ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా ఓడరేవులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి సౌకర్యాలున్న పోర్టు ఏర్పాటు చేద్దామని లేఖలో సూచించారు. దీని కోసం ఎస్‌పీవీని ఏర్పాటు చేయాలని గడ్కరీ కోరారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వస్తే అన్ని అనుమతులు తీసుకోవచ్చని సూచన చేశారు. ఓడరేవులో పోర్టు ఏర్పాటుకు సౌకర్యాలు అనువుగా ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంటే బాగుంటుందని సూచించారు. అయితే ప్రభుత్వ వర్గాలు, అధికార తెలుగు దేశం పార్టీ మాత్రం, ఈ లేఖ పై భగ్గు మంటుంది..

gadkari 27092018 2

విభజన చట్టంలో ఉన్న నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో పోర్టు కుదరదు అని ఇప్పటికే కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ తరుణంలో ఓడరేవులో పోర్టు ఏర్పాటుకు కేంద్రం నుంచి వచ్చిన లేఖను ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నాయి. ఓడరేవులో పెట్టటానికి మాకు ఇబ్బంది లేదని, ఇక్కడ ప్రధాన సమస్య అక్కడ భూములే అని ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే, ఇక్కడ భూమిలో అన్నీ మన ప్రతిపక్ష నేత కబంధ హస్తాలలో ఉన్నాయి. వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు వైఎస్‌ ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వ భూమి సుమారు అయిదు వేల ఎకరాలకు పైగా, అలాగే ప్రైవేటు భూమి 1,825 ఎకరాల భూమిని అప్పగించింది. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఈ ప్రాజెక్టుకు చేసిన భూకేటాయింపు కూడా ఉంది.

gadkari 27092018 3

ఆ భూములు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పరిధిలో ఉన్నాయి. గడ్కరీ ప్రతిపాదిస్తున్న నౌకాశ్రయానికి భూమి ఇవ్వాలంటే.. దీన్నుంచే కేటాయించాలి. ఈడీ పరిధిలోనున్న భూమిని ఇప్పటికిప్పుడు కేటాయించటం సాధ్యం కాకపోవచ్చని ఉన్నతాధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక... ఆ భూముల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ... కేసుల నేపథ్యంలో అది కుదరలేదు. మొత్తానికి... ఎప్పుడో ముగిసిందనుకున్న ‘వాడరేవు’ కథ గడ్కరీ ప్రకటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే.. పోర్టు ఏర్పాటు కోసం ఎలాంటి వివాదంలేని భూములు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నొక్కి మరీ చెప్తున్న గడ్కరీకి, అక్కడ జగన్ అక్రమాస్తుల కేసులో ఈ భూమి అంతా ఉందని తెలిసే ఇలా ప్రకటన చేసారా, లేక అక్కడ భూములు జగన్ ముఠాకు ఉన్నాయి కాబట్టి, వాళ్లకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారా, అనే అనుమానాలు కలుగుతున్నాయి. అలాంటప్పుడు, కేంద్ర ప్రభుత్వం, జగన్ అక్రమాస్తుల కేసుని ఒక కొలిక్కి తెస్తే, 3 వేల ఎకరాలు ఏమి ఖర్మ, 30 వేల ఎకరాలు ఇస్తామని అధికార పక్షం అంటుంది.

దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక పనిలేని ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును నోటికొచ్చినట్లు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. ‘‘జీవీఎల్‌ నరసింహారావు ఎవరో కూడా నాకు తెలియదు..ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయనకు ఆంధ్రప్రదేశ్‌పై పెత్తనం ఏమిటి?’’ అని మండిపడ్డారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో జరిగే సభను అడ్డుకుంటామని జీవిఎల్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అయ్యన్నపాత్రుడు...‘‘ రా..దమ్ముంటే అడ్డుకో.. అని’’ సవాల్‌ విసిరారు.

