నవ్యాంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిన తిరుపతికి భారీ పరిశ్రమలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ పరిశ్రమలు ఏర్పాటు కాగా మరికొన్ని ఏర్పాటవుతున్నాయి. తాజాగా చైనానుంచి పలు పరిశ్రమలు తిరుపతికి కదలిరానున్నాయి. ఈ మేరకు చైనా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఐటీ మంత్రి నారా లోకేష్‌తో ఆయా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ టీసీఎల్‌ తిరుపతిలో పరిశ్రమ ఏర్పాటు కు నాలుగు రోజుల క్రితం ఒప్పందం కుదుర్చుకోగా తాజాగా శనివారం మరో నాలుగు పరిశ్రమలు తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇలా పలు ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు తిరుపతికి తరలిరానుండటంతో తిరుపతి ఎలకా్ట్రనిక్‌ హబ్‌ నిండుదనం సంతరించుకోనుంది. వేలాది మందికి ఉద్యోగవకాశాలు కలగనున్నాయి.

lokeesh 25092018 2

చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ హబ్‌గా మారుస్తామని, వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు ఐటీ మంత్రి లోకేష్‌ భరోసా ఇచ్చారు. ఆ మేరకు మంత్రి లోకేష్‌ చేస్తున్న కృషిలో భాగంగా టీసీఎల్‌ పరిశ్రమ తిరుపతి దగ్గర ఏర్పాటు చేసేం దుకు ముందుకొచ్చింది. చైనా పర్యటనలో ఉన్న లోకేష్‌తో ఆ సంస్థ సీఎఫ్‌వో మైకెల్‌ వాంగ్‌తో గత గురువారం భేటీ అయి టీసీఎల్‌ యూనిట్‌ను తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు ఏపీ ఎలక్ట్రానిక్స్‌ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. టీసీఎల్‌ తిరుపతిలో ఏర్పాటయితే ఎలక్ట్రానిక్స్‌ రంగానికే మరో కలికితురాయి అవుతుంది.

lokeesh 25092018 3

పరిశ్రమ రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యికి పైగా ఉద్యోగాలు లభించే అవకా శాలు ఉన్నట్లు అంచనా వేస్తు న్నారు. టీసీఎల్‌ పరిశ్రమ టీవీలు, వాషింగ్‌ మిషన్లు, స్మార్ట్‌ ఫోన్లు, ఏసీలు, రెప్రిజిరేటర్లు, ఎల్‌సీడీలు తదితర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో పేరెన్నికగన్నది. ప్రపం చంలో 160 ప్రాంతాల్లో చిన్న, పెద్ద కంపెనీలను కలిగి ఉన్న టీసీఎల్‌ భారత్‌లో ముంబైలోని ప్రధాన కార్యాలయం ద్వారా కార్యకలాపాలను సాగిస్తోంది. ఎలక్ట్రానిక్స్‌ రంగంతో పాటు ఆటోమొబైల్‌ రంగంలో కూడా ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పటికే హీరోమోటార్స్‌, రాక్‌మెన్‌ ఇండస్ట్రీస్‌, అపోలో టైర్స్‌ పనులు జరుగుతున్నాయి. ఇసుజి మోటార్స్‌ పరిశ్రమ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఫలితంగా అటు ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్‌ రంగాల్లో చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో నిలవనుంది.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి ‘నామినేట్’ చేసినట్టు తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసాయి సౌందర రాజన్ పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద’’ ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోదీ ఈ పురస్కారానికి అర్హుడని ఆమె పేర్కొన్నారు. ఓ ప్రయివేటు యూనివర్సిటీలో నెఫ్రాలజీ విభాగం హెడ్‌గా, సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న తన భర్త డాక్టర్ పి. సౌందరరాజన్ కూడా మోదీ పేరును నోబెల్‌కు నామినేట్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఈమేరకు తమిళనాడు బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది.

modi 25092018

‘‘2019 నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును తమిళిసాయి సౌందరరాజన్ నామినేట్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ కేర్ పథకం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ‘ఆయుష్మాన్ భారత్‌’ను ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు..’’ అని బీజేపీ వెల్లడించింది. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం ఆయన దార్శనికతకు నిదర్శనమనీ.. కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో ఈ పథకం వెలుగులు నింపుతుందని పేర్కొంది. ‘‘2019 నోబెల్ శాంతి బహుమతి నామినేషన్లకు జనవరి 31 వరకు గడువు ఉంది. ప్రతియేటా సెప్టెంబర్‌లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, పార్లమెంటు సభ్యులు సహా ఇతరులు కూడా ప్రధానమంత్రిని నామినేట్ చేయవచ్చు...’’ అని తమిళనాడు బీజేపీ పేర్కొంది.

