మోడీ క్లీన్ ఇమేజ్ అంటూ కబురులు చెప్తూ, 5 రాష్ట్రాల ఎన్నికలకు వెళ్తున్న బీజేపీకి, ఊహించని షాక్‌ తగిలింది. కొత్తగా వచ్చిన సుప్రీం కోర్ట్ ఛీఫ్ జస్టిస్, రాఫెల్ కేసు పై విచారణ చెయ్యనున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆరోపణలకు మాత్రమే ఉన్న ఈ అంశం, ఇక కోర్ట్ లో విచారణకు రానుంది. దీనిలో ఉన్న నిజా నిజాలు అన్నీ బయటకు వస్తే, ఇక మోడీ క్లీన్ ఇమేజ్ అనేది ఉత్తి మాటే అవుతుంది. కేంద్రంలో ప్రతిపక్షాలు ప్రధాని మోడీని నలభై వేల కుంభకోణమంటూ విమర్శల పాలు చేస్తున్న రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశం మీద దాఖలైన రెండు వాజ్యాలపై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. వినీత్ అనే న్యాయవాది దాఖలు చేసిన రాఫెల్ ఒప్పందంపై ప్రజాప్రయోజన వాజ్యం.. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై స్టే విధించాలంటూ ఎంఎల్ శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్ రెండు రేపు విచారణకు రానున్నాయి.

bjp 09102018 2

ఈ రెండు పిటిషన్‌లను కలిపి రేపు విచారించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వరంగ సంస్థ ఎరోనాటిక్ ను పక్కనబెట్టి అనుభవంలేని రిలయన్స్ డిఫన్స్ ను ఫ్రాన్స్ సంస్థతో భాగస్వామిని చేసిన మోడీ సర్కార్ నిజానిజాలు తేల్చాలని.. భారత్-ప్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం.. గతంలో యూపీఏలో చేసుకున్న ఒప్పందం.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం.. వ్యత్యాసాలు..ఫ్రాన్స్ కంపెనీకి రిలయన్స్ సంస్థ ఎలా భాగస్వామిగా చేరిందనే అంశం మీద విచారణ జరగనుంది.

bjp 09102018 3

మరో పక్క కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు కూడా మోడీని ఈ విషయంలో విమర్శించారు. రాఫెల్ ఒప్పందాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) నుంచి లాక్కుని అనిల్ అంబానీకి ఇచ్చారంటూ తప్పుపట్టారు. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో మంగళవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ, రూ.45,000 కోట్ల మేరకు బకాయిలు ఉన్న అనిల్ అంబానీకి 'హాల్' నుంచి గుంజుకున్న రాఫెల్ ఒప్పందాన్ని మోదీ కట్టబెట్టారని చెప్పారు. ఇదే విషయాన్ని తాను పార్లమెంటులో ప్రశ్నించినప్పుడు మోదీ తన కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోయారని అన్నారు. ఒక్కో రాఫెల్ యుద్ధ విమానం ధరను రూ.526 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు ప్రధాని పెంచేశారని ఆరోపించారు. రాఫెల్ ఒప్పందం ఖరారుకు ప్రధాని స్వయంగా అంబానీని తన వెంట పెట్టుకుని వెళ్లారని చెప్పారు. తన జీవితంలో ఎప్పుడూ ఒక్క విమానం కూడా తయారు చేయని అనిల్ అంబానీకి ఈ డీల్ ఎలా ఇచ్చారని ఎద్దేవా చేశారు.

ఏపీలో జల వనరులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటేలా ఎఫ్1 హెచ్2ఓ పవర్‌బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కొత్త రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్న మొట్ట మొదటి ప్రపంచస్థాయి పోటీలు కనుక ఈ జల క్రీడలను అందరూ మెచ్చేలా ఘనంగా నిర్వహించాలని చెప్పారు. నవంబరు 16 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఎఫ్1 హెచ్2వో పవర్ బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలకు చేస్తున్న ఏర్పాట్ల పై 30 శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి తన కార్యాలయంలో సమీక్షించారు. కృష్ణా, గోదావరి పుష్కరాలకు అంచనాలకు మించిన జనం వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈసారి అంతకు మించిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

