వైసీపీలో కొత్తగా చేరిన నేతలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అప్పటి వరకూ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధినేత నేతలకు ఊహించని షాకిస్తున్నారు. మల్లాది విష్ణు కోసం వంగవీటి రాధాకు కేటాయించిన స్థానాన్ని మార్పు చేయడం, ఆనం కోసం బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని దూరం చేసుకోవడం, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్‌ను కాదని విడదల రజనీని సమన్వయకర్తగా నియమించడం, ఇప్పుడు తాజాగా ఇదే జిల్లా నుంచి పార్టీ కీలక నేత లేళ్ల అప్పిరెడ్డిని పక్కనపెట్టడం.. ఇలా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో అప్పటి వరకూ పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలు డీలా పడిపోతున్నారు.

lella 01102018 2

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై లేళ్ల అప్పిరెడ్డి గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఇలాంటి తరుణంలో పార్టీలో కొత్తగా చేరిన ఏసు రత్నంను పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అధిష్టానం నియమించడంతో లేళ్ల వర్గం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తమ నేతకు పార్టీ మొండిచేయి చూపడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రవేశాలకు లోనవుతున్నారు. ఈ విషయం తెలిసిన అప్పిరెడ్డి అనుచరులు కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాధాన్యత లేని చోట ఉండవద్దని, పార్టీ నుంచి బయటకు రావాలని అప్పిరెడ్డిపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. లేళ్ల మాత్రం మరోసారి అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్ ఏసురత్నంను గుంటూరు పశ్చిమం నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంపై అప్పిరెడ్డి వర్గం ఈ రోజు ఆందోళనకు దిగింది.

lella 01102018 3

తాము అభ్యంతరం వ్యక్తం చేసినా అయననే ఇన్ చార్జీగా కొనసాగించడంతో పార్టీ నుంచి వెళ్లిపోదామని ఆయన వర్గీయులు డిమాండ్ చేశారు. తాము నియోజకవర్గంలో పార్టీని బలపర్చేందుకు పనిచేస్తే సడెన్ గా బయటివ్యక్తికి నియోజకవర్గం బాధ్యతలు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ప్రస్తుతం అప్పిరెడ్డి వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవితో పాటు పశ్చిమం సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. గుంటూరు పార్లమెంట్ స్థానం విషయంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయం శ్రేణులను విస్మయానికి గురి చేసింది. గుంటూరు పార్లమెంట్ టికెట్ తనదేనన్న నమ్మకంతో లావు శ్రీకృష్ణ దేవరాయలు నియోజకవర్గమంతా కలియతిరిగారు. అయితే.. ఉన్నట్టుండి ఆయనను నరసరావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించారు.

ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంలో, కేంద్రంతో పాటు, తెలంగాణా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, సుప్రీం ముందు దోషిగా చూపెట్టే ప్రయత్నం చేసారు. అయితే, వీరికి దీటుగా ఏపి తరుపు లాయర్లు సమాధానం ఇచ్చారు. ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా, హైకోర్టు భవనాలు ఎప్పుడు పూర్తి అవుతాయని సుప్రీం ప్రశ్నించగా, డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది నారీమన్ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే పనులు మొదలు పెట్టమని, పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

supreme 01102018 2

అయితే ఇదే సందర్భంలో, కేంద్రం, తెలంగాణా తరుపు న్యాయవాదులు మన రాష్ట్రాన్ని ఇరికించే ప్రయత్నం చేసారు. మూడేళ్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇదే విషయాన్ని చెబుతూ వస్తుందని, ఆలస్యానికి కారణాలేంటని కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఉన్నతన్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి తగిన విధంగా సమాధానం ఇచ్చారు ఏపి న్యాయవాదులు. తగిన నిధులు లేకపోవడం వల్లే హైకోర్టు భవన నిర్మాణం ఆలస్యమైందని నారీమన్ తెలిపారు. కేంద్రం నుంచి సరైన సహకారం రాలేదని చెప్పారు.

supreme 01102018 3

ఈ నేపధ్యంలో జోక్యం చేసుకున్న కేంద్ర తరపున లాయర్, కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.2500 కోట్లు ఇచ్చామని, అందులో హైకోర్టుకు కూడా కొన్ని నిధులు కేటాయించినట్లు కేంద్రం తరపు న్యాయవాదులు తెలియజేశారు. అయితే ఇవి ఎప్పుడు ఇచ్చారని ? మూడేళ్ళ క్రిందట ఇచ్చారా ? ఏడాది క్రితం ఇచ్చారా అని ఏపి తరుపు లాయర్ ప్రశ్నిస్తూ, ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నామని, డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది నారీమన్ తెలియజేశారు. వాదనలు వినన కోర్ట్, దీనిపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

ప్రపంచ ప్రఖ్యాత వేదిక పై, మరోసారి నవ్యాంధ్రకు గుర్తింపు లభించింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాల గురించి ప్రపంచ ఆర్ధిక వేదిక తొలిసారి శ్వేతపత్రాన్ని రూపొందించింది. సుస్థిర ఉత్పాదకత సత్వర సాధన అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలితో కలిసి ప్రపంచ ఆర్థిక వేదిక సంయుక్త పత్రాన్ని విడుదల చేసింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి అద్భుతమంటూ ప్రపంచ ఆర్ధిక వేదిక కితాబిచ్చింది.. పెట్టుబడులకు అవకాశాలు అపారమంటూ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. మొత్తం 28 పేజీలతో పారిశ్రామిక సానుకూల అంశాలను విడుదల చేసింది. ఆటోమోటివ్‌, ఎలక్ర్టానిక్ పరిశ్రమలకు సంబంధించి 2022 నాటికి ఏటా 5 US బిలియన్ డాలర్ల మేర అవకాశాలు వున్నాయని తొలిపేజీలో WEF ప్రముఖంగా పేర్కొంది.