 

modi 25092018

అయితే, దీని పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అదేదో మోడీ త్యాగం చేసినట్టు, ఆయాన సొంత ఆస్థి ఎదో రాసిచ్చినట్టు, ఇంత హడావిడి ఎందుకని విపక్షాలు అంటున్నాయి. ఈ దేశంలో ఎంతో మంది ప్రధానులు, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసరాని, ఎవరూ ఇలా చెయ్యలేదని చెప్తున్నాయి. ప్రధాని పదవి అనేది బాధ్యత అని, ఒక పధకానికి ఆయన పేరు పెట్టుకుని, దానికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వమని కోరటం ఏమిటో అర్ధం కావట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. మోడీ, అమిత్ షా ఎంత శాంతి కోరుకునే వారో, గుజరాత్ నర మేధం చూస్తే తెలుస్తుందని, ఇలాంటివి మాని, దేశాన్ని కుదిపేస్తున్న, రాఫెల్ కుంభకోణం పై స్పందించాలని కోరుతున్నారు.

ఆదివారం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోమల హత్య అనంతరం పారిపోతున్న మావోయిస్టుల వీడియోలు బయటపడ్డాయి. హత్య చేశాకా వారు పారిపోతున్న దృశ్యాలను స్థానికులు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కామేశ్వరి అలియాస్ సింద్రి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జలుమూరు శ్రీనుబాబు అలియాస్ రైనోగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే కిడారి, సోమాలను హత్య చేసిన మావోల ఫోటోలను పోలీసులు సోమవారం విడుదల చేశారు. వీరిలో జలుమూరు శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనో, కామేశ్వరి అలియాస్ స్వరూపా అలియాస్ సింద్రి, అలియాస్ చంద్రి, అలియాస్ రింకి, వెంకట రవి చైతన్య అలియాస్ అరుణలుగా గుర్తించారు. ఇక హత్యలో పాల్గొని పారిపోతున్న వారిలో కామేశ్వరి, శ్రీనుబాబులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ ఆ వీడియో చూడవచ్చు https://youtu.be/zazoG6irrOY

kidari 25092018

ఇక కిడారి సర్వేశ్వరరావు, సోమాలను హతమార్చేందుకు గత ఐదునెలలుగా మావోలు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు అరకు ప్రాంతాన్ని పోలీసులు భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. ఓ వైపు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుండగా మరోవైపు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ నిర్వహించిన సమయంలో కొందరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజాప్రతినిధులే టార్గెట్‌గా పైపు లైన్లలో భారీ పేలుడు సామగ్రిని అమర్చారు మావోయిస్టులు. ఇక కిడారి,సోమల హత్యతో మన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మొత్తానికి అటు మావోల కదలికలు, ఇటు పోలీసులు కూంబింగ్‌తో మన్యం ప్రాంతాలు యుద్ధభూమిని తలపిస్తున్నాయి. స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టకుని ఏక్షణం ఏమి జరుగుతుందో తెలియక బిక్కుబిక్కున కాలం వెల్లదీస్తున్నారు.

kidari 25092018

గూడ్ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న లిప్పిటిపుట్టు దాడికి అన్ని విధాల సురక్షితమని భావించిన మావోయస్టులు అక్కడే యాక్షన్‌కు దిగారు. సెల్ సిగ్నల్స్ పనిచేయని ఈ గ్రామంలో ఇన్ఫార్మర్లను అడుగడుగునా మోహరించారు. స్థానిక మహిళలతో కలిసి దళాలకు అనుగుణంగా ఉన్నవారిని రంగంలోకి దించి కిడారి, సివేరి వాహనాలను ఆపారు. సమస్యలు చెప్పుకోడానికి వచ్చారేమోనని కిడారి భావించారు. అయితే మహిళల్లో కొందరు ఆయుధాలు ధరించి ఉండడాన్ని గమనించిన డ్రైవర్లు తమ వాహనాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే సాయుధులైన మహిళలు కార్లకు అడ్డంగా నిలుచుని తప్పించుకోకుండా చేశారు. తర్వాత కిడారి, సోమను కిందికి దించి యాక్షన్ పూర్తి చేశారు. అరకు ఏజెన్సీలో ఆదివారం (23వ తేదీ) ఉదయం ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే.

