అత్యంత అధునాతన ఐఓటీ సాంకేతికతను అన్వయించి క్యాన్సర్ నివారణ చికిత్సను మరింత మెరుగుపర్చాలని, రోగుల జీవితకాలం పెంచే అవకాశాలను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో స్థిరపడిన మనదేశ సుప్రసిద్ధ క్యాన్సర్ వైద్య నిపుణులు డా. నోరి దత్తాత్రేయుడు సోమవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైద్య బృందాలు మారుమూల గ్రామాలు వెళ్లి మహిళలకు క్యాన్సర్ నిర్ధారణకోసం స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. లక్షలాది మహిళలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారని వివరించారు. క్యాన్సర్ వైద్య చికిత్స కూడా మారుమూల ప్రాంతాలకు అందించాలన్నది తమ అభిమతమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

cbn doctor 24092018

క్యాన్సర్ వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు డాక్టర్ దత్తాత్రేయుడు తమ అంగీకారాన్ని తెలిపారు. వైద్యరంగంలో, ఐఓటీ వాడకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించటాన్ని, ఈయన ఆశ్చర్యపోయారు. వైద్య రంగలో మీకు ఇంత అవగాహన ఉందనుకోలేదు అని, ఇప్పుడిప్పుడే మేము ఇక్కడ వైద్య రంగంలో ఐఓటీ గురించి మాట్లాడుతుంటే, ఆ మాటలు మీ నోటి వెంట రావటం చూసి ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. ఒక రాజకీయ నాయకుడుకి ఇంత అవగాహన ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. మీకు సంపూర్ణ సహకారం అందిస్తామని, అమెరికాలోని ‘సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్’ ద్వారా రాష్ట్రంలో క్యాన్సర్ వైద్యులకు అత్యంత అధునాతన శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాలలో రోగులకూ నూతన చికిత్సలు అంజేయాలన్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. భావి వైజ్ఞానిక యుగానికి చోదకశక్తిగా నిలవాలని, ముఖ్యంగా వైద్యరంగంలో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ ఆవిష్కరణల విస్తృతికి తోడ్పడాలన్న ముఖ్యమంత్రి సూచనను స్వాగతించారు.

cbn doctor 24092018

వైద్యఆరోగ్య రంగంలో, సంబంధిత రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సొంత రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా వుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. విజ్ఞానం, సాంకేతికత ఊతంగా అమెరికాలో తెలుగువారి తలసరి ఆదాయం మరో ఐదేళ్లలో రెండింతలు కానున్నదని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దే కృషి ఆరంభమైందని, అంతిమంగా సాధారణ ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమస్యలను, అంశాలను గుర్తించడంలో ప్రాథమిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిభను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చి వినియోగించాలని చంద్రబాబు కోరారు. బ్రెయిన్ డ్రెయిన్ ప్రాచీన సిద్ధాంతమని, ఇప్పుడు కావాల్సింది ‘బ్రెయిన్ గెయిన్’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనా విధానానికి ఐక్యరాజ్యసమితిలోని భారతదేశ శాశ్వత ప్రతినిధి, రాయభారి సయ్యద్ అక్బరుద్దీన్ ముగ్ధులయ్యారు. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రిని ఆదివారం అక్బరుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిసి, విందు సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ కోసం తీసుకుంటున్న చర్యలు, రైతులను ప్రోత్సహించే విధానాన్ని ఈ సందర్బంగా అక్బరుద్దీన్‌కు ముఖ్యమంత్రి వివరించారు.

cbn 24092018 2

60 లక్షల మంది రైతులు కనీసం రెండు కోట్ల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, చురుకైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శవంతమైన, స్ఫూర్తిదాయకమైన రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తున్నాయని అక్బరుద్దీన్ ప్రశంసించారు. ఇరువురూ కలిసి నూతన వ్యవసాయ విధానాలు, రైతులకు రెట్టింపు ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాల గురించి కాసేపు చర్చించారు. అనంతరం ‘న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ సెనేట్‌’లో ప్రవాస తెలుగు సంఘాలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించడంతో పాటు జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన తరుణం ఇదేనని పిలుపునిచ్చారు.

cbn 24092018 3

అరకు శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసన సభ్యుడు సివేరి హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు. ఇది పిరికిపందల చర్య అని, హత్యా రాజకీయాలు సరికాదని ఖండించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఇంటిటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్న ప్రజాప్రతినిధిని హతమార్చటం అనాగరిక చర్య అని ముఖ్యమంత్రి ఖండించారు. న్యూయార్కు విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ముందుగా ఆయన అరకు ఎమ్మెల్యే హత్య, అనంతరం ఉత్పన్నమైన పరిస్థితిని సమీక్షించారు. ఫోనులో మంత్రులకు, అధికారులకు తగిన సూచనలిచ్చారు.

