2019 ఎన్నికలకు ముందు మొత్తం ఫేక్ ప్రచారం నడిచేది. ప్రశాంత్ కిషోర్ ఫేక్ బ్యాచ్ కి తోడుగా, జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు, ఒక ఫేక్ వార్త సృష్టించి, దాన్ని రాష్ట్రం మొత్తం తిప్పటంలో సక్సెస్ అయ్యారు. ఈ ఫేక్ ప్రచారాన్ని ఖండిస్తూ, ప్రజల్లోకి వెళ్ళటంలో టిడిపి ఫెయిల్ అయ్యి, మూల్యం చెల్లించింది. ఇలాంటి ఒక పెద్ద ఫేక్ న్యూస్ లో, మొదటి స్థానం సంపాదించేది, అందరి మదిలో ఉండేది, పింక్ డైమెండ్. తిరుమలలో ఉన్న పింక్ డైమెండ్ చంద్రబాబు, విదేశాల్లో అమ్మేసారు అని, అలాగే చంద్రబాబు ఇంట్లోని నేలలో శ్రీవారి నగలు ఉన్నాయి అంటూ, విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ అందరికీ తెలిసే ఉంటాయి. అప్పట్లోనే పింక్ డైమెండ్ అనేది లేదు అని అందరూ ఖండించినా, ఈ వార్త మాత్రం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చినా, ఈ అంశం పై అసలు సౌండ్ చేయేలేదు. ఫేక్ అని వారికి కూడా తెలుసు కదా ? అయితే ఇప్పుడు తాజాగా ఈ అంశం మరోసారి తెర పైకి వచ్చింది. రెండు రోజుల క్రితం తిరుపతిలో సర్వ దర్శనం టికెట్ల కోసం జరిగిన రచ్చ, ప్రభుత్వ వైఫల్యం, ప్రజలు పడిన ఇబ్బందులు ఇవన్నీ తెలిసిందే. అయితే ఇదే అంశం పై, మాజీ ఐఏఎస్ అధికారి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నిన్న ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ, తన అభిప్రాయం పంచుకున్నారు.

lvs 14042022 2

గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, తిరుమలలో టిటిడి ఈవో గా కూడా పని చేసిన విషయం తెలిసిందే. ఆ అనుభవంతోనే, ఆయన తిరుమలలో జరుగుతున్న అంశాల పై స్పందించారు. ఈ సందర్భంగా గతంలో తిరుమలలో పింక్ డైమండ్ మాయం అయ్యింది అనే ఆరోపణలు వచ్చాయి, దీని పై మీ స్పందన ఏమిటి అని అడగగా, అసలు పింక్ డైమెండ్ అనేదే లేదని, అది రాజకీయాలు కోసం తీసుకుని వచ్చిన అంశం అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సారి ఎన్నికల్లో బ్లూ డిమాండ్ వస్తుందేమో అంటూ వ్యంగ్యంగా స్పందించారు. రాజకీయాల కోసం ఇలాంటివి వాడుకోవటం దారుణం అని అన్నారు. దీంతో మరోసారి వైసీపీ చేసిన ఫేక్ ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఇక మొన్న తిరుపతిలో దర్శనం టికెట్ల కోసం ప్రజలు పడిన ఇబ్బందులు పై ఎల్వీ సుబ్రహ్మణ్యం ఘాటుగా స్పందిస్తూ, ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని, గతంలో ఇంత కంటే ఎక్కువ భక్తులు వచ్చినా, ఇబ్బంది రాలేదని, తెలుపుతూ, టిటిడి వైఖరి పై విమర్శలు చేసారు.

సిదిరి అప్పలరాజు... ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పశుసంవర్థకశాఖ మంత్రిగా ఉన్నారు. రాజకీయ నేపధ్యం లేని కుటుంబం నుంచి, మంత్రి వరకు ఎదిగిన అప్పలరాజు గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పలరాజు 2017 ఎన్నికల్లో వైసీపీ తీర్చం పుచ్చుకున్నారు. తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి అవకాసం ఇవ్వటంతో, పలాస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. అ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి గౌతు శిరీష పై విజయం సాధించారు. మత్స్యకార వర్గానికి చెందిన అప్పల రాజు, 2020లోనే జగన్ మంత్రి వర్గంలో చేరారు. అప్పట్లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్ళటంతో, ఆయన స్థానంలో, అప్పలరాజుని క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే మొన్న జరిగిన మంత్రి వర్గ మార్పుల్లో, జగన్ మోహన్ రెడ్డి మరో అవకాసం ఇచ్చారు. సిదిరి అప్పలరాజు ఉన్నత విద్యావంతుడు. ఏపీఆర్జేసీలో స్టేట్ రెండో ర్యాంక్ తెచ్చుకున్నారు. ఇక ఎంసెట్ లో స్టేట్ 13వ ర్యాంక్ తెచ్చుకున్నారు. తరువాత ఎంబీబీఎస్ చదివారు. అక్కడ కూడా గోల్డ్ మెడల్స్ సాధించారు. ఇక అప్పలరాజు, పదవి తరిగితిలో రాష్ట్ర స్థాయిలో స్టేట్ 3వ ర్యాంక్ తెచ్చుకున్నారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండేవారు.

cbn 14042022 2

చంద్రబాబు చదువుకు ప్రధానత్య ఇస్తూ, మంచి మార్కులు వచ్చిన వారికి పురస్కారాలు ఇచ్చే వారు. అదే విధంగా, స్టేట్ 3వ ర్యాంక్ ఇచ్చిన అప్పల రాజుకి పురస్కారం అందించారు. 1995లో చంద్రబాబు నాయుడు, అప్పల రాజుకి అవార్డ్ అందచేసారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతుంది. నాడు చంద్రబాబు దగ్గర అవార్డ్ అందుకున్న అప్పల రాజు, నేడు అదే చంద్రబాబుని తిడుతుంటే విడ్డూరంగా ఉన్నా, రాజకీయం అంటే ఇలాగే ఉంటుందని చెప్పాలి. అయితే చదువులో ఇంత మంచి ప్రొఫైల్ ఉన్న అప్పల రాజు, రాజకీయాల్లో మాత్రం ఫెయిల్ అయ్యారు. విద్యావంతుడిగా పేరు ఉండి, ఆయన చేస్తున్న పనులు మాత్రం విమర్శలకు తావు ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహిళ అని కూడా చూడకుండా, గౌతు శిరీషను సోషల్ మీడియాలో తిట్టించటంతో, ఆయనకు పశువుల మంత్రి అనే పేరు వచ్చి పడింది. ఇక ఈ మధ్య కాలంలో పోలీసులు పైన చేయి చేసుకోవటం, బూతులు తిట్టటం చూసాం. చదువు సంస్కారం నేర్పదు అనే పెద్దల మాటకు, ఇది ఉదాహరణగా చెప్పాలి. విద్యా పరంగా ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న అప్పలరాజు, సంస్కారంతో రాజకీయాలు చేస్తారని ఆశిద్దాం.

2019 ఎన్నికలకు ప్రచార సమయంలో జగన్, వారి పార్టీ నేతలకు బాగా పనిచేసి వైసిపిని అధికారంలోకి తీసుకొస్తే ఆ మంత్రి పదవి ఇస్తాను, ఈ మంత్రి వదవి ఇస్తాను అని చాలా ఆశలే కలిపించారు. కాని వారిలో చాలా మందికి ఇప్పుడు జగన్ మొండి చెయ్యి చూపించారని తాజాగా జగన్ చేసిన కాబినెట్ విస్తరణతో అర్ధమైంది. పార్టీలో చాలా మందే మంత్రి పదవులు కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. కాని వారందరికి నిన్నటి జగన్ చర్యతో నిరాశే ఎదురైందని చెప్పాలి. ఈ కోవకే చెందుతారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. 2019 లో ఎన్నికలకు చేసిన ప్రచారంలో నారా లోకేష్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే ఆయనను మంత్రిని చేస్తా అంటూ ఆనాడు జగన్ చేసిన ప్రచారంతో, ఆళ్ల రామకృష్ణారెడ్డికి జనంలో ఉన్న ఫేం వల్ల ఆళ్ల గెలిచారు. అ తరువాత జగన్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని మంత్రిని చేస్తారని అందరూ అనుకున్నారు. కాని జగన్ మాత్రం మొదట కాబినెట్లో ఆళ్ల కు చోటు ఇవ్వలేదు. కనీసం రెండోసారి ఏర్పాటు చేసిన కాబినెట్ లో అయిన సీటు ఇస్తారనుకుంటే కనీసం ఆయన ఊసే జగన్ ఎత్తలేదు.

