వైసిపి పార్టీ ఉత్తరాంద్రాకు ఇంచార్జిగా వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డి ని జగన్ పూర్తిగా పక్కకు పెట్టాలనుకుంటున్నారా , అనే ప్రశ్నకు అవును అనే సమాధానమే పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే రాయలసీమను పెద్దిరెడ్డి, ఉత్తరాంధ్ర విజయసాయిరెడ్డి, ఉభయగోదావరి జిల్లా వైవీ సుబ్బారెడ్డి, కోస్తా జిల్లాలను సజ్జల , వీరందరూ ఆయా జిల్లా వ్యవహారాలన్నీ చూసుకునే వారు. కాని జగన్ మోహన్ రెడ్డి అందర్నీ మార్చబోతున్నట్టు సమాచారం. దీని కోసం జిల్లాల ఇంచార్జ్ ల కోసం కొత్త లిస్టు జగన్ ఇప్పటికే తయారు చేసినట్టు సమాచారం. అయితే ఈ లిస్టులో జగన్ మోహన్ రెడ్డి కి కుడిచెయ్యి అని చెప్పుకునే విజయసాయి రెడ్డి పేరు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ జిల్లాల ఇంచార్జ్ ల విషయంలో విజయసాయి రెడ్డిని, జగన్ పూర్తిగా పక్కకు తప్పించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే జగన్ పీకే టీం ద్వారా విజయసాయి రెడ్డి పై సర్వే కూడా చేయించారని తెలుస్తుంది. ఆ సర్వే ద్వారా ఉత్తరాంద్రలో విజయసాయి రెడ్డి పార్టీని నాశనం చేస్తున్నారని , అందుకే ఆయన్ని ఈ పదవి నుంచి తొలగించాలని ఉద్దేశంతో జగన్ ఉన్నట్లుగా సమాచారం. విజయసాయి రెడ్డిని పక్కన పెడితేనే మంచిదనే అభిప్రాయం తో జగన్ ఉన్నట్టు సమాచారం.

jagan 19042022 2

అయితే నిన్న గాక మొన్న విజయ సాయి రెడ్డి జాబు మేళాలు పెట్టిన సంగతి తెలిసిందే . ఇది జగన్ కు ఇష్టం లేదని చెప్పినా వినకుండా విజయసాయి రెడ్డి మాత్రం ఈ విషయం లో చాలా మొండిగా వ్యవహరించినట్లు సమాచారం. ఎక్కడా జగన్ కు మైలేజ్ ఇవ్వకుండా, ఈ కార్యక్రమం మొత్తం తానే చేస్తున్నట్టు విజయసాయి రెడ్డి బిల్ ఇచ్చారు. ఇవన్నీ మనసులో ఉంచుకొనే జగన్ కీలక భాద్యతల విషయంలో విజయ సాయి రెడ్డిని పూర్తిగా తొలగించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రేపు ఆయనకు రాజ్యసభ సీటు రెన్యూవల్ కూడా చేయాల్సి ఉంది. ఈ విషయం పై జగన్ ఏమి చేస్తారో చూడాలని పార్టీ వర్గాలు చర్చిన్చుకుంటున్నాయి . ఒకవేళ రాజ్యసభ సీటు కూడా రెన్యువల్ చేయక పోతే, ఇక విజయ సాయి రెడ్డి పని క్లోజ్ అయిపోయినట్టే అనే ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద నెంబర్ టు స్థానం నుంచి, కొన్ని జిల్లాలకు పరిమితం అయ్యి, ఇప్పుడు మొత్తం దుకాణం సర్దేసే పరిస్థితి విజయసాయి రెడ్డికి వచ్చింది.

