అందరి మీద నోరేసుకుని పడిపోయే మంత్రి రోజా, ఈ రోజు కేటిఆర్ ఆంధ్రప్రదేశ్ గురించి అంత హేళన గా మాట్లాడినా, ఆయనను చాలా సున్నితంగా విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో కేటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అభివృద్ధి పధంలో దూసుకుపోతుందని, ఆంధ్రప్రదేశ్ లో కనీసం నీళ్ళ సౌకర్యం లేదని, కరెంట్ లేదని, రోడ్లన్నీ గుంతల మయమని ఆయన చాలా ఎగతాళి చేసారు. ఏపి ప్రజలంతా తెలంగాణకు తరలి వచ్చి , హాయిగా జీవిస్తూ ఊపిరి పీల్చుకుంటున్నారని, ఆయన హేళన చేసారు. తన మిత్రుడు ఒకరు ఏపి కి వచ్చి చాల ఇబ్బందులు పడ్డారని కేటిఆర్ ఏపి పై తీవ్ర విమర్శలు చేసారు. దీని పైన వైసీపీ నేతలు కేటీఆర్ పైన విరుచుకు పడుతున్న వేళ, వైసీపీ మంత్రి రోజా అందరికీ షాక్ ఇచ్చారు. కేసీఆర్ తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, మీరు ఎక్కువ చించుకోకండి అనే విధంగా, రోజా, ఏకంగా కేసీఆర్ ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవటానికి తాను ప్రగతి భవన్ వచ్చినట్టు ఆమె చెప్పారు. ఒక పక్క ఇక్కడ ఉన్న వైసీపీ నేతలు, మంత్రులు అందరూ కేటీఆర్ పై విరుచుకు పడుతుంటే, రోజా కూల్ గా, కేసీఆర్ ఇంట్లో ఉండటంతో, నాటకం బయట పడటంతో వైసీపీ నేతలు షాక్ తిన్నారు.

roja 29042022 2

అయితే బయటకు వచ్చిన రోజా, మీడియాను చూసి కవర్ చేసారు. రోజా మాట్లాడుతూ, కేటీఆర్ ఒక్కసారి వచ్చి ఏపిలో పర్యటించాలని , అప్పుడే ఆయనకు ఆంధ్రప్రదేశ్ లో జరిగే అభివృద్ధి అర్ధమవుతుందని ఆమె చెప్పారు. పొరుగు రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో ఏపినే ఆదర్శంగా తీసుకుంటున్నాయని కూడా చెప్పారు. కేటీఆర్ వస్తే ఏపిలో రోడ్లన్ని తిప్పి చూపిస్తామని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సచివాలయ వ్యవస్థ చూసే, తమిళనాడులో కూడా ఆ వ్యవస్థ పెట్టారని, మా జగన్ పాలన అంటే ఇలా ఉంటుందని కూడా రోజా చెప్పారు. తనను కెసిఆర్ ఒక కూతురు లా చూసుకుంటారని కూడా చెప్పారు. ఒక పక్క మన రాష్ట్రాన్ని కెసిఆర్,కేటీఆర్ అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వారి దగ్గరకు ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళడం ఏంటో, .అని ప్రజలు అనుకుంటుంటే, వైసీపీ నేతలు మాత్రం, మేమేదో మీడియా ముందు కేటీఆర్ ని తిడుతున్నట్టు షో చేస్తుంటే, రోజా వెళ్లి మొత్తం పాడు చేసారని, నాటకం ప్రజలకు అర్ధమై పోతుంది కదా అని బాధ పడుతున్నారు పాపం...