cbn review 09102018 2

వివిధ ప్రాంతాల నుంచి యువకులు ఈ పోటీలను చూసేందుకు విజయవాడ వస్తారని, 2, 3 లక్షల మంది వచ్చినా సరిపోయేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిధులు, క్రీడాకారులు, పత్రికారంగానికి చెందిన వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈరోజు నుంచి ప్రతి ఒక్క రోజూ విలువైనదేనని, పోటీలకు చేస్తున్ ఏర్పాట్లపై నిశిత పర్యవేక్షణ జరపాలని చెప్పారు. ముఖ్యంగా, విద్యార్ధుల భాగస్వామ్యం తీసుకోవాలని అన్నారు. ‘జల వనరులే రాష్ట్రానికి వరం. జల వనరులకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నామో ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేలా పోటీలకు అనుబంధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. పర్యాటక ప్రాధాన్యం గురించి విద్యార్ధులకు అవగతం అయ్యేలా వివిధ పోటీలు పెట్టాలని, కార్యగోష్టి నిర్వహించాలని తెలిపారు. అలాగే, అంతర్జాతీయ క్రీడాకారులకు మన ఘనమైన వారసత్వ గొప్పతనాన్ని తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కింది స్థాయి వరకు వివిధ వర్గాలతో నిర్వహణా కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు.

cbn review 09102018 3

ఎఫ్‌1 హెచ్‌2ఓ పవర్‌ బోటు రేసింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై ఈ సమావేశంలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం కె మీనా ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. విజయవాడ ప్రకాశం జలాశయమే వేదికగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. అమరావతిలో జరిగే పోటీల్లో 10 బృందాలకు గాను ఒక్కో జట్టు నుంచి 50 సభ్యులు చొప్పున 500 మంది క్రీడాకారులు వస్తున్నట్టు తెలిపారు. వీరికి అందించే ఆహారంలో ఆంధ్ర వంటకాలను అందించాలని నిర్ణయించామన్నారు. ఎక్కువ మంది ప్రజలు పోటీలను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒకేసారి లక్షమంది కూర్చొని వీక్షించేలా బాల్కనీల ఏర్పాటు చేస్తున్నామని, వీఐపీ, వీవీఐపీ, జట్టు సభ్యులు, జట్టుతో వచ్చిన సభ్యులు, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలు ఉంటాయని తెలిపారు. విజయవాడ, గుంటూరు నగరాలలో ఉన్న హోటళ్లలో 4,500 గదులను బుకింగ్‌ చేసి వుంచామని చెప్పారు. ఇవిగాక మరో 150 ఇళ్లను అద్దెకు తీసుకున్నామన్నారు. ఎఫ్‌1 హెచ్‌2ఓ ఛాంపియన్‌షిప్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు.

ఒకప్పుడు చంద్రబాబు నీటి కుంటలు అంటే నవ్విన వారు, తాజగా చంద్రబాబు పంట కుంటలు అన్నా నవ్వారు.. కాని, కేంద్ర ప్రభుత్వం ఈ పంట కుంటల ప్రాముఖ్యత గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఈ పంట కుంటల తవ్వకం మొదలు పెట్టమని రాష్ట్రాలని కోరింది. దేశమంతా పెద్ద ఎత్తున పంట కుంటలు తవ్వుతున్నాం అని చెప్పి, లక్ష వరకు పంట కుంటలు తవ్వారు. కాని మన రాష్ట్రంలోని ఒక్క అనంతపురం జిల్లాలోనే లక్ష పంట కుంటలు తవ్వి, దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేసారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒకప్పుడు అనంతపురం అంటే, కరవుకు నిదర్శనంలా నిలిచే ప్రాంతం. తీవ్ర వర్షాభావం. 500 అడుగుల లోతు బోరు వేసినా చుక్క నీరు పడని పరిస్థితి. కానీ, ఇలాంటి ప్రదేశంలో పాతాళ గంగ పై పైకి వస్తుంది. జిల్లాలో వ్యవసాయ భూముల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో భాగంగా పంట కుంటలు తవ్విస్తున్నారు.

farm ponds 09102018 2

దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఈ జిల్లాలో పడిన ప్రతి వాన చినుకునూ ఒడిసిపట్టి భూమిలోకి ఇంకించే ప్రయత్నం చేస్తుండడంతో, అనంతపురానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జిల్లాలో ‘లక్ష’ పంట సంజీవని సేద్యపు కుంటలు నిర్మించి రికార్డు సొంతం చేసుకుంది. సోమవారం నాటికి 1,00,405 కుంటలు తవ్వడం పూర్తయింది. నాలుగేళ్లలో ఈ ఘనత సాధించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నాలుగేళ్లల్లో 5,81,898 కుంటలను తవ్వారు. ఇందుకు రూ.2,225.5 కోట్లు వెచ్చించారు. 94 వేల కుంటలతో చిత్తూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. సామాజిక ఉద్యమంలా మొదలై సేద్యపు కుంటల తవ్వకం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సామాజిక ఉద్యమంలా ఆరంభమైంది.

