గత ఆరు నెలల నుంచి, ఒకడి తరువాత ఒకడు, చంద్రబాబు పై విషం చిమ్మటం కోసం పోటీ పడటం, చంద్రబాబు అవినీతి పరుడుగ ముద్ర వెయ్యటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చెయ్యటం, చివరకు విపి అవ్వటం, ఇదే తంతు... ఇన్ని ఆరోపణలు, ఇంత హంగామా చేసి చివరకు ఒక్క రూపాయి అవినీతి ఇప్పటి వరకు ప్రూవ్ చెయ్యలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లడటం, ప్రజల్లో ఏవో అపోహలు కలిగించటం, చెప్పిందే చెప్తే ప్రజలు నిజం అని నమ్ముతారేమో అని ఆశ... మీడియా ముందు చేసారు అంటే అర్ధం ఉంది, చివరకు కోర్ట్ లు దగ్గర కూడా, ఇవే గాల్లో ఆరోపణలు చేస్తే కోర్ట్ లు ఊరుకుంటాయా ?

court 26092018

ఈ రోజు అదే జరిగింది... గత వారం రోజుల నుంచి జగన్ బ్యాచ్, సాక్షి టీవీ ఒకటే హంగామా... ఎవరో హైకోర్ట్ లో చంద్రబాబు, లోకేష్ అవినీతి చేసారంటూ కేసు వేసారు, ఇక చంద్రబాబు జైలుకు వెళ్తారు అంటూ, ఇలా ఒకటే హంగామా.. అసలు వీళ్ళు వేసిన పిటీషన్ ఏంటి అయ్యా అంటే, చంద్రబాబు, లోకేష్ కలిసి ఐటి శాఖలో 25 వేల కుంభకోణం చేసారు అంట.. అసలు ఐటిలో ఇంత పెద్ద కుంభకోణం చెయ్యటానికి, అక్కడ ఏమి ఉంటుంది ? ప్రతివాదులుగా చంద్రబాబు, లోకేష్ లతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ఏపీఎన్నార్టీ సొసైటీ ఛైర్మన్ వేమూరి రవికుమార్ లను చేర్చారు. అయితే, ఇలాంటి పస లేని కేసు పట్టుకుని ఒకటే హడావిడి చేసింది జగన బ్యాచ్..

court 26092018

ఈ పిటీషన్ ఈ రోజు హైకోర్ట్ ముందుకు వచ్చింది. అందరూ అనుకున్నట్టే, ఈ కేసు అసలు హైకోర్ట్ అడ్మిట్ కూడా చేసుకోలేదు. చివరకు హైకోర్టుకు ఎక్కిన పిటిషనర్ శ్రవణ్‌కుమార్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన కోర్టుకు సరైన ఆధారాలు చూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని, పూర్తి ఆధారాలతో కోర్టుకు రావాలని పిటిషనర్‌కు హైకోర్టు చెప్పింది. దీంతో కేసు కొట్టేయక ముందే, శ్రవణ్‌కుమార్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం, ఇది ఒక పనికిరాని కేసు అని, కోర్ట్ లో ఇలాంటివి అసలు నిలబడవు అని అన్నారు. ఆధారాలు చూపించకుండా, ఆరోపణలు చేస్తే, ఇలాగే ఉంటుందని అన్నారు.

ఓ పక్క వర్షం, మరోపక్క కాలినడక ...ఆ శ్రమ ఆంధ్రులకు మేలు చేకూర్చాలనే... ఇక్కడ , అక్కడని లేదు ..ఎక్కడైనా పని పని... తనని నమ్ముకున్న అయిదున్నర కోట్ల ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడుతున్న కష్టానికి ప్రత్యక్ష్య తార్కాణం ఈ ఫోటోలు ... ఇరవై ఏళ్ల క్రితం... నాడు అమెరికాలో ఫైళ్ళు పట్టుకుని అనేక కార్పోరేట్ కార్యాలయాలకు వెళ్లి హైదరాబాద్ లో ఐటీ సంస్థలను నెలకొల్పాలని బలపం కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సఫలీకృతులయ్యారు... మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థ అధిపతి బిల్ గ్రేట్స్ అపాయింట్ మెంట్ సంపాదించడమనే అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసుకుని... పది నిమిషాల సమయాన్ని గంటల పాటు కేటాయించేలా తన వాగ్దాటితో సద్వినియోగం చేసుకుని అసాధ్యుడనిపించుకున్నారు...