మావోయిస్టుల చేతిలో దారుణంగా హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల పై నక్సలైట్ల దాడి ఎలా జరిగిందనే విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరు తమ మైనింగ్ క్వారీల వద్దకు వెళుతుండగా మావోయిస్టులు దాడి చేసి చంపేశారని తొలుత ప్రచారం జరగగా, ఆ తరువాత వీరు గ్రామదర్శినిలో పాల్గొనేందుకు వెళుతుండగా మావోల దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే అసలు వాస్తవం వేరని వీరిని మావోలే ఒక పథకం ప్రకారం తమవద్దకు రప్పించుకొని ఆ తరువాత వీరిని మట్టుబెట్టారని పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వ్యూహాన్నే 'బెయిటెడ్‌ ఆంబుష్‌' అంటారని వారు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే...

mao 24092018 2

ప్రత్యర్థులను అంతమొందించేందుకు మావోయిస్టులు అనుసరించే ప్రధాన వ్యూహాల్లో 'బెయిటెడ్‌ ఆంబుష్‌' ఒకటి...అంటే ఎరవేసి మట్టుపెట్టడం అని దీనికి అర్థం! ఆ 'ఎర' ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఒక చిన్నపాటి సంఘటన, అలజడి సృష్టించి దాని పై ఆరా తీసేందుకు వచ్చిన బలగాలను మట్టుపెట్టే భీకర దాడికి పాల్పడవచ్చు. లేదా, గిరిజనుల ద్వారా తమ సమస్య గురించి అభ్యర్థనలు పంపించి, అక్కడికి వచ్చిన బలగాలను మట్టుపెట్టవచ్చు. లేదా రాజీ పడటం అనే కాన్సెప్ట్ తో చర్చల పేరుతో టార్గెట్ వ్యక్తులనే తమ వద్దకు వచ్చేలా చేసి అక్కడికక్కడే ఫినిష్ చేసేయడం. ఇవీ 'బెయిటెడ్‌ ఆంబుష్‌'లో వ్యూహాల్లో ప్రధానమైనవి.

mao 24092018 3

ఇప్పుడు ఈ ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు బలయింది రాజీ చర్చల పేరిట అమలు చేసిన 'బెయిటెడ్‌ ఆంబుష్‌' వ్యూహానికే అనేది పోలీసుల విశ్లేషణ. ఈ 'బెయిటెడ్‌ ఆంబుష్‌' వ్యూహాల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్‌కే అలియాస్‌ అక్కిరాజు హరగోపాల్‌ దిట్టగా పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది మే 12న బస్తర్‌లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలను బెయిటెడ్‌ ఆంబుష్ తోనే ఉచ్చులోగి లాగి మట్టుబెట్టారని తేలింది. ఈ ఘటనలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అరకు ఎమ్మెల్యే కిడారి, సోమలను కూడా నక్సల్స్ 'మాట్లాడుకుందాం' అనే ఎర వేసి మట్టుపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.

దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమైన గణతంత్ర వేడుకల మాటున దేశ రక్షణలో అత్యంత కీలకమైన యుద్ధ విమానాల కొనుగోలు పేరిట ఫ్రెండుకు మేలు చేయడానికి ఒకరు, గర్ల్‌ఫ్రెండ్‌కి లబ్ధి చేకూర్చడానికి మరొకరు ఒప్పందాలు చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2016 జనవరి 26న, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫాన్స్‌ హోలాంద్‌ హాజరయ్యారు. అనంతరం, కొద్దిసేపటికే 36 రాఫెల్‌ విమానాల కొనుగోలుకు అవగాహన ఒప్పందం పై హోలాంద్‌, మోదీ సంతకాలు చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందంగా దీనిని అభివర్ణించారు.

rafael 24092018 1

కానీ, అంతకు రెండు రోజుల ముందే హోలాంద్‌ ప్రియురాలు, నటి జూలియా గయెట్‌ నిర్మించే ఫ్రెంచి సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. సినిమా బడ్జెట్‌ కోటి యూరోలు (మన రూపాయల్లో దాదాపు 90 కోట్లు.) ఈ సినిమా కోసం 30 లక్షల యూరోలు ‘పైనాన్స్‌’ చేస్తామని రిలయన్స్‌ తెలిపింది. ఈ నేపథ్యంలోనే, రాఫెల్‌ డీల్‌లో క్విడ్‌ ప్రో కో ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోలాంద్‌ ప్రియురాలి సినిమాకు అనిల్‌ అంబానీ పెట్టుబడి పెట్టారు. ఆ వెంటనే, హోలాంద్‌, మోదీ కుదుర్చుకున్న రాఫెల్‌ డీల్‌లో ఆయన ఆఫ్‌ సెట్‌ భాగస్వామిగా తెరపైకి వచ్చారు. దాంతో, అనిల్‌ అంబానీ, హోలాంద్‌ కుమ్మక్కయ్యారని, ఇందుకు మోదీ సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

rafael 24092018 1

రాఫెల్‌ ఒప్పందం క్విడ్‌ ప్రో కో అని విమర్శిస్తూ ఒప్పందంలో మార్పులు జరిగిన తీరు, పరిణామాలను కాంగ్రెస్‌ వివరిస్తోంది. యూపీఏ హయాంలో ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌ నుంచి 126 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఎంవోయూ కుదుర్చుకున్నారు. అది కుదిరి ఉంటే, రాఫెల్‌ విమానాలను భారత్‌లోనే ప్రభుత్వ రంగ సంస్థ ‘హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌’ (హెచ్‌ఏఎల్‌) తయారు చేసి ఉండేది. కానీ, ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ప్రధాని మోదీ ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. దసో నుంచి కేవలం 36 రాఫెల్‌ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. 2016 సెప్టెంబరు 23వ తేదీన ఇరు దేశాల రక్షణ మంత్రులు ఢిల్లీలోనే రూ.59 వేల కోట్ల ఒప్పందం పై సంతకం చేశారు.

Advertisements

Latest Articles

Most Read