ప్రతి ఆంధ్రుడు సిగ్గు పడాలి.. పక్క రాష్ట్రం వారు మనలని హేళన చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు పక్క రాష్ట్రంలో ఉండే కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ని హేళన చేస్తూ మాట్లాడిన మాటలు విని, ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కేటీఆర్ క్రెడాయ్ సదస్సులో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడని, సంక్రాంతికి సొంత ఊరికి వెళ్ళాడని, అక్కడ దారుణమైన రోడ్డులు చూసి, నీళ్ళు లేక, కరెంటు లేక ఇబ్బంది పడ్డానని చెప్పాడని, మళ్ళీ తిరిగి హైదరాబాద్ వస్తే కానీ తనకు ఊపిరి ఆడ లేదని చెప్పాడని, ఆంధ్రప్రదేశ్ లో నరకం అంటే ఏంటో కనిపించిందని, తెలంగాణాలో ప్రశ్నిస్తున్న వారిని, బస్సులు వేసి ఆంధ్రప్రదేశ్ పంపిస్తే, అక్కడ పరిస్థితి చూసి ఎలా ఉందో, ఇక్కడ హైదరాబాద్ లో ఎలా ఉందో వారికే తెలుస్తుంది అంటూ, కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇలాంటి వాటికి ఉదాహరణగా చెప్పుకుంటున్నారు అంటే, మన పరిస్థితి రోజు రోజుకీ ఎలా ఉంటుందో చూస్తేనే అర్ధం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం క-రో-నా సహాయం కోసం ఇచ్చిన సొమ్మును  వేరే పథకాలకు ఖర్చు చేసిందని పిటిషనర్ సుప్రీం కోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలు చేసారు. కేంద్రం క-రో-నా మృతుల కుటుంబాలకు ప్రకటించిన నిధులను ఏపి ప్రభుత్వం ఎలా దారి మళ్ళిస్తారు అంటూ  సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. కేంద్రం ఇచ్చిన రూ.1100 కోట్లను క-రో-నా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా మీరు వేరే వాటికి ఎందుకు ఖర్చు పెట్టారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై సుప్రీం కోర్ట్ సీరియస్ అయ్యి, వార్నింగ్ ఇచ్చింది. దీని పై మే 13 తారీఖు లోగా పరిహారంకు  సంభందించిన వివరణతో అఫిడవిట్ దాఖలు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శికి  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే మీకు ఆఖరి సారి చెప్పడం అని , ఇంకోసారి ఇలా జరిగితే తీవ్ర పరిణామలు ఎదుర్కోవడానికి ఏపి ప్రభుత్వం సిద్దంగా ఉండాలని సుప్రీం కోర్ట్ ఘాటుగా హెచ్చరించింది.

విజయసాయి రెడ్డి ఏం చెప్పారో , ఏం చేసారో తెలియదు గాని ఒక్క రోజులోనే విజయ సాయి రెడ్డికి,  జగన్  అత్యంత కీలక పదవి ఇచ్చి, అందలం ఎక్కించారు. నిన్నమొన్నటి దాక వైసిపి పార్టీలో విజయ సాయి రెడ్డి పని అయిపోయిందని, జగన్ ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారని, వార్తలొచ్చిన నేపద్యంలో జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం  ప్రజలకే  కాక , వారి సొంత పార్టీలో వారికి కూడా అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ  చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన ఏకంగా సజ్జలకు ఉన్న అధికారాలనే కొట్టేసారు. నిన్నటి  వరకు పార్టీ పై పూర్తి పట్టు  సజ్జలకే ఉండేది. అంటే, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు ఇలా అన్ని బాధ్యతలు, ఇపుడు ఆ వ్యవహారాలు కొన్ని విజయ సాయి రెడ్డి  గ్రిప్ లోకి వచ్చేసాయి.  విజయ సాయి రెడ్డి కి అసలు పార్టీలో నే స్థానం ఉండదని , జగన్ కి అతని  పై నమ్మకం పోయిందని  అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఒక్క రాత్రిలోనే సీన్ అంతా మారిపోయింది. పార్టీ పై పూర్తి పట్టు విజయసాయి రెడ్డికే  దక్కింది. దీని  వెనక ఉన్న కథ ఏమిటో వైసిపి నేతలకే అర్ధం కావట్లేదు. అయితే జగన్ ఆక్రమస్తుల గుట్టు అంతా విజయసాయి రెడ్డి కి తెలుసనీ, ఒక వేళ ఆయనను పక్కన పెడితే అప్రూవర్ మారతనని  జగన్ను బెదిరించి ఉంటాడని , అందుకే రాత్రికి రాత్రే ఆయనకు పదవులు ఇచ్చి నోరు మూపించారని టిడిపి నేతలు వాపోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read