"తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీ ఉందా రా అయ్యా తెలంగాణాలో.. 0.1 శాతం ఉన్న పార్టీ అది.. అలాంటి పార్టీ గురించి ఎవరన్నా పట్టించుకుంటారా ?" ఇది కెసిఆర్ అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే చెప్పిన మాట. అసలు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేనే లేదని, చంద్రబాబు అనేవాడు మాకు అనవసరం అని కెసిఆర్ చెప్పాడు... ఇన్ని చిలక పలుకులు పలికిన కెసిఆర్, ఈ రోజు అదే 0.1 శాతం ఉన్న తెలుగుదేశం పార్టీని చూసి వణికిపోతున్నాడు. ఈ రోజు 100 మాటలు మాట్లాడితే, 80 మాటలు చంద్రబాబు చంద్రబాబు అంటూ నామస్మరణ చేసాడు. చంద్రబాబు రాక్షసుడు అని, దొంగ అని, ఇలా నోటికి ఏమి వస్తే అది మాట్లాడాడు.

kcr 03102018

రేవంత్ రెడ్డి అన్నట్టు, రెండు ఏస్తే కాని లెగవడు, నాలుగు ఏస్తే కాని నుంచోడు, అలాంటిది ఈ రోజు 10 ఏసాడో ఏమో, పిచ్చి బూతులతో ప్రచారం మొదలు పెట్టాడు. నాలుగు ఏళ్ళు అయినా, మీరు ఏమి చేసారో చెప్పుకుని ఎన్నికలకు వెళ్ళాలి కాని, ఇంకా ఆంధ్రా వాళ్ళ పై, చంద్రబాబు పై పడితే ఏమి వస్తుంది ? అయినా ఈ రోజు కెసిఆర్ మీటింగ్ చూస్తూనే, అర్ధమవుతుంది, చంద్రబాబు అంటే కెసిఆర్ కు ఎంత భయమో, తెలుగుదేశం పార్టీ చేసే డామేజ్ ఏంటో. మోడీతో కలిసి, కుట్రలు చెయ్యటం తప్ప, కెసిఆర్ చేసింది ఏమి లేదు.

kcr 03102018

వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, సొంతగా రాష్ట్రం వచ్చినా ఇప్పటికీ, ఆంధ్రా వాళ్ళని బూచిగా చూపించటం ఏంటి ? మీకు సొంత రాష్ట్రం వచ్చి 4 ఏళ్ళు అయ్యింది. 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉన్నా, మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. ఇంకా మా మీద ఏడుపులు ఏంటి ? సరే చంద్రబాబు రాక్షసుడే అనుకుందాం... మరి ఈ రాక్షసుడితో 2009లో పొత్తు ఎందుకు పెట్టుకున్నావ్ ? చంద్రబాబుని గెలిపించండి అని ఊరు ఊరు తిరిగి ఎందుకు ప్రచారం చేసావ్ ? ఈ వీడియో చూడు కెసిఆర్... ఒకసారి నీ మాటలు గుర్తు తెచ్చుకో... చంద్రబాబు రాక్షసుడో, రక్షకుడో తెలుస్తుంది.. https://youtu.be/zjK_R12lSWc

తెదేపా సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేయడం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. కిడారి, సోమ మృతిపై టీడీపీ సమన్వయ కమిటీ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీలో తాజాగా చేరిన వ్యక్తిని మావోయిస్టులు ట్రాప్‌ చేసి కిడారి, సోమ కదలికలపై నిఘా పెట్టారని...ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారమే హత్యలు చేశారని తెలిపారు. మావోయిస్టులు సంచలనం కోసమే ఈ హత్యలు చేశారని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాల కోసం వైఎస్‌ హయాంలోనే ఆమోదం తెలిపారన్నారు. తాము అప్పుడు...ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

cbn somu murder 03102018

మరో పక్క, ఎంవీవీఎస్‌ మూర్తికి కూడా నివాళులు అర్పించారు. ఎంవీవీఎస్‌ మూర్తి తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో మూర్తి చనిపోవడం చాలా బాధాకరమన్నారు. రహదారి భద్రత ఉండే అమెరికాలోనూ ఇలాంటి ఘటన జరగడం తనను కలచివేసిందన్నారు. పార్టీ అనేక సంక్షోభాలకు గురైన సమయంలో ఆయన అండగా నిలిచారన్నారు. విశాఖలో పార్టీ కార్యాలయాన్ని అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. ఇటీవలి కాలంలో తెదేపా.. హరికృష్ణ, కిడారి సర్వేశ్వరరావు, మూర్తి వంటి కీలక నేతలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

