పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతుంది. రెండు రోజుల నుంచి చింతమనేని పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్, కొంచెం రూటు మార్చి లగడపాటి రాజగోపాల్ పై పడ్డారు. జనసేన ఓట్ బ్యాంక్ గురించి జనసేన బలం గురించి లగడపాటి సర్వే లు అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు పవన్ కళ్యాణ్. మాజీ ఎంపీ లగడపాటిలాంటి వారు తమ సర్వేల్లో జనసేన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. జనసేన ప్రభావం కేవలం నాలుగైదు శాతం మాత్రమే ఉంటుందని అంటున్నారని, కానీ తమ బలం 18 శాతమని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.
జనసేన పార్టీకి కేవలం 4 శాతం, లేదంటే 5 శాతం మాత్రమే ఓట్లు ఉన్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు పవన్ కళ్యాణ్. అలాగే కొంతమంది లగడపాటి సీక్రెట్ సర్వేలు అంటూ, జనసేన బలాన్ని కించపరిచే విధంగా వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. లగడపాటి కొన్ని నెలల క్రితం తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి తన ఇంటికి వచ్చాడు అని, ఆ సందర్భంలో జనసేన పార్టీ బలం గురించి ఆయనతో చర్చించడం జరిగిందని, జనసేన పార్టీ సహాయం లేకుండా ఆంధ్రప్రదేశ్ లో 2019 లో ఏ ప్రభుత్వం ఏర్పడ లేదని, జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి గా ఉంటుంది అని తనతో చెప్పారని, ఇప్పుడు మాత్రం 4 శాతం అంటున్నారని అని పవన్ అన్నారు.
జనసేన కోసం తన ప్రాణాలనే పెట్టుబడిగా పెట్టానని పవన్ అన్నారు. తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆశతో తాను రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం తామే చేశామని అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా గొప్పగా చెప్పుకున్నారని, ఇలాంటివి నేను ఎప్పటి నుంచో చేస్తున్నాని, అని అన్నారు. ధ్వజమెత్తారు. రౌడీయిజం చెలాయిస్తే సహించేది లేదని, కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతామంటూ హెచ్చరించారు. నేను 16 ఏళ్ళ వయసులోనే గుండాలని కొట్టాను అనే సంగతి గుర్తుంచుకోవాలని చెప్పారు పవన్. తాను లండన్ వెళ్లినప్పుడు వ్యాపారవేత్తలను కలిశానన్నారు. ఏపీకి ఎందుకు రావడం లేదని వ్యాపారవేత్తలను అడిగితే.. మీ రాజకీయ నేతలు వాటా అడుగుతున్నారని వాళ్లు తనకు చెప్పారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక తెలంగాణలో పోటీపై ఆలోచిస్తామని పవన్ వెల్లడించారు.