ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిని, బీజేపీ నాయకులు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారో చూస్తున్నాం. మోడీ తరువాత, ప్రధాని అభ్యర్ధి లక్షణాలు అతనికే ఉన్నాయి అంటూ, ఉత్తర్ ప్రదేశ్ లో ఆదర్శవంతమైన పాలన నడుస్తుంది అంటూ హంగామా చేస్తూ ఉంటారు. అయితే అక్కడ పరిస్థితులు మాత్రం దారుణంగా ఉంటాయి. అలంటి ఒక సంఘటనే అక్కడ జరిగింది. యాపిల్‌ సంస్థ ఉద్యోగిని.. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ కాల్చి చంపడం సంచలనం సృష్టించింది. కారు ఆపలేదన్న కారణానికే.. నిండు ప్రాణాలను బలితీసుకోవడం కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. లఖ్‌నవూలోని విలాసవంతమైన గోమతీనగర్‌ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ప్రశాంత్‌ చౌధరి అనే కానిస్టేబుల్‌ జరిపిన కాల్పుల్లో.. యాపిల్‌ సేల్స్‌ మేనేజర్‌ వివేక్‌ తివారీ (38) మరణించారు.

up 30092018 1

ఘటన జరిగిన సమయంలో తివారీతోపాటు కారులో ఆయన సహోద్యోగి సనాఖాన్‌ కూడా ఉన్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు బైక్‌పై తమ కారు ముందుకు వచ్చి.. అడ్డగించే ప్రయత్నం చేసినట్లు ఆమె మీడియాకు తెలిపారు. తివారీ ముందుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో.. కారు వారి బైక్‌ను ఢీకొట్టిందని చెప్పారు. వెంటనే ఓ కానిస్టేబుల్‌ తమపై కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. అనంతరం ఆ ఇద్దరు తనకు మళ్లీ కనిపించలేదని.. అటుగా వచ్చిన ట్రక్కు డ్రైవర్ల సాయంతో ఘటనపై తాను పోలీసులకు సమాచారం ఇచ్చానని ఆమె చెప్పారు. అనంతరం తివారీని పోలీసులు ఆసుపత్రికి తరలించారని వివరించారు. చికిత్స పొందుతూ తివారీ ప్రాణాలు వదిలారు.

up 30092018 1

తూటా గాయాల కారణంగానే ఆయన చనిపోయినట్లు శవపరీక్షలో తేలింది. దీంతో సనాఖాన్‌ ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నివేదికను నమోదు చేశారు. తివారీ మృతికి బాధ్యులైన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. వారిని సర్వీసు నుంచి తొలగించనున్నట్లు రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్‌ తెలిపారు. ఆత్మ రక్షణ పరిమితులను దాటి వారు అతిగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైందని అన్నారు. ఎవరినీ కాల్చేందుకు పోలీసులకు అనుమతి లేదని స్పష్టంచేశారు. తన భర్త మరణానికి రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమాధానం చెప్పాలని తివారీ భార్య కల్పన డిమాండ్‌ చేశారు. ‘నా భర్త ఉగ్రవాదా?’ అని ప్రశ్నించారు. తివారీ, కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద ఎత్తున బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని.. వీటిపై ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ కోరారు.

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో రకరకాల పిటిషన్‌లతో నిందితుల వైపు నుంచి జాప్యం జరుగుతోందంటూ ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారాల్లో దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న పునీత్‌ దాల్మియా హాజరు మినహాయింపు కోరుతూ, తన తరఫున న్యాయవాదిని విచారణకు అనుమతించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఇటీవల జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి వెలువరించిన తీర్పు ప్రతి చేతికందింది. ప్రతి శుక్రవారమూ కోర్టుకు హాజరుకావడం పునీత్‌దాల్మియాకు ఇబ్బందికరమే కావచ్చని, అయితే ఏదైనా ఒకరు ఒక రోజు మినహాయింపు కోరే అవకాశం సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద అవకాశం ఉందని, అలాకాకుండా ప్రతి విచారణకూ మినహాయింపు కోరుతూ సెక్షన్‌ 205 కింద పిటిషన్‌ దాఖలు చేయడం సరికాదని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

