ఆపరేషన్ గరుడలో చివరి అంకం ఇక మొదలు కానుంది. ఇప్పటికే ఐటి రైడ్ లు, ఈడీ రైడ్ లు చేస్తారంటూ ప్రచారం మొదలైంది. చంద్రబాబుని అరెస్ట్ చేస్తారంటూ ఎప్పటి నుంచి బీజేపీ నేతలు చెప్తూ వస్తున్నారు. అయితే, ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన మాటలు దానికి బలం చేకూరుస్తుంది. ఈ రోజు ఆయన మాటలు మాట్లడుతూ, మరో రెండు, మూడు నెలల్లో చంద్రబాబు పదవి ఊడటం ఖాయమంటూ జోస్యం చెప్పారు. విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమానికి హాజరైన కన్నా.. చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై విమర్శలు కురిపించారు. రాష్ట్రాన్ని బాబు లోకేష్‌లు దోచుకుంటున్నారని ఆరోపించారు కన్నా.

kanna 30092018

రాష్ట్రంలో పచ్చ కండువా వేసుకున్నవారికే పథకాలు, నిధులు అందుతున్నాయని విమర్శించారు. రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకొని, భూ దందా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం అమరావతి నిర్మాణానికి రూ.2,500కోట్లు విడుదల చేస్తే.. అమరావతిలో నాలుగు భవనాలు కూడా కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు కన్నా. రాజధాని నిర్మాణం కోసం సేకరించిన విరాళాలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుది అన్నం తిన్న చేతినే నరికే పద్దతని.. కేంద్రాన్ని కూడా అలాగే మోసం చేశారని విమర్శించారు. మరో రెండు, మూడు నెలల్లో సీఎం చంద్రబాబు పదవి ఊడటం ఖాయమని చెబుతారన్నారు కన్నా.

kanna 30092018

అయితే ఈ మాటలు వింటేనే కన్నా ఎలాంటి వాడో అర్ధమవుతుంది. ఒక పక్క రాజధాని నిర్మాణానికి ఇచ్చింది 1500 కోట్లు అని అందరికీ తెలిసిందే, 2500 కోట్లు అంటూ విజయవాడ, గుంటూరుకి ఇచ్చిన డ్రైనేజి నిధులు కూడా కలిపేసాడు. అమరావతిలో అన్ని నిర్మాణాలు జరుగుతుంటే, ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదు అంటున్నాడు. వారి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఢిల్లీ నుంచి మరింత నిధులు తెచ్చే ప్రయత్నం చెయ్యాలి కాని, ఈయన మాత్రం మీకు చాలా ఇచ్చాం పండగ చేసుకోండి అంటున్నారు. మరో పక్క ఇంకా 8 నెలలు సమయం మిగిలి ఉండగానే, మరో రెండు నెలల్లో చంద్రబాబు పడిపోతారు అని చెప్తున్నారు అంటే, ఎంత కుట్ర ప్న్నారో అర్ధమవుతుంది. ఈ ఢిల్లీ కుట్రలు, ప్రజలే తిప్పి కొడతారు.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గురించి తెలియని వారు ఉండరు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ముఖ్యమంత్రి అవ్వటం, తరువాత జగన్ ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించి, తనకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి రోశయ్యకు ఇచ్చారని చెప్పి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టటం, తరువాత రాష్ట్ర విభజన, ఇలాంటి వాటి అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి రోశయ్య. తరువాత కొంత కాలం తమిళనాడు గవర్నర్ గా చేసారు. ఇప్పడు రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యి ఇంటి పట్టున ఉంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మందిని, ఎన్నో సంఘటనలు చుసిన రోశయ్య ఒక వెబ్ ఛానెల్ కి సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నో విషయాల పై మాట్లాడారు.