cbn ny 25092018 2

ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి , వయసు అరవై ఎనిమిది... కుటుంబసభ్యులతో ముఖ్యంగా మనవడితో ఆడుకోవాల్సిన తరుణం.. కాలు తీసి కాలు కదపాల్సిన పని లేదు... పిలిస్తే వాహనాలు క్యూగడతాయి... అయినా వయసు ఏదైనా మిగిలిన వారికి ఉత్సాహం, ప్రోత్సాహం అందించడంలో ఆయనకు ఆయనే సాటి ...యుద్ధమైనా , ఉద్యమంలోనైనా ముందుండి నడిపించేవాడే అసలైన, నిజమైన, నిఖార్సయిన నాయకుడు, పాలకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమె .. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు, ఈ రోజు వర్షంలో తడుస్తూ, తన పర్యటన కొనసాగిస్తున్నారు.

cbn ny 25092018 3

తను బస చేసిన హోటల్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో సమావేశంలో పాల్గొడానికి సుమారు కిలోమీటర్ నడచి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారుల బృందం. న్యూయార్క్ లో జరుగుతున్న ‘సుస్థిర అభివృద్ధి ప్రభావ సదస్సు (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ సమ్మిట్)లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గున్నారు. ‘శీఘ్ర సుస్థిర ఉత్పాదకత సాధన’ అనే అంశంపై ఏపీఈడీబీ (ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి)తో కలిసి ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సంయుక్త పత్రం విడుదల చేసారు.

చంద్రబాబు, లోకేష్ పై సిబిఐ వెయ్యాలి అంట.. దీనికి సంబంధించి, ముందడుగు ప్రజాపార్టీ అధ్యక్షుడు జె.శ్రవణ్ కుమార్ పిటిషన్ వేశారు. గత నాలుగేళ్లలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ సంపాదించిన ఆస్తులపై దర్యాప్తు చేయించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని మాజీ న్యాయాధికారి. ఏపీలో ఐటీ అభివృద్ధి, కొత్త సంస్థల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, పరిశ్రమలకు వేలాది ఎకరాలు స్కాం చేసిన చంద్రబాబు, లోకేష్ లు రూ. 25 వేల కోట్ల ఆస్తులను కూడబెట్టారంటూ పిటిషన్ లో ఈ వ్యక్తి రాసాడు.

cbi 25092018

అర్హత లేకపోయినా నూతన ఐటీ కంపెనీలు/పరిశ్రమలకు అనుమతులిచ్చారు. ఆ కంపెనీలకు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రోత్సాహకాల (ఇనెసెంటివ్స్‌) రూపంలో ఇవ్వడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ పిటీషన్ సారంశం. ప్రతివాదులుగా చంద్రబాబు, లోకేష్ లతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ఏపీఎన్నార్టీ సొసైటీ ఛైర్మన్ వేమూరి రవికుమార్ లను చేర్చారు. లోకేష్ ఐటీ మంత్రి అయిన తర్వాత తన సమీప బంధువు రవికుమార్ ను ఐటీశాఖ ముఖ్య సలహాదారుడిగా, ఏపీఎన్నార్టీ ఛైర్మన్ గా నియమించారని పిటిషన్ లో ఆరోపించారు.