jagan 3000920118 2

దాల్మియాపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవన్నారు. దాల్మియా సిమెంట్స్‌కు లీజులు కట్టబెట్టడంలో వై.ఎస్‌. ప్రభుత్వం సహకరించినందుకు జగన్‌ కంపెనీల్లో ఒకసారి రూ.20 కోట్లు, మరోసారి 70 కోట్లు పెట్టుబడుల రూపంలో చెల్లించారన్నారు. మొత్తం అవినీతి రూ.139 కోట్ల దాకా ఉందన్నారు. రఘురాం సిమెంట్స్‌లో దాల్మియా సిమెంట్స్‌ వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.139 కోట్లలో రూ.55 కోట్లు హవాలా రూపంలో జగన్‌కు అందజేసినట్లు చెప్పారన్నారు. రాష్ట్రానికి ఆర్థిక నష్టాన్ని చేకూర్చే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కోర్టు సాధారణ కేసుల్లోలాగా పునీత్‌ దాల్మియాకు హాజరు మినహాయింపునకు అనుమతించలేదన్నారు.

jagan 3000920118 3

ఇదే అంశంపై జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కేసులోని ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఇదే హైకోర్టు కొట్టివేసిందన్నారు. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితుల వ్యక్తిగత హాజరుకు న్యాయస్థానాలు ఆదేశించడం రాజ్యాంగంలోని అధికరణ 21 కింద ప్రాథమిక హక్కులను హరించినట్లు కాదని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులతో కలిసి పునీత్‌దాల్మియా కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నందున కేసును తీవ్రమైనదిగానే పరిగణించాలన్నారు. వైఎస్‌ జగన్‌ వర్సెస్‌ సీబీఐ కేసులో సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు పూర్తిగా మేజిస్ట్రేట్‌ విచక్షణపైనే ఆధారపడి ఉంటుందన్నారు.

నిత్యం ఎదో ఒక సంచలన ఆరోపణలు చేస్తూ, గత మూడు రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్, ఈ రోజు కూడా మరో సంచలన ఆరోపణతో వార్తల్లో నిలిచారు.. నిన్నటి దాక, చంద్రబాబు, జగన్ పై ఆరోపణలు చేసిన పవన్, ఈ రోజు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల పైనే ఆరోపణలు చేసారు. రెండు రోజుల క్రితం పవన్ మాట్లాడుతూ, నన్ను చంపటానికి ముగ్గురు ప్లాన్ చేసారు, అది వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎవరో వీడియో తీసి నాకు పంపించారు అంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీని పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ గోదావరి జిలా ఎస్పీ స్పందించారు.

pk polioece 29092018

చంద్రబాబు మాట్లాడుతూ, మీకు భయం అవసరం లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మీకున్న సమాచారం ఇవ్వండి, మీకు బధ్రత పెంచుతాం అని అన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిలా ఎస్పీ కూడా, ఆ ముగ్గురు ఎవరో చెప్పండి అంటూ, పవన్ కు ఉత్తరం రాసారు. ఈ ఇద్దరి వ్యాఖ్యల పై ఈ రోజు పవన్ స్పందించారు. అది కూడా ఎంతో వెటకారంతో. ముఖ్యమంత్రికి సమాధానం చెప్తూ, "ఉదయం ఎవరో పవన్ కళ్యాణ్ కి ఆపద ఉంటే సెక్యురిటి ఇస్తాం అని అంటున్నారు, మేము బయపడతామా, నేను సినిమా హీరోను కాదు, ఉద్యమకారున్ని, నన్ను నేను రక్షించోగలను" అని పవన్ అన్నారు.

pk polioece 29092018

అంతే కాదు, మీరు బధ్రత ఎందుకు పెంచతాం అంటున్నారో నాకు తెలియదా ? ఆ పేరు చెప్పి, నా రహస్యాలు అన్నీ రాబడతారా ? మొన్న సెక్యూరిటీ ఇచ్చి మీరు చేసింది అదే కదా. నేను హైదరాబాద్ లో ఉంటే, నా ఇంటి పై, ఆఫీస్ పై, అర్ధరాత్రి వేళలో డ్రోన్ పంపించి నిఘా పెట్టారు, దానిమీద మా వాళ్ళు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు" అంటూ పవన్ మరో సంచలన ఆరోపణ చేసారు. ఇక్కడ ఎవరికీ అర్ధం కానిది ఏంటి అంటే, ఏ రాజకీయ పార్టీ నాయకుడు అయినా, లేకపోతే ఏ రాజకీయ పార్టీ ఆఫీస్ అయినా, పగలు పూట పని చేస్తారు, వివిధ వ్యక్తులతో మాట్లడతారు. ఒకవేళ పవన్ చెప్పింది నిజమే అయితే, పొలిటికల్ ఇంటలిజెన్స్ ప్రభుత్వ చేస్తే, ఆ పని పగలు పూట చేస్తారు కాని, రాత్రి పూట డ్రోన్లు పంపిస్తే, ఏమి ఉంటుంది ? పవన్ కళ్యాణ్ అర్దారాత్రి మాత్రమే ముఖ్యమైన పనులు చేస్తారేమో.. ఇలాంటి చౌకబారు ఆరోపణలు రోజికి ఒకటి చేసి, ప్రజలకు కామెడీ పండించటం తప్ప, పవన్ సాధించేది ఏంటి ?

