జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అంటే కారణం, ప్రశాంత్ కిషోర్. వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్, మోడీని ప్రధానిని చేయటంలో కీలక పాత్ర పోషించారు. తరువాత వివిధ రాష్ట్రాల్లో పని చేసి, జగన్ మోహన్ రెడ్డి కోసం కూడా పని చేసారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సింపుల్ గా చెప్పాలి అంటే, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టటం, గతంలో మోడీని పైకి తేవటానికి మతాల మధ్య చిచ్చు పెట్టాడు. తరువాత జగన్ వద్దకు వచ్చేసరికి, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. ఇలా చిచ్చు పెట్టటమే ప్రశాంత్ కిషోర్ వ్యూహం. ప్రశాంత్ కిషోర్ జగన్ మోహన్ రెడ్డికి చేసిన తరువాత, పశ్చిమ బంగాల్ లో మమతతో చేసారు, తరువాత తమిళనాడులో స్టాలిన్ తో చేసారు, ఇప్పుడు తెలంగాణాలో కేసీఆర్ తో పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కి జాతీయ రాజకీయాల పై మనసు పడింది. మోడీని ఎలాగైనా దింపాలి అనే వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ వేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నారు. చాలా సార్లు సోనియా, రాహుల్ తో కూడా భేటీ అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని తన గుప్పిట్లో పెడితేనే పార్టీలో చేరతానని చెప్పటం, చివరకు కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోక పోవటంతో, తాను కాంగ్రెస్ పార్టీలో చేరటం లేదు అని, ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు.

prasanth 04052022 2

తరువాత రెండు రోజులకే, ప్రశాంత్ కిషోర్, తాను సొంత పార్టీ పెడుతున్నాను అనే సంకేతాలు ఇచ్చారు. అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టటం వెనుక, పెద్ద వ్యూహమే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ ఈ నిర్ణయం తీసుకునే ముందు, రెండు రోజుల పాటు కేసీఆర్ తో భేటీ అయ్యారు. అక్కడే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా జగన్, కేసిఆర్, ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఆర్ధిక వనరులు ఇస్తారనే సమాచారం బయటకు పొక్కింది. ఈ విషయం ఢిల్లీ వరకు వెళ్ళింది. జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక కారణాలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేరు, అలాగనే బీజీపీని నమ్మటానికి లేదు. ఎందుకంటే, బీజేపీ ఏదో ఒక నిమిషంలో మింగేస్తుంది. అందుకే ప్రశాంత్ కిషోర్ పైకి ఎదిగితే, అది తమకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. మమత, స్టాలిన్, నితీష్, కేసీఆర్, జగన్, కేజ్రీవాల్, వీరందరూ స్టాలిన్ క్లైంట్స్ కాబట్టి, అందరూ ఒక ఫ్రంట్ గా ఏర్పాటు అయ్యి, వచ్చే ఎన్నికల్లో మోడీని డీ కొట్టే అంశంలో భాగంగానే, ప్రశాంత్ కిషోర్ ని ఆర్ధిక వనరులు ఇస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజమో చూడాలి మరి.

