ప్రబోధానంద ఆశ్రమ వివాదం నేపథ్యంలో, అనూహ్యంగా మరో అంశం తెరపైకి వచ్చింది. ప్రబోధానంద మొదటి భార్యగా చెబుతూ రంగ మ్మ అనే వృద్ధురాలు తన కు న్యాయం చేయాలం టూ శనివారం మీడియా ఎదుట ప్రత్యక్షమైంది. తా డిపత్రి ఆశ్రమ వివాదానికి సంబంధించి వార్తలు వ స్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రబోధానంద అసలు పే రు పెద్దన్నగా బయటకొచ్చింది. దీంతో విషయం తెలుసుకొన్న ఆయన మొదటి భార్య రంగమ్మ.. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. వివాహ ఆహ్వాన పత్రిక, పెళ్లయిన కొత్తలో తీయించుకొన్న ఫొటోను మీడియాకు చూపించారు.
‘మాది కనగానపల్లి మండలం వేపకుంట. నాన్న ముసలప్ప, అమ్మ వెంకటమ్మ. 1977 ఆగస్టు 26న తాడిపత్రిలోని నందలపాడులో పెద్దన్న(ప్రబోధానంద)తో పెళ్లయింది. ఆయన ఆర్ఎంపీ డాక్టర్. కొన్నేళ్లు తర్వాత ఏమైందో కానీ నన్ను పుట్టింటికి పంపేశాడు. నేను వేపకుంటలోని అమ్మవాళ్ల దగ్గర ఉండగా.. చంటిబిడ్డతో ఉన్న మహిళను తీసుకొచ్చి 6 నెలలపాటు మా ఇంట్లోనే ఉన్నారు. ఆపై వెళ్లిపోయారు. అప్పటికి మాకు పెళ్లై 8 ఏళ్లు. ఆ తర్వాత నన్ను పట్టించుకోలేదు. అన్నయ్య రామకృష్ణ ఇంట్లోనే ఉంటున్నాం. ఈ ముసలి వయసులో పింఛన్ సొమ్ముతో బతుకుతున్నాను’ అని రంగమ్మ వివరించారు.
హైకోర్టులో విచారణ.. ఆశ్రమంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొన్న 10 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ ప్రబోధానందకు చెందిన ఒక ప్రతినిధి శనివారం హౌస్ మోషన్లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ పేర్కొన్న 10 మందిని శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని, వారిని 24గంటల్లో కోర్టులో హాజరుపరుస్తారని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. ఈ వాదనలను రికార్డు చేసిన హైకోర్టు విచారణ ఇంతటితో ముగిస్తున్నట్లు ప్రకటించింది.