ayyanna 27092018 2

ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబుకు దక్కిన గౌరవం తెలుగు జాతికి దక్కిన గౌరవమని, అది డబ్బు, పలుకుబడితో దక్కదని కన్నా, జీవీఎల్ లు తెలుసుకోవాలని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన ఉయ్యూరులో మీడియాతో సమావేశమై మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయంలో తెలుగుజాతి ఘనతను ప్రపంచ వేదిక మీద ప్రపంచానికి చంద్రబాబు చాటి చెప్పారని కొనియాడారు. చంద్రబాబుకు దక్కిన గౌరవం చూసి కన్నా, జీవీఎల్ లు ఈర్ష్య, అసూయలతో రగిలి పోతున్నారని విమర్శించారు. కన్నా, జీవీఎల్ లకు పిచ్చికుక్క కరచినట్లుందని, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ayyanna 27092018 3

రాఫెల్ కుంభకోణం పై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాదయాత్రల పవిత్రతను జగన్ మంటగలిపాడని, 3,000 కాదు 30 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా జగన్ ను ఆంధ్రప్రజలు విశ్వసించరని, జగన్, మోడీ, పవన్ ల అపవిత్ర కూటమిని ప్రజలు తిరస్కరిస్తున్నారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని జగన్ కు మోదీ చెప్పారా? ఆంధ్రాలో బీజేపీకి ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకరన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. అమరావతి బాండ్లు సహా ఏ అంశంపై అయినా బీజేపీ నేతలతో బహిరంగ చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

కెసిఆర్ వణికిపోతున్నాడు.. మోడీ ఎంత సహకారం చేసినా, కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వటంతో, తన నూకలు చెల్లుతున్నాయి అని కెసిఆర్ గ్రహించి, మోడీ సహకారంతో ప్రతిపక్షాల పై దాడులు చేపిస్తున్నాడు... అక్రమ రవాణా అంటే గుర్తుకువచ్చేది కెసిఆర్, అలాంటి కెసిఆర్, మొన్న జగ్గారెడ్డిని లోపల వేయించిన కెసిఆర్, ఈ రోజు తనకు అత్యంత ముప్పుగా ఉన్న రేవంత్ రెడ్డిని ఈడీతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటంతో, ఇక రేవంతే సియం అభ్యర్ధి అనే విధంగా, కాంగ్రెస్ ప్రాజెక్ట్ చేస్తుంది. దీంతో రేవంత్ కి ఉన్నక్ క్రేజ్ కి, కెసిఆర్ బ్రేక్ వెయ్యటానికి, అత్యంత దారుణమైన స్టెప్ వేసాడు.

revanth 27092018

ఎన్నికల సమయంలో రేవంత్ లాంటి వాడిని కెలికి, తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. నా వెనుక మోడీ ఉన్నాడు, నేను ఏమైనా చేస్తా అని విర్రవీగుతున్నాడు కాని, వేసింది ఎంత భయంకరమైన రాంగ్ స్టెప్ అనేది గ్రహించలేకపోతున్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్ళల్లో కూడా సోదాలు జరుపుతుంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్ట్రేట్. మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు జరుగుతున్న చోట్ల కుటుంబసభ్యుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించారు. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి తన సొంత నియోజవర్గంలో, భారీ సభ ప్లాన్ చేసారు. ఇది భగ్నం చెయ్యటానికే, కెసిఆర్ ఇలా భయపెడుతున్నట్టు తెలుస్తుంది.

revanth 27092018

తమ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు, పెద్దఎత్తున కొడంగల్ లోని ఇంటి వద్దకు చేరుకుంటుండటంతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఈ సోదాలేంటని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోదాలకు వచ్చారని అభిమానులు విమర్శిస్తున్నారు. సోదాల విషయం తమకు ముందుగా తెలియదని అంటున్న పోలీసులు, ఆయన ఇంటి వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మూడు చోట్ల సోదాలు జరుగుతున్నాయని సమాచారం.