jagan 13042022 1 2

ఈ జాబితాకే చేరుతారు చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. ఆయన పార్టీ కోసం చాలా ఖర్చే చేసారని సమాచారం. అయితే ఈయన్ని కాదని విడుదల రజనికి ఇవ్వటం పై మర్రి అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఆనాడు ఎన్నికల ప్రచారంలో విడదల రజనీని గెలిపిస్తే, మర్రి రాజశేఖర్ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తానని ప్రమాణాలు కూడా చేసారు. మంత్రి పదవే కాదు కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదని, జగన్ ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదని మర్రి వర్గీయులు విరుచుకు పడుతున్నారు. ఇలా వీరిద్దరే కాదు , జగన్ ఎన్నికల ప్రచార సమయంలో ఇంకా కొంతమందికి కూడా మంత్రి పదవులు ఇస్తానని ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారు. ఇప్పుడెమో వారందరికి అన్యాయం చేయడంతో జగన్ కు తన సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ మొదలయింది. నమ్మించి మోసం చేయటంలో జగన్ దిట్ట అనే పేరు తెచ్చుకున్నారు..

వైసీపీ పార్టీలో లుకలుకలు, గత వారం రోజులుగా బయట పడుతూ వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డికి విధేయులు అంటూ డబ్బా కొట్టే వాళ్ళు కూడా, పదవి పోగానే జగన్ ని ఛీ కొట్టారు. రాజీనామాల వరకు వెళ్లారు. రోడ్ల పై ఆందోళనలు చేసారు. అయితే ఏమైందో ఏమో కానీ, జగన్ మోహన్ రెడ్డి వారిని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి బుజ్జగించటంతో, అందరూ బయటకు వచ్చి, మేము జగన్ వెంటనే నడుస్తాం, అంతా తూచ్ అనేసారు. లోపల ఏమి జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. ఇలా మంత్రి పదవి రాని వాళ్ళు, నానా రచ్చ చేసి, జగన్ మోహన్ రెడ్డి ఎంత బలహీనుడో చెప్పకనే చెప్పారు. 151 మంది ఉన్నా , జగన్ పై సొంత పార్టీలోనే ఎంత వ్యతిరేకత ఉందో ఈ దెబ్బతో అర్ధమైంది. ఇక ఈ విషయం పక్కన పెడితే, ఇప్పుడు మంత్రి పదవులు వచ్చిన వాళ్ళు కూడా, జగన్ మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారా అనే అనుమానం రాక మానదు. తాజాగా సీనియర్ మంత్రి బొత్సా సత్యన్నారాయణ ఇచ్చిన స్ట్రోక్ తో, జగన్ మోహన్ రెడ్డికి షాక్ కొట్టిందనే చెప్పాలి. మొన్న జరిగిన క్యాబినెట్ మార్పుల్లో బొత్సా సత్యన్నారాయణకు జగన్ మోహన్ రెడ్డి విద్యా శాఖ ఇచ్చారు. గతంలో మునిసిపల్ శాఖా మంత్రిగా పని చేసిన బొత్సాకు, మరింత పెద్ద పదవి వస్తుందని అనుకుంటే, విద్యా శాఖ లాంటి చిన్న శాఖ ఇచ్చి సరిపెట్టారు.

botsa 14042022 2

అయితే బొత్సాకు విద్యా శాఖ ఇవ్వటం పట్ల, జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ ఉందనే ప్రచారం జరిగింది. బొత్సాకి మరింత పవర్ రాకుండా, కట్ చేసారనే ప్రచారం ఉంది. ఇది ఇలా ఉంటే, నిన్న విద్యా శాఖ పైన సమీక్ష జరిగింది. జగన మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బొత్సా పాల్గునలేదు. అధికారులు మాత్రమే వచ్చారు. అంతకు ముందు రోజు వైద్య శాఖ పైన రివ్యూ జరిగితే, దానికి విడదల రజినీ వచ్చారు. అయితే ఈ సమావేశానికి బొత్సా రాకపోవటం పై, ఆయన ఏమైనా అసంతృప్తితో ఉన్నారా అనే ప్రచారం జరుగుతుంది. ఆయనకు చిన్న శాఖ ఇచ్చి అవమానించారా అనే ప్రచారం ఉంది. ఇప్పటి వరకు బొత్సా, కొత్త మంత్రిగా బాధ్యత తీసుకోలేదు. ప్రామాణ స్వీకారం తరువాత, మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ప్రమాణ స్వీకారం సమయంలో కూడా, అందరూ జగన్ కాళ్ళ మీద పడితే, బొత్సా నిటారుగా నుంచుని, జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు జగన చేసిన సమీక్షకు కూడా బొత్సా రాకపోవటం పై చర్చ జరుగుతుంది.

Advertisements

Latest Articles

Most Read