ఇద్దరూ ఏపిలో ప్రతిపక్ష నాయకులు అని చెప్పుకు తిరుగుతున్నారు... తీరా చూస్తే ఇక్కడ ప్రజా సమస్యల పై మాత్రం వీరికి పట్టదు.. ఒకతనేమో సియం అయ్యేదాకా ఏమి చెయ్యను అంటాడు.. ఇంకో అతను, చంద్రబాబు మళ్ళీ సియం అవ్వకుండా చెయ్యటమే నా పని అంటాడు... వీళ్ళ ఇద్దరు చిందులు గత పది రోజులుగా వ్యక్తిగతంగా వెళ్ళిపోయాయి. ఒకాయన చింతమనేని నామస్మరణ చేస్తుంటే, ఇంకో అతను లోకేష్ నామస్మరణ చేస్తున్నాడు. వీరికి తన పని తాను చేసుకుపోయే చంద్రబాబే సాఫ్ట్ టార్గెట్. కెసిఆర్ ఆంధ్రా వారి పై అన్ని మాటలు అంటున్నా నోరు మెదపరు. 7 మండలాలు మన హక్కు, సీలేరు ప్రాజెక్ట్ మనది, మన విద్యుత్ వాడుకుని మనల్నే కెసిఆర్ తిడుతుంటే, ఈ ఇద్దరికీ కెసిఆర్ పేరు తలిచే దమ్ము లేదు..
కెసిఆర్ సంగతి సరే.. ఎందుకంటే వీళ్ళ బ్రతుకు హైదరాబాద్ లో బ్రతకాలి కాబట్టి, భయపడుతున్నారు అనుకోవచ్చు.. మరి కేంద్రం చేస్తున్న అన్యాయం పై ఎందుకు మాట్లడరు ? ఒకరికి కేసుల భయం, మరొకరికి పెన్ డ్రైవ్ ల భయమా ? నిన్న కేంద్రం, మన రాష్ట్ర ప్రజలని ఎలా కవ్వించిందో అందరూ చూసారు.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం.. తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల(అవిభక్త) అభివృద్ధికి ప్రత్యేక సాయం కింద 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తాజాగా రూ.450 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు మొండిచెయ్యి చూపించింది. విభజన చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారమే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లను కేంద్రం ఇవ్వాల్సి ఉంది.
2017-18 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకుంది. కేంద్రం చర్యపై రాష్ట్రం ఇప్పటికే తీవ్ర ఆందోళన, నిరసన తెలియజేసింది. దీనిపై చీమ కుట్టినట్టయినా లేని కేంద్రం మరోసారి ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేసింది. 2018-19 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు పైసా ఇవ్వకపోవడం, 2017-18కి సంబంధించిన బకాయిలు రూ.350 కోట్ల గురించీ పట్టించుకోకపోవడం కేంద్రం కక్ష సాధింపునకు నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ఇంత జరుగుతున్నా, ప్రతిపక్షం అని చెప్పుకునే జగన్, పవన్, ఇలాంటి విషయం పై కేంద్రాన్ని నిలదియ్యాలి అంటే భయం.. కేంద్రం పై ఆందోళన చెయ్యాలి అంటే భయం.. కాని కుల గొడవలు పెట్టటానికి మాత్రం చింతమనేని నామస్మరణ మాత్రం చేస్తారు.. వీళ్ళు దమ్ముల గురించి మాట్లడతారు....