farm ponds 09102018 3

ప్రతి రైతు తమ పొలంలో కుంటను తవ్వుకునేలా చైతన్యం కల్పించారు. జిల్లాలో తొలి ఏడాది 2,075 కుంటలను తవ్వారు. 2016-17లో అప్పటి కలెక్టర్‌ కోన శశిధర్‌, పీడీ నాగభూషణం ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ఏడాదే 54,272 సేద్యపు కుంటలు తవ్వించి రికార్డు నెలకొల్పారు. 2017-18లో 25,790 కుంటలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సోమవారం(8న) నాటికి 18,268 కుంటలు పూర్తి చేసి.. లక్ష కుంటలు తవ్వాలన్న లక్ష్యాన్ని సాధించారు. ఇందుకోసం రూ.542.58 కోట్లు ఖర్చు పెట్టారు. జిల్లాలో లక్ష కుంటల తవ్వకాన్ని పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్‌ అభినందనలు తెలియజేసినట్లు డ్వామా పీడీ జ్యోతిబసు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

మిల్లర్లలో క్రమశిక్షణ ఉండాలి..పద్ధతి ప్రకారం పనిచేయకపోతే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. రాష్ట్రం ధాన్యం సేకరించినా ఇప్పుడు తీసుకోబోమని కేంద్రం లేఖరాసిందని, ఒక సీజన్ నుంచి మరొక సీజన్ వరకు సాగదీస్తే ఎలా అని కేంద్రం ప్రశ్నిస్తుంటే మిల్లర్లు జాప్యం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. నిర్ణీత సమయంలో ప్రొక్యూర్‌మెంట్ పూర్తికావాల్సిందే అని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో లెవీ సేకరణకు మరో 30 రోజులు గడువు కావాలని మిల్లర్లు కోరిన నేపథ్యంలో మంత్రులు పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రితో ఈ విషయమై చర్చించారు.

millers 09102018 2

మిల్లర్ల సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది.. కృష్ణాడెల్టాకు ఒకప్పుడు నీళ్లులేక ఇబ్బందులు ఉండేవి.. ఇప్పుడు పట్టిసీమతో కష్టాలు గట్టెక్కించాం.. గోదావరి డెల్టాకు రెండు పంటలకు నీరందిస్తున్నాం.. ఎవరో వచ్చి రెచ్చకొడితే రెచ్చిపోవటం.. కోర్టులకు వెళ్లి ఇబ్బందులు పెట్టాలనుకోవటం సరికాదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తున్నాం.. నీతివంతమైన పాలన అందిస్తున్నామని తెలిపారు. రూ 200 కోట్ల మేర ఎన్‌క్యాష్ చేసే పరిస్థితి ఆఖరి నిమిషంలో ప్రభుత్వం చొరవ తీసుకుని సరిదిద్దింది. నాకు రైతులు, మిల్లర్లు సమానమే.. ప్రభుత్వానికి మచ్చతెచ్చే పనులు చేయద్దు.. ప్రభుత్వం ఇచ్చిన వ్యవధిని వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణకు మిల్లర్లకు మరో 30 రోజుల పాటు గడువు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.

millers 09102018 3

సమస్యపై ఎఫ్‌సీఐతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రులు చర్చించారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులంతా ఏకతాటిపై నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే బ్యాంక్ గ్యారంటీలు రావని, రుణాలు మంజూరు కావని ఇబ్బందులతో పాటు పరిశ్రమ మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని మిల్లర్లు వాదించారు. స్టాక్‌లేని మిల్లులకు పొడిగింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాన్ని మోసం చేయాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. మంత్రులు పితాని, ప్రత్తిపాటి మాట్లాడుతూ మిల్లర్ల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, 30 రోజులు గడువు పొడిగించేందుకు సమ్మతించిందని చెప్పారు. తాత్కాలికంగా అయినా గిడ్డంగులను ఏర్పాటు చేస్తామని ఏపీ ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read