సరైన మనుషులకు అయితే ఒకసారి చెప్తే అర్ధమవుతుంది.. కొంచెం తిక్క ఉన్న వాళ్ళకు ఒకటికి రెండు సార్లు చెప్తారు, చివరకు వింటారు.. కొన్ని వింత జీవులు, ఎన్ని చెప్పినా, ఎన్ని చూపించనా వినరు.. అలాంటి వారికి, వారికి అర్ధమయ్యే భాషలో చెప్పాలి అంటే, కొంత డోస్ పెంచాలి.. అందుకే జీవీఎల్ విషయంలో, కుటుంబరావు గారు, కొంచెం డోస్ ఎక్కువ పెంచారు. ఇప్పుడైనా, పాపం తగ్గుతుందో లేదో.. గత నాలుగు రోజులుగా జీవీఎల్ ఎంత చిత్ర విచిత్రంగా ప్రవర్తించి, ట్వీట్లు వేసి, వరుసపెట్టి బురద జల్లాడో చూసాం. దానికి విరుగుడు ఇవ్వటానికి, కుటుంబరావు గారు ప్రెస్ మీట్ వాయించారు. జీవీఎల్‌ నరసింహారావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని సి.కుటుంబరావు ధ్వజమెత్తారు.

gvl 26092018 2

‘జీవీఎల్‌ ఓ కొత్తకోతి. కోతికి కొబ్బరిచిప్ప ఇచ్చినట్లు.. బీజేపీ ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చింది. వారాంతంలో ఢిల్లీ నుంచి వచ్చి, ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి, తిరిగి ఢిల్లీ వెళ్లిపోవడం ఆయనకు ఆలవాటైపోయింది. సస్టెయినబుల్‌ ఇండియా ఫైనాన్స్‌ ఫెసిలిటీ కింద(ఎస్‌ఐఎ్‌ఫఎఫ్‌) ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత బ్యాంకు బీఎన్‌పీ పారిబా నుంచి ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోలేదు. అయినా రూ.16వేల కోట్ల అప్పు తీసుకుందని జీవీఎల్‌ ఆరోపిస్తారా? అందుకే ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు మాట్లాడేందుకు అవకాశమిచ్చారని అంటారా? ఏమైనా అర్థముందా? జీవీఎల్‌ రోగ్‌ పొలిటీషియన్‌.. రోగ్‌ ఎంపీ.. ఆయనపై రాజ్యసభ కమిటీకి ఫిర్యాదు చేస్తాం’ అని తెలిపారు. కాగా, అబద్ధపు ప్రచారాలతో గోబెల్స్‌నే మించిపోయిన జీవీఎల్‌ను జనం ఒక వింత జీవిగా చూస్తున్నారని శాప్‌ మాజీ చైర్మన్‌ పీఆర్‌ మోహన్‌ ఎద్దేవా చేశారు.

gvl 26092018 3

సుస్థిర భారత ఆర్థిక విధానం కింద యూఎన్‌ఈపీతో జూన్‌ 2న రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు. దీని కింద ఏపీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. రూ.16వేల కోట్లు అప్పుచేసినందునే ముఖ్యమంత్రికి ఐరాసలో మాట్లాడే అవకాశం ఇచ్చారని జీవీఎల్‌ వ్యాఖ్యానించడంలో అర్థం లేదన్నారు. ఒక స్టాక్‌బ్రోకర్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడ్ని చేశారని తనను విమర్శించారని.. ఒకప్పుడు స్టాక్‌బ్రోకర్‌గా ఉన్న అమిత్‌షా భాజపా అధ్యక్షుడు కాలేదా అన్నారు. అగ్రిగోల్డ్‌తో తనకు సంబంధముందని ఆరోపించిన వైకాపా నాయకుడు పార్థసారథి తక్షణమే రుజువు చేయాలని, లేకుంటే ఆయనపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