wef 011102018 2

ఇప్పటికే త్రీడీ ముద్రణ, బ్లాక్ చెయిన్, ఆర్టిఫిషియల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికతలో ముందంజలో వుంచడమే కాకుండా నిపుణులైన మానవ వనరుల కేంద్రంగానూ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతోందని ప్రభుత్వం కృషిని వెల్లడించింది. రెండంకెల వృద్ధి నమోదు కావడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటిస్థానం దక్కడాన్ని ప్రస్తావించింది. 12 రంగాలపై ప్రముఖంగా దృష్టి పెట్టిందని.. వీటి అభివృద్ధికి ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను అనుసరిస్తున్నట్టు తెలిపింది. మొత్తం నాలుగు చాప్టర్లుగా వెలువరించిన ఈ పత్రంలోని తొలి ఛాప్టర్‌ భారతదేశంలో పారిశ్రామిక ముఖచిత్రం, రెండో చాప్టర్‌ సుస్థిర ఉత్పాదకతను పెంపొందించడానికి దోహదపడే నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికత… మూడవ చాప్టర్‌ సుస్థిర ఉత్పాదకత విలువ, నాలుగో చాప్టర్‌లో సుస్థిర ఉత్పాదకతకు మార్గం శీర్షికలతో వివరణాత్మక అంశాలు నిక్షిప్తం చేశారు.

wef 011102018 3

రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఆటో హబ్‌గా రూపొందుతున్నాయని, అనంతపురం జిల్లాలో కియా మోటార్స్, వీరవాహన బస్ బిల్డింగ్, చిత్తూరులో ఇసుజు, హీరో మోటో కార్ప్, అమరరాజా గ్రూప్, అపోలో టైర్స్, ఆటో కాంపొనెంట్ తయారీ యూనిట్లు ఉండగా.. నెల్లూరులో భారత్ ఫోర్జ్, కృష్ణా జిల్లాలో అశోక్ లేల్యాండ్ వంటి ఆటో మొబైల్ రంగ దిగ్గజాలు వేళ్లూనుకున్న వైనాన్ని సంయుక్త పత్రంలో తెలియజేశారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను, హైపర్ లూప్ వంటి సరికొత్త ప్రజా రవాణా విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు చేస్తున్న యోచనను శ్వేతపత్రంలో గుర్తుచేశారు. శ్రీసిటీ, తిరుపతి, కాకినాడ, విశాఖ, అనంతపురం, అమరావతిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్టు సంయుక్తపత్రంలో పేర్కొన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రయాణాన్ని ఇప్పటికే ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… గుర్తించిన సాంకేతిక అంశాలతో అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసిందని సంయుక్త పత్రం పేర్కొంది. http://www3.weforum.org/docs/WEF_White_Paper_Accelerating_Sustainable_Production_report_2018.pdf

ఐటీ సోదాల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఐటీ అధికారులను కలిసిన ఓటుకు నోటు కేసు నిందితుడు ఉదయ్‌సింహ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీంతో మరో ట్విస్ట్ బయటపడింది. నాగోల్‌లోని తమ బంధువు రణధీర్‌ ఇంట్లో నిన్న జరిగిన ఐటీ సోదాలు నకిలీవని ఉదయ్ సింహ చెబుతున్నారు. పోలీసులనే నకిలీ ఐటీ అధికారులుగా చేసి కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేయించదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిపై ప్రభుత్వ కక్షపూరితంగా వ్యవహరించడంలో భాగంగానే ఈ నకిలీ ఐటీ దాడులు జరిగినట్లు ఉదయ్‌సింహ ఆరోపిస్తున్నారు. దాదాపు 15 మంది నకిలీ ఐటీ అధికారులు రణధీర్ ఇంట్లో పలు డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్లు, బంగారం నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

it 01102018

దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా?.. లేక ఐటీ అధికారులు బాధ్యత వహిస్తారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయకార్ భవన్‌లో ఐటీ అధికారులను తాను అడిగినప్పుడు తమ బృందం ఆదివారం ఎక్కడా దాడులు చేయలేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. నకిలీ ఐటీ అధికారులు తమ బంధువుల ఇళ్లలో సోదాలు చేశారంటున్న ఉదయ్ సింహ దీనిపై చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కెసిఆర్ వర్కింగ్ స్టైల్ లో ఒక భాగమని, ఇలా ప్రతిపక్ష పార్టీల వారిని వేధింపులకు గురి చేస్తారని, రేవంత్ ఇంట్లో జరిగిన దాడులు కూడా అసలైనవో, నిజమైనవో తెలుసుకోవాలని రేవంత్ అభిమానులు అంటున్నారు.

it 01102018

మరో పక్క ఎలా ‌అయినా చంద్రబాబుని ఇరికించాలని, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను ఒక్కొక్కరిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం సెబాస్టియన్, కొండల్ రెడ్డి, ఉదయ్ సిన్హాల విచారణ లేదని చెబుతున్నా.. ఐటీ కార్యాలయానికి వారు హాజరయ్యారు. అసలు ఆయాకర్ భవన్‌లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల పరిశీలన జరుగుతోందని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈనెల 3న రేవంత్ రెడ్డితోపాటు ఓటుకు నోటు కేసు నిందితులను కూడా ఐటీ అధికారులు విచారణ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ కోర్టు ఓటుకు నోటు కేసును ఈ నెల 12కు వాయిదా వేసింది. మరో పక్క సెబాస్టియన్, ఉదయ్ సిన్హాల ఇచ్చిన నోటీసులలో, ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే రూ. 10వేల ఫైన్‌తోపాటు ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read