ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎంత అన్యాయం చేస్తుందనేది ఈ సంఘటనతో మరోసారి రుజువైంది. ప్రతి విషయంలోనూ మనల్ని ఎదురు దెబ్బ కొట్టడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మరిపోయింది. ఏపికి మోడీ మరోసారి మొండిచేయి చూపించారు. రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు ఈ ఏడాది మార్చిలోనే విడుదల చేయాల్సి ఉంది. అయితే, నిధులకు సంబంధించిన యూసీలు, ఖర్చుల వివరాలు అందించలేదని సాకు చూపించి, రూ.350 కోట్లను ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కితీసేసుకుంది.

ap backward area 08102018 2

అయితే వెంటనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీని పై స్పందించి మార్చి నెలాఖరు కల్లా యూసీలు, ఖర్చుల వివరాలను అందించింది. ఆర్నెళ్లు గడుస్తున్నా ఈ నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఏపీతో పాటు పెండింగ్‌లో పెట్టిన తెలంగాణకు చెల్లించాల్సిన రూ.450 కోట్ల నిధులను మాత్రం వారం రోజుల క్రితమే విడుదల చేయటంతో, కేంద్రం ఏపికి ఎంత అన్యాయం చేస్తుందో అర్థం అవుతుంది. అదే విషయమై కేంద్ర ఆర్థిక, డీవోపీటీ అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు.

ap backward area 08102018 3

అయితే, ఏపీ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పేశారు. ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.50 కోట్లు చొప్పున మొత్తం రూ.350 కోట్లు చెల్లించకుండా , తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు మాత్రం రూ.450 చెల్లించటంతో వస్తోన్న కేంద్రం మన ఏపీకి ఎంత అన్యాయం చేస్తుందో ఈ విషయంతో మరోసారి రుజువైంది. యుసిలు ఇవ్వలేదు అంటూ, గత కొంత కాలంగా హడావిడి చేసారు. కాని, మేము అప్పటికే అన్ని యుసిలు ఇచ్చామని, ఏపి ప్రభుత్వం బయట పెట్టింది. దీని పై జాతీయ స్థాయిలో చంద్రబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నిధులు ఖాతాలో వేసి మరీ వెనక్కు తీసుకున్నారు. ఎంత పోరాటం చేసినా, ఇప్పటికీ ఏపికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా, తెలంగాణాకి మాత్రం ఏ అభ్యంతరం లేకుండా రిలీజ్ చేసారు.

ఓవైపు ప్రధాని స్వచ్ఛ భారత్ అంటూ, ఒక ఉద్యమంలా చేస్తుంటే, మరోవైపు బీజేపీ నేతలు మాత్రం, కంపు పనులు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జనలు చేయరాదంటూ, మోడీ ప్రచారం చేస్తుంటే, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం అలాంటివేం పట్టించుకోవడం లేదు. రాజస్థాన్ బీజేపీ నాయకుడు, మంత్రి అయిన శంభూ సింగ్ ఖేటసర్ బహిరంగ మూత్ర విసర్జన చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. దీంతో నెటిజన్లు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అజ్‌మేర్‌లో పర్యటించారు మంత్రి శంభూసింగ్, ఈనేపథ్యంలో ఓ గోడ వద్ద ఆయన మూత్ర విసర్జన చేశారు.

bjp 08102018 2

ఆ గోడపై బీజేపీ పోస్టర్ కూడా ఉంది. ఆ పోస్టర్ లో రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుందరా రాజే కూడా ఉన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లంతా తనపై ట్రోల్ చేస్తుండటంతో దీనిపై స్పందించారు మంత్రి. ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం తప్పుకాదన్నారు. అయితే అది నిర్మానుష్యప్రాంతమ ఉండాలన్నారు మంత్రి. తాను మూత్ర విసర్జన చేసింది నిర్మానుష్య ప్రాంతంలో అంటూ చెప్పుకొచ్చారు.

bjp 08102018 3

అలాంటి ప్రాంతంలో ఎవరైనా మూత్ర విసర్జన చేస్తే వ్యాధులు వ్యాపించవన్నారు. ఈ వివరణపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతమైతే అక్కడ బీజేపీ పోస్టర్ ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి సొంత పార్టీ నేతలలే చెడ్డ పేరు తెస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద మోడీ స్వచ్ఛ భారత్ మిషన్‌కు సొంత పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బీజేపీ నేతలు ఫోటోలు కోసం ఫోజులు ఇస్తూ, రోడ్డు మీద చెత్త వేసి, ఆ చెత్త ఊడవటం లాంటివి చూసాం, ఈ సంఘటన మాత్రం హైలైట్..