జగన్ మోహన్ రెడ్డి సడన్ గా విశాఖ పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటన వెనుక ఉన్న మర్మం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఈ పర్యటనలో జగన్ మోహన్ రెడ్డి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ ను కలవనున్నారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ వారం రోజుల పర్యటన కోసం విశాఖ వచ్చారు. ఇక్కడ బేపార్క్ లో ఆయన నేచురోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సహజంగా రాష్ట్రానికి ఏ సియం అయినా వస్తే, ఇక్కడున్న సియం వద్దకు వచ్చి కలుస్తారు. కానీ మనకు మాత్రం రివర్స్ లో, ఆయన ఎక్కడో ఉంటే,మన ముఖ్యమంత్రి పని గట్టుకుని అక్కడకు వెళ్తున్నారు. ఇప్పటికే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ , స్వరూపందను కలిసారు. మూడు రోజుల క్రితం మంత్రి గుడివాడ అమర్నాద్ వెళ్లి కలిసారు. తరువాత జగన్ మోహన్ రెడ్డి కూడా ఆయన్ను వెళ్లి కలుస్తారని ప్రచారం జరిగింది. చివరకు ఈ రోజు జగన్ స్వయంగా విశాఖ వెళ్తున్నారు. అయితే ఈ భేటీ ఎందుకు జరుగుతుందో ఎవరికీ అంతు బట్టటం లేదు. హర్యానా రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఎలాంటి సంబంధాలు, ఇతరత్రా సమస్యలు లేవు. మరి జగన్ ఎందుకు కలుస్తున్నారు అంటే,మర్యాదపూర్వక భేటీ అంటున్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇలా ఎవరో కోసం, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్లి కలిసిన సందర్భాలు ఏమి లేవు.

khattar 19042022 2

ఇప్పుడు ఈ భేటీ వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అని చర్చ జరుగుతుంది. ముందుగా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ స్వరూపానందను కలవటం, తరువాత జగన్ వెళ్లి కలవటం, ఇవన్నీ లింక్ చేస్తే, ఎదో జరుగుతుంది అనే విషయం స్పష్టం అవుతుంది. రాజకీయంగా బీజేపీ ఏమైనా చెప్పాలి అంటే, జగన్ ను నేరుగా ఢిల్లీ పిలిపించుకుని ఆదేశాలు ఇస్తారు, ఈయన పాటిస్తారు. మరి ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది తెలియాలి. అయితే ఇక్కడ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ ఉన్న బేపార్క్ విషయం కూడా గతంలో వార్తల్లో నిలిచింది. ఈ బేపార్క్ ని వైసీపీలోని కొంత మంది పెద్దలు కబ్జా చేసారు. ఇందులోనే జగన్ మోహన్ రెడ్డి సియాం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటారు అనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడే ఇదే బేపార్క్ కి జగన్ వస్తున్నారు. మధ్యానం విశాఖ వెళ్ళే జగన్ మోహన్ రెడ్డి, తిరిగి మళ్ళీ వెంటనే అమరావతి వచ్చేస్తారు. మరి ఈ సీక్రెట్ పర్యటన వెనుక అంతర్యం ఏమిటో మరి. చూడాలి.

జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో ఘన సన్మానం చేయలని, దానికి తన ఆచార్య సినిమాని ఉపయోగించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు. ఈ నెల 27న విడుదల కానున్న ఆచర్య సినిమా కోసం, ఈ నెల 23న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని, ఆంధ్రప్రదేశ్ లో చేసి, జగన్ మోహన్ రెడ్డికి ఇదే వేదిక పై సన్మానం చేస్తే ఎలా ఉంటుందని అలోచించి, ఈ విషయం జగన్ తో చెప్పటం, దానికి జగన్ కూడా ఒప్పుకోవటంతో, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు జగన్ వస్తున్నారని, తెలుగు సినిమా ఇండస్ట్రీ తరుపున, జగన్ మోహన్ రెడ్డికి సన్మానం చేస్తున్నాం అంటూ, మీడియాకు లీకులు ఇచ్చారు. దీంతో రెండు రోజులుగా ఈ విషయం హోరెత్తి పోయింది. ఆచార్య సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. జగన్ మోహన్ రెడ్డి సిబిఐ కేసులు చూసే వ్యక్తిగా నిరంజన్ రెడ్డికి పేరు ఉంది. గతంలో సినిమా టికెట్ల ఇష్యూ వచ్చినప్పుడు కూడా, జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు, చిరంజీవిని తీసుకుని వెళ్ళటంతో, నిరంజన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. ఈ నేపధ్యంలోనే, జగన్ మోహన్ రెడ్డికి, ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా, సన్మానం చేయాలని నిర్ణయం తీసుకుని, మీడియాకు సమాచారం ఇచ్చారు.

