ఎప్పుడు ఆగష్టు 14న, మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ అని ఎదో రిలీజ్ చేసి, గోదావరి జిల్లా నుంచి తాను నివాసం ఉండే హైదరాబాద్ చెక్కేసాడు, జగనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అంతే, ఏమైందో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. మధ్యలో కంటి మీద కురుపుకు ఆపరేషన్ అన్నారు, రెండో రోజే ఎవరినో చేర్చుకుంటూ ఉన్న వీడియో బయటకు వదిలారు. తరువాత తన సామాజికవర్గంతో టీ మీటింగ్ అని చెప్పి, ఒక్కొక్కడి దగ్గర 10 లక్షల వసూలు చేసి, గంటలో 15 కొట్లు వెనకేసిన వీడియో మీడియాలో రావటంతో, కలకలం రేగింది. మరోసారి, అత్తగారి ఇంటికి రష్యా కూడా వేల్లరనే ప్రచారం జరిగింది. ఒక పక్క తెలంగాణా ఎన్నికల హడావిడి..
అన్ని పార్టీలో తెలంగాణా ఎన్నికల హడావిడిలో ఉంటే, జగన్, పవన్ మాత్రం, తెలంగాణా ఎన్నికల పై ఒక్క మాట కూడా చెప్పలేదు. ముందుగా సిపిఐ, సిపిఎం పార్టీలు, పవన్ తో కలిసి తెలంగాణా ఎన్నికలకు వెళ్దాం అనుకున్నారు. సిపిఐ మొదట్లోనే, మనోడు కెసిఆర్ తొత్తు అని గ్రహించి, ఒక నమస్కారం పెట్టి బయటకు వచ్చింది. ఇక సిపిఎం పార్టీ మాత్రం, పవన్ తో కలిసి వెళ్తాం అంటూ ప్రకటించింది. ఎన్ని రోజులకి పవన్ అప్పాయింట్మెంట్ దొరక్క పోవటంతో, వారికి కూడా సినిమా అర్ధమైంది. కెసిఆర్ తో పోరాటం చెయ్యటానికి, పవన్ సిద్ధంగా లేరనుకుంటా అని సిపిఎం కూడా చెప్పేసింది. ఇంత గోల జరుగుతున్నా, మనోడు ఒక ట్వీట్ కూడా లేదు..
ఇంతకీ అసలు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో అంటూ, సొంత సినిమా ఫాన్స్ కి కూడా ఆలోచన మొదలైంది. ఎప్పటిలాగే ఎన్నికల ముందు హడావిడే ఇదంతా అని అందరూ అనుకుంటున్న టైంలో, మనోడు అజ్ఞాతం వీడి బయటకు రానున్నాడు. దాదాపు 40 రోజుల తరువాత తనకి ఎంతో ఇష్టమైన హైదరాబాద్ వదిలి, ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడు. అయితే, 22 రాత్రికి నెల్లూరుకు చేరుకుని, 23వ తేదీ ఉదయం బారాషాహిద్ దర్గాను దర్శించుకుని, 2019 ఎన్నికల్లో గెలుపొందేందుకు స్వర్ణాల చెరువులో తమ పార్టీ ముఖ్యనేతల ద్వారా ‘గెలుపు రొట్టె’ పట్టుకోనున్నారు. మరి ఇక్కడే పర్యటన కొనసాగుతుందా, లేకపోతే మళ్ళీ హైదరాబాద్ చెక్కేసి ఫార్మ్ హౌస్ కి వేల్లిపోతాడా అనేది తెలియాల్సి ఉంది. 40 రోజుల తరువాత బయటకు వస్తూ ఉండటంతో, పవన్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ఇక మా అన్నే కాబోయే సియం అంటూ, హుషారుగా ఉన్నారు.