జగన్ సభలో ప్రసంగిస్తుండగా అంబులెన్స్ రావడం.. ఆ అంబులెన్స్‌ను ప్రభుత్వమే పంపించి వికృత చర్యలకు పాల్పడుతుందని జగన్ శాపనార్థాలు పెట్టడం.. ఆ అంబులెన్స్‌కు దారిచ్చి పంపాలని జగన్ సభకొచ్చిన కార్యకర్తలకు పిలుపునివ్వడం.. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ అంబులెన్స్‌లో పేషెంటే లేడని జగన్ చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే జగనే ఈ డ్రామాకు తెరలేపాడని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించాయి. అయితే హాట్ టాపిక్‌గా మారిన ఈ అంశంపై మంత్రి దేవినేని ఉమ స్పష్టత ఇచ్చారు. ఈ విషయంపై ఆరా తీశామని.. సభలో పాల్గొన్న ఓ వైసీపీ కార్యకర్తకు దెబ్బతగిలితే ఆ పార్టీ కార్యకర్తలే అంబులెన్స్ పంపించాలంటూ ఫోన్‌ చేశారని తెలిపారు. ఈ విషయంపై నిజానిజాలు తెలుసుకోకుండా జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

jaganambu 08102018 2

ఆదివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన సభలో 108 వాహనం వెళ్తుంటే, జగన్ ప్రభుత్వం పై వాడిన భాష నికృష్టమని మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. గరివి మండలం తాటిపూడి గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త వల్లూరి శ్రీనివాస్ లారీ లో జగన్ సభ కు వచ్చాడని తెలిపారు. అతన్ని ఆటో ఢీ కొట్టగా, వైకాపా కార్యకర్తలే 108 వాహనంలో తరలించారని చెప్పారు. అతను ప్రస్తుతం మొవ్వ గోపాల్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ప్రత్యామ్నాయ రోడ్డు లేక జగన్ సభ జరుగుతున్న దారి లో 108 వాహనాన్ని తీసుకెళ్లారని తెలిపారు. నీ సభ కి వచ్చిన కార్యకర్తకి దెబ్బ తగిలితే, అతన్ని నీ కార్యకర్త లే ఆసుపత్రికి తరలిస్తే, దానికి ప్రభుత్వం పై విమర్శలు చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. దిగజారి జగన్ డ్రామా లు, నాటకాలు ఆడుతున్నాడని దుయ్యబట్టారు.

 

jaganambu 08102018 3

2019 లో బీజేపీ కి 12 ఎంపి సీట్లు, వైసిపి కి 21 సీట్లు వస్తాయని సర్వే లను నమ్ముకుని జగన్ ఊహాలోకంలో బతుకుతున్నాడన్నారు. అవినీతి బురదలో కూరుకుపోయిన జగన్ 420 అని 2014 లో ప్రజలు పక్కన పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. శాసన సభ కు రాకుండా, కోట్ల జీతభత్యాలు తీసుకుంటూ, ఉత్తర కుమారుడు లా పారిపోయిన జగన్ కు తమను విమర్శించే అర్హత ఎక్కడుందని మండిపడ్డారు. శాసనసభ లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేక రోడ్ల మీద తిరుగుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఐటీ దాడులకు ప్రభుత్వం భయపడుతోందని జగన్ మాట్లాడుతున్నాడని, 1982 మార్చి లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన నాటి నుంచి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోరాటం చేసిన చరిత్ర తమదన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసి, అరెస్ట్ అయ్యి జైలు కి వెళ్లామని గుర్తుచేశారు. అలాంటి మేము ఐటి దాడులకు ఎందుకు భయపడతామన్నారు.

కొత్త ఛీఫ్ జస్టిస్ రావటంతోనే, బీజేపీకి బాంబు పేలింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య రగులుతున్న వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్‌లను సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. ఈ నెల 10న వీటి పై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. తొలి పిటిషన్‌ను సుప్రీంకోర్టు లాయర్ వివేక్ ధండా దాఖలు చేశారు. ఈ ఒప్పందం తాలూకు వివరాలతో పాటు ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాల ఒప్పందాల మధ్య ధరల వ్యత్యాసాన్ని సీల్డ్ కవర్‌లో ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని వివేక్ కోరారు.

rafael 08102018

యూపీఏ హయాంలో రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు, ఎన్డీయే హయాంలో విమానాల కొనుగోలుకు ఎంత కేటాయించారనే దానికి సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిందిగా న్యాయవాది వినీత్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు రిలయన్స్‌, డసో ఏవియేషన్‌ మధ్య ఈ ఒప్పందం ఏ విధంగా జరిగిందో తెలపాల్సిందిగా కోరారు. ఫ్రాన్స్‌ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్, రిలయన్స్ డిఫెన్స్ మధ్య జరిగిన ఒప్పందం వివరాలు కూడా వెల్లడించాలని ఆయన కోరారు. కాగా ఈ యుద్ధ విమానాల ఒప్పందాల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయంటూ మరో న్యాయవాది ఎమ్ఎల్ శర్మ ఇంతకు ముందే సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.

 

rafael 08102018

రాజ్యాంగంలోని 253 అధికరణాన్ని ఈ ఒప్పందం ఉల్లంఘిస్తోందనీ... ‘‘అవినీతిమయమైన’’ రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. రఫేల్‌ యుద్ధ విమానాల తయారీకి రిలయన్స్‌ కంపెనీని భాగస్వామిగా చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వమే సూచించిందంటూ ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన వెంటనే మాట మార్చారు. ఇందులో భారత ప్రభుత్వం ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రఫేల్‌‌ యుద్ధ విమానాల ఒప్పందంలో ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. యుద్ధ విమానాల తయారీలో ఎటువంటి నైపుణ్యం, అనుభవం లేని రిలయన్స్‌ కంపెనీని ఎందుకు ఎంపిక చేసుకున్నారో చెప్పాల్సిందిగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read