chiru 18042022 2

అయితే ఏమైందో ఏమో కానీ, సడన్ గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ , వేదిక మారిపోయింది. విజయవాడలో కాకుండా, హైదరాబాద్ లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో పెడుతున్నారు అంటే, ఇక అక్కడ జగన్ మోహన్ రెడ్డికి సన్మానం చేసే అవకాశమే లేదు. ఈ సడన్ మార్పు వెనుక రాజకీయ కోణాలే కనిపిస్తున్నాయి. ఇంటలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే, ఈ ప్రోగ్రాం కు జగన్ రాలేనని చెప్పటంతోనే, వేదిక మార్చినట్టు చెప్తున్నారు. చిరంజీవి సినిమా ఫంక్షన్ అంటే, మెగా స్టార్ ఫాన్స్ తో పాటు, పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా అక్కడకు వస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పై, పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే పరిస్తితి చేయిదాటి పోయి, జగన్ మోహన్ రెడ్డికి అవమానకరంగా మారే ప్రమాదం ఉండటం, అక్కడ ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం కాబట్టి, ఈ కార్యక్రమానికి వెళ్ళకుండా ఉండటమే మంచిదని, జగన్ మోహన్ రెడ్డికి వచ్చిన రిపోర్ట్ మేరకే, ఈ కార్యక్రమాన్ని జగన్ రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే వేదికను హైదరాబాద్ కు మార్చినట్టు తెలుస్తుంది.

ఈ నెల 15వ తేదీన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉషశ్రీ చరణ్, తన అనుచరులతో కలిసి ఊరేగింపుగా, సొంత నియోజకవర్గం కళ్యాణదుర్గంలో పర్యటించారు. భారీ ఊరేగింపుతో మంత్రి రావటం, పోలీసులు ఆంక్షలు పెట్టటంతో, ట్రాఫిక్ లో చిక్కుకుని ఒక దళిత బాలిక చనిపోయింది అంటూ, వార్తలు వచ్చాయి. చనిపోయిన చిన్నారి తండ్రి కూడా మీడియా ముందుకు వచ్చి, పోలీసుల వైఖరే కారణం అంటూ, ఆవేదన వ్యక్తం చేసారు. అదే రోజు పోలీసులు తీరుకి నిరసనగా, అక్కడున్న మిగతా ప్రజలతో కలిసి, రోడ్డు పైన బైఠాయించి, ఉషశ్రీ చరణ్ ఊరేగింపుని అడ్డుకున్నారు. ఈ వీడియోలు వైరల్ అవ్వటం, అలాగే వార్తల్లో కూడా ప్రముఖంగా ప్రచురితం కావటంతో, సోషల్ మీడియాలో అనేక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే మంత్రి ఆర్భాటానికి, ఒక చిన్నారి చనిపోవటంతో, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్, ఈ అంశం పై స్పందించారు. ట్విట్టర్ వేదికగా చిన్నారికి జరిగిన అన్యాయాన్ని, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారు. దీంతో వైసీపీ మంత్రి ఆర్భాటం మరింత ప్రజల్లోకి వెళ్ళింది. అయితే దీని పై భారీగా డ్యామేజ్ జరుగుతుందని భావించిన అధికార పార్టీ నేతలు, పోలీసులతో ఒక మీడియా సమావేశం పెట్టించారు.

cbn 19042022 2

అందులో పోలీసులు ఒక సిసి టీవీ ఫూటేజ్ విడుదల చేసారు. మంత్రి ఊరేగింపులో, ఈ చిన్నారి తల్లిదండ్రులు చిక్కుకోలేదు అంటూ, వీడియో చూపించారు. అయితే సంఘటన రాత్రి జరిగితే, సాయంకాలం వీడియో చూపించటం చర్చకు దారి తీసింది. ఇక ఆ వీడియోలు ఉన్నది వారేనా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే పోలీసుల ప్రెస్ మీట్ అయిపోగానే, చంద్రబాబు, లోకేష్ పై కేసులు నమోదు చేసారు. వైసీపీ నేత కొంగర భాస్కర్ అనే వ్యక్తి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ప్రజలలో, పోలీసుల పై విద్వేషాలు రెచ్చ గొట్టారు అంటూ కేసు పెట్టటంతో, చంద్రబాబు పైన 153ఏ/34 సెక్షన్ల కింద కేసుని పోలీసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు. అయితే ఒక ప్రతిపక్ష నేతగా, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే, దానికి కూడా కేసులు పెట్టటం పైన, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక పక్క జరిగిన ఘటన, కుటుంబ సభ్యుల ఆవేదన కనిపిస్తుంటే, దానికి సమాధానం చెప్పకుండా, మా మంత్రి ఏమి చేయలేదు, మా పోలీసులు ఏమి చేయలేదు, మొత్తం చంద్రబాబు చేసారు, అంటూ ఎదురు కేసు పెట్టటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

Advertisements

Latest Articles

Most Read