విభజన హామీలు నెరవేర్చలేదు అని, తెలుగుదేశంపార్టీ ఎన్టీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ, తెలుగుదేశం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. బీజేపీ నేతలు రాష్ట్రంలో చంద్రబాబు పై కత్తులు నూరుతున్నారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ శాసనసభాపక్ష నేతల విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో చిచ్చురేపాయి.. పోలవరం గ్యాలరీ వాక్‌కు వెళ్లిన విష్ణుకుమార్‌రాజు అక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు మంచివని, పట్టిసీమ లేని పక్షంలో కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయేదని, చంద్రబాబు చేసిన ప్రయత్నం వల్ల కృష్ణా డెల్టాలో మూడేళ్లుగా పంట చేతికందుతుందని వ్యాఖ్యానించారు. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్ల పధకాలు కూడా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.

gvl 27092018

ప్రత్యేకహోదా.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానంపై విష్ణుకుమార్‌రాజు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తినప్పటికీ, ముఖ్యమంత్రి సూచనతో తీర్మానాన్ని బలపరిచారు విష్ణుకుమార్‌రాజు. పలు సందర్భాలలో ముఖ్యమంత్రిని విష్ణుకుమార్ రాజు ప్రశంసించడం బీజేపీ నేతలకు సుతారమూ నచ్చలేదు. తామంతా ప్రభుత్వ పని తీరును తప్పుబడుతుంటే విష్ణుకుమార్ రాజు శాసనసభలో అందరి సాక్షిగా ముఖ్యమంత్రిని పొగడటం పట్ల వారు హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 'నరేగా' నిధులు వినియోగంపై కూడా రాష్ట్రానికి అనేక అవార్డులు వచ్చాయని, దేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ నిధుల వినియోగంలో అగ్రగామిగా ఉందని లోకేష్ చెప్పగా, కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లే రాష్ట్రానికి ఈ పేరు వచ్చిందని, అందువల్ల ప్రధాని ఫోటోను కూడా పత్రికా ప్రకటనల్లో వేయాలని మాజీ మంత్రి మాణిక్యాలరావు సూచించారు. యువకుడిగా ఉన్న లోకేష్ అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు.

gvl 27092018

ఇలా బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాజీ మంత్రి మాణిక్యాలరావులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను ప్రశంసించడం, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిరువుర్నీ పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. అయితే బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.. 'అసెంబ్లీలో మీ నేతలేమో ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు.. మీరేమో తిట్టిపోస్తున్నారు' అని విలేకరులు అడగడంతో ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆయన దృష్టి కోణం అలా ఉందంటూ విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలను తిప్పికొట్టారాయన! బీజేపీ అగ్రనేతలు కొందరు ఈ విషయాన్ని హైకమాండ్‌కు చెప్పినట్టు తెలిసింది.. విష్ణుకుమార్‌రాజు ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటున్నారు.. పైగా ఆర్‌ఎస్‌ఎస్‌తో మంచి సంబంధాలున్నాయి.. ఈ కారణంగానే ఆయన జోలికి ఎవరూ వెళ్లడం లేదు.. హైకమాండ్‌ మాత్రం సంయమనం పాటించాలని నేతలకు సూచించింది..

అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఆదివారం లివిటిపుట్టులో కాల్చిచంపిన మావోయిస్టులు, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా ఇది ప్రతీకార చర్యనో, గిరిజన విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు చంపామనో వారు ప్రకటిస్తుంటారు. ఇప్పుడు హత్యలు జరిగి 5 రోజులవుతున్నా ఇంతవరకు అలాంటి ప్రకటన జారీచేయలేదు. ఇది వ్యూహాత్మక జాప్యమా, లేక మరేదైనా కారణం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మావోయిస్టులు ఎవరినైనా హతమారిస్తే.. అది తమ పనేనని సంఘటనా స్థలంలోనే లేఖ పెట్టి, నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోతారు.