కర్ణాటకలో ఎలా అయినా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని అమిత్ షా చేసిన శపధం మాత్రం నెరవేరటం లేదు. నాలుగు నెలల క్రితం, అధికారం కోసం వీళ్ళు పడిన పాట్లు చూసాం. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మల్యేలను కొనటానికి చేసిన ప్రయత్నాలు అన్నీ రివర్స్ అయ్యి, వీళ్ళు చేసిన బేరాలు అన్నీ బయట పడ్డాయి. అప్పటి నుంచి కుమారస్వామిని దించటానికి అమిత్ షా గ్యాంగ్ పని చేస్తూనే ఉంది. ఎమ్మల్సీ ఎన్నికలు రావటంతో, మరోసారి రంగంలోకి దిగారు. పదిరోజులుగా ముంబై రిసార్టు రాజకీయం అని, విధానపరిషత్‌ ఎన్నికలలో అభ్యర్థులను రంగంలోకి దించుతామని మీసాలు తిప్పిన కమలనాథులు నామినేషన్‌ల చివరిరోజైన సోమవారం కనిపించకుండా పోయారు.

amit 26092018

దీంతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి మరింత కాలం ఢోకాలేదనేది తేలిపోయింది. గత మూడు రోజులుగా సంకీర్ణం కూలిపోతుందనే బెంగతో గడిపిన కాంగ్రెస్‌నేతలు ఆ బెదిరింపులన్నీ ఉత్తుత్తివని తేలిపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. మంత్రివర్గ విస్తరణ వైపు దృష్టిసారించారు. శాసనసభసభ్యుల నుంచి ఎన్నిక జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అక్టోబరు 4న పోలింగ్‌ జరగాల్సి ఉండగా, సోమవారం నామినేషన్‌ల దాఖలుకు చివరి రోజు కావడం గమనార్హం. 104మంది ఎమ్మెల్యేలు కలిగిన బీజేపీ మరో 8మంది మద్దతు పొందేందుకు నాలుగురోజులుగా భారీగానే కసరత్తు జరిపింది. ఏకంగా పదిమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ముంబైకు చేరారని ప్రచారం జరిగింది.

amit 26092018

అయితే వారెవనేది మాత్రం తేల్చలేక పోయారు. ఇక చెన్నై మీదుగా ముగ్గురు ఎమ్మెల్యేలు ముంబై వెళతారనే సమాచారం హల్‌ఛల్‌ చేసింది. వారు బెంగళూరు శివారు హోసూరుకు చేరేసరికే అగ్రనేతల నుంచి పిలుపు రావడంతో వెనుతిరిగి బెంగళూరుకు చేరారు. ఇలా మూడు రోజులుగా సాగిన రిసార్టు రాజకీయం ప్రచారం మినహా ఆచరణలో సాధించింది శూన్యం. 104మంది ఎమ్మెల్యేలు కలిగిన బీజేపీ మరో 8మంది మద్దతుతో మూడు ఎమ్మెల్సీ స్థానాలను ఎలా పొందలేక పోయిందో అదే రీతిన సంకీర్ణ ప్రభుత్వాన్ని సైతం కూల్చడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి మరింత కాలం ఢోకాలేదనేది తేలిపోయింది. బీజేపీ వ్యూహాలు ప్రతి అంశంలోను బెడిసి కొడుతుండటంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ అగ్రనేతలకు తమ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా ఏర్పడింది.

ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ అంశంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరపగా జస్టిస్‌ ఏకే సిక్రి మెజార్టీ తీర్పును చదివి వినిపించారు. ఆధార్‌తో నకిలీల సమస్య తొలిగిపోయిందని, మరోసారి ఆధార్‌ నమోదుకు వెళ్తే కంప్యూటర్‌ గుర్తిస్తుందని, ఇదే ఆధార్‌ను ప్రత్యేక గుర్తింపుగా చెప్పడానికి కారణం అని ఆయన పేర్కొన్నారు. ఆధార్‌ నమోదుకు ప్రజల నుంచి సాధ్యమైనంత కనీస సమాచారం మాత్రమే తీసుకున్నారని, ఇది పౌరులకు ఏకైక గుర్తింపు కార్డును అందజేసిందని సిక్రి వెల్లడించారు.

aadhar 26092018 2

ఆధార్‌ వల్ల వ్యక్తిగత గోప్యత, హ్యాకింగ్‌ జరుగుతున్నాయని ప్రధానంగా పిటిషన్‌దారులు వాదిస్తున్నారని, అయితే ఆధార్‌ డేటా హ్యాకింగ్‌ చేశారనే వార్తలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టంచేసిందని కోర్టు వెల్లడించింది. అయితే రాష్ట్రాలు సహా ప్రైవేట్‌ కంపెనీలు, మొబైల్‌ కంపెనీలు ఆధార్‌ డేటాను కోరడానికి వీల్లేదని కోర్టు స్పష్టంచేసింది. కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది. సుమారు బిలియన్‌ మందికి పైగా భారతీయులు ఆధార్‌ నమోదు చేసుకున్నారని కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది.