నిన్న దెందులూరులో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందరూ విన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడుగా, అంత మంది యువత ఫాలో అయ్యే వ్యక్తి, ఎంత బాధ్యత లేకుండా మాట్లడాడో చూసాం. చింతమనేని ఆకు రౌడీ అని, తలకాయి నరకాలి అని, కొట్టాలని, ఇలా అనేకసార్లు అక్కడ ఉన్న యువతకు పిలుపిచ్చాడు. ఇది పక్కన పెడితే, 16 ఏళ్ళకే రౌడీలను కొట్టే వాడిని అని, చంద్రబాబుని జగన్ నుంచి కాపాడింది నేనే అని, ఎవర్తో ఎవరితోనో పడుకుంటే నేను సమాధనం చప్పాలా అంటూ, ఎంతో జుబుక్సాకరంగా, బాధ్యత లేని గాలి వ్యక్తిలాగా, ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసాడు. అయితే, స్వతహాగా దూకుడు స్వభావం ఉన్న చింతమనేని, పవన్ పై విరుచుకుపడతారని, అక్కడే పవన్ కూడా ఉండటంతో, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందేమో అని అందరూ భావించారు.

chintamaneni 27092018 2

అయితే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన చింతమనేని మాత్రం, చాలా బ్యాలన్సు చేసుకుని పవన్ పై విమర్శలు చేసారు. పవన్ కుల గొడవలు రేపటానికి వచ్చాడు అని తెలుసుకుని, ఎక్కడా బ్యాలన్సు తప్పలేదు. అదే సమయంలో పవన్ కి సరైన జవాబే చెప్పారు. తనపట్ల వచ్చిన ఆరోపణలపై మీకు ఇష్టమొచ్చిన కమిటీ వేసుకోండని ఆయన సవాల్ చేశారు. ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకోకుండా.. తనను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులతో కలిసి పని చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పార్టీ నాయకుడి నుంచి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ స్థాయికి పడిపోయారన్నారు. ‘నువ్వు నాపై పోటీ చేయి. చావో రేవో దెందులూరులోనే తేల్చుకుందాం. నువ్వు గెలిస్తే.. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిపై పోటీ చేసి ఓడిపోయానని అనుకుంటా. నీ విజయోత్సవంలో పాల్గొంటా.. నేను గెలిస్తే షేక్ హ్యాండ్ ఇవ్వు చాలు అంతే..’ అంటూ పవన్ కల్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

chintamaneni 27092018 3

నిజంగా తాను చేసిన తప్పుల గురించి చెబితే సరిదిద్దుకుంటాననీ, సానుకూల విమర్శలు చేస్తే స్వాగతిస్తానని వెల్లడించారు. తొలుత దెందులూరు ప్రజలు, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు, చివరికి పార్టీ అధినేత చంద్రబాబు తనకు హైకమాండ్ అని చింతమనేని స్పష్టం చేశారు. పవన్ చేసిన అర్థం లేని విమర్శలతో తన జీవితంలో తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. తనపై 37 కేసులున్నాయని పవన్‌ తప్పుడు ఆరోపణలు చేశారని.. వాస్తవంగా తనపై ఉన్నవి 3కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పవన్‌కల్యాణ్‌ వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడితే ఆయన మూడు రోజులు భోజనం చేయరని అన్నారు. ఓ పార్టీకి అధినేతగా ఉన్న పవన్‌ ఇష్టం వచ్చినట్లు ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతారని చింతమనేని అన్నారు. తాను రాజ్యాంగశక్తినని పవన్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. పవన్‌ తాను కొనుగోలు చేసిన ఛానల్‌ ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొత్తానికి, మనం ఒకడిని టార్గెట్ చేస్తున్నాం అంటే, ఆడిని పెద్దాడిని చెయ్యకూడదు, వీపీ గాడిని చెయ్యాలి.. ఇది నిన్న ఊగిపోయిన పవన్ కళ్యాణ్ కి, ఈ రోజు ఎక్కడా బాలన్స్ తప్పకుండా, దించేసిన చింతమనేనికి తేడా...

Advertisements

Latest Articles

Most Read