maoist 27092018

కొన్ని సందర్భాల్లో మరుసటి రోజో, రెండు రోజులు ఆగాకో లేఖ పంపుతారు. ఇన్‌ఫార్మర్ల ద్వారా లేఖలు అందజేస్తారు. విలేకరులకు పోస్టులో పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ లివిటిపుట్టు ఘటనపై మావోయిస్టులు ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. ఇద్దరు గిరిజన నాయకుల్ని కాల్చి చంపడంపై ఎటువంటి వివరణ ఇవ్వాలనే దానిపై వారు తర్జనభర్జన పడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలోనూ వారు రాజకీయ నాయకుల్ని చంపారు. మణికుమారి గిరిజన సంక్షేమ మంత్రిగా ఉండగా ఆమె భర్త వెంకటరాజును హత్య చేశారు. హుకుంపేటలో సమిడ రవిశంకర్‌ను చంపారు. అయితే కిడారి, సోమలను హత్య చేయడంపై గిరిజనుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.

maoist 27092018

అధికార దాహం కోసం ప్రతిపక్ష నేతలు మావోలతో చేతులు కలపటం చూసాం.. ఆనాడు చంద్రబాబు పై దాడి చేసింది కూడా అప్పటి రాజశేఖర్ రెడ్డి అనుచురుడు గంగి రెడ్డి. నాడు చత్తీస్‌ఘర్‌ లో కాంగ్రెస్ కు చెందిన విసి శుక్లా, పిసిసి ప్రేసిడెంట్ నడకుమార్ పాటిల్, సీఎం రేస్ లో ఉన్న మహేంద్ర ఖర్మతో పటు 27 మందిని ఒకే స్పాట్ లో మావో లు కాల్చి చంపడం లో దాగి ఉన్న రాజకీయా కోణం ఏంటి ? యావత్ దేశం లోని మావోలకు అడ్డాగా మారిన చత్తీస్‌ఘర్‌ లో బిజేపీ 3 సార్లు పవర్ లోకి రావడం, మావోలతో కొందరు నేతలు చేతులు కలిపి చేస్తున్న రాజకీయం, అరకు ఘటన ఫై మావో పార్టి ఏమి చెప్పనుఉంది ? చంపాల్సినంత తప్పులు వారు ఏమి చేశారంటూ గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టుల చర్యను ఎవరూ హర్షించడంలేదు.

అసెంబ్లీ రద్దు చేసిన కెసిఆర్ కి అన్ని వైపుల నుంచి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మీడియా కవరింగ్ తప్పితే, పరిస్థితి దారుణంగా ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ రూపంలో, మరో ఇబ్బంది వచ్చింది. అసెంబ్లీ రద్దయిన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని ఈసీ పేర్కొంది. విధానపర నిర్ణయాలు తీసుకోవద్దని, ఎన్నికల సమయంలో వర్తించే నియమాలన్నీ పాటించాలని ఈసీ ఆదేశించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు గురువారం లేఖ రాసింది. దీంతో కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకోవటానికి వీలు లేదు. ఇది కెసిఆర్ కు పెద్ద ఎదురు దెబ్బ.

kcr 27092018 2

ప్రజలని మభ్య పెడుతూ, కొన్ని నిర్ణయాలు చేద్దాం అనుకున్న కెసిఆర్ కి, ఇది పెద్ద ఎదురు దెబ్బ. అసెంబ్లీ రద్దయిన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కొత్త అసెంబ్లీ ఏర్పడే వరకు ఇది వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం సహా అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాల్లో ఎటువంటి ప్రజాకర్ష పథకాల పై ప్రకటన చేయరాదని కూడా ఈసీ స్పష్టం చేసింది. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. లేఖలో ఈసీ చాలా స్పష్టంగా చెప్పింది. ఎస్‌ఆర్‌ బొంబాయి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు చెప్పిన నియమ నిబంధనలన్నీ వర్తిస్తాయని వెల్లడించింది.

