పవన్ కళ్యాణ్ సీక్రెట్ మీటింగ్ పెట్టి, డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటూ, మహా న్యూస్ లో ఉండగా, మూర్తి ఒక స్పెషల్ ప్రోగ్రాం వేసి, వీడియోలు చూపించిన సంగతి తెలిసిందే. అందులో, పవన్ ఆడిటర్ మాట్లాడుతూ, చెక్ ఇస్తున్నారా, కాష్ ఇస్తున్నారా ? మినిమం 10 లక్షలు ఇవ్వాలి అని చెప్పిన వీడియో అందరూ చూసారు. అయితే, పవన్ నుంచి వచ్చిన ఒత్తిడితో, ఈ ప్రోగ్రాం మధ్యలోనే ఆపేశారు. పవన్ కళ్యాణ్, తన కులం వారితో, మాట్లాడిన మాటల వీడియో ప్లే చెయ్యలేదు. దీంతో మనస్తాపం చెందిన మూర్తి, మహా న్యూస్ కి రాజీనామా చేసి వెళ్ళిపోయారు.

murthy 23092018

ఈ తరుణంలో, పవన్ ఫాన్స్, ఆయన పై చేస్తున్న ఉన్మాదం తట్టుకోలేక, ఒక యుట్యూబ్ వీడియో విడుదల చేసారు. అందులో, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి చెప్పారు. కాపులతో మాత్రమే పవన్ కల్యాణ్ సమావేశమయ్యారని,అందులో పాల్గొన్న ఓ వ్యక్తి మాటలను కూడా వీడియోలో, ప్రజెంట్ చేశారు మూర్తి. అంతటితో ఆగిపోలేదు, తన దగ్గర జనసేనకు చెందిన నిఖార్సైన నిజాలు చాలా ఉన్నాయని, కానీ సందర్భంగా కాదని మాత్రమే బయటపెట్టడం లేదని తేల్చి చెప్పారు. తను బయపెట్టిన అంశంపైన కానీ, తన పై జనసేన కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలపైన కానీ చర్చకు తాను సిద్ధమని సవాల్ చేశారు. అవసరం అయితే పవన్ 99 ఛానెల్ కు వచ్చి, చర్చిస్తానని చెప్పారు.

murthy 23092018

అయితే, ఇప్పుడు మూర్తి, మరో కొత్త ఛానెల్ లో జాయిన్ అయ్యారు. టీవీ5 తెలుగు న్యూస్ ఛానల్ లో ఆయన తన కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో, మహా న్యూస్ లో చూపించిన పవన్ కళ్యాణ్ వీడియోలు, ఇప్పుడు ఇక్కడ చూపిస్తారు అనే చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ ఫాన్స్, మూర్తి పై చూపించిన ఉన్మాదం అంతా ఇంతా కాదు. మూర్తి కమ్మ సామాజిక వర్గం అంటూ, తను ఆ కులం కాకపోయినా, అంటకట్టి, చంద్రబాబు డబ్బులు ఇచ్చి చేపించారు అంటూ హడావిడి చేసారు. కొంత మంది, మా పవన్ కి భయపడి, మూర్తి ఆపేసాడు, మా పవన్ గ్రేట్ అంటూ పోస్ట్ లు పెట్టారు. అయితే ఇప్పుడు మూర్తి వీరందరికీ తగు రీతిలో సమాధానం చెప్తారు అనే చర్చ మొదలైంది..

ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న వరుస పరువు హత్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మిర్యాలగూడ పరువు హత్య తరహాలో ‘సోని రాహు ప్రియ’లు పరువు హత్యకు గురవుతారని విజయవాడలో పోస్టర్లు వెలిశాయి. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం శివాలయం వీధిలో ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. పోస్టర్ల విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరు అంటించారు? అసలు ఈ సోని రాహు ప్రియ ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

vija 23092018 2

భయపెట్టే ఉద్దేశంతోనే ఈ పోస్టర్లను వీధిలో అంటించి ఉంటారని అధికారులు భావించి, ఆ దిశగా ఎంక్వయిరీ మొదలు పెట్టారు. ఆ యాప్రాంతాల్లో కులాంతర వివాహం చేసుకున్న యు వతీ యువకులు ఎవరైనా ఉన్నారా అని పోలీసులు ఆరా తీశారు. వారి వివరాలు తెలుసుకుంటూ ఎంక్వయిరీ ప్రారంభిస్తూనే, మరో పక్క ఆ ఏరియాలోని సీసీ కెమేరాల ఫుటేజిని పరిశీలించారు. సీసీ కెమేరాల ఫుటేజిని పరిశీలించగా, చివరకు పోలీసులుకి ఒక క్లూ దొరికింది. ఒక యువతకు ఆ పోస్టర్లు అంటిస్తూ కనిపించాడు.

vija 23092018 3

దీంతో పోలీసులు విచారణ ఆ దిశగా మొదలు పెట్టారు. పోస్టర్లు అతికించిన వ్యక్తి ఎక్కడుంటాడు అనే విషయం ఎంక్వయిరీ చేసారు. చివరకు, పోస్టర్లు అతికించిన యువకుడిని పట్టుకున్నారు. అతడు ఆ ప్రాంతానికే చెందిన చిట్టి లక్ష్మీనారాయణగా గుర్తించారు. ఈ పోస్టర్లు ఎవరు అంటించమన్నారు ? ఎందుకు అంటించమన్నారు ? రాహు, సోని, ప్రియ ఎవరని అతడిని ప్రశ్నించగా, అతని వైపు నుంచి అవాక్కయ్యే సమాధానం వచ్చింది. రాహు, సోని, ప్రియ అంటే కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీల పేర్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. చివరగా, అతడికి మతిస్థిమితం లేదని నిర్ధారించుకుని, ఊపిరిపీల్చుకున్నారు.

ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, వీకెండ్ కావటంతో, ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఈ వారం, కుటుంబరావు గారి చేతిలో కోటింగ్ కోసం, తెగ తాపత్రయ పడుతున్నాడు. వారం వారం, కొత్త కొత్త కాన్సెప్ట్ లతో, వచ్చే జీవీఎల్ ఈ వారం, కూడా మరో కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు. క్లైమాక్స్ మాత్రం కుటుంబరావు గారి ఎంట్రీ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఈ వారం, ఢిల్లీ నుంచి ఆదరాబాదరాగా వచ్చి, చంద్రబాబు అమెరికా పర్యటన పై బురద జల్లుడు మొదలు పెట్టాడు జీవీఎల్. చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్తున్న ఉద్దేశం ఒకటి.. చెప్పేదొకటని విమర్శించారు. ఐక్యరాజ్యసమితిలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో.. వారి పంపిన ఇన్విటేషన్ ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

gvl 22092018 1

ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్తున్నట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విమానం ఎక్కే లోపే ఐక్యరాజ్యసమితి పంపిన ఇన్విటేషన్‌ను మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ విషయంలో, చంద్రబాబు అమెరికా విమానం ఎక్కే లోపు, ఆ విషయం చెప్పలంటున్న జీవీఎల్ కు, అప్పటి దాక ఎందుకు, మేము ఒక్క నిమిషంలోనే, ఈ విషయం గురించి వివరాలు చెప్తున్నాం. అంతే కాదు, జీవీఎల్ అడుగుతున్న ఇన్విటేషన్ కూడా చూపిస్తున్నాం. కుటుంబరావు గారు వచ్చి, కోటింగ్ ఇచ్చే లోపు, జీవీఎల్ గారు, ఇది చూసుకోండి.

gvl 22092018 1

‘‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రంసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానించింది. దీనికి సమబందించి, ఐక్యరాజ్య సమితి ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెం, చంద్రబాబుకి లెటర్ రాసారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 24 నుంచి జరుగుతుందని, ‘‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ టాపిక్ మీద మీరు ప్రసంగించాలి అంటూ లెటర్ రాసారు. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో మార్పులు చోటు చేసుకుంటుంది. సామాజికంగా, ఆర్ధికంగా, ఎన్విరాన్మెంట్ పరంగా, మీరు తీసుకుంటున్న చర్యలు అమోఘం. ముఖ్యంగా, మీరు మీ రాష్ట్రంలో, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి ఇస్తున్న ప్రాధాన్యత, వాటి ఫలితాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. ఈ ప్రపంచం, మీ నుంచి, మీ అనుభవాలు వినాలని అనుకుంటుంది. మీ అనుభవాలు మాతో వచ్చి పంచుకుంటారని ఆశిస్తున్నా అంటూ, ఐక్యరాజ్య సమితి ఎక్జిక్యూటివ్ డైరెక్టర్, చంద్రబాబుకి లేఖ రసారు. జీవీఎల్ గారు, ఈ లేఖ చూసి పండగ చేసుకోండి...

వారానికి ఒక ఆరోపణ తీసుకువచ్చి, చంద్రబాబు అవినీతి చేసారు అంటూ గాల్లో కబురులు చెప్పి, అదిగో చంద్రబాబు అరెస్ట్, ఇదిగో చంద్రబాబు అరెస్ట్ అంటూ, చివరకి ఎప్పుడో 8 ఏళ్ళ క్రిందట ప్రజా ఆందోళన పై చేసిన ఒక పిల్ల కేసు తీసుకుని నోటీసులు ఇచ్చి, అరెస్ట్ వారంట్ ఇచ్చారు. అంటే, చంద్రబాబు అవినీతి పై వీళ్ళకు ఆధారాలు ఏమి దొరక్క, వీళ్ళ ఇగో చల్లార్చుకోవటానికి, ఇలా నోటీస్ పంపించారు. ఇప్పుడు చంద్రబాబు ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించబోతున్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రంసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానం పంపింది.

gvl cmo 2209218

జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు నిలిచిపోనుంది. ఇవన్నీ తట్టుకోలేని ఢిల్లీ పెద్దలు, రగిలిపోతున్నారు. అందుకే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లాంటి వాడు ఉన్నట్టు ఉండి హడావిడిగా విజయవాడ వచ్చారు. చంద్రబాబు అమెరికా వెళ్లి గంటల ముందు, ప్రజల్లో ఆలోచన రేపటానికి, చొవ్కబారు ఆరోపణలతో ముందుకువచ్చారు. ఐక్యరాజ్యసమితిలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో.. వారి పంపిన ఇన్విటేషన్ ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

gvl cmo 2209218

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు పెడుతున్న సమావేశాలకు వెళ్తూ.. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్తున్నట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐక్యరాజ్యసమితిలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో.. వారి పంపిన ఇన్విటేషన్ ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే జీవీఎల్ ఈ ఆరోపణలు చేసిన అరగంటలోనే ఏపి సీయంఓ, కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి ఆహ్వానాన్ని ఏపీ సీఎంవో మీడియాకు విడుదల చేసింది. ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తీరును ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడేందుకు రావాలని చంద్రబాబును కోరిన ఐక్యరాజ్యసమితి. గత నెల 22న చంద్రబాబుకు ఆహ్వానం పంపిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఎరిక్ సాల్‌హిమ్ పేరుతో సీఎంను పిలిచిన ఐక్యరాజ్యసమితి. చంద్రబాబు స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతారని ఐక్యరాజ్యసమితి లేఖలో పేర్కొంది.

Advertisements

Latest Articles

Most Read