aadhar 26092018 3

అయితే మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌‌ అనుసంధానం తప్పనిసరి కాదని పేర్కొంది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ నంబర్‌లు తీసుకునేందుకు ఆధార్ కోసం బలవంతం చేయరాదని, స్కూళ్లు, ప్రయివేటు కంపెనీలు ఆధార్‌ పై ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూజీసీ, నీట్, సీబీఎస్‌ఈ పరీక్షలకు కూడా12 అంకెల ఆధార్ గుర్తింపు సంఖ్య తప్పనిసరి కాదని ధర్మాసనం పేర్కొంది. అక్రమంగా వలస వచ్చిన వారికి ఆధార్ కార్డు మంజూరు చేయరాదని సూచించింది. అయితే పాన్, ఐటీ రిటర్నులకు ఆధార్ తప్పనిసరి అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

గత కొన్నేళ్ళుగా, నక్సల్స్ భయం లేకుండా, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో, లివిటిపుట్టు ఘటన వణుకు పుట్టిస్తోంది. ఇన్నాళ్ళు స్వేచ్ఛగా తిరిగిన రాజకీయ నాయకులు, ఈ ఘటన తరువాత ఇబ్బంది పడుతున్నారు. ఈ భయానికి తోడు, నక్సల్స్ హిట్ లిస్టులో 200 మంది ఉన్నట్టు తెలుస్తుంది. మావోయిస్టుల తదుపరి టార్గెట్‌’పై అటు పోలీసులు, ఇటు రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతోంది. పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీలు, వివిధ పార్టీల నాయకులు, పోలీసులు, మిలీషియాలో పని చేసి లొంగిపోయిన యువకులు, పోలీసు ఇన్‌ఫార్మర్లుగా భావిస్తున్న గిరిజనులు... ఇలా మొత్తం 200 మందితో మావోయిస్టులు హిట్‌లిస్ట్‌ తయారు చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

naxals 26092018 2

ఈ నేపథ్యంలో తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లొద్దంటూ కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు హెచ్చరించినట్టు తెలిసింది. మావోయిస్టుల హిట్‌లి్‌స్టలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన సోదరుడు వినాయక్‌, గిడ్డి ఈశ్వరి వ్యక్తిగత కార్యదర్శి పోలుపర్తి గోవిందరావు, బీజేపీ నాయకుడు లోకుల గాంధీ, కొయ్యూరు మండలం బూదరాళ్ల మాజీ సర్పంచ్‌ సూరిబాబు, ఇదే మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ఎం.ప్రసాద్‌, పెదబయలు మండలాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ, పెదబయలు మండలం జామిగూడ మాజీ సర్పంచ్‌ సుబ్బారావు, ఇంజిరి మాజీ సర్పంచులు సత్యారావు, కామేశ్వరరావులకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

naxals 26092018 3

చింతపల్లి మండలంలో 12 మందిని, జీకే వీధి మండలంలో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే అనేక పర్యాయాలు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. ఇంకా ఏజన్సీలోని పలు మండలాలకు చెందిన 110 మంది ఈ జాబితాలో ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు, గిడ్డి ఈశ్వరికి భద్రత మరింత పెంచారు. ప్రస్తుతం ఉన్న భద్రత సిబ్బందికి అదనంగా గన్‌మెన్‌ను కేటాయించాలని నిర్ణయించారు. అలాగే... సివిల్‌ డ్రెస్‌లో ఉండి చుట్టుపక్కల పరిస్థితులను గమనించే ‘షాడో టీమ్‌’ను ఏర్పాటు చేయనున్నారు. అయ్యన్నకు ప్రభుత్వం ఇప్పటికే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సమకూర్చింది. వీలైనంత వరకు మారుమూల ప్రాంతాలకు వెళ్లవద్దని అయ్యన్న, ఈశ్వరికి పోలీసులు సూచించారు.

Advertisements

Latest Articles

Most Read