 style=

ఈ సందర్భంగా తాజాగా జరుగుతున్న రాజకీయ విషయాల పై కూడా మాట్లాడారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన, జగన్ గురించి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ఆయన అభిప్రాయాలు చెప్పారు. ఈ ఇంటర్వ్యూ లో ఎన్నో విషయాలకు తన అబిప్రాయాలు చెప్పిన రోశయ్య, పవన్ విషయం గురించి వచ్చే సిరికి అసలు స్పందించలేదు. అప్పట్లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మీరు అన్నీ చూసారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అంటూ కొత్త పార్టీ పెట్టారు, ఇప్పుడు పవన్ పై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నంచగా.. చాలా సాదాసీదా సమాధానం ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అవతలి వ్యక్తి వంతయ్యింది. ఇంతకూ ఆయన ఏమన్నారంటే, ఆ పార్టీ గురించి పెద్దగా ఆలోచించడం లేదంటూ జవాబిచ్చారు. అభిప్రాయం చెప్పడానికి ఆసక్తి లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు.

rosaiah 30092018 3

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది, ఆయన పరిపాలన పై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా, నేను కాంగ్రెస్ పార్టీ లో ఉన్నా, మేము ప్రతిపక్షం, ఆయన ఎలా పరిపాలిస్తున్నా, సరిగ్గా పరిపాలించటం లేదు అనే చెప్తాం, నేను అదే చెప్తున్నా అని సమాధానం చెప్పారు. మరి మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా అంటే, అవన్నీ తప్పవు రాజకీయం అని చెప్పారు. జగన్ గురించి అభిప్రాయం అడుగుతూ, రాజశేఖర్ రెడ్డికి, జగన్ కి తేడా అడగగా, నేను ఎప్పుడో జగన్ తో విభేదించా, అప్పటి నుంచి ఆయన్ను పెద్దగా పట్టించుకోవటం లేదు, ఆయన ఏమి చేస్తున్నాడో ఏంటో, నాకు తెలియదు అని సమాధానం ఇచ్చారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు... https://youtu.be/mgjXUM3u8_o

రేవంత్ రెడ్డి... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. గత కొన్ని రోజులుగా తెలంగాణా రాష్ట్ర పాలకులకు కొరకారని కొయ్యగా తయారయ్యాడు. హేమాహీమీలు లాంటి మీడియా అధిపతులనే తన గ్రిప్ లో పెట్టుకున్న కెసిఆర్, రేవంత్ ని మాత్రం ఏమి చెయ్యలేకపోతున్నాడు. అందుకే అన్ని రకాలుగా దాడులు చేపిస్తున్నాడు. చుక్కలు చూపిస్తున్నాడు. కాని రేవంత్ మాత్రం, నిన్న వదలను కెసిఆర్ అంటూ వెంట పడుతున్నాడు. ఇది ఇలా ఉంచితే నిన్న రేవంత్, కెసిఆర్ కి ఒక ఛాలెంజ్ చేసారు. 15 ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్న రేవంత్, ఇలా ఛాలెంజ్ చేసాడు అంటే అది కెసిఆర్ కి పండగే. రేవంత్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ని కెసిఆర్ వదులుకున్నాడు అనే చెప్పాలి. రెండు రోజులపాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

jagan pk 30092018 2

ఎంఎల్‌సీగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటి వరకున్న ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు.నా సవాల్‌కు కేసీఆర్‌ 24 గంటల్లో స్పందించాలని, లేకపోతే అవినీతికి పాల్పడ్డది కేసీఆరే అని స్పష్టమవుతుందన్నారు. ఇదే సమయంలో 2001 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌కున్న ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఉద్యమ సమయంలో, 2014 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దా నాలను నెరవేర్చకపోవడాన్నే నేను ప్రశ్నిస్తున్నా. దీన్ని జీర్ణించుకోలేకే అసెంబ్లి నుంచి బయటకు పంపించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నారు అంటూ మండిపడ్డారు. ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు, నేను నా ఆస్థులు పై సిట్టింగ్ జడ్జితో విచారణకు రెడీ, నువ్వు రెడీనా అంటూ ఛాలెంజ్ చేసారు.