ఈ వార్తను చూసైనా బీజేపీ, వైకాపా, జనసేన లీడర్లకు బుద్ధి,జ్ఞానం వస్తుందని ఆశిద్దాం.... ఉభయరాష్ట్రాల ప్రజలే కాదు ప్రపంచస్థాయి నేతల మన్ననలు పొందిన తెలుగుతేజం శ్రీ నారా చంద్రబాబునాయుడు ఒక్కరే... ఇండియన్ ఐకానిక్ లీడర్.. చంద్రబాబును చాలా గొప్పగా పరిచయం చేసిన ఐక్యరాజ్యసమితి.. "ఇండియాలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు చంద్రబాబు రాష్ట్రం వారే.. ఐటీ రంగంలో ఆయన ఎంతో ప్రగతిని సాధించారు.. మీ లీడర్ షిప్ కు, ఛాంపియన్ షిప్ కు ధన్యవాదాలు.." ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. 'జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్' పై ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు చాలా గొప్పగా పరిచయం చేశారు.

un 25092018 2

"ఎక్సలెన్సీస్, లేడీస్ అండ్ జెంటిల్మన్. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విజేతలు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మనతో ఉన్నారు. ఇండియాలో చంద్రబాబు ఒక ఐకానిక్ లీడర్. ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులే. ఇండియాలోని ప్రతి నలుగురు ఐటీ ఎక్స్ పర్ట్స్ లో ఒకరు చంద్రబాబు రాష్ట్రానికి చెందినవారే. భారతదేశ జనాభాలో చంద్రబాబు రాష్ట్ర జనాభా కేవలం నాలుగు శాతం మాత్రమే... అయినా దేశ ఐటీ నిపుణుల్లో 25 శాతం మంది ఆయన రాష్ట్రం వారే . ఐటీ రంగంలో ఆయన ఎంతో ప్రగతిని సాధించారు. మీ లీడర్ షిప్ కు, ఛాంపియన్ షిప్ కు ధన్యవాదాలు. మీ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చాలా చేస్తున్నారు. ఏపీ, ఇండియా... వీలైతే ప్రపంచ భవిష్యత్తును మార్చగలరు. మీరు చేస్తున్నది వినాలనుకుంటున్నాం. మీరు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు"... అంటూ చంద్రబాబును ఐక్యరాజ్యసమితి మోడరేటర్ ఈ విధంగా పరిచయం చేస్తున్నప్పుడు... సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.

un 25092018 3

చంద్రబాబు కూడా తెలుగులో ప్రసంగం చేసారు.. ప్రసంగం దాదాపు 25 నిమషాలు కొనసాగింది. చివరగా మాట్లాడుతూ "ఇక్కడి నుంచి మా భారత్‌కు వచ్చిన మిత్రులు మేం సాగిస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. మీరంతా ఆంధ్రప్రదేశ్ కు రండి. మేం సాధిస్తున్న అభివృద్ధిని, ప్రజా జీవన ప్రమాణాల మెరుగుకు టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించండి. మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వ అతిథులుగా గౌరవిస్తాం. మీరు ప్రకృతి వ్యవసాయంలో మా కాన్సెప్ట్ నచ్చితే అంతర్జాతీయ సమాజానికి వేగవంతంగా అన్వయించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్ధిక సంస్కరణలపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను. కానీ ఇవాళ మీ సమక్షంలో ఈ ఐక్యరాజ్యసమితి వేదికపై నేనిచ్చిన ఉపన్యాసం నాకెంతో సంతృప్తిని ఇఛ్చింది. ప్రకృతి వ్యవసాయానికి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి ఇది నాకు దక్కిన అద్భుత అవకాశంగా భావిస్తున్నాను. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను." అని ముగించారు.

Advertisements

Latest Articles

Most Read