cbn somu murder 03102018

అనంతరం ఎంవీవీఎస్‌ మూర్తి చిత్రపటానికి చంద్రబాబు సహా మంత్రులు, తెదేపా ముఖ్యనేతలు నివాళులర్పించారు. ఇది ఇలా ఉంటే, ఈరోజు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగాల్సి ఉంది. అయితే మంగళవారం అమెరికాలోని అలస్కాలో జరిగిన రోడ్డుప్రమాదంలో గీతం యూనివర్శిటీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మృతిచెందారు. తెదేపాలో సీనియర్‌ నేతగా ఉన్న మూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తెదేపాను దెబ్బతీసేందుకేనని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం అమరావతిలో ఆయన మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో కీలక అంశాలపై చర్చించారు. తమ రెండు పార్టీలూ రాజకీయంగా కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనే సంకేతాలను గతంలో తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపినా.. ప్రధాని మోదీ మాయలో పడిన ఆయన అందుకు అంగీకరించలేదని చంద్రబాబు అన్నట్టు సమాచారం. నేతలతో తాజా రాజకీయ పరిణామాలు, మావోయిస్టుల కదలికలపైనా ఈ సమావేశంలో చర్చించారు.

cbn 03102018 2

భాజపా, వైకాపా, జనసేన కలిసి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని నేతలకు దిశానిర్దేశం చేశారు. అలిపిరిలో తనపై దాడికి పాల్పడిన వారే కుట్రపూరితంగా అరకులో జంట హత్యలకు పాల్పడ్డారని అన్నారు. ఓటుకు నోటు కేసుపైనా ఈ భేటీలో చర్చ జరిగింది. ఓటుకు నోటు కేసు దర్యాప్తు చేయాలని తెలంగాణ అనిశా కేంద్రాన్ని కోరిందని ఓ మంత్రి అన్నట్టు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఏపీ విషయంలోనూ ఇదే తరహా దాడులు జరిగే అవకాశం ఉందని మరో మంత్రి అన్నారని సమాచారం.

cbn 03102018 3

సీఎం, మంత్రులే లక్ష్యంగా కేంద్రం కుట్రలు పన్నుతోందని ఓ సీనియర్‌ నేత అన్నారు. తెలంగాణలో మహాకూటమి ఏర్పాటును కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారని ఓ మంత్రి అనగా.. భాజపా, జగన్‌, పవన్‌, కేసీఆర్‌ అంతా కలిసి తెదేపాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అడుగడుగునా రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీఎం విమర్శించారు. దిల్లీ శివారులో రైతులపై దమనకాండపైనా చర్చించారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయితే, అధికారంలోకి వచ్చి ఏపీలో తెదేపాను దెబ్బతీయాలని భాజపా కేసీఆర్‌తో ఆడిస్తున్న నాటకంగా ఈ సమావేశంలో నేతలంతా అభిప్రాయపడినట్టు సమాచారం.

తెలుగుదేశం పార్టీ నేతలను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తెదేపా మాజీ ఎంపీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం నుంచి తేరుకోక ముందే మరో కీలక నేత రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న విశాఖ మాజీ ఎంపీ, గీతం విద్యాసంస్థల అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి హఠాన్మరణం చెందడటం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మొదలుకొని ఎంవీవీఎస్‌ మూర్తి వరకు నలుగురు కీలక నేతలు రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందడం వారి కుటుంబాలకు శోకాన్ని.. తెదేపాకు తీరని లోటును మిగిల్చాయి.

tdp 03102018

2002లో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న ప్రముఖ తెదేపా నేత జీఎంసీ బాలయోగి సైతం ప్రమాదంలోనే మృతిచెందారు. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోవడంతో దుర్మరణం చెందారు. ఇటీవలే మావోయిస్టుల చేతిలో విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ దారుణ హత్యకు గురయ్యారు. ఆ విషాదం నుంచి పూర్తిగా బయటపడకముందే అదే జిల్లాకు చెందిన ఎంవీవీఎస్‌ మూర్తి రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో విశాఖ జిల్లా తెదేపాలో విషాదం నెలకొంది. కొద్ది రోజుల వ్యవధిలోనే కీలక నేతలంతా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

tdp 03102018

నందమూరి హరికృష్ణ మరణం నుంచి తెదేపా శ్రేణులు పూర్తిగా కోలుకోకముందే ఈ తెల్లవారు జామున మరో దుర్వార్త వినాల్సి వచ్చింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం విశ్వవిద్యాలయం అధినేత, తెదేపా ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మృతిచెందారు. మంగళవారం కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న వ్యాను ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. గీతం విద్యా సంస్థల అధినేతగా, పార్టీ ఎంపీగా మూర్తి విశేష సేవలందించారు. తెదేపా సంక్షోభంలో ఉన్న సమయంలో పార్టీకి ఆయన అండగా నిలిచారు.

Advertisements

Latest Articles

Most Read