cbi 25092018

అయితే ఈ కేసు రేపు హైకోర్ట్ పరిగణలోకి తీసుకుని, అసలు ఇది విచారణ చేయ్యదగ్గిందా, రాజకీయ ప్రేరేపిత పిటీషనా అనేది తేల్చనుంది. అసలు ఐటి శాఖలో 25 వేల కోట్లు స్కాం ఏంటో, ఆ పిటీషన్ వేసిన వ్యక్తులకే తెలియాలి. అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం, ఇది ఒక పనికిరాని కేసు అని, కోర్ట్ లో ఇలాంటివి అసలు నిలబడవు అని అంటున్నారు. నరేంద్ర మోడీ, గత ఆరు నెలలుగా, చంద్రబాబుని ఎదో ఒక కేసులో ఇరికించటానికి, అన్ని విధాలుగా ప్రయత్నం చేసి, ఏ ఆధారం దొరక్క, బాబ్రీ లాంటి కేసుల్లో నోటీసులు ఇచ్చేలా చేసారని, ఇది కూడా రాజకీయ నేపధ్యంలో వేసిన కేసు అని, అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు సౌర బ్యాటరీలు చెందిన ప్రాజెక్ట్ వైపు దృష్టి సారించింది. సౌర విద్యుత్ పరికరాల తయారీ లో పేరుగన్న ట్రైటన్ సోలార్ ఆంధ్రప్రదేశ్ లో సోలార్ బ్యాటరీ తయారీ ప్రాజెక్టు ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటన లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారుల బృందంతో ట్రైటన్ సోలార్ సంస్థ చర్చలు జరిపింది. ప్రాజెక్టు ఏర్పాటు కు ఆ సంస్థ చైర్మన్ హిమాంశు పటేల్, మేనేజింగ్ పార్టనర్ నంద శాండిల్య - పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్ మధ్య ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహనా ఒప్పందం కుదిరింది.

solar 25092018

ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు వంద మిలియన్ల యూఎస్ డాలర్లు అంటే సుమారు 727 కోట్ల 84 లక్షల రూపాయలు అంచనాతో పెట్టుబడిని దశలవారీగా పెడతామని ట్రైటన్ సోలార్ సంస్థ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ ప్లాంట్ ఏర్పాటుకు 100-200 ఎకరాల భూమి అవసరం అవుతుందని ఆ సంస్థ ప్రతిపాదించింది. ఈ సౌర బ్యాటరీని తయారు చేయడానికి నానోటెక్నాలజీ - లిథియం పాలిమర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని, దీనిలో భాగంగా సౌర బ్యాటరీలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామమని, నవ్యంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

solar 25092018

మూడో రోజు చంద్రబాబు షడ్యుల్.. భారత కాలమాన ప్రకారం ఈ సాయంత్రం 6.30కు WEF ప్రతినిధి టషీనా లెబికోస్కీకి ఇచ్చే వీడియో ఇంటర్వ్యూతో మూడోరోజు అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలు ప్రారంభం... రాత్రి 8 గంటలకు (IST) ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సు’కు హాజరు... ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి-ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే బహు పాక్షిక సదస్సులో ‘శీఘ్ర సుస్థిర ఉత్పాదకత సాధన’ అనే అంశంపై సంయుక్త పత్రం విడుదల... రాత్రి 9.45 (IST) వైర్‌లెస్ ఆప్టికల్స్ కమ్యూనికేషన్స్ రంగ దిగ్గజం-గూగుల్ ‘ఎక్స్’ సంస్థ ఉపాధ్యక్షుడు టామ్ మూరే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్‌సైట్ కౌన్సిల్-ఎఫ్ సాక్ (FSOC) ప్రాజెక్టు హెడ్ మహేశ్ కృష్ణస్వామితో లంచ్ సమావేశం... రాత్రి 11.30 (IST)కు ఆర్టిఫీషియల్ టెక్నాలజీ రంగానికి చెందిన ఇన్వెస్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశం, అత్యాధునిక ఐవోటీ సాధనాల ఆవిష్కారాల ఆవశ్యకతలపై సమావేశంలో తన అభిప్రాయాలను వెల్లడించనున్న ముఖ్యమంత్రి... అర్థరాత్రి 12.30 (IST)కు ఆర్డోర్ ఈక్విటీ పార్టనర్లతో సమావేశం... 2.20 AM (IST)కు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ అసోసియేషన్‌ సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. 4AM (IST)కు యుఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF)కు చెందిన 25మంది ఉన్నత శ్రేణి ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం

Advertisements

Latest Articles

Most Read