌స్తే లోట‌స్‌పాండ్‌కి పారిపోయే ప‌ద‌వీకాంక్ష పాద‌యాత్రీకుడికి ఇవ‌న్నీ ఎలా తెలుస్తాయి? అన్ని శాఖ‌ల ఉన్న‌తాధికారులూ, ప్ర‌త్యేక బృందాలూ శ్రీకాకుళంలో తుఫాన్ పీడిత ప్రాంతాల‌లో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క‌చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఇంకా కొన‌సాగిస్తున్నాయి. ఇందులో ప్ర‌చార యావ ఏంటో ఎవ‌రికీ అర్థంకావ‌డంలేద‌ని స్థానికులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు 40 ఏళ్ల రాజ‌కీయ జీవితం..అత్య‌ధిక కాలం ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం, కేంద్రంలోనూ చ‌క్రంతిప్పిన చాణుక్యుడు, దేశంలో ఐటీ రంగం అభివృద్ధికి ఆద్యుడైన చంద్ర‌బాబు...ఇటీవ‌లే ఐక్య‌రాజ్య‌స‌మితిలో ప్ర‌సంగించే అరుదైన అవ‌కాశాన్ని వినియోగించుకుని భార‌త‌దేశ కీర్తిప‌తాక‌ను రెప‌రెప‌లాడించారు. తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటారు. అటువంటి విజ‌న‌రీ ముఖ్య‌మంత్రి తుఫాన్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొని ప్ర‌చారం పొందాల‌ని చూస్తున్నార‌ని వైసీపీ చేస్తున్న విష‌ప్ర‌చారాన్ని ఎవ‌రైనా న‌మ్ముతారా? ఐటీలో జీరోగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను సాటిలేని మేటిగా మార్చిన నారా లోకేష్‌... పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ‌ల ప‌నితీరుకు స్కోచ్ అవార్డులు, ప‌లు రివార్డులు గెలుచుకున్న మంత్రి లోకేష్‌...తుఫాన్ బాధితుల‌కు స‌హాయం చేయ‌డం త‌న‌ బాద్య‌త‌గా భావించారు. నిద్ర‌లేకుండా, తిండి లేకుండా... ప‌రిస్థితి చ‌క్క‌దిద్దేవ‌ర‌కూ ఇక్క‌డే ఉంటాన‌ని ప్ర‌తిన‌బూని ప‌నిచేస్తున్న మంత్రిది ప్ర‌చార యావంటూ ప్ర‌చారం చేస్తున్న మీ విష‌రాజ‌కీయాలు..మేము క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్ప‌డు వ‌ద్దంటూ జ‌గ‌న్‌కి శ్రీకాకుళం వాసులు హెచ్చ‌రిస్తున్నారు.

తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు ఒక్కొక్కరూ ముందుకొస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉదారంగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ బాధితులకు బాసటగా నిలిచారు. బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన రూ.25లక్షల విరాళాన్ని ప్రకటించారు. తుపాను తీవ్రతతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే కొంత మంది ముందుకొచ్చారు.

nbk 17102018 2

ఇప్పటికే కార్తీకేయ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వరుణ్ తేజ్, నిఖిల్, సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ ఆర్థిక సాయం ప్రకటించడం విశేషం. తితలీ తుపాను ధాటికి అతలాకుతలమైన ఉత్తరాంధ్ర వాసులకు అండగా, సాయం చేసేందుకు తాము సైతం అంటూ తెలుగు హీరోలు ముందుకొస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం కూడా విరాళం ప్రకటించింది. ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు శశిభూషణ్‌ తెలిపారు. ఇప్పటికే సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ అధికారులు శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు.

nbk 17102018 3

మరో పక్క, తిత్లీ తుఫాన్ బాధితుల‌కు మంత్రి కళావెంకటరావు ఆద్వర్యంలో త‌మ వంతు సాయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోటి రూపాయల చెక్కును అందించిన విశాఖ డైరీ యాజమాన్యం. ఇది ఇలా ఉంటే, తిత్లీ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, తమ వంతు సహకారాన్ని అందించాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. నష్టం అంచనా వేయడానికి, బాధాతప్త హృదయాల్లో భరోసా కల్పించి ఆదుకోవడానికి ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తోందని చెప్పారు. విరాళాలు ఇచ్చేవారు ముఖ్యమంత్రి సహాయనిధికి పంపాలని లోకేశ్‌ కోరారు.

తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుతో పాటు వైద్య పరీక్షలు అందించడంపై శ్రద్ధ పెట్టాలని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. తుపాను నేపథ్యంలో సీఎం, ప్రభుత్వం అందిస్తున్న సహాయ చర్యలను ఆయన అభినందించారు. రెండు రోజులుగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. పర్యటనలో తన దృష్టికి వచ్చిన అంశాలను.. పరిష్కారాలను లేఖ రూపంలో వివరించారు.

lakshminarayana 17102018 2

ప్రతి గ్రామానికి ఒక ఉద్యాన అధికారిని ఏడాది కాలానికి నియమించాలి. అక్కడ ఉద్యాన పంటల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించి అమలుకు చర్యలు చేపట్టాలి. కొబ్బరి రైతులకు ఆర్థిక సాయం అందించాలి. కొబ్బరి కాయలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. లేదంటే రైతులకు లాభం కలిగించేలా మార్కెట్‌ ధరలను నియంత్రించాలి. పడిపోయిన చెట్ల తొలగింపు కోసం పెట్రోలుతో నడిచే పవర్‌ కట్టర్లను అందించాలి. తక్కువ సమయంలో ఫలాలనిచ్చే పండ్లతోటల సాగుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవాలి. కనీసం ఒక ఏడాది పాటు ఇక్కడి విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలి.

lakshminarayana 17102018 3

వంటగ్యాస్‌, విద్యుత్తు ఏడాది పాటు ఉచితంగా అందించాలి. మహిళలకు చీపుర్లు తయారీలో శిక్షణ ఇప్పించాలి. సహకార విధానంలో ఉత్పత్తి చేయించి ఆర్థిక, సహకార, మార్కెటింగ్‌ పరంగా ప్రోత్సాహం ఇవ్వాలి. పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల ద్వారా కొనుగోలు చేయించాలి. కొబ్బరి ఆధారిత ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. కోకో తోటల పెంపకానికి చేయూత ఇవ్వాలి. కవిటి మండలంలోని 17 గ్రామాల్లో 100 బోర్లు తవ్వాలి. ప్రత్యామ్నాయ పండ్లతోటల సాగుకు ఇది ఉపకరిస్తుంది. మత్స్యకారుల కోసం వేర్వేరు ప్రాంతాల్లో జెట్టీలు ఏర్పాటు చేయాలి. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద మూడేళ్లు ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకునేలా చూడాలి. కవిటిలో డయాలసిస్‌ యూనిట్లను విస్తరించాలి. వైద్య పరీక్షలు నిరంతరాయంగా కొనసాగించాలి. గుడిసెల స్థానంలో పక్కా గృహాల నిర్మాణం చేపట్టాలి.

Advertisements

Latest Articles

Most Read