kcr 27092018 3

ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఉన్నచోట ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది గనక, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కానీ ఓటర్లను ఆకర్షించే విధంగా కొత్త విధివిధానాలు ప్రకటించడం గానీ, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడమైనా ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తాయని తెలిపింది. తెలంగాణలో అసెంబ్లీ రద్దయిన తర్వాత కూడా మెట్రో రైలుకు సంబంధించి ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మంత్రి హోదాలో ఉన్నట్లుగా ప్రవర్తించారని, కేసీఆర్ వ్యవహార శైలిగానీ, కొన్ని కార్యక్రమాలో మంత్రులు పాల్గొనడం.. తదితర వాటిపై ఈసీకి పిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ తదితరులపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపితేనే విచారణ చేపట్టగలమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన జడ్జి శ్రావణ్‌ కుమార్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. దీంతో... పిటిషనరే వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకున్నారు. పిల్‌ వేసే ముందు పూర్తి ఆధారాలు సేకరించి, లోతుగా అధ్యయనం చేసి రావాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. ఇటీవల తామర తంపరగా దాఖలవుతున్న పిల్స్‌లో... ప్రజాహితంకంటే ప్రచారమే ఎక్కువగా ఉంటోందని అభిప్రాయపడింది. ‘తగిన ఆధారాలు లేకుండా పిల్‌ వేస్తే ఎలా? కోర్టులకు జ్యోతి ష్యం తెలియదు. మా ముందున్న ఆధారాలతోనే విచారణ చేస్తాం. మేం పంచేంద్రియాలపై ఆధారపడే పని చేస్తున్నాం. 12, 13, 14 సెన్స్‌ లు లేవు’ అని తెలిపింది.

court 270902018 2

సమాచార చట్టం ద్వారా పూర్తి వివరాలు సేకరించవచ్చని సూచించింది. ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వక పోతే అప్పీలు దాఖలు చేయవచ్చంది. కంపెనీల గురించిన సమాచారం రిజిస్ర్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) వద్ద ఉంటుందని, ఆర్‌బీఐ వద్ద లభిస్తుందని తెలిపింది. ‘మీ వ్యాజ్యంలో ఆధారాలకంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా కోర్టులు పిటిషనర్‌ను ప్రశ్నిస్తాయి. ఇక్కడ మాత్రం మీరే కోర్టును ప్రశ్నిస్తున్నట్లుంది. ఆధారాలు లేకుండా కేసులు ఎలా విచారణ చేపడతామో మీకు తెలియదా?’ అని ప్రశ్నించింది. గతంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌రావు రాసిన లేఖను ఇదే హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిందన్నారు. తన వ్యాజ్యంలో కూడా దర్యాప్తునకు ఆదేశిస్తే... వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

court 270902018 3

ఈ దశలో ధర్మాసనం కల్పించుకుని, ఆర్టికల్‌ 226 కింద కోర్టులకు ఉండే విచక్షణాధికారాలతో సుమోటోగా విచారణ చేపట్టవచ్చని వ్యాఖ్యానించింది. బాధితులు కోర్టుకు వచ్చి తమ ఆవేదన చెప్పుకొంటే పిల్‌గా స్వీకరించిన ఘటనలున్నాయని గుర్తుచేసింది. తగిన ఆధారాలు లేకుండా పిల్‌ వేస్తే విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెబుతున్న సంస్థలు ఏపీలోనే కాదు భారతదేశంలో ఎక్కడా నమోదు కాలేదని పిటిషనర్‌ తెలిపారు. దర్మాసనం మళ్లీ జోక్యం చేసుకుని... ‘‘40 ఎకరాలను ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ఇన్నొవా సొల్యూషన్స్‌ అనే సంస్థకు కేటాయించినట్లు చెబుతున్నారు. ఆ సంస్థ ఎక్కడుందో పిటిషన్‌లో తెలిపారా? భూములు కేటాయించారని చెబుతున్న సంస్థను ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదు?’’ అని ప్రశ్నించింది. అయితే, పిల్‌ దాఖలు తర్వాత కొంత అదనపు సమాచారం లభించిందని, ఈ సమాచారాన్ని కోర్టు ముందుంచుతానని, రెండు వారాలు గడువు కావాలని కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది.

Advertisements

Latest Articles

Most Read