jagan pk 30092018 3

ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా, పవన్, జగన్, ప్రతి రోజు చంద్రబాబు పై వేసుకుపడుతూ, నువ్వు ఇన్ని తిన్నావ్, అన్ని తిన్నావ్ అంటూ విమర్శ చేస్తారు. చంద్రబాబు ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించి, ప్రతి సంవత్సరం ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. మరి ప్రతిపక్షంలో ఉన్న పవన్, జగన్, ఇలాంటి ఛాలెంజ్ చెయ్యగలరా ? ఎలాగూ జగన్ కేసులు అన్నీ ఈ అక్రమ ఆస్థుల మీదే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ , నా అంత నీతిమంతుడు ఎక్కడా లేడు అని చెప్తూ ఉంటాడు. ఎక్కువ కాలం వద్దు , 2014 నుంచి ఇప్పటి వరకు పవన్ కు పెరిగిన ఆస్థుల పై విచారణకు ఛాలెంజ్ చేసి, అప్పుడు చంద్రబాబు పై కూడా ఒత్తిడి తెచ్చి, ఆయన ఆస్థుల పై కూడా ఛాలెంజ్ చేసే దమ్ము, పవన్, జగన్ కు ఉందా ? ఆప్పుడు ఎవడి బండారం ఏంటో తేలిపోతుంది కదా ? ప్రతిపక్షంలో ఉన్న పవన్, జగన్, రేవంత్ లాగా ఛాలెంజ్ చేసి నిజా నిజాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చెయ్యాలి.

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాఫెల్ ఒప్పందం రగడతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) పేరు అందరి నోళ్లలో నానుతోంది. హాల్ ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ దాన్ని పక్కనబెట్టి, అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ కు మోడీ సర్కార్ కావాలనే కాంట్రాక్టును అప్పగించిందని గత కొంతకాలంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ రఫేల్ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలచుకోని రోజుకో బాంబు పేలుస్తున్నారు. ఈ ఒప్పందం పై ఫ్రాన్స్ మాజీ అధ్య క్షుడు ఫ్రాన్సో హోలన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. మరోవైపు 'హాల్ కు సామర్థ్యం లేకపోవడం వల్లే కాంట్రాక్టును ఇవ్వలేదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.

hal 30092018

దీంతో కంపెనీ సామర్థ్యం పై అనుమానాలు రేకెత్తిన వేళ, హాల్ రికార్డు స్థాయిలో అత్యధిక టర్నోవర్ సాధించడం విశేషం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 2017-18 సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.18,283.86 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్టు చెప్పారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌ రూ.17,603.79 కోట్లుగా నమోదైనట్టు తెలిపారు. శుక్రవారంనాడు కంపెనీ 55వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. కంపెనీ లిస్టింగ్‌ తర్వాత జరిగిన తొలి సమావేశం ఇదే. గత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపునకు ముందు లాభం రూ.3,322.84 కోట్లుగా ఉందని, నికర లాభం రూ.2,070.41 కోట్లుగా నమోదైందని మాధవన్‌ తెలిపారు.

hal 30092018

తమ కంపెనీ 105 కొత్త ఇంజన్లను ఉత్పత్తి చేసిందని, 220 విమానాలు, హెలికాప్టర్లు, 550 ఇంజన్లను ఓవర్‌హాల్‌ చేసినట్టు ఆయన చెప్పారు. అంతరిక్ష ప్రోగ్రామ్‌కు సంబంధించి 146 కొత్త ఏరో స్ట్రక్చర్స్‌ను ఉత్పత్తి చేసినట్టు కూడా ఆయన తెలిపారు. తమ కంపెనీ 40 విమానాలు, హెలికాప్టర్లను ఉత్పత్తి చేసినట్టు చెప్పారు. వీటిలో ఎస్‌యు-30 ఎంకెఐ, ఎల్‌సిఎ తేజస్‌ కూడా ఉన్నాయని తెలిపారు. రాఫెల్‌ విమానాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం హెచ్‌ఎఎల్‌కు లేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కంపెనీ చైర్మన్‌ తమ కంపెనీకున్న సామర్థ్యాలను వాటాదారుల ముందు ప్రకటించారు. రాఫెల్ వివాదం పై ఇటీవల రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. యూపీఏ హయాంలో రాఫెల్ ఒప్పందం జరగకపోవడానికి ‘హాల్'కు సామర్థ్యం లేకపోవడం కూడా ఒక కారణమేనని అన్నారు. మరోవైపు రాఫెల్ ఒప్పందం కోసం రిలయన్స్ డిఫెన్స్ పేరును మోదీ సర్కారే ప్రతిపాదించిందని ఇటీవల ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది కాస్తా రాజకీయ వివాదానికి దారితీసింది.

Advertisements

Latest Articles

Most Read