యువనేస్తం పధకం అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. అప్పటి వరకు రిజిస్టర్ అయ్యి, వెరిఫై అయిన వారికి వచ్చే నెల నుంచి నెలకు వెయ్య నిరుద్యోగ బృతి ఇవ్వనున్నారు. అయితే, ఇలాంటి ప్రతిష్టాత్మిక పధకం పై, జగన్ బ్యాచ్ విషం చిమ్ముతూ, యువతని ఆందోళన పడేలాగా చేస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి యువనేస్తం పధకం ప్రారంభం కాదని, ఇదంతా చంద్రబాబు ఎన్నికల స్టంట్ అంటూ, విషపు రాతలు రాపిస్తున్నాడు జగన్. నిరుద్యోగ బృతితో పాటు, నైపుణ్య శిక్షణ ఇస్తున్న ఇలాంటి పధకం పై, యువతలో ఆందోళన రేకెత్తించి, రాజకీయ ప్రయోజనం పొందాలనే దుర్మార్గపు కుట్ర పన్నారు. ఈ కుట్రలో జగన సొంత మీడియా, పేపర్ తో పాటు, జగన్ నియమించిన పైడ్ సోషల్ మీడియా కూడా ఇదే పనిలో ఉంది.

yuvanestam 30092018

అయితే దీని పై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. యువనేస్తం పథకంపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువనేస్తం అమలైతే తమ దుకాణం బంద్ అవుతుందని వైసీపీ భయం పట్టుకుందుని ఎధ్దేవా చేశారు. ఇప్పటికే 5లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్నవారిలో 2 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. నిరుద్యోగుల పొట్టకొట్టే ప్రయత్నాలు జగన్‌ మానుకోవాలని కొల్లు రవీంద్ర సూచించారు. యువనేస్తం నమోదుకు ఆఖరి తేదీ లేదని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని, అసత్యాలు ప్రచారం చేస్తున్న జగన్‌కు నిరుద్యోగులే బుద్ధిచెప్పాలని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి అర్హులైన అభ్యర్థులు ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చని, ఇదో నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర యువజనాభ్యుదయ శాఖ సంచాలకులు భానుప్రకాశ్‌ తెలిపారు.

yuvanestam 30092018

ఆధార్‌కు అనుసంధానించిన ఫోన్‌ నెంబర్‌ వివరాలను సరిచేసుకోవడం కేంద్రం ఎంపిక చేసిన కేంద్రాల్లో నిరంతరం కొనసాగుతుందన్నారు. నమోదులో విద్యార్హతపై ఫిర్యాదులుంటే సంబంధిత విశ్వవిద్యాలయాలను సంప్రదించి అర్హత ఉన్నవారిని వెంటనే ఎంపిక చేస్తున్నామన్నారు. భూమి, కారు వంటి అంశాలపై అభ్యంతరాలుంటే ఫిర్యాదుచేయవచ్చని, 2-7 రోజుల్లో వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ఆ తర్వాతా అభ్యంతరాలుంటే పరిశీలిస్తామని, పథకానికి అర్హులా కాదా అనే విషయాన్ని దరఖాస్తుదారు మొబైల్‌ నంబర్‌కు సందేశం వెళ్తుందన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి అంశాలవారీగా నోడల్‌ అధికారులను నియమించామన్నారు. యువనేస్తం పథకానికి ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 1.60లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందన్నారు. అందిన 80 వేలకుపైగా ఫిర్యాదుల్లో 50 శాతానికిపైగా పరిష్కరించామన్నారు.

Advertisements

Latest Articles

Most Read