తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలైన సంగతి తెలిసిందే.. ఎన్నికల తేది ఎప్పుడనేది క్లారిటీ లేకపోయినా, అన్ని పార్టీలు తమ తమ వ్యుహాల్లో మునిగి తేలుతున్నాయి. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఎన్నికల హీట్ పెంచేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తెరాస ఎంపీ కాంగ్రెస్ పార్టీ పై కొన్ని విమర్శలు చేసారు. కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రా పార్టీలతో పొత్తు పెట్టుకుంటుంది అని, అసలు కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వలేదు అంటూ కొన్ని విమర్శలు చేసారు. దీనికి ఆ పార్టీ కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఘాటుగా స్పందించారు. ఆయన కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇవన్నీ మన రాష్ట్రానికి అనవసరం అయినా, ఇక్కడ మధు యాష్కీ చేసిన ఒక కామెంట్ మాత్రం ఏపిలో హీట్ పుట్టిస్తుంది.
కాళేశ్వరం రీడిజైన్‌తో కల్వకుంట్ల కంపుగా మారిపోయిందని, వైఎస్ జగన్ ఫోన్ చేస్తే రాయలసీమ కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్ళ మీద అంత ఎత్తున లేగిసే కెసిఆర్ కు, జగన్ అంటే అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు.. జగన్, కెసిఆర్ మధ్య ఉన్న బంధం ఏంటో చెప్పాలని అన్నారు. పక్క రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి మనుషులకి ఎందుకు కాంట్రాక్టులు ఇస్తున్నారని ప్రశ్నించారు. నిజానికి, కెసిఆర్, జగన్ ఎప్పుడూ రహస్య స్నేహితులుగానే ఉన్నారు. ఇద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబుని దెబ్బ కొట్టాలనే టార్గెట్.
కెసిఆర్ ని ఓడించటానికి, అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న వేళ, జగన మాత్రం కెసిఆర్ గెలుపు కోసం, ఇప్పటి నుంచి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణాలో, జగన్ పార్టీకి చెందిన, ముగ్గురు ఎమ్మల్యేలు, ఒక ఎంపీకి, భారీ కాంట్రాక్టులు ఉన్నాయి. మిషన్ భగీరథ పనులలో భాగంగా కొన్ని వేల కోట్ల కాంట్రాక్టులు వీరికి ఉన్నాయి. ఇది జగన్ - కెసిఆర్ అవగాహనలో భాగంగా, జగన్ ను ఆర్ధికంగా మరింత బలం చేకుర్చి, చంద్రబాబుని దెబ్బతియ్యటానికి కెసిఆర్ ఎప్పుడో వేసిన ప్లాన్ ఇది. నంద్యాల ఉప ఎన్నికలో కూడా, జగన్ పార్టీ ఖర్చు పెట్టిన డబ్బు అంతా, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ లో వచ్చిన కమీషనే అని, కెసిఆర్ కూడా డబ్బు పంపించనట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మధు యాష్కీ మాటలతో, ఇది నిజమే అని మరోసారి రుజువైంది.