బెంగుళూర్ లో దొరికిన డ్రగ్స్ కేసు రోజుకొక  కీలక మలుపులు తిరుగుతుంది. నిన్న బెంగుళూరుకు వచ్చిన  పార్సిల్ విజయవాడ నుంచి పంపించినట్టు పోలీసులు తెలిపారు. అక్కడ బెంగుళూరులో కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం  చేసుకొని , ఆ కొరియర్ బాయ్ తేజాని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో  సాయి గోపి అనే యువకుడు పేరు మీద  విజయవాడ లో పార్సిల్ చేసినట్టు అతను సమాచారం ఇచ్చాడు.  తేజ ఇచ్చిన సమాచారం ప్రకారం సియి గోపి అనే వ్యక్తి గత రాత్రి అదుపులోకి తీసుకుని , అతన్ని పూర్తి స్థాయి లో విచారించారు. అయితే ఈ విచారంలో ఈ పార్సిల్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని , అదార్ నంబర్ , అడ్రెస్ తనదేకాని , అందులో ఉన్న ఫోటో మాత్రం తనది కాదని విచారణలో చెప్పినట్టు సమాచారం. తన ఆదార్ నెంబర్ తో ఫేక్ వి సృష్టించి ఎవరోవాడుకున్నారని , తనకు ఈకేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని ,అసలు నిందితులను పోలీసులే పట్టుకోవాలని గోపి విచారణలో పోలీసులను కోరినట్టు సమాచారం.  ఆవిచారణ తరువాత పోలీసులు అతనిని పంపించేసారు. అ తరువాత  గోపి సత్తెనపల్లి రూరల్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. తన ఆధార కార్డ్ ను ఎవరో మార్ఫింగ్ చేసారని , డ్రగ్స్ రవాణా చేసేందుకు పార్సిల్ కేంద్రం లో తన ఆధార ఎవరో వాడారని , అది ఎవరో కనిపెట్టి, కఠిన చెర్యలు తీసుకువాలని సాయి గోపి సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

ఇన్నాళ్ళు ఇష్టం వచ్చినట్టు, విచ్చల విడిగా అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, అన్ని వైపుల నుంచి సహకారం వచ్చి, అప్పులు ఇష్టం వచ్చినట్టు చేసారు. అటు కేంద్రం కానీ, ఇటు బ్యాంకులు కానీ, ముందు వెనుకా చూసుకోకుండా అప్పులు ఇచ్చారు. రూల్స్ ని అతిక్రమించి మరీ అప్పులు చేసిన సంగతి తెలిసిందే. బ్యాంకులు కూడా చిత్ర విచిత్ర షరతులు పెట్టి అప్పులు ఇచ్చాయి. చివరకు 25 ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాగే మద్యం పైన కూడా అప్పులు తెచ్చారు అంటే, ఎంతటి గొప్ప వాళ్ళో అర్ధం అవుతుంది. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటి వెళ్తే, ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అదే పరిస్థితి వచ్చింది. అటు కేంద్రం కానీ, ఇటు బ్యాంకులు కానీ, అప్పులు ఇవ్వాలన్నా, ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే కేంద్రం అప్పు ఇచ్చేది లేదని, తమకు ముందు పాత లెక్కలు చెప్పాల్సిందే అని, కూర్చోవటంతో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 20 రోజులుగా అప్పులు పుట్టక విలవిలలాడుతుంది. తాజాగా బ్యాంకులు వద్ద నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇదే అనుభవం ఎదురైంది. ఇష్టం వచ్చినట్టు గాల్లో లెక్కలు చెప్పటం కాదని, తమకు కచ్చితంగా చెప్తేనే అప్పు ఇస్తాం అంటూ బ్యాంకులు తెగేసి చెప్పాయి.

appu 03052022 2

హైకోర్టు ఆదేశాలు ప్రకారం, అమరావతిలో నిర్మాణ పనులు మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. దీంతో ప్రభుత్వం డబ్బులు లేక, బ్యాంకులు వద్ద, తమకు రూ.3 వేల కోట్ల పైన అప్పు కావాలని ప్రతిపాదనలు పెట్టాయి. నిన్న సీఆర్డీఏ అధికారులు పెట్టిన ఈ మీటింగ్ కు, అనేక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వచ్చాయి. అయితే వారు మాత్రం ఇంతకు ముందు లాగా, చూసి చూడనట్టు అప్పు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. అసలు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందా, లేక మూడు రాజధానులు ఉంటాయా అనేది ముందు స్పష్టం చేయాలని, తరువాతే ఈ అప్పు విషయం పై ముందుకు వెళ్తాం అని తేల్చి చెప్పారు. దీంతో ఖంగు తిన్న అధికారులు, మూడు రాజధానులు బిల్లు వెనక్కు తీసుకున్నారు కాబట్టి, ఒకే రాజధాని ఉంటుందని స్పష్టం చేసారు. అయితే హైకోర్టు తీర్పు వచ్చిన తరువాత, ప్రభుత్వం మళ్ళీ మూడు రాజధానులు అంటుంది కదా అని అడగ్గా, ఇటు వైపు నుంచి సరైన సమాధానం లేదు. దీంతో అమరావతి ఏకైక రాజధాని పై తమకు స్పష్టత వస్తేనే, ఈ రుణం పై,ప్రతిపాదనలు ముందుకు వెళ్తాయని బ్యాంకులు తేల్చి చెప్పాయి.

