బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసులో, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకావాల్సి ఉండగా, చంద్రబాబు ఆయన తరుపున, తన న్యాయవాదిని ధర్మాబాద్‌లో కోర్టుకు పంపించారు. చంద్రబాబు తరుపున, అడ్వకేట్ సుబ్బారావు రీకాల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే, ఈ విషయం పై ధర్మాబాద్‌లో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రీకాల్ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాబాద్ కోర్టు చంద్రబాబు సహా 16 మంది కోర్టుకు హాజరుకావల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు కోర్టు వాయిదా వేసింది. అయితే చంద్రబాబు వేసిన రీకాల్ పిటీషన్ కోర్ట్ పరిగణలోకి తీసుకుంటుంది అని అందరూ అనుకున్నారు.
ఇది ఇలా ఉంటే తెలంగాణా నుంచి హాజరైన ముగ్గురు తెరాస మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నంకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాబాద్ కోర్టు ప్రకటించింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన ఆందోళన పై మహారాష్ట్రలోని ధర్మాబాద్ న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధర్మాబాద్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినం సంగతి తెలిసిందే. అయితే తనకు న్యాయస్థానానికి హాజరయ్యేందుకు సమయం లేనందున చంద్రబాబు తన న్యాయవాదిని కోర్టుకు పంపారు.
చంద్రబాబుకు జారీచేసిన బెయిల్‌కు వీలులేని వారెంట్(నాన్ బెయిలబుల్ వారెంట్-ఎన్బీడబ్ల్యూ)ను రీకాల్ చేయాలని కోరుతూ న్యాయవాది జి.సుబ్బారావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సంబంధమున్న పలువురు నేతలు ఈరోజు న్యాయస్థానికి హాజరయ్యారు. అయితే అనూహ్యంగా, కోర్ట్ ఈ రీకాల్ పిటీషన్ కొట్టేసి, చంద్రబాబు కోర్ట్ కి రావాల్సిందే అంటూ చెప్పింది. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే, వచ్చే నెల 15 నుకు వాయిదా వెయ్యటం. ఒకవేళ వెంటనే చంద్రబాబు రావాలి అని తీర్పు ఇచ్చి ఉంటే, చంద్రబాబు అమెరికా పర్యటనకు ఇబ్బంది అయ్యేది. చంద్రబాబు రేపటి నుంచి 26 వరకు అమెరికా పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే...