ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎంత అన్యాయం చేస్తుందనేది ఈ సంఘటనతో మరోసారి రుజువైంది. ప్రతి విషయంలోనూ మనల్ని ఎదురు దెబ్బ కొట్టడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మరిపోయింది. ఏపికి మోడీ మరోసారి మొండిచేయి చూపించారు. రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు ఈ ఏడాది మార్చిలోనే విడుదల చేయాల్సి ఉంది. అయితే, నిధులకు సంబంధించిన యూసీలు, ఖర్చుల వివరాలు అందించలేదని సాకు చూపించి, రూ.350 కోట్లను ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కితీసేసుకుంది.
అయితే వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని పై స్పందించి మార్చి నెలాఖరు కల్లా యూసీలు, ఖర్చుల వివరాలను అందించింది. ఆర్నెళ్లు గడుస్తున్నా ఈ నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఏపీతో పాటు పెండింగ్‌లో పెట్టిన తెలంగాణకు చెల్లించాల్సిన రూ.450 కోట్ల నిధులను మాత్రం వారం రోజుల క్రితమే విడుదల చేయటంతో, కేంద్రం ఏపికి ఎంత అన్యాయం చేస్తుందో అర్థం అవుతుంది. అదే విషయమై కేంద్ర ఆర్థిక, డీవోపీటీ అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు.
అయితే, ఏపీ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పేశారు. ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.50 కోట్లు చొప్పున మొత్తం రూ.350 కోట్లు చెల్లించకుండా , తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు మాత్రం రూ.450 చెల్లించటంతో వస్తోన్న కేంద్రం మన ఏపీకి ఎంత అన్యాయం చేస్తుందో ఈ విషయంతో మరోసారి రుజువైంది. యుసిలు ఇవ్వలేదు అంటూ, గత కొంత కాలంగా హడావిడి చేసారు. కాని, మేము అప్పటికే అన్ని యుసిలు ఇచ్చామని, ఏపి ప్రభుత్వం బయట పెట్టింది. దీని పై జాతీయ స్థాయిలో చంద్రబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నిధులు ఖాతాలో వేసి మరీ వెనక్కు తీసుకున్నారు. ఎంత పోరాటం చేసినా, ఇప్పటికీ ఏపికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా, తెలంగాణాకి మాత్రం ఏ అభ్యంతరం లేకుండా రిలీజ్ చేసారు.