కోర్ట్ తీర్పు అమలు చేయడం లో జాప్యం చేసిన కారణంగా ఐఏఎస్ అధికారి చిన్న వీరభద్రుడికి నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష ,రెండు వేల రూపాయల జరిమానా హైకోర్ట్ విదించింది. అయితే ఈ తీర్పు అమలుకు సంభందించి ,అమలు రెండు వారాల పాటు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారి చేసింది. ఈ కేసు వివరాల ప్రకారం జివో నంబర్ 342 ప్రకారం SC, ST సంబంధించిన సెకండ్ గ్రేడ్ టీచర్లకు ,ప్రమోషన్ కోసం BPED కోర్సులు తీసుకునే వెసులుబాటు ఉంది . అయితే BPED కోర్సులు అభ్యసించే టైమ్ లో SC, ST సంబంధించిన సెకండ్ గ్రేడ్ టీచర్లకు పూర్తి స్థాయిలో జీతాలు ఇస్తారు. అయితే తరువాత ప్రభుత్వం కొన్ని సవరణలు చేస్తూ వాళ్లకు జీత భత్యాలు చెల్లించే వెసులుబాటును తీసివేసింది. ఈ నేపధ్యంలో విజయనగరానికి చెందిన నలుగురు సెకండ్ గ్రేడ్ టీచర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్ట్ ను ఆశ్రయించింది. హైకోర్ట్ ఈ కేసుకు సంభందించి పోయిన సంవత్సరం మార్చి నెలలో తీర్పును ఇచ్చింది. జివో నంబర్ 342 యధాతధంగా అమలుచేయాలని ,దీనికి సంబంధించి ,ప్రభుత్వం చేసిన సవరణలు చెల్లవని స్పష్టం చేసింది. హైకోర్ట్ వెంటనే జివో నంబర్ 342 అమలు చేస్తూ BPED కోర్సులు చేస్తున్న సెకండ్ గ్రేడ్ టీచర్లకు పూర్తి స్థాయి జీతభత్యాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

hc 030502022 2

అయితే ఈ ఆదేశాలు అమలు చేయడంలో ఈ అధికారులు సుధీర్గ జాప్యం చేసారు. ఈ జాప్యాన్ని సవాలు చేస్తూ కోర్ట్ దిక్కరణ పిటీషన్ దాఖలు చేయడం తో ఈ కేసు పూర్వ పరాలను పరిశీలించి , ముగ్గురు ప్రభుత్వ అధికారులు కోర్ట్ దిక్కరణ చేసారని కేసు నమోదయింది. ఈ కేసులో ఇద్దరు అధికారులకు మినహాయింపు ఇచ్చారు. కాని IAS అధికారి చిన్న వీరభద్రుడికి మాత్రం నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష ,రెండు వేల రూపాయల జరిమానా హైకోర్ట్ విదించింది. అయతే చిన్న వీరభద్రుడి తరుపున న్యాయవాది దీనికి సంభందించిన అప్పీలు కోసం శిక్షను నిలుపుదల చేయాల్సిందిగా కోరడంతో, శిక్షను రెండు వారాల పాటు నిలుపుదల చేస్తూ హైకోర్ట్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. వరుస పెట్టి అధికారులు ఇలా కోర్టులో, కోర్టు ధిక్కరణ కేసులు కింద, బుక్ అవ్వటం, ఈ మద్య కాలంలో చూస్తున్నాం. నెల రోజుల క్రిందట ఏకంగా ఎనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్ల పైన, కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయ్యి, వారికి సేవా శిక్ష కూడా కోర్టు విధించిన సంగతి తెలిసిందే.

 

Advertisements

Latest Articles

Most Read